Bigg Boss Telugu 5, Second Week Nominations: బిగ్‌బాస్ తెలుగు ఐదో సీజన్‌లో డేరింగ్ అండ్ డాషింగ్ కంటెస్టెంట్ సరయూ ఎలిమినేట్ అయిపోయింది. ఇప్పుడు హౌస్‌లో 18 మంది కంటెస్టెంట్లు ఉన్నారు. ఎలాంటి బెరుకు లేకుండా ఉన్నదున్నట్లు ముఖం మీదే మాట్లాడే సరయూ ఎలిమినేషన్‌తో ఇతర కంటెస్టెంట్లలో కదలిక మొదలైనట్లు కనిపిస్తోంది. ఇంకా సైలెంట్‌గా ఓ మూలన కూర్చుంటే తొక్కేస్తారనుకుందో ఏమో కానీ శ్వేత వర్మ నేటి నామినేషన్స్‌లో విరుచుకుపడింది. దీంతో శ్వేతలో ఈ యాంగిల్ ఇంతవరకు చూడలేదంటూ కామెంట్లు చేస్తున్నారు నెటిజన్లు. మొత్తానికి బిగ్‌బాస్ పెట్టిన నామినేషన్ మంట హౌస్‌లో బాగానే రగులుతున్నట్లు కనిపిస్తోంది.
ఇదిలా వుంటే ఈవారం నామినేట్ అయిన కంటెస్టెంట్లు వీళ్లేనంటూ ఓ లిస్ట్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. నటరాజ్ మాస్టర్, యానీ మాస్టర్, ఆర్జే కాజల్, లోబో, ప్రియ, ఉమాదేవి, ప్రియాంక సింగ్ నామినేషన్ జోన్‌లోకి వచ్చారని లీకువీరులు దండోరా వేసి మరీ చెప్తున్నారు. ఒకవేళ ఇదే నిజమైతే ఇందులో కాజల్ మినహా అందరూ కొత్తగా నామినేషన్‌లోకి ఎంటరైనవారే. మరి ఈసారి నిజంగానే ఏడుగురు కంటెస్టెంట్లు నామినేషన్‌లో ఉండబోతున్నారా? లేదా ఈ లిస్టులో ఏమైనా మార్పులు చోటు చేసుకోనున్నాయా? అనేది తెలియాలంటే నేటి ఎపిసోడ్ వచ్చేంతవరకు ఆగాల్సిందే!
Comments
Please login to add a commentAdd a comment