ప్రతి సీజన్‌లో అందరి మీదా నోరు పారేసుకునే కంటెస్టెంట్ ఒకరుంటారు. చీటికీమాటికీ గొడవ పడుతూ, ప్రతి విషయాన్ని రాద్ధాంతం చేస్తూ నానా రభస చేస్తుంటారు. అయితే ఇలా ఆవేశం స్టార్లను బిగ్‌బాస్ త్వరగానే బయటకు పంపించివేస్తుంటాడు. అలా ఈ సీజన్‌లో పెద్ద గొంతేసుకుని అందరినీ ఓ ఆటాడేసుకుంది ఉమాదేవి. అంతేకాదు, నోటికొచ్చినట్లు చెడామడా తిట్టేసి తనకు బూతులు కూడా వచ్చని నిరూపించుకుంది. ఈ బూతులే ఆమె కొంప ముంచాయి. ఆమెను తన ఇంటికి చేర్చాయి.
బిగ్‌బాస్ బజ్‌లో రెచ్చిపోయిన ఉమాదేవి
అయితే ఇలా బూతులు మాట్లాడటం తప్పని తెలుసుకుని తన ప్రవర్తన మార్చుకుని మంచి దారిలో నడవాలనుకుంది ఉమాదేవి. కానీ చేతులు కాలాక ఆకులు పట్టుకుంటే ఏం లాభం! అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. తన తప్పులు సరిదిద్దుకున్నా, అందరితో కలిసి ఉన్నా, కామెడీ చేసి జనాలను నవ్వించినా రెండోవారంలో ఎలిమినేట్ కాక తప్పలేదు. హౌస్ నుంచి బయటకు వచ్చిన ఆమె అరియానా గ్లోరీ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న బిగ్‌బాస్ బజ్‌లో పాల్గొంది. ఈ సందర్భంగా కంటెస్టెంట్ల నిజస్వరూపాలను బయటపెట్టింది.
యాంకర్ రవి నాకు ఆ ఛాన్స్‌ఇవ్వలేదు
ముందుగా సిరి, షణ్ముఖ్‌ల గురించి మాట్లాడుతూ.. 'వాళ్లిద్దరూ ఫ్రెండ్సేంటి? నాకర్థం కాదు. ఫ్రెండ్‌షిప్ కోసమే ఆడటానికి వచ్చారా? అదేదో వాళ్లింట్లో ఆడుకోవచ్చు కదా! సిరి ఉంటే షణ్ను ఉండాలి. మంచాలు కూడా పక్కపక్కనే వేసుకుంటారా ఎవరైనా? దాని పక్కనే వాడు మంచం వేసుకోవాలా? బయటకొచ్చాక కూడా వాళ్లిద్దరి మధ్య ఇదే ప్రేమ ఉంటుందా? ఆమె పనులు ఆమెకు, ఇతడి పనులు ఇతడికి ఉంటాయి. షణ్ముఖ్.. సిరి మాటలు వింటే కనుక ఏదో ఒక వారం బయటకు వచ్చేస్తాడు. యానీ మాస్టర్ చాలా కన్నింగ్. ఫాల్తూ గేమ్ ఆడుతోంది. యాంకర్ రవితో గట్టిగా గొడవపడాలి అనుకున్నా, కానీ ఆ ఛాన్స్ ఇవ్వలేదు. ప్రియ బిగ్‌బాస్ షోకు పనికిరాదు' అంటూ ఉమాదేవి సంచలన కామెంట్లు చేసింది. ప్రస్తుతం ఈ బిగ్‌బాస్ బజ్ ఇంటర్వ్యూ వీడియో యూట్యూబ్‌లో ట్రెండింగ్ అవుతోంది.
Comments
Please login to add a commentAdd a comment