Bigg Boss 5 Telugu Episode 59 బిగ్‌బాస్ హౌస్‌లో ఎప్పుడు ఏం జరుగుతుందో ఎవరూ ఊహించలేరు. నామినేషన్‌లో ఉన్నవాళ్లు సేవ్ కావొచ్చు. సేఫ్‌గా ఉన్నవాళ్లు నామినేషన్‌లోకి రావొచ్చు. బిగ్‌బాస్ ఇచ్చే ట్విస్ట్‌లను ఎవరూ అంచనా వేయలేరు. ముఖ్యంగా తొమ్మిదో వారం మొదటి రోజు నుంచే ఇంటి సభ్యులకు ట్విస్టుల మీద ట్విస్ట్‌లు ఇస్తున్నాడు బిగ్‌బాస్. నామినేషన్‌లోకి కెప్టెన్ మినహా.. మిగిలిన 10 మంది రావడం ఇంటి సభ్యులతో పాటు ఆడియన్స్‌ని ఆశ్చర్యానికి గురిచేసింది. తాజాగా ఇంటి సభ్యులకుబిగ్‌బాస్ బిగ్ ట్విస్ట్ ఇచ్చాడు. నామినేషన్‌లో ఉన్నవాళ్లలో ఇద్దరికి ఇమ్యునిటీ వచ్చేలా చేశాడు. దాని కోసం బిగ్‌బాస్ ఏం చేశాడు? ఇమ్యునిటి పొందిన ఆ ఇద్దరు అదృష్టవంతులు ఎవరు? వారు ఎలా సేవ్ అయ్యారో నేటి ఎపిసోడ్‌లో చదివేద్దాం.
ఇంటి సభ్యులు గుంపులు, గుంపులుగా విడిపోయి నిన్నటి నామినేషన్ గురించి చర్చించారు. సన్నీ గట్టిగా అరిచినప్పటికీ..మంచి వ్యక్తే అని యానీ మాస్టర్ చెప్పొకొచ్చింది. ఆయన అంతలా అరుస్తుంటే.. స్నేహితులైన కాజన్, మానస్ సైలెంట్‌గా ఉండటం కరెక్ట్ కాదన్నారు. అలాగే సన్నీ అలా ప్రతిసారి అరవడం మంచిది కాదన్నారు. మరోవైపు సన్నీ, మానస్, కాజల్ కలిసి త్రిమూర్తుల గురించి, జెస్సీ ఆరోగ్యం గురించి చర్చించారు. తన స్నేహితుడు వాంతులు చేసుకుంటే.. ఇద్దరు ముందుకు రాకపోవడం నచ్చలేదని సన్నీ చెప్పగా.. అది వాళ్ల మ్యాటర్..వదిలేయ్ అన్నాడు.
ఇమ్యూనిటీ టాస్క్.. జీవితమే ఒక ఆట
నామినేషన్‌లో ఉన్న 10 మందికి ‘జీవితమే ఒక ఆట’అనే ఇమ్యూనిటీ టాస్క్‌ఇచ్చాడు బిగ్‌బాస్. దీని ద్వారా నామినేషన్‌లో 10 మందిలో ఒకరు సేఫ్ కావొచ్చు. ఈ టాస్క్‌లో భాగంగా గార్డెన్ ఏరియా మూడు జోన్‌లుగా విభజించబడింది.
బ్యాగేజ్ జోన్: ఇక్కడ నామినేట్ అయిన ప్రతి ఒక్కరి సభుల ముఖంతో ఒక బ్యాగ్ ఉంది
సేఫ్ జోన్: ఇక్కడ ఇమ్యూనిటీ కోసం పోటీ పడుతున్న సభ్యులుంటారు
డేంజర్ జోన్: ఇక్కడ ఇమ్యూనిటీ కోల్పోయే డేంజర్‌లో ఉన్నసభ్యులు ఉంటారు.
బజర్ మోగగానే సభ్యులంతా పరుగెత్తుకుంటూ వెళ్లి అక్కడ ఉన్న బ్యాగేజ్ జోన్‌లో నుంచి ఎవరైనా ఇతర సభ్యుల ముఖంతో ఉన్న ఒక బ్యాగ్ తీసుకొని సేఫ్ జోన్‌లోకి వెళ్లాలి. అలా ఎవరైతే చివరకు వస్తారో వారితో పాటు వారి చేతిలో ఎవరి బ్యాగు ఉందో వాళ్లు కూడా డేంజర్ జోన్‌లోకి వస్తారు. డేంజర్ ఉన్న ఇద్దరిలో నుంచి ఎవరిని సేఫ్ జోన్‌లోకి తీసుకురావలో సేఫ్ జోన్‌లో ఉన్న సభ్యులు నిర్ణయించాలి. అలా చివరకు ఒక్కరు మాత్రమే ఆటలో మిగులుతారు. వారికే ఇమ్యూనిటీ లభిస్తుంది.
ఈ గేమ్‌లో కాజల్, శ్రీరామచంద్ర తొలి రౌండ్‌లోనే డేంజర్‌లోకి వెళ్లారు. కాజల్ ఫోటో ఉన్న బ్యాగును తీసుకున్న శ్రీరామచంద్ర.. ముందుగా గార్జెన్ ఏరియాలోకి వచ్చినప్పటికీ.. కావాలనే సేఫ్ జోన్ డోర్‌లోకి వెళ్లలేదు.దీంతో మొదటి రౌండ్‌లో శ్రీరామ్, కాజల్ డేంజర్ జోన్‌లోకి వచ్చారు. సేఫ్ జోన్‌లో ఉన్న ఇంటి సభ్యుల మెజార్టీ అభిప్రాయంతో శ్రీరామ్‌కు రెండో రౌండ్‌కు వెళ్లాడు. కాజల్ అవుట్ అయింది. రెండో రౌండ్‌లో జెస్సీ.. సన్నీ ఫోటో బ్యాగ్‌తో చివరగా వెళ్లడంతో.. ఇద్దరు డేంజర్ జోన్‌లోకి వెళ్లారు. వీరిలో జెస్సీ సేఫ్ అయ్యాడు.
మూడో రౌండ్లో జెస్సీ చివరగా రావడం, అతని చేతిలో సిరి బొమ్మ ఉన్న బ్యాగ్ ఉండటంతో ఆఇద్దరూ కూడా డేంజర్ జోన్‌లోకి వచ్చారు. దీంతో సేఫ్ జోన్‌లో ఉన్న ఇంటి సభ్యుల సిరిని సేవ్ చేసి.. సన్నీని డేంజర్ జోన్‌కి పంపారు.నాల్గో రౌండ్‌లో విశ్వ ఫోటోతో శ్రీరామ్ చివరగా వచ్చాడు.దీంతో ఆ ఇద్దరు డేంజర్ జోన్‌లోకి వెళ్లగా.. శ్రీరామ్‌ని సేవ్ చేశారు. దీంతో విశ్వ బయటకు వెళ్లాడు. ఐదో రౌండ్‌లో సిరి లేట్‌గా రావడం.. తన చేతిలో రవి ఫోటో ఉన్నబ్యాగు ఉండడంతో ఇద్దరు డేంజర్ జోన్‌లోకి వెళ్లారు. వీరిలో సిరి ఔట్ అయింది. ఆరో రౌండ్‌లో ప్రియాంక, ఏడో రౌండ్‌లో రవి ఔటయ్యారు. ఎనిమిదో రౌండ్‌లో మానస్, యానీ మాస్టర్ డేంజర్ జోన్‌లోకి వెళ్లగా.. శ్రీరామ్ నిర్ణయంతో యానీ మాస్టర్ నెక్ట్ రౌండ్‌కి సెలెక్ట్ అయింది. అలా చివరకు శ్రీరామచంద్ర, యానీ మాస్టర్ ఉండటంతో.. ఇంటి సభ్యుల మెజార్టీ ఓట్లతో యానీ మాస్టర్‌కు ఇమ్యూనిటీ లభించింది.
బిగ్‌బాస్ బిగ్ ట్విస్.. మానస్ సేఫ్
ఇక నామినేషన్‌లో చివరకు 9మంది మిగిలారుకుంటున్న క్రమంలో.. ఇంటి సభ్యులకు బిగ్ షాక్ ఇచ్చాడు బిగ్‌బాస్.గతంలో యానీ మాస్టర్‌కు హోస్ట్ ద్వారా లభించిన స్పెషల్ పవర్‌తో ఒకరిని నామినేషన్ నుంచి తప్పించవచ్చనే అవకాశం ఇచ్చాడు. దీంతో యానీ మాస్టర్ మానస్‌ని సేవ్ చేసింది. గతంలో మానస్ తన కోసం లెటర్ త్యాగం చేశాడు.. డైరెక్ట్ నామినేట్ అయ్యాడు.. అందుకే మానస్‌కు ఇచ్చేస్తున్నాను అని యానీ చెప్పింది. దీంతో యానీ, మానస్ తప్పా మిగిలిన అందరూ నామినేషన్‌లోనే ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment