Anee Master Tests Covid-19 Positive Second Time, Netizens Shocking Reactions - Sakshi
Sakshi News home page

Anee Master: యానీకి మ‌ళ్లీ క‌రోనా: స‌న్నీకి స‌పోర్ట్ చేయ‌నందుకు బాగైంద‌న్న నెటిజ‌న్‌

Published Wed, Jan 26 2022 9:54 AM | Last Updated on Wed, Jan 26 2022 12:22 PM

Anee Master Tested Coronavirus Positive For Second Time - Sakshi

కొరియోగ్రాఫ‌ర్‌, బిగ్‌బాస్ కంటెస్టెంట్ యానీ మాస్ట‌ర్ క‌రోనా బారిన ప‌డింది. ఈ విష‌యాన్ని ఆమె సోష‌ల్ మీడియా వేదిక‌గా వెల్ల‌డించింది. 'గ‌తేడాది కూడా నాకు కోవిడ్ వ‌చ్చింది. 24 రోజుల త‌ర్వాత అంటే జ‌న‌వ‌రి 23న నాకు క‌రోనా త‌గ్గిపోయింది. మ‌ళ్లీ ఇప్పుడు జ‌న‌వ‌రి 24న కోవిడ్ పాజిటివ్ అని తేలింది. ఈ కరోనా ఏమైనా టైం మెయింటెన్ చేస్తుందా? క్వారంటైన్ చిరాకుగా, చాలా బోరింగ్‌గా ఉంది' అని యానీ మాస్ట‌ర్ ఇన్‌స్టాగ్రామ్ స్టోరీస్‌లో రాసుకొచ్చింది.

రెండోసారి ఈ మ‌హ‌మ్మారి బారిన ప‌డిన ఆమె త్వ‌ర‌గా కోలుకోవాలంటూ ఆమె అభిమానులు కామెంట్లు చేస్తుండ‌గా ఒక నెటిజ‌న్ మాత్రం త‌గిన శాస్తి జ‌రిగింద‌ని విమ‌ర్శించింది. 'స‌న్నీకి స‌పోర్ట్ చేయ‌లేదు క‌దా, నీకు క‌రోనా రావాల్సిందే'న‌ని శాప‌నార్థాలు పెట్టింది. ఈ మెసేజ్‌కు సంబంధించిన స్క్రీన్‌షాట్‌ను షేర్ చేసిన యానీ.. 'నువ్వింకా ఎద‌గాలి' అంటూ కౌంట‌రిస్తూనే.. 'స‌న్నీ బాబా నాకు కోవిడ్ పోయేలా ఏదైనా చెయ్యొచ్చుగా' అని స‌రదాగా కామెంట్ చేసింది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement