
Bigg Boss Telugu 5 Contestant Anee Master: టాలీవుడ్‌లో టాప్ లేడీ కొరియోగ్రాఫర్ యానీ మాస్టర్. బిగ్‌బాస్ తెలుగు ఐదో సీజన్‌లో పాల్గొన్న ఆమె 11వ వారంలోనే ఎలిమినేట్ అయింది. షోలో ఎంతో నెగెటివిటీని మూటగట్టుకున్న ఆమె తనపై ట్రోలింగ్‌ను చూసి విస్తుపోయింది. షో ముగిసిందని, ఇంకా తన గురించి తిట్టుకుంటూ టైంపాస్ చేయడం ఆపేయండని చెప్పుకొచ్చింది.
తాజాగా తన అభిమానులతో గుడ్ న్యూస్ పంచుకుంది యానీ మాస్టర్. మెగాస్టార్ చిరంజీవి భోళా శంకర్ సినిమాలో నటిస్తున్నానని తెలిపింది. ఈ అవకాశం బిగ్‌బాస్‌కు వెళ్లడానికి ముందే వచ్చిందని, ఈ సినిమాలో చిరంజీవి, వెన్నెల కిషోర్‌ల పక్కనే ఉంటానంటూ తన పాత్ర గురించి చెప్పింది. ఇక ఈ మూవీ కొరియోగ్రఫీ కూడా చేస్తున్నానని చెప్పుకొచ్చింది. తనకీ అవకాశం ఇచ్చిన డైరెక్టర్ మెహర్ రమేశ్‌కు కృతజ్ఞతలు తెలిపింది. ఇక ఈ సినిమాలో బిగ్‌బాస్ కంటెస్టెంట్ లోబో కూడా నటిస్తున్న విషయం తెలిసిందే!
Comments
Please login to add a commentAdd a comment