Bigg Boss Telugu 5: Anne Or Nataraj Master Likely Exit The House - Sakshi
Sakshi News home page

Bigg Boss 5 Telugu: రెండోవారం ఎలిమినేషన్‌ లెక్క మారింది!

Sep 17 2021 3:01 PM | Updated on Sep 17 2021 7:33 PM

Bigg Boss Telugu 5: Anee Or Natraj Master Likely Exit The House - Sakshi

బిగ్‌బాస్‌ తెలుగు ఐదో సీజన్‌ బుల్లితెర ప్రేక్షకులను బాగానే అలరిస్తోంది. ఇక్కడ టన్నుల కొద్దీ ఎంటర్‌టైన్‌మెంట్‌ లభించును అన్న నాగార్జున మాటను నిజం చేసేందుకు కంటెస్టెంట్లు కూడా బాగానే శ్రమిస్తున్నారు. కామెడీ అయినా కొట్లాట అయినా ఎక్కడా తగ్గేదే లే అన్నట్లుగా వ్యవహరిస్తున్నారు. కానీ కొన్నిసార్లు వీరి ఆగడాలు శృతి మించుతూ నానా హింసాత్మకంగా మారుతున్నాయి. అంతేకాకుండా విచ్చలవిడిగా బూతులు కూడా మాట్లాడేస్తున్నారు. ఇది ఫ్యామిలీ ఆడియన్స్‌ను ఇబ్బంది పెడుతోంది.

మారుతున్న స్థానాలు
ఇదిలా వుంటే రెండో వారం ఎలిమినేషన్‌ దగ్గరపడుతోంది. ఈసారి కాజల్‌, ఉమాదేవి, నటరాజ్‌ మాస్టర్‌, లోబో, ప్రియాంక సింగ్‌, యానీ మాస్టర్‌, ప్రియ నామినేషన్‌లో ఉన్నారు. విచిత్రమేంటంటే రోజుకొక విధంగా ఓటింగ్‌ ప్రక్రియలో మార్పులు కనిపిస్తున్నాయి. హౌస్‌లో గేమ్‌ మారుతున్న కొద్దీ కంటెస్టెంట్లకు వచ్చే ఓట్లలోనూ భారీ తేడాలు కనిపిస్తున్నాయి.

అసలు గండం ఆమెకు కాదు!
ఈ వారం ఉమాదేవికి గండం ఉందని అంతా అనుకున్నారు, కానీ అనూహ్యంగా ఆమెకు ఎక్కువ ఓట్లు పడుతున్నట్లు తెలుస్తోంది. ఆవేశం ఎక్కువే అయినా వినోదాన్ని అందించడంలో ఉమాదేవి రూటే సెపరేటు అంటూ చాలామంది నెటిజన్లు ఆమెకు ఓట్లేస్తున్నారు. దీంతో సోషల్‌ మీడియాలో పెద్దగా ఫాలోయింగ్‌ లేని నటరాజ్‌ మాస్టర్‌, యానీ మాస్టర్‌ డేంజర్‌ జోన్‌లో ఉన్నట్లు సమాచారం. ఈ వారం వీళ్లిద్దరిలోనే ఒకరు ఎలిమినేట్‌ అవుతారని, ఉమాదేవి మాత్రం పక్కా సేఫ్‌ అవుతుందని అంటున్నారు. మరి నిజంగానే ఆ కొరియోగ్రాఫర్లలో ఒకరు వెళ్లిపోతారా? లేదా ఉమాదేవినే బయటకు పంపించివేస్తారా? అన్నది ఆసక్తికరంగా మారింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement