Lobo
-
ఈ అమ్మల ఒడికి చేరిన పద్మాలు
పోరాట స్వరం @100పద్మశ్రీ పురస్కారాన్ని స్వీకరించిన సందర్భంగా లిబియా లోబో సర్దేశాయ్ పేరు వార్తల్లోకి వచ్చింది. నిజానికి లిబియా లోబో సర్దేశాయ్ అనేది ఒక పేరు కాదు. స్వాతంత్య్ర పోరాట స్వరం. గోవా స్వాతంత్య్రోద్యమంలో కీలక పాత్ర పోషించిన లోబో సర్దేశాయ్ పోర్చుగీస్ పాలనకు వ్యతిరేకంగా ప్రజలను సమీకరించడానికి అటవీప్రాంతంలో ‘వాయిస్ ఆఫ్ ఫ్రీడమ్’ అనే రేడియో స్టేషన్నిప్రారంభించారు.పద్మశ్రీ (Padma Shri) పురస్కారాన్ని స్వీకరించిన సందర్భంగా... పోర్చుగీస్ పాలన నుంచి గోవాకు విముక్తి లభించిన రోజు ఎంత సంతోషంగా ఉన్నానో, ఇప్పుడూ అంతే సంతోషంగా ఉన్నాను’ అంటూ తన ఆనందాన్ని పంచుకుంది గోవా స్వాతంత్య్ర సమరయోధురాలు లిబియా లోబో సర్దేశాయ్(lobo sardesai).గోవాకు విముక్తి లభించిన రోజున తన సహోద్యోగి, ఆ తర్వాత భర్త వామన్ సర్దేశాయ్తో కలిసి భారత వైమానిక దళం విమానంలో పనాజీ, గోవాలోని ఇతర ప్రాంతాల మీదుగా ప్రయాణించింది. అందులోని రేడియో ట్రాన్సిస్టర్‌కు లౌడ్ స్పీకర్ అమర్చి పోర్చుగీస్, కొంకిణి భాషల్లో ప్రకటనలు చేసి వారు కరపత్రాలు విసిరారు.‘పోర్చుగీసు వారు లొంగిపోయారు. 451 సంవత్సరాల వలస పాలన తరువాత గోవా స్వాతంత్య్రం పొందింది’ అనేది ఆ ప్రకటనల సారాంశం.‘ఈరోజు కూడా అలాంటి సంతోషమే నాకు కలిగింది. ఇలాంటి క్షణాలు నా జీవితంలో అరుదు. ఈ అవార్డు ఆశ్చర్యకరమైన ఆనందాన్ని కలిగించింది. నేనెప్పుడూ ఊహించలేదు. కోరుకోలేదు. ఈ అవార్డు ఇతరులకు ఆదర్శంగా నిలుస్తుందని, స్ఫూర్తిని ఇస్తుందని ఆశిస్తున్నాను’ అంటుంది లోబో సర్దేశాయ్. గత ఏడాది మేలో ఆమె శతవసంతాన్ని పూర్తి చేసుకుంది. రెండవ ప్రపంచ యుద్ధ సమయంలో (lobo sardesai)లోబో సర్దేశాయ్... ఇటాలియన్ యుద్ధ ఖైదీలు రాసిన రహస్య లేఖలను అర్థం చేసుకుంటూ, సెన్సార్ చేస్తూ ట్రాన్స్‌లేటర్ గా పనిచేసింది. బొంబాయిలోని ఆల్ ఇండియా రేడియోలో స్టెనోగ్రాఫర్, లైబ్రేరియన్‌గా పనిచేసింది. తరువాత న్యాయవాద వృత్తిలోకి వచ్చింది. కాలేజీలో చదివే రోజుల్లో గోవా జాతీయోద్యమంలో చురుగ్గా పాల్గొనేది. విమోచనానంతరం న్యాయవాదిగా ప్రాక్టిస్ చేయడంతో పాటు మహిళా సహకార బ్యాంకును స్థాపించింది. రాష్ట్ర పర్యాటక రంగాన్ని తీర్చిదిద్దడంలో కీలక పాత్ర పోషించిన తొలి టూరిజం డైరెక్టర్‌గా గుర్తింపు తెచ్చుకుంది.ఆమెకు ‘పద్మ’ పురస్కారం ప్రకటించిన సందర్భంగా గోవా గవర్నర్ శ్రీధరన్ పిళ్లై పణాజీలోని సర్దేశాయ్ నివాసానికి వెళ్లి ఆమెకు పుష్పగుచ్ఛాన్ని అందించి, అభినందించారు. ఆమె మరింతకాలం ఆరోగ్యంగా ఉండాలని ఆకాంక్షించారు. సర్దేశాయ్ జీవన గాథను శ్రద్ధగా అధ్యయనం చేసి, దానినుంచి స్ఫూర్తిని పొందవలసిందిగా విద్యార్థులకు సూచించారు. ‘మీరు చెబుతున్నంత గొప్పదాన్నేమీ కాదు, నా మార్గంలోకి ఏమి వచ్చిందో, నేను అదే చేసుకుంటూ పోయాను అంతే’ అని నిండుగా నవ్వారామె. మేలు బొమ్మలు@98‘తోలు బొమ్మలాట’ ఆడిస్తూనే 98 ఏళ్లకు చేరుకున్న భీమవ్వ చిర్నవ్వు నవ్వింది. ఆమెకు ‘పద్మశ్రీ’ ప్రకటించారు. టీవీలు, సినిమాలు, ఓటీటీలు వచ్చినా భారతీయ సంప్రదాయకళను ఏ ప్రయోజనం ఆశించక ఆమె కాపాడుకుంటూ వచ్చింది. ఇప్పుడు ‘పద్మశ్రీ’ ఇస్తే ఆమె చేతి వేళ్లు కదిలి తోలుబొమ్మలు చప్పట్లు కొట్టొచ్చు. కాని నిజమైన చప్పట్లు జనం నుంచి ఆమెకు ఎప్పుడో దక్కాయి. భీమవ్వ లాంటి వాళ్లు రుషులు. పురస్కారాలకే వీరి వల్ల గౌరవం.భక్తులకు పుణ్యక్షేత్రాలు ఉంటాయి. కానీ ‘తోలుబొమ్మలాట’కు ఒక పుణ్యక్షేత్రం ఉందీ అంటే అది కర్నాటకలోని కొప్పల్ జిల్లాలోని ‘మొరనాల’ అనే పల్లెలో ఉన్న భీమవ్వ ఇల్లే. ఆ ఇంట్లో ఎవర్ని కదిలించినా తోలుబొమ్మలాట వచ్చు అని చెబుతారు. భీమవ్వకు ఇప్పుడు 96 సంవత్సరాలు. ఆమె కొడుకు కేశప్ప, మనవలు, మునిమనవలు అందరూ తోలుబొమ్మలాటలో నిమగ్నమై ఉన్నారు. ఎందుకంటే వారి వంశం కనీసం రెండు వందల ఏళ్లుగా తోలుబొమ్మలాట ఆడిస్తూ ఉంది. ‘నేను 14 ఏళ్ల వయసులో తోలుబొమ్మలాట నేర్చుకున్నాను’ అంటుంది భీమవ్వ. ఆమెకు ‘పద్మశ్రీ’ ప్రకటన వచ్చాక ఆమె ఇల్లు, ఊరు మాత్రమే కాదు మొత్తం కొప్పల్ జిల్లా సంబరం చేసుకుంటూ ఉంది. ఎందుకంటే భీమవ్వ ఆట కట్టని పల్లె ఆ జిల్లాలో లేదు. కర్నాటకలో లేదు. భీమవ్వ అందరికీ తెలుసు. ఉత్సవాలకు, జాతర్లకు భీమవ్వ ఆట ఉందంటే జనం బండ్లు కట్టుకుని వచ్చేవారు ఒకప్పుడు. ఇప్పుడూ ఆ ఘనత చెరగలేదు.‘నేను రామాయణ, మహాభారతాలను పొల్లు పోకుండా పాడగలను. భారతంలోని పద్దెనిమిది పర్వాలకూ ఆట కడతాను. అయితే కురుక్షేత్రం, కర్ణ పర్వం, ద్రౌపది వస్త్రాపహరణం, ఆది పర్వం ఇవి ఎక్కువగా చె΄్తాను. జనం వీటిని బాగా అడుగుతారు. రామాయణంలో లవకుశుల కథ చాలామందికి ఇష్టం’ అని చెప్పింది భీమవ్వ.గ్రామీణ కళ, జానపద కళ అయిన తోలుబొమ్మలాటను కర్నాటకలో ‘తొగలు గొంబెయాట’ అంటారు. తెలుగులో ఒకప్పుడు ప్రసిద్ధంగా ఉన్నట్టే కర్నాటకలో కూడా ఈ కళ ప్రసిద్ధం. అయితే భీమవ్వ వంశం దాని కోసం జీవితాలను అంకితం చేసింది. కనుక అక్కడ ఇంకా ఆ ఆట వైభవం కొనసాగుతూ ఉంది. ‘తోలు బొమ్మలాటలో నేనే రాముణ్ణి, సీతను, లక్ష్మణున్ని. అందరి పాటలూ పాడతాను. నా ఆట గొప్పదనం తెలిసిన ప్రపంచ దేశాలు నన్ను పిలిచి ఆట చూపించమన్నాయి. అమెరికా, పారిస్, ఇటలీ, ఇరాన్, ఇరాక్, స్విట్జర్లాండ్ ఈ దేశాలన్నింటికి వెళ్లి తోలుబొమ్మలాట ఆడాను’ అందామె. అదొక్కటే కాదు ఆమె దగ్గర 200 ఏళ్ల కిందటి తోలుబొమ్మలు భద్రపరిచి ఉన్నాయి.శిక్షణ ఇస్తున్నాతనకు తెలిసిన విద్య తన వాళ్లకే అనుకోలేదు భీమవ్వ(Bhimavva). ప్రతి ఏటా కొంతమంది యువతను ఎంపిక చేసి తోలుబొమ్మలాట(puppeteer)లో శిక్షణ ఇస్తుంది. అది నేర్చుకున్నవారు ఆటను కొనసాగిస్తున్నారు. కర్నాటక ప్రభుత్వం ఈ కృషిని గుర్తించి ఎన్నో పురస్కారాలు ఇచ్చింది. జనం భీమవ్వను గుండెల్లో పెట్టుకున్నారు. ‘ఇది మనదైన విద్య. దీనిని పోగొట్టుకోకూడదు. మన గ్రామీణ కళల్లో నీతి ఎంతో ఉంటుంది. మనిషికి నీతి చెప్పడానికైనా ఇలాంటి కళలను కాపాడుకోవాలి’ అంది భీమవ్వ.భీమవ్వ ఎన్నోసార్లు విమానం ఎక్కింది. కాని ఈసారి ఎక్కబోయే విమానం ఆమెను ‘పద్మశ్రీ’ ఇవ్వనుంది. ప్రధాని, కేంద్ర మంత్రులు, పెద్దలు కరతాళధ్వనులు చేస్తుండగా రాష్ట్రపతి చేతుల మీద ఆమె పద్మశ్రీ అందుకుని తోలు బొమ్మల ఆటకు కిరీటం పెట్టనుంది. -
లోబోకు కవల పిల్లలు, ఆనందంలో బిగ్‌బాస్ కంటెస్టెంట్
Bigg Boss Telugu 5, Lobo: బిగ్‌బాస్ తెలుగు ఐదో సీజన్ కంటెస్టెంట్ లోబో తండ్రయ్యాడు. ఈ శుభవార్తను అతడు ఇన్స్టాగ్రామ్ వేదికగా అభిమానులతో పంచుకున్నాడు. తన భార్యకు కవలలు జన్మించినట్లు చెప్పాడు. ఒక బాబు, ఒక కూతురు పుట్టారని సంతోషం వ్యక్తం చేశాడు. దీంతో ఆయన అభిమానులు లోబోకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. మెగాస్టార్ చిరంజీవి సైతం తన కవలలను ఆశీర్వదించాడంటూ ఓ ఫొటోను సోషల్ మీడియాలో షేర్ చేశాడు. ఇదిలా ఉంటే బిగ్‌బాస్ హౌస్‌లో ఉండగా లోబో తన భార్య గర్భవతి అని, ఈ సమయంలో తనకు తోడుగా లేనంటూ ఎమోషనల్ అయిన విషయం తెలిసిందే. తన కూతురు వీడియో చూసినప్పుడు సైతం ఫ్యామిలీ గుర్తొస్తుందంటూ ఏడ్చాడు. ఇక షో నుంచి బయటకు రాగానే కుటుంబంతో క్వాలిటీ టైం స్పెండ్ చేస్తున్న లోబో మంచి మంచి ఆఫర్లు అందుకుంటూ కెరీర్లో దూసుకుపోతున్నాడు. మెహర్ రమేశ్ దర్శకత్వంలో చిరంజీవి నటిస్తున్న భోళా శంకర్ చిత్రంలో లోబో నటిస్తున్నాడు. View this post on Instagram A post shared by Lobo (@lobo__619) -
నా కల నిజమైంది, లోబో ఎమోషనల్
ఒకప్పుడు టీవీ షోలు చేస్తూ ప్రేక్షకులని అలరించిన లోబో ఇటీవల బిగ్‌బాస్ ఆఫర్ కొట్టెశాడు. సీజన్ 5లో పాల్గొన్న ఆయన తన కామెడీతో హౌజ్‌మేట్స్‌ని ఫుల్ ఎంటర్టైన్ చేశాడు. సీక్రెట్ రూంలో ఉన్నా కూడా గేమ్‌ని మార్చుకోలేక బయటకు వచ్చేశాడు లోబో. ఈ క్రమంలో అతడికి సినిమా ఆఫర్స్ తలుపుతడుతున్నాయని, ఏకంగా చిరు సినిమాలోనే నటించే చాన్స్ కొట్టేశాడంటూ వార్తలు వచ్చాయి. అయితే దీనిపై క్లారిటీ లేదు. ఈ నేపథ్యంలో చిరంజీవి పిలిచి మరి తన సినిమాలో ఆఫర్ ఇచ్చారని స్వయంగా లోబోనే వెల్లడించాడు. చదవండి: ‘ఆర్ఆర్ఆర్’ ట్రైలర్‌పై చిరంజీవి ఆసక్తికర వ్యాఖ్యలు తన ఇన్‌స్టాగ్రామ్‌లో చిరుతో ఉన్న ఫొటోను షేర్ చేస్తూ ‘నా కల నిజమైంది. చిరంజీవి సార్ సినిమాలో ఆఫర్ వచ్చింది’ అంటూ స్పష్టం చేసిన సంగతి తెలిసిందే. ఇక ఇటీవల ఓ టీవీ షోలో పాల్గొన్న లోబో చిరంజీవి సినిమా ఆఫర్‌పై మాట్లాడుతూ కన్నీళ్లు పెట్టుకున్నాడు. ‘ సినిమాలో నాది చిరు సార్‌ని అంటిపెట్టుకుని ఉండే పాత్ర. మెగాస్టార్ పక్కన నటించడం అంటే తన కల సాకారమైనట్లే’ అని సంబర పడిపోయాడు. దీంతో పాటు ఈ సినిమాకు మెహర్ రమేశ్ తెరకెక్కిస్తున్నాడని చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం చిరంజీవి- మెహర్ రమేష్ దర్శకత్వంలో తమిళ చిత్రం వేదాళం రీమేక్‌గా ‘భోళా శంకర్’ చిత్రం రూపొందుతున్న విషయం తెలిసిందే. చదవండి: ఊహ నన్ను చూసి వణికిపోయింది: శ్రీకాంత్ ఆసక్తికర వ్యాఖ్యలు View this post on Instagram A post shared by Lobo (@lobo__619) -
మెగాస్టార్ చిరంజీవి సినిమాలో లోబో!
Bigg Boss 5 Telugu Contestants Lobo Got Movie Chance: 'హైదరాబాదీ ఎక్స్‌ప్రెస్' అనే మ్యూజిక్ షోతో బాగా పాపులర్ అయ్యాడు లోబో. తనకు అందరిలా ఉండటం నచ్చదు. సమ్‌థింగ్ స్పెషల్ అంటూ వెరైటీ జుట్టుతో, డిఫరెంట్ డ్రెస్సుతో, వినూత్న గెటప్‌తో, హైదరాబాదీ యాసతో ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు. ఆ తర్వాత స్క్రీన్ మీద పెద్దగా కనిపించని లోబో ఈ మధ్యే బిగ్‌బాస్ షో ద్వారా బుల్లితెర ఆడియన్స్‌ను పలకరించాడు. బస్తీ నుంచి వచ్చాను, జనాల సపోర్ట్ వల్లే ఎదిగాను అంటూ నిత్యం చెప్తూ ఉండే లోబోకు బిగ్‌బాస్ షో తర్వాత బంపర్ ఆఫర్ వచ్చింది. అతడికి స్టార్ హీరో సినిమాలో నటించే అవకాశం వచ్చింది. ఇంతకీ ఆ స్టార్ హీరో ఎవరనుకుంటున్నారు? మెగాస్టార్ చిరంజీవి. ఈమధ్యే చిరంజీవి లోబోను పిలిచి మరీ నా సినిమాలో ఛాన్స్ ఉంది, వచ్చి చేయమని చెప్పారట! ఓ టీవీ షోలో పాల్గొన్న లోబో ఈ విషయాన్ని వెల్లడిస్తూ భావోద్వేగానికి లోనయ్యాడు. తనది చిరును అంటిపెట్టుకుని ఉండే పాత్ర అని, మెగాస్టార్ పక్కన ఉండి నటించడం అంటే తన కల నెరవేరినట్లేనని సంబరపడుతున్నాడు. ఈ సినిమాకు మెహర్ రమేశ్ దర్శకత్వం వహిస్తున్నాడని చెప్పుకొచ్చాడు. అంటే లోబో.. మెహర్ రమేశ్- చిరంజీవి కాంబోలో వస్తున్న 'భోళా శంకర్' సినిమాలో నటించనున్నట్లు తెలుస్తోంది. -
ఆ కంటెస్టెంట్ జోలికొస్తే బాగోదు: లోబో వార్నింగ్
Bigg Boss Telugu 5, Lobo Supports Shannu: లోబో.. బిగ్‌బాస్ తెలుగు ఐదో సీజన్లో ఎంటర్టైనర్ ఆఫ్ హౌస్ బిరుదు అందుకున్నాడీ హైదరాబాదీ. అయితే ఎంటర్టైన్మెంట్ ఒకటే సరిపోదని గేమ్ ఆడితే బాగుండేదని అభిప్రాయపడ్డారు ప్రేక్షకులు. అయితే బిగ్‌బాస్ మాత్రం లోబోకు ఒక ఛాన్సిద్దామని సీక్రెట్ రూమ్‌కు పంపించారు. కానీ అక్కడి నుంచి వచ్చిన తర్వాత కూడా గేమ్‌లో పెద్దగా ఛేంజ్ లేకపోవడంతో ప్రేక్షకులు పెదవి విరిచారు. ఎనిమిదవ వారం అతడిని ఎలిమినేట్ చేశారు. హౌస్‌లో ఉన్నన్ని రోజులు రవి కోసం గేమ్ ఆడాడని, అతడికి కుడిభుజంలా వ్యవహరించాడని లోబో గురించి అంతా అనుకున్నారు. బయటకు వచ్చాక కూడా తన స్నేహితుడు రవికి ఓట్లేయండంటూ అతడికి సపోర్ట్ చేస్తూ వచ్చాడు. కానీ అనూహ్యంగా రవి కూడా షోలో నుంచి నిష్క్రమించడంతో ఇప్పుడు లోబో మరో కంటెస్టెంట్‌కు మద్దతు ప్రకటించాడు. యూట్యూబర్ షణ్ముఖ్ జశ్వంత్‌కు ఓటేయమని అభ్యర్థిస్తున్నాడు. అతడు ఈ వారం ఓటింగ్‌లో లేకపోయినా ఓట్లేయండంటూ వీడియో రిలీజ్ చేశాడు. View this post on Instagram A post shared by Lobo (@lobo__619) హౌస్‌లో ఉన్న అందరూ తనకు ఫ్రెండ్సే అని, కానీ షణ్ను అంటే కాస్త ఎక్కువ లవ్ అని చెప్పుకొచ్చాడు. ఎవరు ఎంత బాగా ఆడుతున్నారు? ఎవరు బాగా ఆడట్లేదు? అనేది పక్కనపెడితే షణ్ను తన ఫ్రెండ్ అని, అతడి జోలికొస్తే బాగోదని హెచ్చరించాడు. షణ్నును తోపుగా అభివర్ణించిన లోబో అతడికి సపోర్ట్ చేసి సూపర్ స్టార్‌ను చేద్దామని పిలుపునిచ్చాడు. -
బిగ్‌బాస్: లోబో అన్ని లక్షలు వెనకేసుకున్నాడా?
బిగ్‌బాస్ మీద ఇంట్రస్ట్‌తోనే సెలబ్రిటీలు షోలో పాల్గొంటారు. కానీ లోబో మాత్రం కొంత విరక్తి, మరికొంత ఆసక్తితో హౌస్‌లో అడుగుపెట్టాడు. గతంలో బిగ్‌బాస్ షో నచ్చదన్నాడు కదా! కానీ మరోసారి జనాలను ఎంటర్టైన్ చేసేందుకు ఐదో సీజన్లో ఎంట్రీ ఇచ్చాడు. అతడు హౌస్‌లో చేసే కామెడీకి కొదవ లేదు, లోబో అన్నయ్య కామెడీకి పొట్ట చెక్కలయ్యేలా నవ్వుతామని హౌస్‌మేట్ ప్రియాంక సింగ్ ఎన్నోసార్లు చెప్పుకొచ్చింది. కానీ షోలో రాణించాలంటే కామెడీ ఒక్కటే చేస్తే సరిపోదు, టాస్క్‌లు కూడా ఆడాలి! ఈ విషయాన్ని ఆలస్యంగా తెలుసుకున్నాడు లోబో. పైగా మాటిమాటికీ బస్తీలో నుంచి వచ్చాను, బస్తీ వాడిని అని చెప్పడం వల్ల అతడు సింపతీ కోసం ట్రై చేస్తున్నాడని నెగెటివ్ అభిప్రాయం ఏర్పడింది. వెరసి.. లోబో 8వ వారం ఎలిమినేట్ అయ్యాడు. అయితే అతడికి బిగ్‌బాస్ నుంచి ఎంత ముట్టిందనేది సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. లోబో రెమ్యునరేషన్ విషయానికి వస్తే అతడు వారానికి లక్షన్నర నుంచి రెండు లక్షల వరకు తీసుకున్నాడట! ఈ లెక్కన అతడు రోజుకు దాదాపుగా పాతిక వేల పైచిలుకు వెనకేసినట్లు తెలుస్తోంది. అంటే ఎనిమిది వారాలకు ఏకంగా 15 లక్షల కన్నా ఎక్కువే సంపాదించాడు. అతడు చేసిన ఎంటర్టైన్మెంట్ను దృష్టిలో పెట్టుకుని బిగ్‌బాస్ నిర్వాహకులు ముందుగా అనుకున్న డీల్ కంటే ఒకింత ఎక్కువే ఉండే అవకాశమూ లేకపోలేదు! -
షణ్నుకు వచ్చే భార్య కూడా సిరిలా చేయదు: లోబో
Bigg Boss Buzz, Lobo Interview: ఎంటర్టైనర్ ఆఫ్ హౌస్‌గా పేరు తెచ్చుకున్నాడు లోబో. మొదట్లో తెగ నవ్వించినా రానురానూ డల్ అయిపోయాడు. ఆరోవారం ఫేక్ ఎలిమినేషన్ ద్వారా హౌస్ బయటకు వచ్చేసిన లోబో తాజాగా అరియానా గ్లోరీ వ్యాఖ్యాతగా వ్యవహరించే బిగ్‌బాస్ బజ్కు హాజరయ్యాడు. ఈ సందర్భంగా అతడు తన దోస్త్ రవిని పదేపదే ఎందుకు నామినేట్ చేయాల్సి వచ్చిందో చెప్పాడు. అందరూ కొత్త ముఖాలే అని, అందుకే తనకు తెలిసిన రవిని నామినేట్ చేశానని సింపుల్‌గా చెప్పేశాడు. కాజల్ బిగ్‌బాస్ హౌస్‌లో సంవత్సరం ఉండమన్నా ఉంటుందని కామెంట్ చేశాడు. సిరి, షణ్నుతో ఫ్రెండ్షిప్ చేసి జెస్సీ హౌస్‌లో కంటిన్యూ కావాలనుకుంటున్నాడా? అన్న అరియానా ప్రశ్నకు అతడో స్వార్థపరుడని పెదవి విరిచాడు. షణ్నుకు డిఫరెంట్ యాటిట్యూడ్ ఉందని, తనకు గేమ్ ఎలా ఆడాలో బాగా తెలుసని చెప్పుకొచ్చాడు. చెటాకు మాటకు నాలుగు లక్షల మాటలు చెప్పుడు వద్దే వద్దని రవికి సూచించాడు. సిరి.. ఓ పక్క చేసేది చేస్తూనే ఒర్రుతుందన్నాడు. ఇక ఆమె షణ్నుకు చేసే సపర్యల గురించి చెప్తూ.. షణ్ను లేవగానే చేతికి బ్రష్ అందిస్తుంది. అన్ని పనులు చేసి పెడుతుంది. అతడికి వచ్చే భార్య కూడా ఇంతలా చేయకపోవచ్చు. మరోసారి ప్రజల వల్లే తానీ స్టేజీలో ఉన్నానని చెప్తూ ఎమోషనల్ అయ్యాడు లోబో. ప్రస్తుతం ఈ ఇంటర్వ్యూ వీడియో వైరల్‌గా మారింది. -
లోబో ఎలిమినేట్.. హౌస్‌లో ఆ ఆరుగురే లోబో శత్రువులు!
బిగ్‌బాస్ తెలుగు ఐదో సీజన్ దీపావళి స్పెషల్ ఎపిసోడ్లో ఎంటర్టైన్మెంట్ ఆకాశాన్ని తాకింది. తారల డ్యాన్సులతో స్టేజీ దద్దరిల్లిపోయింది. బిగ్‌బాస్ మాజీ కంటెస్టెంట్లు చేసిన రచ్చను ప్రేక్షకులు ఆస్వాదించారు. ఇక విజయ్ దేవరకొండ, ఆనంద్ దేవరకొండలను ఒకే స్క్రీన్‌పై చూసి ముచ్చటపడిపోయారు అభిమానులు. మొత్తానికి బోలెడంత ఎంటర్టైన్మెంట్ను అందించిన ఈ ఎపిసోడ్లో ఎలిమినేషన్ ఘట్టం కూడా ముగిసింది. 8వ వారం లోబో ఎలిమినేట్ అయ్యాడు. అతడి ఎలిమినేషన్‌తో హౌస్‌లో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. ఇది నిజమా? కలా? అని కొంతమంది కంటెస్టెంట్లు షాక్‌లోకి వెళ్లిపోయారు. ఈసారి సీక్రెట్ రూమ్, గట్రా ఏదీ ఉండదని అర్థమైన లోబో.. తనేదైనా తప్పుగా మాట్లాడితే క్షమించమని కాజల్‌ను వేడుకున్నాడు. స్టేజీ మీదకు వచ్చిన లోబోతో ఐదుగురు మిత్రువులు- ఆరుగురు శత్రువులు గేమ్ ఆడించాడు నాగార్జున. ఈ సందర్భంగా లోబో.. తొలుతగా ఫ్రెండ్స్ గురించి చెప్పుకొచ్చాడు. నాకు ఎల్లప్పుడూ బూస్ట్ ఇచ్చే విశ్వ తన ఫ్రెండ్ అని తెలిపాడు. అలాగే కాజల్, సన్నీ, రవి కూడా తన మిత్రువులేనని పేర్కొన్నాడు. ఇక ఐదో ఫ్రెండ్ యానీ గురించి చెప్తూ ఆమె కెప్టెన్ అయితే మా గల్లీలో పటాకులు కాలుస్తానన్నాడు. మిగిలిన షణ్ముఖ్, జెస్సీ, సిరి, మానస్, పింకీ శ్రీరామ్.. శత్రువులని చెప్పకనే చెప్పాడు. -
బిగ్‌బాస్‌కు టాటా చెప్పేసిన లోబో!
Bigg Boss 5 8th Week Elimination: బిగ్‌బాస్ తెలుగు ఐదో సీజన్లో ఎలిమినేషన్ ఎపిసోడ్ పస లేకుండా పోతోంది. ఎవరు ఎలిమినేట్ అవుతారన్నది ఒకరోజు ముందే లీకవడంతో సస్పెన్స్‌కు స్థానం లేకుండా పోయింది. ఈ వారం రవి, లోబో, శ్రీరామచంద్ర, సిరి హన్మంత్, షణ్ముఖ్ జస్వంత్, మానస్ నామినేషన్లో ఉన్నారు. వీరిలో రవి, శ్రీరామ్, మానస్, షణ్ముఖ్‌లకు ఓటింగ్ పరంగా ఢోకా లేదు. వీళ్లందరికీ సోషల్ మీడియాలో భారీ ఫాలోయింగ్ ఉంది, కాబట్టి ఈజీగా ఎలిమినేషన్ నుంచి బయటపడతారు.. ఎటొచ్చీ సిరి, లోబోలనే ఎలిమినేషన్ గండం వెంటాడుతోంది. వీళ్లిద్దరిలో లోబో కన్నా సిరి బెటర్ అన్నది చాలామంది అభిప్రాయం. ఆమె టాస్కులు ఆడుతూ, గొడవలు పెట్టుకుంటూ, షణ్నూ దగ్గర అలుగుతూ, ఏదో ఒకరకంగా స్క్రీన్ స్పేస్ సంపాదించుకుంటూ వస్తోంది. లోబో మొదట్లో ఎంటర్టైన్ చేసినా రానురానూ డల్ అయిపోయాడు. అతడు బాగా ఆడాడు అని చెప్పుకోవడానికి ఒకటీ, రెండు టాస్కులు మినహా పెద్దగా ఏమీ లేవు. పైగా ఏడు వారాల్లో ఆరుగురు అమ్మాయిలను పంపించివేయడంపై బిగ్‌బాస్‌పై గరమవుతున్నారు నెటిజన్లు. అమ్మాయిలను విన్నర్ చేయొద్దని ముందే డిసైడ్ అయినట్లున్నారని విమర్శలు చేస్తున్నారు. ఈ క్రమంలో ఈ వారం కూడా అమ్మాయినే పంపించివేస్తే మరింత విమర్శలపాలవడం ఖాయం. దీనికి తోడు అనధికారిక పోల్స్‌లోనూ లోబోకు తక్కువ ఓట్లు వచ్చాయి. అటు అఫీషియల్ ఓటింగ్‌లోనూ లోబో వెనకబడినట్లు సమాచారం! ఫలితంగా ఈ వారం లోబో.. హౌస్ నుంచి తన బస్తీకి పయనమవుతున్నట్లు తెలుస్తోంది. -
ఎలిమినేషన్: ఈసారి లోబోను ఎవరూ కాపాడలేరు!
Bigg Boss 5 Telugu, 8th Week Elimination: బిగ్‌బాస్ షోలో ప్రేక్షకులకు ఎక్కువ కిక్కేచ్చేవి రెండే రెండు. ఒకటి నామినేషన్, రెండు ఎలిమినేషన్. సోమవారం నామినేషన్స్ తంతు పూర్తవగానే సండే ఎలిమినేషన్ ప్రక్రియ కోసం కళ్లు కాయలు కాచేలా ఎదురు చూస్తుంటారు వీక్షకులు. అయితే ఎవరు నామినేషన్లో ఉన్నారు? ఎవరు ఎలిమినేట్ అవుతున్నారు? అన్న విషయాలను ఎపిసోడ్ ప్రసారమవడాని కంటే ముందే లీక్ చేసి అసలైన మజాను పోగొడుతున్నారు లీకువీరులు. అయినప్పటికీ ఎలిమినేట్ అయినప్పుడు వారి భావోద్వేగాలను, స్టేజీపై వారు మాట్లాడే మాటలను వినాలని తెగ ఉవ్విళ్లూరుతుంటారు బిగ్‌బాస్ లవర్స్. ఇక ఈసారి కూడా ఎవరు బిగ్‌బాస్ హౌస్‌ను వీడబోతున్నారు? అని చర్చలు మొదలెట్టేశారు. అయితే ఈసారి ఎలిమినేషన్ వార్ వన్‌సైడ్ అవనున్నట్లు కనిపిస్తోంది. అదెలాగంటే.. ఎనిమిదవ వారం రవి, లోబో, శ్రీరామచంద్ర, సిరి హన్మంత్, షణ్ముఖ్ జశ్వంత్, మానస్ నామినేషన్స్‌లో ఉన్నారు. వీరిలో రవి ఈ సీజన్ ప్రారంభం నుంచి ప్రతివారం నామినేట్ అవడం, తనకున్న ఫ్యాన్ ఫాలోయింగ్‌తో సేవ్ అవడం ఆనవాయితీగా వస్తోంది. కాబట్టి రవి బెర్త్‌కు ఢోకా లేదు. యూట్యూబ్ సంచలనం షణ్ముఖ్‌కు సైతం యూత్‌లో మంచి పాపులారిటీ ఉంది. అతడు నామినేషన్లోకి రావడమే తరువాయి ఓట్ల వర్షం కురిపిస్తున్నారు అభిమానులు. అనఫీషియల్ ఓటింగ్‌లో భారీ ఓట్లతో టాప్ ప్లేస్‌లో దూసుకుపోతున్నాడు. అధికారిక ఓటింగ్‌లోనూ అతడు ముందువరుసలో ఉండే ఛాన్స్ ఉంది. ఇక శ్రీరామచంద్ర, మానస్.. ఇద్దరూ మిస్టర్ కూల్‌గా పేరు తెచ్చుకున్నవారే. లేనిపోని గొడవలు పెట్టుకోకుండా, ఏ తగవుల్లోనూ దూరకుండా తమ పని తాము చేసుకుపోతున్నారు. రోజురోజుకీ వీళ్లిద్దరి గ్రాఫ్ పెరుగుతూనే ఉంది తప్ప తగ్గడం లేదు. ఈ ఇద్దరినీ అభిమానులు ఇంకొన్నాళ్లు కాపాడుకుంటారే తప్ప అప్పుడే షో నుంచి జారవిడుచుకోరు. మిగిలిందల్లా సిరి, లోబో. ఈ ఇద్దరే ఈ వారం డేంజర్ జోన్లో ఉన్నారు. కానీ ఎలిమినేషన్ కత్తి ప్రధానంగా వేలాడుతోంది లోబోపైనే. ఎందుకంటే గడిచిన ఏడు వారాల్లో ఆరుగురు అమ్మాయిలను షో నుంచి పంపించేసి బిగ్‌బాస్ పక్షపాతం చూపిస్తున్నాడని విమర్శలు ఎదుర్కొంటున్నారు. అలాంటి తరుణంలో మరోసారి అమ్మాయినే పంపించేసి చేతులు కాల్చుకునే సాహసం చేయదు బిగ్‌బాస్ టీమ్. ముఖ్యంగా గ్లామర్ కంటెంట్ తగ్గిపోయింది కాబట్టి దాన్ని బ్యాలెన్స్ చేయడానికైనా సిరిని ఇంకొన్నాళ్లు కొనసాగించే అవకాశం ఉంది. పైగా టాస్కుల్లో లోబో కంటే మెరుగ్గా ఆడుతోంది. ఇక లోబో విషయానికి వస్తే.. ఆరోవారంలో అమ్మాయిని పంపించకూడదని బిగ్‌బాస్ నిర్వాహకులు ఓ నిర్ణయానికి వస్తే గనుక శ్వేతవర్మ స్థానంలో ఎలిమినేట్ అయ్యేది లోబోనే! కానీ సీక్రెట్ రూమ్‌తో అతడిని ఆ గండం నుంచి గట్టెక్కించారు. కానీ ఈ వారం మాత్రం అతడిని ఎవరూ కాపాడలేరని తెలుస్తోంది. సీజన్ ప్రారంభమైన మొదట్లో లోబో బాగానే ఎంటర్టైన్ చేసినా రానురానూ డల్ అయిపోయినట్లు కనిపించింది. టాస్కుల్లోనూ ఎక్కడా పనితనం చూపకపోవడంతో స్వయంగా నాగార్జునే టాస్కుల్లోనూ కాస్త యాక్టివ్‌గా ఉండవయ్యా అంటూ చురకలంటించాడు. సీక్రెట్ రూమ్ ఎపిసోడ్ తర్వాత అతడు ఆటపై కొంత ఫోకస్ పెట్టినప్పటికీ అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. ఈ 50 రోజుల్లో మిగతా కంటెస్టెంట్లు అందరూ టాస్క్‌ల్లో చురుకుగా పాల్గొంటూ తమ గ్రాఫ్‌ను పెంచుకుంటూ పోగా లోబో మాత్రం కేవలం ఎంటర్టైన్మెంట్నే నమ్ముకుని ఒకే దగ్గర ఉండిపోయాడు. ఏ విధంగా చూసుకున్న లోబో ఈ వారం ఎలిమినేట్ అవడం ఖాయంగా కనిపిస్తోంది. లేదు, అతడిని ఎలాగైనా కాపాడుకుంటాం అని బిగ్‌బాస్ నిర్వాహకులు అనుకుంటే మాత్రం సిరి బలవక తప్పదు. -
Bigg Boss 5 Telugu: ప్రియాంక.. ముద్దుల బావలు వీళ్లే
బిగ్‌బాస్-5లో ట్రాన్స్ జెండర్ కంటెస్టెంట్‌గా పరిచయం అయినా ప్రియాంక... తన అంద చందాలతో బిగ్ బాస్ హౌస్‌లోనే గ్లామర్ బ్యూటీగా అవతరించిన ప్రియాంక స్ట్రాంగ్ కంటెస్టెంట్‌గా మారింది. మానస్‌తో ఆమె నడిపే లవ్‌ట్రాక్.. ప్రేక్షకులకు తెగ నచ్చేసింది. వారిద్దరిపై మిగతా సభ్యులు వేసే పంచ్‌లు, జోకులు బాగా పేలుతున్నాయి. తాజా ఎపిసోడ్లో ప్రియాంక పెద్దబావ, చిన్నబావ, బుల్లిబావల విషయంలో రవి, లోబోల మధ్య జరిగిన సరదా సంభాషణ నవ్వులు పూయించాయి. శ్రీరామ్‌ను పెద్ద బావ, మానస్‌ను చిన్నబావ అని, జెస్సీని బుల్లి బావ అంటూ ప్రియాంక చెప్పుకొచ్చింది. పెద్ద బావ ఒప్పుకోవడం లేదన్న.. కట్నం కావాలని అంటున్నాడు అన్నయ్య అంటూ యాంకర్ రవితో అంటే.. రెండో అన్నయను అడుగు అంటూ లోబో వద్దకు పంపించాడు రవి. లోబో మాట్లాడుతూ పింకికి బుల్లి బావ ఎవరు అనగా.. జెస్సీ అని రవి సమాధానం ఇచ్చాడు. అయితే వాడు కూడా క్యారెక్టర్లో ఉన్నాడా అంటూ లోబో ఆశ్చర్యం వ్యక్తం చేశారు. దాంతో జెస్పీ గాడికి నేనంటే చాలా ఇష్టం అంటూ ప్రియాంక చెప్పుకొచ్చింది. ‘నీ మాట వినని పెద్దబావ కాళ్లూచేతులు తీసేస్తాను’లోబో అంటే ‘అయ్యయ్యో అలా చేయవద్దు అన్నయ్య’అని ప్రియాంక రిక్వెస్ట్ చేసింది. చిన్నబావ అన్ని విషయాల్లోనూ అడ్జెస్ట్ అవుతాడు.. వాడిని ఇచ్చి పెళ్లి చేస్తాఅని లోబో చెప్పాడు. ‘నీకు కూడా అతడే కదమ్మా కావాల్సింది’అని రవి కౌంటర్ ఇవ్వడం నవ్వులు పూయించింది. (చదవండి: బిగ్‌బాస్: ఎట్టకేలకు గెలిచిన షణ్ముఖ్.. చెమటలు కక్కిన శ్రీరామ్) -
బిగ్‌బాస్: ఎట్టకేలకు గెలిచిన షణ్ముఖ్.. చెమటలు కక్కిన శ్రీరామ్.
Bigg Boss Telugu 5, Episode 52: బిగ్‌బాస్ ఇంట్లో ఎనిమిదోవారం కెప్టెన్సీ కంటెండర్ టాస్క్ ఇంటి సభ్యులకు చుక్కలు చూపిస్తోంది. కెప్టెన్ అయ్యేందుకు కంటెస్టెంట్స్ నానా కష్టాలు పడుతున్నారు. లోబో, షణ్ముఖ్ ఆవుపేడతో ఆటలాడగా.. సిరి, రవి స్విమ్మింగ్‌ఫూల్‌లో సీసాలు ఏరారు. మరోవైపు మానస్, శ్రీరామచంద్రలు చమటలు పట్టేలా తాళ్లను ఊపారు. మరి ఈ టాస్కుల్లో ఎవరుగెలిచారు. హౌస్‌ని లాక్డౌన్ చేస్తున్నట్లు బిగ్‌బాస్ ఎందుకు ప్రకటించారు. ఇంట్లోకి వెళ్లేందుకు కంటెస్టెంట్స్ పడ్డ కష్టాలేంటో నేటి ఎపిసోడ్ చదివేద్దాం. సిరికి షణ్ముఖ్ గోరు ముద్దలు నామినేషన్ ప్రక్రియలో విశ్వ ప్రవర్తన తనకు నచ్చలేదని సిరికి చెప్పాడు షణ్మఖ్. ఆమెకు గోరుముద్దలు తినిపిస్తూ.. తన గోడునంతా చెప్పుకున్నాడు. అందరిలాగే తనకు కూడా అమ్మ మొదటిసారే లెటర్ రాసిందని.. అందరు చెపుకుంటారు, మనం చెప్పుకోము అంతే తేడా అన్నాడు. అలాగే విశ్వ చాలా సేఫ్ గేమ్ ఆడుతున్నాడని, నామినేషన్ అంటే ఆయన భయమని చెప్పాడు. టాప్ 5లో నేను, మానస్ ఉంటాం : ప్రియాంక బెడ్రూమ్ ఏరియాలో పింపీ, సిరి, మానస్ ముచ్చట్లు పెట్టారు. ఈ సారి నామినేషన్లో ఆరుగురు ఉన్నారు కదా అని మానస్ అడగ్గా.. అవును ఒక గర్ల్, ఐదుగురు బాయ్స్ ఉన్నారని సిరి చెప్పింది. పింకి ఈ సారి కూడా నామినేషన్లో లేరని సిరి అనగా.. నేను మానస్ టాప్ 5లో ఉంటామని ప్రియాంక చెప్పింది. దానికి సిరి నవ్వుతూ.. 'మేమేంటి అడుక్కోవాలా..?' అని ప్రశ్నించించగా.. మా పక్కన మీ ముగ్గురు కూడా ఉంటారులేని కౌంటర్ ఇచ్చింది పింకి. ఇక మానస్ అయితే.. అంకుల్స్ అంతా బయటకు వెళ్లిపోవాలి.. కుర్రాళ్లంతా లోపలే ఉండాలని మాసన్ కోరుకోగా.. ఒకవేళ ఆంటీలను బయటకు పోవాలని చెబితే.. పింకీ వెళ్తుందని సిరి నవ్వుతూ కౌంటర్ వేయగా.. మొహం పగిలిపోద్దని ప్రియాంక ఫన్నీ వార్నింగ్ ఇచ్చింది. షన్ను అంటే.. ఇన్ మోజ్ రూమ్ విత్ త్రీ: యాంకర్ రవి ఇక రవి ఏమో ఎప్పటిమాదిరే.. ఇతరులను ఇన్ఫ్లూయన్స్ చేసే పనిలో పడ్డాడు. షణ్ముఖ్ దగ్గరకు వెళ్లి.. 'నాకు తెలిసి నేను చూసిన దాంట్లో వేర్ ఈజ్ షన్ను అంటే.. ఇన్ మోజ్ రూమ్ విత్ త్రీ.. ఆన్ బెడ్ విత్ త్రీ..' అంటూ షన్ను పరువు తీశాడు రవి. కెప్టెన్సీ పోటీదారుల టాస్క్..‘అభయహస్తం’ కెప్టెన్సీ కంటెండర్ టాస్క్ కోసం ఇంటిని లాక్డౌన్ చేసినట్లుగా ప్రకటించారు బిగ్ బాస్. ఇందులో భాగంగా అభయహస్తం టాస్కులో గెలిచి కెప్టెన్సీ కంటెస్టెంట్ గా సెలక్ట్ అయిన సభ్యులు మాత్రమే ఇంట్లోకి వెళ్లాల్సి ఉంటుందని కండిషన్ పెట్టాడు. ఇందులో భాగంగా గార్డెన్ ఏరియాలో కెప్టెన్సీ టాస్క్ కోసం ఏర్పాట్లు చేశారు. ఈ వారం కెప్టెన్సీ పోటీదారులు అవ్వడానికి, అలాగే ఇంట్లోకి వెళ్లడానికి ఐదు చాలెంజ్‌లు ఎదుర్కొవాల్సి ఉంటుందని చెప్పారు బిగ్‌బాస్. ఈ చాలెంజ్‌లో భాగంగా ఎవరెవరు పోటీ పడతారనేది ఇంటి సభ్యులంతా ఏకాభిప్రాయంతో చెప్పాలి. అలాగే ఒక చాలెంజ్‌లో ఓడినవారు ఇంటి సభ్యులను ఒప్పించి మిగతా చాలెంజ్‌లలో కూడా పోటీపడొచ్చు. మొదటి చాలెంజ్..మట్టిలో ముత్యాలు ఈ చాలెంజ్‌లో భాగంగా గార్డెన్ ఏరియాలో బాత్‌టబ్‌లో మట్టి, పేడ, ముత్యాలు కలిపి ఉన్నాయి. దాని నుంచి ఎవర ఎక్కువ ముత్యాలు తీస్తారో వారే విజేతలు. ఒక్కోసారి ఒక్కో ముత్యాన్ని మాత్రమే వేయాలి. ఈ టాస్క్‌కి ఇంటి సభ్యులందరూ ఏకాభిప్రాయంతో ఇప్పటివరకూ కెప్టెన్ పోటీదారులుగా అర్హత సాధించలేకపోయిన షణ్ముఖ్, లోబోలు వెళ్లారు. ఇందులో టాస్క్‌లో షన్నూ 101 ముత్యాలను ఏరి లోబో(74)పై విజయం సాధించాడు. అయితే షణ్ముఖ్ తీసిన ముత్యాలు సరిగా లేవని విశ్వ, శ్రీరామచంద్ర, రవి అనగా.. నీట్‌గా ఉండటం మ్యాటర్ కాదు.. ఎక్కువ తీయాలంతే అంటూ అడ్డంగా వాదించింది సిరి. చివరకు సంచాలకులుగా ఉన్న సన్నీ.. షణ్ముఖ్‌ని విన్నర్‌గా ప్రకటించడంతో సిరి ఎగిరిగంతేసి షణ్ముఖ్‌ని గట్టిగా కౌగిలించుకుంది. రెండో చాలెంజ్ గాలం మార్చే మీ కాలం రెండో చాలెంజ్‌గా ‘గాలం మార్చే మీ కాలం’టాస్క్ ఇచ్చాడు బిగ్‌బాస్. ఈ టాస్క్‌లో భాగంగా స్విమ్మింగ్ ఫూల్ అడుగున ఉన్న బాటిల్స్‌ని ఫిషింగ్ రాడ్‌తో బయటకు తీయాలి. ఎండ్ బజర్ మోగేలోపు ఎవరు ఎక్కువ బాటిల్స్‌ని బయటకు తీస్తారు వారే విజయం సాధించినట్లు. దీని కోసం రవి, సిరి హోరా హోరిగా పోటీపడ్డారు. చివరకు సిరి 15 బాటిల్స్‌ని బయటకు తీసి రవి(12)పై విజయం సాధించింది. మూడో చాలెంజ్.. తాడులు తకదిమి మూడో చాలెంజ్‌గా తాడుల తకదిమి టాస్క్ ఇచ్చారు. ఇందులో భాగంగా ఎవరైతే రోప్‌లను ఎక్కువగా వేగంగా కదుపుతూ ఆపకుండా ఉంటారో వారే గెలుస్తారు. ఆపేసిన వారు ఓడిపోతారు. దీని కోసం శ్రీరామచంద్ర, మానస్ పోటీ పడ్డారు. ఇద్దరు చెమటలు వచ్చేలా తాడులను ఊపారు. చివరకు మానస్ భరించలేక తాడులను వదిలేయడంతో శ్రీరామ్ విజయం సాధించాడు. అయితే మిగిలిన టాస్క్‌లతో పోల్చితే ఈ టాస్క్ కోసం శ్రీరామచంద్ర చాలా కష్టపడ్డాడు. చెమటలు వచ్చినప్పటికీ.. తాడులను ఊపడం ఆపలేదు. దీంతో మూడో విజేతగా నిలిచి ఇంట్లోకి ప్రవేశించాడు. మొత్తంగా ఇప్పటివరకు కెప్టెన్సీ దారులుగా షణ్ముఖ్, సిరి, శ్రీరామచంద్రలు గెలిచి, బిగ్‌బాస్ హౌస్‌లోకి వెళ్లారు. మిగిలి సభ్యులంతా బయటే ఉన్నారు. మరి వారిలో ఏ ఇద్దరు చాలెంజ్‌లు గెలిచి కెప్టెన్సీ పోటీదారులైన షన్నూ, సిరి, శ్రీరామ్‌లతో పోటీపడ్డారు? ఈ వారం కెప్టెన్‌గా ఎవరు ఎంపికయ్యారో రేపటి ఎపిసోడ్లో చూద్దాం. -
బిగ్‌బాస్-5: లాక్డౌన్లో బిగ్‌బాస్ హౌస్.. షాక్‌లో ఇంటి సభ్యులు
Bigg Boss 5 Telugu Today Promo: బిగ్‌బాస్ ఐదో సీజన్ రానురానూ ఆసక్తికరంగా సాగుతోంది. కంటెస్టెంట్స్ కొంతమంది సరదాగా గడుపుతుంటే, మరికొంత మంది ఎమోషనల్ గా ఉన్నారు. అప్పుడే ఈ షో ఏడువారాలను పూర్తి చేసుకొని ఎనిమిదోవారంలోకి అడుగుపెట్టింది. ఈ వారం ఎలిమినేషన్ రవి, లోబో, శ్రీరామచంద్ర, సిరి హన్మంత్,షణ్ముఖ్ జస్వంత్, మానస్ ఉన్నారు. నామినేషన్ ప్రక్రియ పూర్తయిన వెంటనే.. హౌస్‌లో కొత్త కెప్టెన్‌ను ఎన్నుకునే ప్రక్రియ మొదలైంది. ఈ వారం కెప్టెన్సీ పోటీదారుల కోసం ‘అభయహస్తం’అనే టాస్క్‌ని ఇచ్చాడు బిగ్‌బాస్. ఈ టాస్క్‌లో భాగంగా బిగ్‌బాస్ ఇంటిని పూర్తిగా లాక్డౌన్ చేస్తున్నట్లు ప్రకటించాడు. ఈ చాలెంజ్‌లో గెలిచిన సభ్యులకు మాత్రమే ఇంట్లోకి ఎంట్రీ ఉంటుంది. ఈ టాస్క్‌లో భాగంగా షణ్ముఖ్-లోబో హోరా హోరిగా తలపడినట్లు తాజాగా విడుదలైన ప్రోమో చూస్తే అర్థమవుతుంది. (చదవండి: బిగ్‌బాస్: ప్రియ పారితోషికం ఎన్ని లక్షలో తెలుసా?) బురదతో నిండిన బాత్‌టబ్ నుంచి కాయిన్స్‌ని సేకరించే టాస్క్‌లో లోబో-షణ్ణ్నూ పోటీ పడ్డారు. ఆ సమయంలో విశ్వ-షణ్ముఖ్, కాజల్-లోబో మధ్య చిన్నపాటి మాటల యుద్దం జరిగింది. ‘వందమంది వంద వాగుతారు అని షణ్ణ్నూ అనగా.. విశ్వ మధ్యలో కలగజేసుకొని.. అంతా ఇక్కడ ఉన్నోళ్లమే కదా డార్లింగ్ అని సీరియస్ అయ్యారు. ఆ వంద మందిలో నువ్వు ఉన్నావా.. అంటూ షణ్ముఖ్ కౌంటర్ ఇచ్చాడు. ఇక కాజల్ ఏదో అనబోతుండగా.. కాసేపు ఏం మాట్లాడొద్దని లోబో అడ్డుకోబోయాడు. ‘నా ఇష్టం నేను మాట్లాడతా. నీకు ఇబ్బంది ఉంటే చెవులు మూసుకో’అంటూ లోబోపై కాజల్ ఫైర్ అయ్యారు. మరి ఈ కెప్టెన్సీ కంటెండర్ టాస్క్ ఇంటి సభ్యుల మధ్య ఎలాంటి చిచ్చు పెట్టిందో తెలియాలంటే.. నేటి ఎపిసోడ్ చూడాల్సిందే. -
నా కొడుకు నాకు పుట్టలేదు, నీ బాధ అర్థం చేసుకోగలను: సిరి
Bigg Boss Telugu 5, Episode 51: రవి లోబోకు చాలా సపోర్ట్ చేస్తాడు, కానీ అతడు మాత్రం రవికి సపోర్ట్ చేయడు, ఫ్రెండంటాడు, కానీ పదేపదే నామినేట్ చేస్తాడు అని పింకీతో చెప్పుకొచ్చింది యానీ మాస్టర్. ఇంతలో లోబో నమాజ్ చేసుకుంటూ ఏడ్చేశాడు. దీంతో రవి అతడిని దగ్గరకు తీసుకుని ఓదార్చాడు. బిగ్‌బాస్ హౌస్‌లో కంటెస్టెంట్లు అడుగుపెట్టి 50 రోజులు పూర్తయిందన్న బిగ్‌బాస్.. మీకు ఎంతో ప్రియమైనవారి నుంచి లేఖను పొందే అవకాశం లభిస్తుందని ఊరించాడు. కానీ.. ఏదైనా దక్కించుకోవాలంటే ఇంకేదైనా వదులుకోవాల్సి వస్తుందని నామినేషన్ గురించి హింటిచ్చాడు. నామినేషన్ ప్రక్రియలో భాగంగా పోస్ట్ మ్యాన్ ఇద్దరు ఇంటిసభ్యులను పవర్ రూమ్‌కు పిలుస్తుంటాడు. వారి ముందున్న బ్యాగ్‌లోని రెండు లేఖల్లో ఒక్కరికి మాత్రమే లేఖ ఇచ్చి మిగతాది చింపివేయాల్సి ఉంటుంది. లెటర్ అందుకోలేనివాళ్లు నామినేట్ అయినట్లు లెక్క! నాకు పుట్టకపోయినా నా దగ్గర కూడా ఒక బాబు ఉన్నాడు మొదటగా పవర్ రూమ్‌లోకి వెళ్లిన మానస్, శ్రీరామ్‌లకు లోబో, ప్రియాంక లేఖలు అందాయి. దీంతో లోబో మాట్లాడుతూ.. తన భార్య గర్భవతి అని, అమ్మ ఆరోగ్యం ఎలా ఉందో తెలుసుకోవాలని ఉందంటూనే పింకీ కోసం తన లేఖను త్యాగం చేశాడు. కానీ ఉబికి వస్తున్న కన్నీళ్లను మాత్రం ఆపుకోలేకపోయాడు. తర్వాత షణ్ను- రవిలకు విశ్వ, సిరి లేఖలు అందాయి. అయితే విశ్వ కోసం తన ప్రియుడు శ్రీహాన్ రాసిన లేఖను ముక్కలు చేయడానికి సిద్ధపడింది సిరి. 'నాకు పుట్టకపోయినా నా దగ్గర కూడా ఒక బాబు ఉన్నాడు, కాబట్టి నీకు పుట్టిన పిల్లల కోసం ఎంత తపన ఉంటుందో నేను అర్థం చేసుకోగలను' అంటూ విశ్వకు లేఖ అందించమని చెప్తూ ఎమోషనల్ అయింది. ఏడ్చేసిన శ్రీరామ్, ఓదార్చుతూ ముద్దులు పెట్టిన పింకీ తర్వాత పింకీ- కాజల్‌కు యానీ మాస్టర్, మానస్‌ల లేఖలు అందాయి. యానీ పరిస్థితి అర్థం చేసుకున్న మానస్ తన లేఖను త్యాగం చేశాడు. కానీ పింకీ మాత్రం మానస్ లెటర్ ముక్కలవుతున్నందుకు ఎంతగానో బాధపడిపోయింది. విశ్వ-లోబోలకు రవి, శ్రీరామ్ లెటర్స్ వచ్చాయి. అయితే పెద్ద మనసు చేసుకున్న శ్రీరామ్.. రవి కోసం తన లెటర్‌ను వదులుకునేందుకు సిద్ధపడిపోయాడు. కానీ లోబో మాత్రం రవి తన ఫ్యామిలీని గుర్తు చేసుకునేందుకు బొమ్మ, టీ షర్ట్, లెటర్ ఉన్నాయి కాబట్టి శ్రీరామ్‌కే లెటర్ ఇవ్వాలన్నాడు, ఇందుకోసం రవిని ఒప్పించేందుకు ప్రయత్నించాడు. దీంతో రవి తన లెటర్‌ను చింపివేసి శ్రీరామ్‌కు వచ్చిన లేఖను చదివి వినిపించాడు. తర్వాత కాసేపటికి ఆ లేఖను పట్టుకుని ఒంటరిగా కూర్చున్న శ్రీరామ్ ఇల్లు గుర్తొచ్చి కన్నీళ్లు పెట్టుకున్నాడు. ఇది చూసిన పింకీ అతడి కన్నీళ్లు తుడిచి, హగ్గిచ్చి, బుగ్గపై ముద్దులు పెట్టింది. అమ్మా, నువ్వే నా ఇన్స్పిరేషన్: షణ్ముఖ్ తర్వాత యానీ- సిరిలకు షణ్ముఖ్, కాజల్ లెటర్స్ వచ్చాయి. దీంతో మొదటిసారి కాజల్ తన కన్నీళ్లు ఆపుకోలేక గక్క్క పెట్టి ఏడ్చేసింది. ఇది చూసి కరిగిపోయిన షణ్ను కాజల్‌ను లెటర్ తీసుకోమన్నాడు. అయితే సిరి మాత్రం 'నేనెలాగో అందుకోలేకపోయాను, కనీసం నువ్వైనా తీసుకో' అంటూ ఏడ్చేసింది. కానీ షణ్ను అందుకు ఒప్పుకోకపోవడంతో అతడి లేఖ తునాతునకలైంది. ఇది చూసి దుఃఖాన్ని దిగమింగుకున్న షణ్ను.. 'అమ్మా, క్యాన్సర్‌ను జయించావు, అమ్మమ్మ చనిపోయినప్పుడు ఆ బాధ నుంచి కోలుకున్నావు, నువ్వే నా ఇన్స్పిరేషన్, నేను ఈ బాధలో నుంచి బయటపడతాను' అని చెప్పుకొచ్చాడు. కానీ లోపలకు వెళ్లి గుండెలోని భారాన్ని దించుకుంటూ గట్టిగా ఏడ్చేశాడు. జెస్సీ కోసం త్యాగానికి పూనుకున్న శ్రీరామ్.. ఇక కెప్టెన్ సన్నీకి స్పెషల్ పవర్ లభించింది. దీని ద్వారా జెస్సీ లెటర్‌ను సన్నీ చేతిలో పెట్టాడు బిగ్‌బాస్. జెస్సీకి లెటర్ ఇచ్చి సేవ్ చేయాలంటే ఆల్రెడీ సేవ్ అయినవాళ్ల దగ్గరి నుంచి లేఖ అందుకోవాలని చెప్పాడు. దీంతో శ్రీరామ్.. జెస్సీ కోసం తన లేఖను త్యాగం చేసి నామినేట్ అయ్యేందుకు రెడీ అయ్యాడు. కానీ షణ్ను, సిరి, జెస్సీ.. శ్రీరామ్‌కు హగ్గిచ్చి దూరాన్ని చెరిపేసుకోవాలని రవి కండీషన్ పెట్టాడు. ఈ కండీషన్‌కు త్రిమూర్తులు ఒప్పుకోకపోగా మా మధ్య డిస్టబెన్స్ అంతా క్లియర్ అయిపోయిందని చెప్పడంతో రవి వెనక్కు తగ్గాడు. అలా శ్రీరామ్ నామినేషన్లోకి వెళ్లి జెస్సీని సేవ్ చేశాడు. తర్వాత కెప్టెన్ సన్నీకి లేఖ అందడంతో ఆనందంలో మునిగి తేలాడు. ఇంతటితో నామినేషన్ ప్రక్రియ పూర్తవగా రవి, లోబో, శ్రీరామ్, సిరి, షణ్ముఖ్, మానస్ నామినేట్ అయ్యారు. -
బిగ్‌బాస్: 8వ వారం నామినేషన్స్‌లో ఆరుగురు!
Bigg Boss 5 Telugu, 8th week Nominations: బిగ్‌బాస్ తెలుగు ఐదో సీజన్ ఎనిమిదో వారంలోకి అడుగు పెట్టింది. ఎప్పటికప్పుడు సరికొత్తగా నామినేషన్స్ నిర్వహించే బిగ్‌బాస్ ఈసారి హౌస్మేట్స్ ఎమోషన్స్‌తో ఆడుకునేందుకు ప్రయత్నించినట్లు కనిపిస్తోంది. ఈ మేరకు తాజాగా ఓ ప్రోమో రిలీజైంది. మీ అందరికీ మీ ప్రియమైనవారి నుంచి ఓ లేఖ పొందే అవకాశం లభిస్తుందన్న బిగ్‌బాస్ అంతలోనే మరో ట్విస్టు ఇచ్చాడు. జీవితంలో కోరుకున్న ప్రతీది దక్కదని, ఏదైనా దక్కించుకోవాలంటే వేరే ఏదైనా వదులుకోవాల్సి వస్తుందని చెప్పాడు. పవర్ రూమ్‌లోని సభ్యులు ఎవరికైతే లేఖ ఇస్తారో వారు సేఫ్ అవగా లెటర్ దక్కనివారు నామినేట్ అవుతారని బాంబు పేల్చాడు. నామినేషన్స్‌లో ఆరుగురు కాగా ఎనిమిదో వారం నామినేట్ అయిన సభ్యులు వీరేనంటూ ఓ లిస్ట్ నెట్టింట చక్కర్లు కొడుతోంది. శ్రీరామచంద్ర, షణ్ముఖ్ జశ్వంత్, మానస్, సిరి హన్మంత్, లోబో, యాంకర్ రవి నామినేషన్లో ఉన్నట్లు సమాచారం. వీళ్లలో లోబో బయటకు వెళ్లే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయంటున్నారు నెటిజన్లు. మరోవైపు ఈ వారం ఎవరో ఒకరు వైల్డ్ కార్డ్ లేదా రీఎంట్రీ ఇచ్చే అవకాశం ఉందన్న గుసగుసలు కూడా వినపడుతున్నాయి. మరి ఈ జోస్యాలు నిజమవుతాయా? లేదా? అనేది రానున్న రోజుల్లో చూడాల్సిందే! -
బిగ్‌బాస్-5: లోబోకి స్పెషల్ పవర్.. పాపం ఆ దురదృష్టవంతులు ఎవరు?
బిగ్‌బాస్ హౌస్‌లో ఎప్పుడు ఏం జరుగుతుందో ఎవరూ ఊహించలేరు. కంటెస్టెంట్స్ అంతా ఒకటి ఆలోచిస్తే.. బిగ్‌బాస్ మరోకటి ఆలోచిస్తాడు. తాజాగా కెప్టెన్సీ పోటీదారుల కోసం పెట్టిన‘బంగారు కోడిపెట్ట’టాస్క్‌లో ఊహించని ట్విస్ట్ ఇచ్చి ఇంటి సభ్యులకు షాకిచ్చాడు బిగ్‌బాస్. ‘బంగారు కోడిపెట్ట’టాస్క్‌లో భాగంగా రెండు రోజుల నుంచి ఇంటి సభ్యులు గుడ్లను సంపాదించి, దాచుకుంటున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఇంటి సభ్యుల మధ్య గొడవలు కూడా జరిగాయి. ముఖ్యంగా సన్నీ, ప్రియలు అయితే ఫిజికల్ అటాక్ వరకు వెళ్లారు. ఎలాగైన కెప్టెన్ కావాలనే కసితో టాస్క్ ఆడుతున్నారు కంటెస్టెంట్స్. అయితే టాస్క్‌ల్లో గెలవడం అనేది కేవలం కష్టం మీదనే ఆధారపడి లేదని, కొంచెం అదృష్టం కూడా ఉండాలని నిరూపిస్తున్నాడు బిగ్‌బాస్. మధ్య మధ్యలో స్పెషల్ పవర్ ఉన్న ఎగ్స్ ఇస్తూ.. అదృష్ట పరీక్షలు పెడుతున్నాడు. (చదవండి: బిగ్‌బాస్: ఆడు, ఈడు అంటూ రెచ్చిపోయిన ప్రియ..ఏయ్ అంటూ సన్నీ ఫైర్) ఇదిలా ఉంటే.. తాజాగా ఈ గేమ్‌లో నుంచి ఒకరిని ఎలిమినేట్ చేసే అవకాశం రీఎంట్రీ ఇచ్చిన లోబో చేతికి ఇచ్చాడు బిగ్‌బాస్. అతని చేతిలో బ్లాక్, గొల్డెన్ కలర్ ఎగ్స్ ఉన్నాయి. వాటి ద్వారా ఒకరిని గేమ్ నుంచి తొలగించొచ్చు, మరొకరిని నేరుగా కెప్టెన్సీ పోటీదారుడిగా ఎంపిక చేయ్యొచ్చు. బ్లాక్ ఎగ్ ఎవరికిస్తే వారు ఈ టాస్క్ నుంచి ఔట్ అయినట్లు. గొల్డెన్ ఎగ్ పొందిన వారు డెరెక్ట్‌గా కెప్టెన్సీ పోటీదారుడిగా ఎంపికైతారు. మరి లోబో ఈ రెండు గుడ్లను ఎవరెవరికి ఇచ్చారో తెలియాలంటే.. నేటి ఎపిసోడ్ చూడాల్సిందే. -
బిగ్‌బాస్-5: లోబో రీఎంట్రీ, మోసపోయానని కన్నీళ్లు పెట్టుకున్న షణ్ముఖ్
బిగ్‌బాస్ హౌస్‌లో యుద్ధ వాతావరణం నెలకొంది. కెప్టెన్సీ పోటీదారుల కోసం ‘బంగారు కోడిపెట్ట’అనే టాస్క్ ఇచ్చిన విషయం తెలిసిందే. ఈ టాస్కే సన్నీ, ప్రియల మధ్య పెద్ద చిచ్చు పెట్టింది. వీరిద్దరూ మాటలతో ఆగకుండా ఫిజికల్ అటాక్ వరకు వెళ్లారు. ఇలా నిన్నటి ఎపిసోడ్ అంతా వాడివేడిగా జరగ్గా.. ఎండింగ్లో మాత్రం భారీ ట్విస్ట్ ఇచ్చాడు బిగ్‌బాస్. ఇప్పటి వరకు సీక్రెట్ రూమ్‌లో ఉన్న లోబో రీ ఎంట్రీ ఇచ్చినట్టు ప్రోమోలో తెలిపారు. మెయిన్ గెట్ తెరుచుకోవడం, అక్కడ లోబో నిలబడి ఉండటం చూసిన రవి.. లోబో వచ్చాడు అంటూ చెప్పడంతో అందరి ముఖంలో ఆనందం కనిపించింది. రవి పరిగెత్తుకుంటూ వెళ్లి లోబోను గట్టిగా హత్తుకున్నాడు. మరోవైపు జెస్సీకి ఇచ్చిన సీక్రెట్ టాస్క్ త్రిమూర్తులు(షణ్ముఖ్, సిరి, జెస్సీ)మధ్య గొవడవకు దారి తీసినట్లు కనిపిస్తోంది. జెస్సీకి సిరి సాయం చేయడాన్ని షణ్ముఖ్ జీర్ణించుకోలేకపోతున్నాడు. అందరూ టాస్క్ సరిగ్గా ఆడడని అంటున్నారని, తనను అందరూ పిచ్చ లైట్ తీసుకుంటున్నారని జెస్సీ, సిరిల ముందు షణ్ముఖ్ వాపోయాడు. జెస్సీ కెప్టెన్ అవ్వాలనుకున్నాడు. నువ్వు సాయం చేశావు. చివరికి నేను మోసపోయాను. నాకు గేమ్ ఆడడం కూడా రాదు.. అదే నా దరిద్రం.. అంటూ షణ్ముఖ్ కన్నీళ్లు పెట్టుకున్నాడు. జెస్సీ, సిరి ఇద్దరు సంజాయిషీ ఇచ్చే ప్రయత్నం చేసినా షణ్ముఖ్ ఆగకుండా సిరిని అక్కడి నుంచి వెళ్లిపో అంటూ అరిచాడు. దీంతో సిరి కూడా కన్నీళ్లు పెట్టుకుంది. మంచి స్నేహితులుగా ఉన్న షణ్ముఖ్-సిరి-జెస్సీల మధ్య ఏం జరిగిందో ఈ రోజు ఎపిసోడ్లో తెలుస్తుంది. -
మొన్న కూతురు, ఇప్పుడు తల్లి బిగ్‌బాస్‌ను వీడక తప్పదా!
Bigg Boss 5 Telugu, 7th Week Eliminations: బిగ్‌బాస్ గేమ్ ఎప్పుడు ఎటు తిరుగుతుందో ఎవరూ చెప్పలేరు. ఎందుకంటే ఊహించని ట్విస్టులతో, ఊహకందని ఎలిమినేషన్లతో ప్రేక్షకులకు తరచూ షాకుల మీద షాకులిస్తుంటాడు బిగ్‌బాస్. ఈసారి ఆయన నిర్వహించిన వెరైటీ నామినేషన్స్ ద్వారా శ్రీరామ్, సిరి, రవి, కాజల్, జెస్సీ, ప్రియ, యానీ.. ఏడుగురు ఎలిమినేషన్ జోన్లోకి వచ్చారు. సీక్రెట్ రూమ్‌లో ఉన్న లోబో నేరుగా నామినేట్ అవడంతో ఈ వారం నామినేషన్స్‌లో ఉన్నవారి సంఖ్య ఎనిమిదికి చేరింది. ఇప్పటివరకు బిగ్‌బాస్ షో నుంచి ఆరుగురు ఎలిమినేట్ అయ్యారు. అందులో సరయు, ఉమాదేవి, లహరి, హమీదా, శ్వేత ఐదుగురు ఆడవాళ్లే కాగా ఒక మేల్ కంటెస్టెంట్ నటరాజ్ మాస్టర్ ఉన్నారు. దీంతో ఈసారి ఎవరిని పంపిస్తారనేది ఆసక్తికరంగా మారింది. రవి, శ్రీరామ్ స్ట్రాంగ్ అండ్ పాపులర్ కంటెస్టెంట్స్, కాబట్టి బిగ్‌బాస్ వాళ్లను టచ్ చేసే ప్రయత్నం కూడా చేయడు. ఇక వరుస పెట్టి అమ్మాయిలను పంపించేసి గ్లామర్‌ను షోకు దూరం చేసిన బిగ్‌బాస్ సిరి ద్వారా దాన్ని బ్యాలెన్స్ చేస్తున్నాడు. పైగా షణ్ముఖ్‌తో దోస్తీ వల్ల అతడి ఫ్యాన్స్ కూడా సిరికే ఓట్లేస్తున్నారు. ఫలితంగా సిరి బయటకు వెళ్లే ఛాన్స్ లేదని తెలుస్తోంది. ప్రియకు బుల్లితెర సెలబ్రిటీల మద్దతు గట్టిగా ఉంది. ఎవరేంటో పసిగడుతూ ఆచితూచి అడుగు ముందుకు వేస్తూ గేమ్ ఆడుతోందీ నటి. ఈమె కంటే వీక్ కంటెస్టెంట్స్ నామినేషన్స్‌లో ఉన్నారు కాబట్టి తను ఈ వారం నిశ్చింతగా ఉండొచ్చని తెలుస్తోంది. మిగిలిందల్లా జెస్సీ, యానీ, లోబో. మొదట్లో జెస్సీని అందరూ చిన్నపిల్లాడని తీసిపారేశారు. కానీ రానురాను ఆటలోనే కాకుండా మాటల్లోనూ పదును తేలాడు. అయితే అందరితో కలవకుండా కేవలం షణ్ముఖ్, సిరిలతో మాత్రమే ఉంటున్నాడు. దీంతో అతడు సొంతంగా గేమ్ ఆడలేకపోతున్నాడని, సొంత నిర్ణయాలు తీసుకోవడం లేదన్న విమర్శలు మొదలయ్యాయి. కానీ షణ్ముఖ్ నామినేషన్స్‌లో లేకపోవడంతో అతడి ఓట్లు జెస్సీకి పడి సేవ్ అయ్యే అవకాశాలున్నాయి. లోబోను ఫేక్ ఎలిమినేషన్‌తో సీక్రెట్ రూమ్‌కు పంపించారు. అతడిని తిరిగి హౌస్‌లోకి పంపించి గేమ్‌ను రసవత్తరంగా మార్చేందుకు ఏదైనా డ్రామా ప్లాన్ చేసి ఉంటారు బిగ్‌బాస్ నిర్వాహకులు. లేదంటే సీక్రెట్ రూమ్ గడువు పూర్తయిన వెంటనే అతడు ఎలిమినేట్ అయ్యాడంటే ఫేక్ ఎలిమినేషన్ అట్టర్ ఫ్లాప్ అయినట్లేనని బిగ్‌బాస్‌ను తిట్టిపోస్తారు జనాలు. కాబట్టి లోబో ఎలిమినేషన్‌కు 50-50 ఛాన్సులున్నాయి. మిగిలింది యానీ మాస్టర్.. ఫ్యాన్‌బేస్ పెద్దగా లేని యానీ మాస్టర్ ఈవారం గట్టెక్కడం కష్టమే అనిపిస్తోంది. తనను ఎవరైనా నామినేట్ చేస్తే సహించలేకపోయే స్వభావం, ఇతరులను కించపరుస్తూ మాట్లాడటం, నోరు జారడం.. ఇలా పలు అంశాలు ఆమెకు నెగెటివ్‌గా మారాయి. శ్వేతను కూతురు కూతురు అంటూ అల్లుకుపోయిన యానీ.. ఓ టాస్క్‌లో మాత్రం తొక్కలో రిలేషన్స్ నాకొద్దు అని ఆవేశంతో ఊగిపోయి తన క్యారెక్టర్‌ను బ్యాడ్ చేసుకుంది. ఎక్కువగా కిచెన్‌కే పరిమితమైన ఆమె గేమ్‌లో పెద్దగా పర్ఫామ్ చేయలేదన్న కామెంట్లు కూడా వినిపించాయి. మొత్తంగా ఈ వారం యానీ మాస్టర్ ఎలిమినేట్ అయ్యే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. గత వారమే కూతుర్ని(శ్వేత) పంపించేసిన బిగ్‌బాస్ ఈ వారం తల్లిని(యానీ మాస్టర్) కూడా బయటకు పంపిస్తాడేమో చూడాలి! లేదంటే ఇప్పటికే ఐదుగురు అమ్మాయిలను పంపించాం కాబట్టి, ఈసారి అబ్బాయిలనే పంపించాలని నిర్ణయం తీసుకుంటే మాత్రం జెస్సీ ఎలిమినేట్ అవొచ్చు. -
సీక్రెట్ రూమ్ అట్టర్ ఫ్లాప్ అంటున్న నెటిజన్లు!
Bigg Boss Telugu 5 Promo: సడన్ ఎలిమినేషన్‌తో షాక్‌లో ఉన్నారు హౌస్మేట్స్. లోబో ఎలిమినేట్ అవడాన్ని చాలామంది జీర్ణించుకోలేకపోయారు. ముఖ్యంగా విశ్వ ఏకధాటిగా ఏడుస్తుంటే రవి తన కళ్లను తానే నమ్మలేకపోయాడు. లోబోది ఫేక్ ఎలిమినేషన్ అన్న విషయం కంటెస్టెంట్లకు తప్ప మనందరికీ తెలిసిందే! దీంతో వారిని షాక్‌లో నుంచి బయటకు తీసుకొచ్చే ప్రయత్నం చేశాడు నాగ్. అందులో భాగంగా నాగ్ వారితో సరదాగా ఆటలాడించాడు. ఇక సీక్రెట్ రూమ్‌లో ఉన్న లోబోతో మాట్లాడిన నాగ్.. తనిచ్చిన డ్రెస్ వేసుకోలేదని ప్రశ్నించాడు. నాలుక్కరుచుకున్న లోబో వెంటనే డ్రెస్ వేసుకున్నాడు. ఇక్కడే సీక్రెట్ రూమ్‌లో ఉంటాననడంతో నాగ్ నవ్వాపుకోలేకపోయాడు. ఈ ప్రోమో చూసిన నెటిజన్లు బిగ్‌బాస్ లోబోను సీక్రెట్ రూమ్‌కు పంపించి పెద్ద తప్పు చేశాడని కామెంట్లు చేస్తున్నారు. 'శ్రీరామ్, సన్నీ... వీళ్లిద్దరిలో ఎవరిని సీక్రెట్ రూమ్‌కు పంపించినా కథ వేరే ఉండేదని, ఈ సీజన్లో సీక్రెట్ రూమ్ ఉండి కూడా వేస్టే' అంటున్నారు. 'సీక్రెట్ రూమ్‌లో లోబో తిన్నామా, పడుకున్నామా, తెల్లారిందా అన్నట్లుగా ఉంటున్నాడు', 'షో చాలా చప్పగా సాగుతుంది, లోబోకి సీక్రెట్ రూమ్ వేస్ట్ అనిపిస్తోంది', 'అతడు సీక్రెట్ రూమ్‌కు వెళ్తున్నాడని విశ్వ కు తప్ప మిగతా అందరికీ తెలిసినట్లుంది', 'మిగతా సీజన్లతో పోలిస్తే ఈసారి పెద్దగా కామెడీ లేదు, బంధాలు, అనుబంధాలు, స్నేహం, గేమ్.. ఇవేవీ కనిపించడం లేదు' అని పెదవి విరుస్తున్నారు. -
లోబోను ఎలిమినేట్ చేసిన నాగ్, షాక్‌లో రవి!
Bigg Boss 5 Telugu, Episode 42: వరస్ట్ పర్ఫామర్‌గా ఎంపికై జైల్లో బందీ అయిన శ్వేత శిక్ష పూర్తి చేసుకుని బయటకు వచ్చింది. ఇంతలో రవి ఆమె దగ్గరకు వెళ్లి.. నా ఐడియా ఫాలో అవమని నీకు చెప్పలేదని పేర్కొన్నాడు. కానీ శ్వేత మాత్రం.. నువ్వు కుషన్స్ కట్ చేయమని నాకు కూడా చెప్పావని తెలిపింది. తర్వాత ఇంటిసభ్యులు వారికి పంపించిన కాస్ట్యూమ్స్ వేసుకుని రెడ్ కార్పెట్‌పై హొయలొలికిస్తూ నడిచారు. అనంతరం కాజల్, రవి ఫ్రెండ్షిప్ హగ్గిచ్చుకుని కలిసిపోయారు. రవి గడ్డి తినమంటే తింటావా? ఇక నాగార్జున వచ్చీరావడంతోనే కెప్టెన్సీ కంటెండర్స్ టాస్కులో కుషన్స్ పాడు చేసింది ఎవరని గరమయ్యాడు. దీంతో లోబో నీళ్లు నములుతూ మొదట తనే దూది తీశానని తెలిపాడు. హౌస్ ప్రాపర్టీ ధ్వంసం చేయకూడదని తెలీదా? అని నాగ్ నిలదీయగా అమాయకంగా ముఖం పెట్టి తెలీదంటూ అడ్డంగా తలూపాడు లోబో. కుషన్స్ కట్ చేయమని నీకు రవి చెప్తే గుడ్డిగా ఫాలో అయిపోయావు, రవి గడ్డి తినమంటే తింటావా? అని ఫైర్ అయ్యాడు. యాక్టర్స్ అంటే చిన్నచూపా? సంచాలకులుగా ఉన్నప్పుడు కంటెస్టెంట్లు చెప్పేది కూడా వినాలని సిరికి సలహా ఇచ్చాడు నాగ్. ఇక యానీ అంత గట్టిగా అరవాల్సిన అవసరం లేదని, అందరి మీదా ఒట్టేయాల్సిన పని లేదని చురకలంటించాడు. అయితే సిరి యాటిట్యూడ్ నచ్చకే అలా ప్రవర్తించాననింటూ ఆమెకు సారీ చెప్పింది యానీ. ఇక నువ్వు నీలా ఉంటేనే అందరికీ నచ్చుతావని శ్రీరామ్‌కు సూచించాడు నాగ్. అయితే నామినేషన్స్‌లో అంత దురుసుగా మాట్లాడావు, యాక్టర్స్ అంటే చిన్నచూపా? అని నిలదీశాడు. దీంతో తప్పు అంగీకరించిన శ్రీరామ్ తల దించుకుని సారీ చెప్పాడు. సన్నీకి ఎక్కడలేని ఎనర్జీ వచ్చిందన్న నాగ్ ఇదే ఆటను కంటిన్యూ చేయమని చెప్పాడు. అందరూ ఇన్ఫ్లూయెన్స్ అవుతున్నా నువ్వు మాత్రం అవ్వడం లేదని షణ్నుని మెచ్చుకున్నాడు నాగ్. మరోసారి అడ్డంగా దొరికిపోయిన రవి ఇక శ్వేత.. తను రెండుసార్లు కుషన్స్ కట్ చేశానని చెప్తూ బోరుమని ఏడ్చేసింది. ఆ ఐడియా ఇచ్చిన మనిషి మాత్రం చేయలేదంటూ రవి మీద కౌంటరేశాడు నాగ్. ఇదంతా చూస్తుంటే నటరాజ్ చెప్పిందే కరెక్ట్(గుంటనక్క) అనిపిస్తోందని రవిని ఘోరంగా అవమానించాడు. తన మీద పడ్డ నిందను చెరిపేసుకునేందుకు ప్రయత్నించిన రవి.. లోబో, నేను మాత్రమే ఈ ఐడియా డిస్కషన్ చేశామన్నాడు. బిగ్‌బాస్ పంపిన కాటన్, కుషన్స్‌లో ఉన్న దూది సేమ్ ఉన్నాయన్నాడు. దీంతో సంచాలకులు ఆ రెండురకాల దూదిలను పరీక్షించి అవి ఒకేలా లేవని చెప్పడంతో మరోసారి రవి అడ్డంగా దొరికిపోయాడు. ఇక శ్వేత తీసిందని తనకు తెలీదని రవి పదేపదే చెప్పడంతో మధ్యలోనే అడ్డుపడ్డ శ్వేత.. రవికి ఈ విషయం ముందే తెలుసంటూ అందరి ముందే క్లారిటీ ఇచ్చింది. రవి ఇన్ఫ్లూయెన్స్ చేసి పక్కవారి గేమ్ చెడగొడుతున్నాడు తర్వాత నాగ్ ఇంటిసభ్యులను ఒక్కొక్కరిగా కన్ఫెషన్ రూమ్‌లోకి పిలిచి హౌస్‌లో ఉండేందుకు అర్హత లేని వాళ్ల పేర్లను చెప్పమన్నాడు. ముందుగా మానస్.. వేరేవాళ్ల మాటలను పట్టించుకుంటూ శ్రీరామ్ అన్నింటా వెనకడుగు వేస్తున్నాడన్నాడు. సన్నీ మాట్లాడుతూ.. టాస్కుల్లో 100% ఇవ్వడం లేదంటూ ప్రియ పేరు చెప్పాడు. కాజల్.. ఇద్దరికి అర్హత లేదనిపిస్తూనే ప్రియ పేరు చెప్పింది. ఆమె కనిపించేంత స్వీట్‌గా ఉండరని పేర్కొంది. యానీ మాస్టర్, శ్వేత, సిరి, షణ్ముఖ్.. సొంతంగా ఆడలేకపోతున్నాడంటూ లోబో పేరు సూచించారు. శ్రీరామ్.. రవి పేరు చెప్పాడు. ప్రియ, ప్రియాంక.. ఎవరికి గొడవలవుతాయా అని ఎప్పుడూ ఎదురుచూస్తూ ఉండే కాజల్ అన్‌ఫిట్ అని అభిప్రాయపడ్డారు. జెస్సీ.. పక్కవాళ్లను ఇన్ఫ్లూయెన్స్ చేస్తూ వారి గేమ్ చెడగొడుతున్న రవి వెళ్లిపోవాలని కోరుకున్నాడు. తెలీక తప్పు చేస్తే క్షమించండంటూ లోబో వీడ్కోలు రవి.. అక్కడి విషయాలు ఇక్కడ, ఇక్కడ విషయాలు అక్కడ చెప్తున్న కాజల్ హౌస్‌లో అనర్హురాలు అని చెప్పాడు. విశ్వ.. తప్పు చేస్తే ఒప్పుకోకుండా, సమర్థించుకునే ప్రియ అన్‌ఫిట్ అని అభిప్రాయపడ్డాడు. చివరగా వచ్చిన లోబో.. ప్రియ బిగ్‌బాస్ హౌస్‌కు అనర్హురాలు అని పేర్కొన్నాడు. మొత్తంగా ఈ ప్రక్రియలో లోబోకు, ప్రియకు సమానంగా 4 ఓట్లు పడటంతో నాగ్ ఓ పరీక్ష పెట్టాడు. హౌస్మేట్స్ ఎవరికి ఎక్కువ సపోర్ట్ చేస్తే వారు సేఫ్ అని చెప్పాడు. రవి, సన్నీ, విశ్వ.. ఈ ముగ్గురు మాత్రమే లోబో వైపు నిలబడగా మిగిలిన అందరూ ప్రియకు మద్దతిచ్చారు. దీంతో లోబో ఎలిమినేట్ అయినట్లు నాగ్ ప్రకటించడంతో రవి షాకయ్యాడు. ఇక విశ్వ అయితే చిన్నపిల్లాడిలా గుక్క పెట్టి మరీ ఏడ్చాడు. తెలీక తప్పు చేస్తే క్షమించండంటూ ఏడుస్తూ వీడ్కోలు తీసుకున్నాడు. వారం రోజులపాటు సీక్రెట్ రూమ్‌లో! స్టేజీ మీదకు వచ్చిన లోబోతో నాగ్ థంబ్స్ అప్, థంబ్స్ డౌన్ ఆడించాడు. సన్నీ బుర్ర, తన బుర్ర ఒకటేనన్న లోబో ఇకపై మారిపోమని సూచించాడు. కాజల్‌కు ఏ వేలూ చూపించలేదని మరోసారి స్పష్టం చేశాడు. కంటెస్టెంట్లు అందరికీ థంబ్స్ అప్ చూపించాడు. తర్వాత అతడిని పంపించినట్లే పంపించేసి తిరిగి రమ్మన్నాడు నాగ్. నిన్ను ఎలిమినేట్ చేసే అధికారం ప్రేక్షకులకు మాత్రమే ఉందని చెప్పడంతో లోబో నేలపై మోకరిల్లి ఏడ్చాడు. మెజారిటీ కంటెస్టెంట్లు నువ్వు వెళ్లాలని ఓటేసినందున వచ్చేవారం నేరుగా నామినేషన్స్‌లో ఉండబోతున్నావని చెప్పాడు. కాకపోతే నువ్వు హౌస్‌లోకి కాకుండా సీక్రెట్ రూమ్‌లోకి వెళ్తున్నావని వెల్లడించాడు. -
బిగ్ ట్విస్ట్: సెట్ శ్వేత అవుట్, సీక్రెట్ రూమ్‌కి అతడు!
బిగ్‌బాస్ షోలో కంటెస్టెంట్లను వెంటాడేవి ఎలిమినేషన్స్. ప్రతివారం ఎవరో ఒకరు హౌస్ నుంచి వెళ్లిపోవాల్సిందే! ఇప్పటికే సరయు, ఉమాదేవి, లహరి, నటరాజ్ మాస్టర్, హమీదా వరుసగా ఎలిమినేట్ అవుతూ వచ్చారు. ఇప్పటివరకు ఐదుగురు ఎలిమినేట్ అయితే అందులో నలుగురు అమ్మాయిలే కావడం గమనార్హం. దీంతో ఈ వారం అమ్మాయిని పంపిస్తారా? లేదా అబ్బాయిని వెళ్లగొడతారా? అన్నది ఆసక్తికరంగా మారింది. ఆరోవారం జరిగిన నామినేషన్స్‌లో శ్రీరామ్ చంద్ర, సిరి, లోబో, విశ్వ, షణ్ముఖ్ జస్వంత్, ప్రియాంక, యాంకర్ రవి, జెస్సీ, శ్వేతా, సన్నీ ఉన్నారు. వీరిలో లోబో, విశ్వ, శ్వేత డేంజర్ జోన్లో ఉన్నట్లు అనధికారిక పోల్స్‌లో వెల్లడైంది. అయితే విశ్వ టాస్కుల్లో విశ్వరూపం చూపిస్తూ మిగతా కంటెస్టెంట్లకు గట్టిపోటీ ఇస్తున్నాడు. లోబో.. మొదట్లో ఎంటర్టైన్ చేసినా తర్వాత పూర్తిగా సైలెంట్ అయిపోయాడు. కాకపోతే రవికి నమ్మిన బంటుగా ఉండటంతో యాంకర్ ఫ్యాన్స్ ఇతడిని సేవ్ చేసే అవకాశం ఉంది. మిగిలిందల్లా శ్వేత.. ఆమెకు సోషల్ మీడియాలో పెద్దగా ఫ్యాన్ ఫాలోయింగ్ లేదు. పైగా షోలో హౌస్‌మేట్స్‌తో తరచూ గొడవకు దిగింది. ఇప్పటివరకు జరిగిన ఎలిమినేషన్స్ చూసినట్లైతే ఎక్కువగా గొడవపడిన వాళ్లే బిగ్‌బాస్‌కు దూరమవుతూ వచ్చారు. ఈ లెక్కన ఈ వారం సెట్ శ్వేత ఎలిమినేట్ అయినట్లు లీకువీరులు నెట్టంట ప్రచారం చేస్తున్నారు. అంతేకాదు, తాజాగా రిలీజైన ప్రోమోలో ప్రియ, లోబోలలో ఒకరిని ఎలిమినేట్ చేస్తున్నట్లు ఊదరగొట్టాడు నాగ్. నిజంగానే ఇందులో ఒకరిని ఎలిమినేట్ చేశారట, కాకపోతే అది ఫేక్ ఎలిమినేషన్! లోబోను ఎలిమినేట్ చేసినట్లే చేసి సీక్రెట్ రూమ్‌కు పంపించారట. మరి సీక్రెట్ రూమ్‌ను లోబో తనకు ఎలా అనుకూలంగా మార్చుకుంటాడు, గేమ్‌ను ఎలా టర్న్ చేస్తాడన్నది చూడాలి! -
బిగ్‌బాస్ వీక్షకులకు బ్రేకింగ్ న్యూస్: నాగార్జున
బిగ్‌బాస్ హౌస్‌లో ఈ వారం జరిగిన గొడవలను తిరగదోడుతున్నాడు నాగార్జున. తప్పొప్పులను ఎత్తిచూపుతూ కంటెస్టెంట్లతో పంచాయితీ పెడుతున్నాడు. ఇదంతా పక్కనపెడితే రేపు జరగాల్సిన ఎలిమినేషన్‌ను ఈరోజే జరిపించేలా ఉన్నాడు నాగ్. తాజాగా రిలీజైన ప్రోమోలో అందరికీ ఓ బ్రేకింగ్ న్యూస్ చెప్పబోతున్నాననంటూ సస్పెన్స్ పెట్టాడు. ఈ హౌస్‌లో ఉండేందుకు అర్హత లేనివాళ్లు ఎవరో చెప్పండి? అంటూ ఒక్కొక్కరినీ కన్ఫెషన్ రూమ్‌లోకి పిలిచి మరీ అడిగాడు. ఈ క్రమంలో అందరూ తలా ఒకరి పేరు చెప్పారు. ఫైనల్‌గా ప్రియకు, లోబోకు ఇద్దరికీ 4 ఓట్లు పడ్డాయి. దీంతో నాగ్.. వీరిలో ఎవరికి సపోర్ట్ చేస్తారో వారి పక్కన నిల్చోమని ఇంటిసభ్యులను ఆదేశించాడు. మరి మెజారిటీ హౌస్మేట్స్ ఎవరిని సేవ్ చేసే అవకాశం ఉంది? ఎవరిని హౌస్‌లో నుంచి పంపించేస్తారన్నది ఆసక్తికరంగా మారింది. అయితే నెటిజన్లు మాత్రం ఆ ఇద్దరిలో ఎవరిని ఎలిమినేట్ చేసి సీక్రెట్ రూమ్‌కు పంపించినా పెద్ద ప్రయోజనం ఏమీ ఉండదని పెదవి విరుస్తున్నారు. కావాలంటే డబుల్ ఎలిమినేషన్ పెట్టండని సూచిస్తున్నారు. ఇక ప్రోమో ఈ రేంజ్లో ఉన్నప్పటికీ ప్రియ, లోబో ఎలిమినేట్ అయ్యే అవకాశాలైతే లేనట్లే కనిపిస్తోంది. ఇలా అర్ధాంతరంగా వారిని హౌస్‌లోంచి వెళ్లగొట్టే సాహసం చేయరని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. మరి నాగ్ నిజంగానే బ్రేకింగ్ న్యూస్ చెప్తాడా? లేదా జనాలను ప్రాంక్ చేస్తాడా? అన్నది చూడాలి! -
డేంజర్ జోన్లో ఆ ముగ్గురు, అందరికళ్లు ఆమెపైనే!
Bigg Boss 5 Telugu, 6th Week Elimination: బిగ్‌బాస్ తెలుగు ఐదో సీజన్లో ఆరో ఎలిమినేషన్‌కు రంగం సిద్ధమైంది. 19 మంది కంటెస్టెంట్లతో ప్రారంభమైన ఈ షోలో ఇప్పుడు 14 మంది మాత్రమే మిగిలారు. ఈ వారం వీరిలో నుంచి ఏకంగా 10 మంది నామినేట్ అయ్యారు. శ్రీరామచంద్ర, సిరి, లోబో, విశ్వ, షణ్ముఖ్, ప్రియాంక, సన్నీ, శ్వేత, యాంకర్ రవి, జెస్సీ నామినేషన్లో ఉన్నారు. మరి ఈ 10 మందిలో నుంచి హౌస్‌కు వీడ్కోలు పలికేదెవరు? అన్నది ఇంట్రస్టింగ్‌గా మారింది. ఓటింగ్‌లో మొదటి నుంచి టాప్‌లో దూసుకుపోతున్నాడు షణ్ముఖ్ జశ్వంత్. దీంతో అతడు ఎలిమినేట్ అయ్యే ఛాన్స్ అంగుళం కూడా లేదు. ప్రతిసారి తప్పులు చేస్తూ అడ్డంగా దొరికిపోతున్న యాంకర్ రవికి కావాల్సినంత పాపులారిటీ ఉంది కాబట్టి అది అతడిని నీడలా రక్షిస్తోంది. సన్నీ, శ్రీరామ్‌కు కూడా భారీగానే ఓట్లు గుద్దుతున్నారు.. కనుక వీళ్లూ సేఫ్ జోన్లోనే ఉన్నట్లు లెక్క! సిరి, ప్రియాంక, జెస్సీ కూడా బయటకు వెళ్లేట్లు కనిపించడం లేదు. మిగిలిందల్లా శ్వేత, విశ్వ, లోబో. వీరిలో ఒకరిపై ఎలిమినేషన్ వేటు పడటం ఖాయంగా కనిపిస్తోంది. విశ్వ రెండోసారి కెప్టెన్‌గా గెలిచి సత్తా చాటడంతో అతడి గ్రాఫ్ ఒక్కసారిగా పెరిగిపోయింది. వరస్ట్ పర్ఫామర్‌గా ఎన్నికైన శ్వేత గ్రాఫ్ అమాంతం పడిపోయింది. ఈ లెక్కన శ్వేత హౌస్‌కు గుడ్‌బై చెప్పే అవకాశాలు పుష్కలంగా ఉన్నట్లు కనిపిస్తోంది. ఇది బిగ్‌బాస్.. ఇక్కడ ఏదైనా జరగొచ్చు, కాబట్టి ఎలిమినేషన్లో ఏం ట్విస్ట్ ఇస్తారో? ఎవరిని పంపించేస్తారో చూడాలి! -
బిగ్‌బాస్ పత్తేపారం.. రవి, లోబో, శ్వేతలకు జాక్‌పాట్
Bigg Boss Telugu, Episode 38 Highlights : నిన్నటి నామినేషన్ ప్రక్రియతో బిగ్‌బాస్ హౌస్ అంతా గంభీరంగా మారిపోగా..నేడు ఆ గొడవల నుంచి బయటకు వచ్చి కాస్త రిలాక్స్ అయ్యేందుకు ప్రయత్నించారు ఇంటి సభ్యులు. ఇంతలోనే కెప్టెన్సీ పోటీదారుల టాస్క్ ఇచ్చి మళ్లీ హౌస్‌లో యుద్ధ వాతావరణం నెలకొల్పాడు బిగ్‌బాస్. ఈ పోటీలో భాగంగా ఇంటి సభ్యులంతా మళ్లీ టీమ్‌లుగా విడిపోయారు. గేమ్ కోసం ఒకరిపై ఒకరు అరుచుకున్నారు. యానీ మాస్టర్ అయితే ఆవేశంతో ఊగిపోయారు. సిరి చిన్నబోయింది.. రవి, లోబో, శ్వేతలో ఆనందంతో చిందులేశారు. ఇంకా బిగ్‌బాస్ హౌస్‌లో నేడు ఏమేం జరిగిందో నేటి ఎపిసోడ్లో చదివేద్దాం. సోమవారం జరిగిన నామినేషన్ ప్రక్రియ గురించి ఇంటి సభ్యులంతా గుసగుసలు మొదలు పెట్టారు. యాక్టర్స్ అంటూ శ్రీరామ్ నోరు జారడంపై సిరి, షణ్ముఖ్, జెస్సీ మరోసారి సీరియస్ అయ్యారు. ఇక షణ్నూ అయితే గత వారం నామినేషన్ ప్రక్రియను ఇంకా మర్చిపోవడం లేదు. . సీక్రెట్ నామినేషన్స్ అంటే 8 మంది నామినేట్ చేశారు.. ఇప్పుడు డైరెక్ట్ నామినేషన్స్ అంటే ఇద్దరే నామినేట్ చేశారు అని ఇంటి సభ్యులందరిపై అసహనం వ్యక్తం చేశాడు. ప్రియ ఏమో సన్నీ గురించి ప్రియాంక దగ్గర చెబుతూ.. ‘ప్రతి వారం నామినేట్ చేస్తానని అంటున్నాడు. ఆయన నన్ను బెదిరిస్తున్నాడా? మానస్‌ని హెల్ప్ చేయమని తనే పంపానని చెప్పాడు.. సన్నీ చెబితేనే మాసన్ వింటాడా? ఆయనకు ఏం చేయాలిపిస్తే అదే చేస్తాడుగా’అంటూ సన్నీ మాటలకు కౌంటర్ ఇచ్చింది. మరోవైపు మాస్టర్ని ఎందుకు నామినేట్ చేశావని విశ్వని శ్రీరామ్ అడిగాడు. తను ప్రతిసారి స్ట్రాంగ్ కంటెస్టెంట్‌ని నామినేట్ చేస్తాననడం తనకు నచ్చలేదని, అందుకే నామినేట్ చేశానని విశ్వ చెప్పుకొచ్చాడు. మన రాజుకు బుర్రలేదు : షణ్నూ నామినేషన్స్‌లో జరిగిన రచ్చపై త్రిమూర్తులు జెస్సీ, సిరి, షణ్ముఖ్ చర్చ పెట్టారు. లోబోని సన్నీ వెనుకేసుకొస్తున్నాడని జశ్వంత్ చెప్పగా.. మన రాజుకు బుర్రలేదని, ఉంటే ఆ టాస్క్ మనమే గెలిచేవామని షణ్ముఖ్ చెప్పాడు. ఐన్‌స్టీన్ E=mc2 ఎందుకు కనిపెట్టాడో కూడా కనుక్కోవచ్చు. కానీ ఎలిమినేషన్స్ అర్థంకావు’అని షణ్నూ చేసిన ఫన్నీ కామెంట్‌కి జెస్సీ, సిరి పగలబడి నవ్వారు. చర్రితలోనే ఫస్ట్ టైమ్ ఇలాంటి బ్రేకప్! సోమవారం జరిగిన నామినేషన్ ప్రక్రియలో శ్రీరామ్, కాజల్ మధ్య గొడవ జరిగిన విషయం తెలిసిందే. ఇకపై తనను సిస్టర్ అని పిలవొద్దని శ్రీరామ్‌కు చెప్పింది కాజల్.నేడు కూడా అదే విషయాన్ని మరోసారి గుర్తు చేసింది. బెడ్రూమ్లో ఉన్న కాజల్ దగ్గరకు శ్రీరామ్ వెళ్లగా.. ‘బ్రేకప్ బ్రో.. చరిత్రలో బ్రదర్ అండ్ సిస్టర్ బ్రేకప్ ఫస్ట్ టైమ్ కదా’అంటూ నవ్వుతూ చెప్పింది. దాన్ని కామెడీగానే స్వీకరించి శ్రీరామ్.. అవునవును అంటూ అక్కడ నుంచి వెళ్లిపోయాడు. ‘బీబీ బొమ్మల ఫ్యాక్టరీ’ ఈ వారం కెప్టెన్సీ పోటీదారుల టాస్క్‌గా ‘బీబీ బొమ్మల ఫ్యాక్టరీ’అనే గేమ్ ఇచ్చాడు. ఇందులో కంటెస్టెంట్స్ అంతా నాలుగు టీమ్‌లుగా విడిపోయారు. బ్లూ టీమ్‌లో సభ్యులు: మానస్, సన్నీ, యానీ మాస్టర్ ఎల్లో టీమ్ సభ్యులు షణ్ముఖ్, ప్రియాంక, జెస్సీ రెడ్ టీమ్ సభ్యులు : విశ్వ, శ్రీరామ్, ప్రియ గ్రీన్ టీమ్ సభ్యులు : రవి, లోబో, శ్వేత సిరి, కాజల్ ఫ్యాక్టరీ మేనేజర్, సంచాలకులుగా వ్యవహరిస్తారని చెప్పారు బిగ్ బాస్. రెడ్ అండ్ గ్రీన్ టీంకి మేనేజర్స్‌గా సిరిని.. బ్లూ, ఎల్లో టీంకి కాజల్‌కి మేనేజర్స్‌గా నియమించారు. వీళ్లే బొమ్మల నాణ్యతని తనిఖీ చేసి ఎటువంటి లోపాలు లేకుండా చూస్తారు. కెప్టెన్సీ పోటీ దారులు అవ్వాలంటే.. ప్రతి టీమ్ ప్రత్యర్థుల కంటే ఎక్కువ బొమ్మలు తయారు చేయాల్సి ఉంటుంది. ఈ టాస్క్‌లో భాగంగా గార్డెన్ ఏరియాలో ఉన్న కన్వేయర్ బెల్ట్‌పై నుంచి బొమ్మలకు సంబంధించి రా మెటీరియల్ వస్తుంది. వాటిని తీసుకొని బొమ్మలను తయారు చేయాల్సి ఉంటుంది. గెలిచిన టీంకి మేనేజర్‌గా ఉన్నవాళ్లకి కూడా కెప్టెన్ అయ్యే అవకాశం ఉంది. అయితే బొమ్మల్లో కాటన్ సరిగా పెట్టకపోవడంతో.. ఇదో పత్తేపారం.. బొమ్మల్లో పత్తి లేకపోతే రిజెక్ట్ చేస్తున్నారు అంటూ మానస్ పంచ్ వేశాడు యానీ మాస్టర్ ఉగ్రరూపం.. సిరిపై చిందులు ఈ టాస్క్‌లో భాగంగా యానీ మాస్టర్, సిరిల మధ్య మాటల యుద్దం జరిగింది. సంచాలకులుగా ఉన్నవారు బొమ్మల కౌంటింగ్ సరిగా చేయాలని, బజర్ మోగిన తర్వాత బొమ్మలను తెస్తే నేను యాక్సెప్ట్ చేయను.. గొడవ చేస్తాని యానీ మాస్టర్ అనగా.. 'మాకెవరూ ఏం చెప్పొద్దూ.. సంచాలకురాలిగా మేం చూసుకుంటాం' అంటూ సిరి చెప్పింది. దీంతో యానీ మాస్టర్ ఉగ్రరూపం దాల్చింది. 'నేను అంత రూడ్ కాదు.. నువ్ నన్ను అలా బ్లేమ్ చేయలేవు.. నాకు డ్రామాలు ఆడడం రాదు.. నేను డ్రామా క్వీన్ కాదు' అంటూ మండిపడింది. దీంతో బాగా హర్ట్ అయిన సిరి.. గేమ్ ఫేర్‌గా అడినప్పటికీ.. నేను ఒక టీమ్(షణ్ను ఉన్న ఎల్లో టీమ్)కే సపోర్ట్ చేస్తున్నానని అంటున్నారు.. ఇకపై అలానే ఆడుతాను. 'ఇప్పుడు నా చేతుల్లో గేమ్ ఉంది.. నేను ఆడతాను’అని సిరి అనగా.. గేమ్‌కి రెస్పెక్ట్ ఇచ్చి జన్యూన్‌గా ఆడాలని షణ్ముఖ్ సర్థి చెప్పాడు. రవి టీమ్‌కి జాక్‌పాట్ ఇక ఈ టాస్క్‌లో గ్రీన్ టీమ్ సభ్యులైన రవి, లోబో, శ్వేతాలకు స్పెషల్ పవర్ లభించింది. స్పెషల్ బొమ్మ రావడంతో దాని ద్వారా వేరే టీం దగ్గర ఉన్న బొమ్మల్ని తీసుకునే అవకాశం ఇచ్చారు బిగ్ బాస్. ఇక రేపటి ఎపిసోడ్లో యానీ మాస్టర్, శ్వేతల మధ్య పెద్ద గొడవే జరిగినట్లు తెలుస్తోంది. లాస్ట్ టాస్క్‌లో ఫ్రెండ్‌ని కోల్పోయా.. ఈ టాస్క్‌లో బిడ్డని కోల్పోయా.. అలాంటి తొక్కల రిలేషన్షిప్ నాకొద్దంటూ యానీ మాస్టర్ తన అసలు రూపాన్ని బయటపెట్టింది. -
అగ్ని పరీక్ష.. ఛీ కొట్టిన పింకీ, చిందులు తొక్కిన షణ్ముఖ్
Bigg Boss Telugu, Episode 37: హమీదా వెళ్లిపోయాక శ్రీరామచంద్ర కాస్త డల్ అయిపోయినట్లు కనిపించింది. అర్ధరాత్రి నిద్రలో కూడా ఏవేవో కేకలు వేయడంతో ఇంటిసభ్యులు ఉలిక్కిపడ్డారు. పక్కనే ఉన్న విశ్వ.. అతడి పరిస్థితి అర్థమై అతడి వీపు నిమురుతూ నిద్రపుచ్చాడు. మరోపక్క నామినేషన్స్‌లో ఎలా ఫైట్ చేయాలా? సిరి, జెస్సీ, షణ్ముఖ్ చర్చించుకున్నారు. ఏదేమైనా సరే, అతడికి రివర్స్ కౌంటరివ్వు, ఏం కాదంటూ సిరిని శ్రీరామ్ మీదకు ఉసిగొల్పాడు షణ్ముఖ్. మరోపక్క కెప్టెన్, రేషన్ మేనేజర్‌కు అస్సలు పడటం లేదన్న విషయం మరోసారి స్పష్టమైంది. రేషన్ మేనేజర్‌గా నువ్వు ఫెయిలయ్యావంటూ విశ్వ ముఖం మీదే చెప్పేసింది ప్రియ. అంతేకాకుండా అందరికీ గిన్నెల్లో వేసి పెట్టిన తర్వాతే తినాలని అతడిని ఆదేశించింది. కంటెస్టెంట్లకు అగ్ని పరీక్ష అనంతరం బిగ్‌బాస్ హౌస్‌లో ఆరోవారం నామినేషన్స్ మొదలయ్యాయి. నిప్పులా ఎగసిపడుతున్న అభిప్రాయాలను 'అగ్నిపరీక్ష' టాస్క్‌లో బయటపెట్టాలన్నాడు బిగ్‌బాస్. మొదటగా వచ్చిన సన్నీ.. రవి, జెస్సీ ఫొటోలను మంటలో వేశాడు. తర్వాత వచ్చిన విశ్వ.. ఎంతో కష్టపడి బిగ్‌బాస్‌కు వచ్చిన తనను స్ట్రాంగ్ అంటూ పదేపదే నామినేట్ చేయడం నచ్చలేదంటూ యానీ మాస్టర్ ఫొటోను నిప్పులో పడేశాడు. దీన్ని జీర్ణించుకోలేకపోయిన యానీ ఉగ్రావతారం ఎత్తింది. ఇకపై తనను అక్క అని పిలవద్దంటూ వార్నింగ్ ఇచ్చింది. తర్వాత అతడు ప్రియాంక సింగ్‌ను నామినేట్ చేశాడు. నా గేమ్ నా ఇష్టం, నాకు నీతులు చెప్పకు: సిరి శ్వేత.. సిరి, కాజల్‌ను నామినేట్ చేసింది. అనంతరం లోబో వంతు రాగా.. నమ్మకం అంటే చచ్చిపోతా, అలాంటిది తన నమ్మకాన్ని చంపారంటూ ప్రియాంక సింగ్, జెస్సీని నామినేట్ చేశాడు. దీనిపై జెస్సీ రియాక్ట్ అవుతూ.. నమ్మకంతో తనకు పని లేదని, గేమ్ ఆడటానికి వచ్చానని సమాధానమిచ్చాడు. సిరి మాట్లాడుతూ.. నీ కెప్టెన్సీలో పక్షపాతం కనిపించిందంటూ శ్రీరామచంద్రను నామినేట్ చేసింది. తర్వాత శ్వేత ఫొటోను మంటల్లో వేస్తూ.. నా గేమ్ నా ఇష్టం, ఏం చేయాలో నాకు సూక్తులు చెప్పకంటూ చిర్రెత్తిపోయింది. యాంకర్ రవి.. కెప్టెన్సీ టాస్క్‌లో సపోర్ట్ చేయలేదని మానస్‌ను నామినేట్ చేశాడు. జనాలను ఎంటర్టైన్ చేయాలని తాను, లోబో బిగ్‌బాస్‌కు వచ్చామని, కానీ మా ఇద్దరినీ తప్పుగా అర్థం చేసుకుంటున్నావంటూ సిరి ఫొటోను కాల్చి బూడిద చేశాడు. విశ్వను ఛీ కొట్టిన పింకీ, నవ్వాపుకున్న ప్రియ జెస్సీ.. శ్రీరామ్, సన్నీని నామినేట్ చేశాడు. ఈ క్రమంలో జెస్సీ, సన్నీ మధ్య పెద్ద ఫైటే నడిచింది. నేను గేమ్ ఆడితే తట్టుకోలేవు, నా మంచితనం పోతే చాలా వరస్ట్‌గా ఉంటుంది అని హెచ్చరించాడు సన్నీ. ప్రియాంక సింగ్ మాట్లాడుతూ.. ప్రతిసారి సిల్లీ రీజన్స్‌తో నామినేట్ చేయడమే కాకుండా నమ్మకం గురించి మాట్లాడేందుకు సిగ్గుండాలంటూ లోబో ఫొటోను నిప్పుల్లో వేసింది. విశ్వ గురించి మాట్లాడుతూ.. కండబలమే కాదు బుద్ధిబలం కూడా ఉపయోగించాలి. ఎధవ రీజన్లు చెప్తారు.. ఛీ.. అంటూ అక్కడి నుంచి ఆవేశంగా వెళ్లిపోయింది. ఇదంతా చూసి ప్రియ నవ్వాపుకోవడం గమనార్హం. మానస్.. యాంకర్ రవి, లోబోను నామినేట్ చేశాడు. యానీ మాస్టర్.. మరోసారి స్ట్రాంగ్ కంటెస్టెంట్‌నే నామినేట్ చేస్తానంటూ షణ్ముఖ్ ఫొటోను నిప్పుల్లో పడేసింది. అక్కా, అక్కా అంటూ దొంగ నాటకాలు ఆడకు, వెనకాల నుంచి పొడవకు అని హెచ్చరిస్తూ విశ్వ ఫొటోను కాల్చివేసింది. అందుకోసం నేను బిగ్‌బాస్‌కు రాలేదు: కాజల్ తర్వాత శ్రీరామ్ వంతురాగా.. మీ అవసరానికి తగ్గట్టు రిలేషన్షిప్ వాడుకోవద్దని సూచిస్తూ సిరిని నామినేట్ చేశాడు. ఆడినా ఆడకపోయినా షణ్ముఖ్నెవరూ నామినేట్ చేయడంలేదంటూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తూ అతడి ఫొటోను మంటల్లో వేశాడు. ఈ క్రమంలో నిప్పులు తొక్కిన షణ్ను బిగ్‌బాస్ హౌస్‌కు నువ్వు దేవుడివి, నువ్వేం చెప్తే అది చేయాలా? అని ఫైర్ అయ్యాడు. దీంతో శ్రీరామ్ అతడికి కూల్ చేసేందుకు ప్రయత్నించాడు. తర్వాత కాజల్ మాట్లాడుతూ.. హమీదా నన్ను అక్కా అంటూ పిలిచింది కానీ నేను కనెక్ట్ కాలేకపోయా.. నేను నిన్ను బ్రదర్ అంటూ మాట్లాడదామని ముందుకు వస్తే నువ్వు కనెక్ట్ అవ్వలేదు. ఇదే కర్మ.. ఎమోషనల్ ఎటాచ్మెంట్ పెట్టుకోవడానికి హౌస్‌లోకి రాలేదు, కేవలం గేమ్ ఆడటానికే వచ్చానని తేల్చి చెప్పింది కాజల్. తనను నామినేట్ చేసినందుకు శ్వేత ఫొటోను నిప్పుల్లో వేసింది. అందరికీ పెట్టాకే తినాలి: ప్రియ ప్రియ.. నువ్వేం మాట్లాడతావో అర్థం కాదు, టక్కున నోరు జారేస్తావు. రేషన్ మేనేజర్‌గా బాధ్యతలు తీసుకున్నప్పుడు అందరికీ పెట్టాకే తినాలి అంటూ విశ్వను నామినేట్ చేసింది. తర్వాత సన్నీ ఫొటోను మంటల్లో వేసింది. ప్రతివారం తనను నామినేట్ చేయడమే పనిగా పెట్టుకోవడాన్ని సహించలేకపోయాడు సన్నీ. మీరున్నన్ని రోజులు మిమ్మల్నే నామినేట్ చేస్తానంటూ ప్రియను హెచ్చరించాడు. మొత్తంగా ఈ వారం షణ్ముఖ్, ప్రియాంక సింగ్, లోబో, శ్రీరామ్, రవి, సిరి, విశ్వ, శ్వేత, సన్నీ, జెస్సీ నామినేట్ అయినట్లు బిగ్‌బాస్ ప్రకటించాడు. -
బిగ్‌బాస్ హౌస్‌కు నేనే హీరోయిన్: హమీదా
Bigg Boss Telugu 5: నవరాత్రి స్పెషల్ ఎపిసోడ్లో భాగంగా నాగ్ సాంప్రదాయ పంచెకట్టులో మెరిసిపోయాడు. అటు కంటెస్టెంట్లు కూడా పోటీపడి మరీ అలంకరించుకున్నట్లు కనిపిస్తోంది. సండేను స్పెషల్‌డేగా మార్చేందుకు స్టేజీ మీదకు విచ్చేసిన నాగ్.. మగాళ్లందరూ బంగార్రాజులాగా, ఆడాళ్లందరూ సత్యభామల్లా ఉన్నారంటూ కంటెస్టెంట్ల మీద పొగడ్తల వర్షం కురిపించాడు. నవరాత్రి సందర్భంగా 9 గేమ్స్, 9 అవార్డులు ఇవ్వబోతున్నట్లు వెల్లడించాడు. గెలిచిన రవి టీమ్ ఇందులో భాగంగా A టీమ్‌లో రవి, హమీదా, శ్వేత, సన్నీ, షణ్ముఖ్, ప్రియాంక, లోబో, యానీ ఉండగా మిగిలినవారు B టీమ్‌లో ఉంటారు. మొదటగా వీరిద్దరికీ మధ్య రింగ్ ఫైట్ పెట్టారు. ఇందులో సన్నీ, సిరి గెలవడంతో వారికి ఫ్యామిలీ వీడియో చూపించారు. లోబో తన కూతురు మాట్లాడిన వీడియో చూడగానే వెక్కివెక్కి ఏడ్చాడు. తర్వాత జెస్సీ తల్లి అతడికి ధైర్యం నూరిపోసిన మాటలను చూపించగా అతడు తెగ సంతోషపడ్డాడు. తర్వాత రెండు టీమ్‌లు చెరో స్కిట్‌తో మంచి సందేశాన్ని అందించే ప్రయత్నం చేశారు. ఈ గేమ్‌లో రవి టీమ్ గెలవగా అతడు మరోసారి పాలపిట్ట అవార్డు అందుకున్నాడు. ఈ సందర్భంగా అతడి టీమ్‌లోని యానీ మాస్టర్‌కు ఆమె తల్లి మాట్లాడిన వీడియో చూపించారు. దీంతో కొరియోగ్రాఫర్.. ఉద్వేగానికి లోనైంది. అనంతరం హెబ్బా పటేల్.. నా తప్పు ఏమున్నదబ్బా అంటూ.. డ్యాన్స్‌తో హుషారెత్తించింది. కాజల్‌కు కాకరకాయ, ప్రియకు ఉల్లిపాయ తర్వాత కంటెస్టెంట్ల కోసం బిగ్‌బాస్ డబ్బాలు పంపించాడు. ఎవరికి ఎక్కువ స్వీట్లు వస్తే వారే గెలిచినట్లు అని చెప్పాడు. ఈ టాస్క్‌లో కాజల్‌కు కాకరకాయ, ప్రియకు ఉల్లిపాయ రావడం గమనార్హం. కానీ రవి టీమ్‌లోని హమీదాకు పూతరేకులు, పింకీ, షణ్ముఖ్‌లకు స్వీట్లు రావడంతో A టీమ్ గెలవగా మరోసారి వారు పాలపిట్ట అవార్డు ఎగరేసుకుపోయారు. ఈ సందర్భంగా యాంకర్ రవి భార్య, కూతురు మాట్లాడిన వీడియో ప్లే చేయడంతో అతడు ఎమోషనల్ అయ్యాడు. స్పెషల్ పర్ఫామెన్స్తో ఆకట్టుకున్న సంధ్యారాణి తర్వాత నాగార్జున రెండు టీములను చెరో 5 ప్రశ్నలు అడిగాడు. ఈ గేమ్‌లో ఎక్కువ సమాధానాలు చెప్పి ప్రియ టీమ్ గెలవడంతో ఆమె టీమ్‌లోని విశ్వకు అతడి ఫ్యామిలీ మాట్లాడిన వీడియో చూపించారు. అందులో విశ్వ భార్య మాట్లాడుతూ.. ఏదున్నా మసులో పెట్టుకోకని సూచించింది. నాట్యం సినిమా కథానాయిక సంధ్యారాణి తన స్పెషల్ పర్ఫామెన్స్తో అందరినీ అవాక్కయ్యేలా చేసింది. ఉర్రూతలూగించిన మంగ్లీ అనంతరం కడవ మీద కడవ ఎత్తుకుని నడిచే టాస్కులో కాజల్ గెలిచింది. దీంతో ఆమె సభ్యురాలిగా ఉన్న B టీమ్‌కు పాలపిట్ట అవార్డు రాగా ప్రియకు ఆమె కుమారుడు మాట్లాడిన వీడియో చూపించారు. తర్వాత హౌస్మేట్స్ బతుకమ్మ పేర్చి ఆడారు. బతుకమ్మ అందంగా పేర్చి ప్రియ టీమ్ గెలిచి పాలపిట్ట అవార్డు ఎగరేసుకుపోయింది. దీంతో కాజల్‌కు ఆమె కూతురు మాట్లాడిన వీడియో చూపించారు. అటు మంగ్లీ మాస్ పాటలు పాడి తన గాత్రంతో అందరినీ ఓ ఊపు ఊపేసింది. జెస్సీని, సిరిని కాపాడటానికే షణ్ముఖ్ పుట్టాడు.. తర్వాత వచ్చిన హైపర్ ఆది కంటెస్టెంట్లు అందరినీ చెడుగుడు ఆడేశాడు. హమీదా వాకిట్లో శ్రీరామ్ చెట్టు అనే ఈవెంట్ ప్లాన్ చేస్తున్నారంటూ వాళ్లిద్దరి మీద జోకేశాడు ఆది. నాగ్ తాకిన షర్ట్‌ను అంత అపురూపంగా చూసుకున్నావు, మరి నన్ను హగ్ చేసుకున్నారు. నన్నేం చేస్తావంటూ పంచ్ వేశాడు. జెస్సీని, సిరిని కాపాడటానికే షణ్ముఖ్ పుట్టాడని కౌంటరిచ్చాడు. ఈ ముగ్గురు మిగతావాళ్లతో కూడా కలిసి ఆడితే బాగుంటుందని సెలవిచ్చాడు. స్విమ్మింగ్‌పూల్‌లో ఎక్కువ సేపు మునగాలన్న టాస్క్‌లో B టీమ్ నుంచి విశ్వ గెలిచింది. దీంతో అదే టీమ్‌లోని సిరికి ఆమె మాట్లాడిన వీడియో చూపించారు. ప్రియ గెలిచింది 6, రవి గెలిచింది 2 తర్వాత బొమ్మను అందంగా ముస్తాబు చేయాల్సిన టాస్క్‌లో ప్రియ టీమ్ గెలిచి మరోసారి పాలపిట్ట అవార్డు ఎగరేసుకుపోయింది. దీంతో ఆ టీమ్‌లోని హమీదాకు ఆమె ఫ్యామిలీ మాట్లాడిన వీడియో చూపించారు. ట్రోఫీ తీసుకొచ్చేయ్ అక్కా.. అంటూ ఆమె తమ్ముడు మాట్లాడిన మాటలు విని హమీదా కంటతడి పెట్టుకుంది. ఇప్పటివరకు ఆడిన 8 గేముల్లో ప్రియ 6 గెలవగా రవి 2 గెలిచాడు. తర్వాత స్టేజీ మీద సడన్ సర్ప్రైజ్ ఇచ్చింది మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్ టీమ్. హీరో అఖిల్.. తనతో పాటు తీసుకొచ్చిన పూజా హెగ్డేను ఇంప్రెస్ చేయమని ఇంట్లోని మగవాళ్లకు టాస్క్ ఇచ్చాడు. దీంతో శ్రీరామ్ పాట పాడగా, సన్నీ మిమిక్రీ చేశాడు. షణ్ముఖ్ మాత్రం సింగిల్స్ కోసం స్కిట్ వేశాడు. జెస్సీ, మానస్ డ్యాన్స్‌తో పడగొట్టేందుకు ప్రయత్నించారు. కానీ పూజా మాత్రం.. తను అఖిల్‌కే పడిపోయానని చెప్పింది. అయితే ఈ గేమ్‌లో మానస్ గెలిచాడని తెలిపాడు నాగ్. దీంతో మానస్‌కు ఫ్యామిలీ వీడియో చూపించారు. తర్వాత షణ్ముఖ్ సేవ్ అయినట్లు ప్రకటించారు. చివరగా విశ్వ, హమీదా మిగలగా... వీరిలో నుంచి హమీదా ఎలిమినేట్ అయినట్లు ప్రకటించారు. హౌస్‌కు తానే హీరోయిన్ అని చెప్పుకొచ్చింది హమీదా. -
కాజల్‌కు మిడిల్ ఫింగర్ చూపించిన లోబో, వేలు నరికేస్తానన్న పింకీ!
Bigg Boss Telugu 5, Episode 31: కెప్టెన్ శ్రీరామ్ ఎప్పుడైతే ఎవరి ఫుడ్ వాళ్లు వండుకుని తినాలని ఓ స్టేట్మెంట్ ఇచ్చాడో అప్పటినుంచి సిరి గ్యాంగ్‌కు యాంటీ అయిపోయాడు. జెస్సీ మాటతీరు వల్లే తాను అలా అనాల్సి వచ్చిందని అతడు నచ్చజెప్పడానికి ప్రయత్నించినప్పటికీ సిరి, షణ్ను వినిపించుకోలేదు. జెస్సీ తన క్లోజ్ ఫ్రెండ్ కాబట్టి స్టాండ్ తీసుకున్నానని షణ్ను, అయినా మధ్యలో ఏజ్ గురించి ఎందుకు మాట్లాడుతున్నావని సిరి శ్రీరామ్ మీద ఒంటికాలిపై లేచారు. మొత్తంగా ఈ గొడవతో అటు సిరి, షణ్ను, జెస్సీ, ఇటు శ్రీరామ్, హమీదా ఏమీ తినకుండా ఫుడ్ మీద తమ ప్రతాపాన్ని చూపించారు. తమ పేరెంట్స్‌కు టీవీ, వాచ్, స్మార్ట్ ఫోన్ గిఫ్టులుగా ఇచ్చిన కంటెస్టెంట్లు.. అయితే నీకు ఆకలేస్తే తినంటూ శ్రీరామ్ హమీదాను బుజ్జగించాడు. కానీ ఆమె అందుకు నిరాకరించడంతో పస్తులతోనే పడుకున్నారు. అయితే తర్వాతి రోజు అందరూ వారి గిల్లికజ్జాలను పక్కన పెట్టి టిఫిన్ కుమ్మేసినట్లు కనిపించింది. అనంతరం అమెజాన్ గ్రేట్ ఇండియా ఫెస్టివల్లో భాగంగా పలువురు ఇంటిసభ్యులు వారి ఫ్యామిలీకి బహుమతులను అందించే అవకాశాన్ని కొట్టేశారు. ఇందుకోసం కెప్టెన్ శ్రీరామ్.. ప్రియ, షణ్ముఖ్, హమీదా, మానస్‌లను ఎంచుకున్నాడు. మొదటగా ప్రియ.. తన తల్లికి టీవీని బహుమతిగా ఇచ్చే అవకాశాన్ని అందుకుంది. తర్వాత షణ్ముఖ్.. డైరెక్టర్ సుబ్బుకు ల్యాప్‌టాప్ బహుమతిగా ఇస్తున్నట్లు ప్రకటించాడు. మానస్.. తన తల్లికి బ్రాండెడ్ వాచ్‌ను గిఫ్ట్‌గా ఇస్తున్నట్లు వెల్లడించాడు. హమీదా.. తన తల్లికి లేటెస్ట్ స్మార్ట్‌ఫోన్‌ను ఇస్తున్నట్లు తెలిపింది. మజాక్ అనేది కొంతవరకు ఉంటేనే బెటర్.. ఇక రవి, కాజల్ మధ్య మరోసారి అగ్గి రాజుకుంది. నెల రోజుల నుంచి లోబో, రవి వాష్‌రూమ్ క్లీనింగ్ తప్ప కిచెన్ వంకే చూడట్లేదని సెటైర్ వేసింది కాజల్. దాన్నే కాస్త పొడిగిస్తూ డ్యాన్సులు కూడా చేసింది. అయితే మజాక్ అనేది కొంతవరకు ఉంటేనే బెటర్ అని కాజల్‌పై చిరాకుపడ్డాడు రవి. ఇక లోబో అయితే ఏకంగా మిడిల్ ఫింగర్ చూపించి ఆమెకు ఇన్‌డైరెక్ట్‌గా వార్నింగ్ ఇచ్చాడు. దీంతో లోబో చేసింది తప్పని వాదించింది కాజల్. ఇదే విషయాన్ని కాజల్ పింకీతో చెప్పుకురాగా.. తనకుగానీ అలా వేలు చూపిస్తే కట్ చేసి పడేస్తానని హెచ్చరించింది. బిగ్‌బాస్ హౌస్‌లో హింసకు తావు లేనందున అక్కడి నుంచి సైలెంట్‌గా వచ్చేశానంది కాజల్. రవిని ఫ్రెండుగా ఉండమని నేనేమైనా అడిగానా?: కాజల్ నెల రోజులన నుంచి కిచెన్‌లో తానేమీ పని చేయలేదని ఎలా స్టేట్మెంట్ ఇస్తావని కాజల్‌ను నిలదీశాడు రవి. దీంతో మాట మార్చిన కాజల్.. కేవలం మీకు కిచెన్ డ్యూటీ రాలేదని మాత్రమే అన్నానని కవర్ చేసింది. కాజల్ వింత ప్రవర్తన చూసిన మానస్ ఎందుకు అరుస్తున్నావు? ఎవరి మీద అరుస్తున్నావు? అని ప్రశ్నించాడు. ఇదేమీ పెద్దగా పట్టించుకోని కాజల్.. అయినా రవిని నా ఫ్రెండుగా ఉండమని ఎప్పుడైనా అడిగానా? అని అసహనానికి లోనైంది. లోబో మిడిల్ ఫింగర్ చూపిస్తే సపోర్ట్ చేస్తున్నావు అనడంతో షాకైన రవి.. అలా వేలు చూపించడం తప్పని లోబోను కూడా హెచ్చరించానన్నాడు. ఇక శ్రీరామ్ వీళ్ల మధ్య గొడవను సద్దుమణిగే ప్రయత్నం చేశాడు కానీ ఎవరూ అతడు మాటను పట్టించుకున్న పాపాన పోలేదు. ఏ రాజు దగ్గర ఎక్కువ ధనం ఉంటే ఆ రాజ్యంలోని వాళ్లే కెప్టెన్సీకి అర్హులు తర్వాత బిగ్‌బాస్.. 'రాజ్యానికి ఒక్కడే రాజు' అనే కెప్టెన్సీ పోటీదారుల టాస్క్‌ను ప్రవేశపెట్టాడు. ఈ టాస్క్‌లో భాగంగా ఇద్దరు రాజులు రవి, సన్నీ సింహాసనాన్ని గెలుచుకోవడానికి పోటీపడతారు. మిగతా ఇంటి సభ్యులు ప్రజలుగా వ్యవహరిస్తారు. ఇద్దరు రాకుమారులు వారి దగ్గరున్న ధనాన్ని టాస్క్‌లతో పాటు సేవలు చేయించుకోవడానికి వినియోగించుకోవాల్సి ఉంటుంది. టాస్క్ పూర్తయ్యే సమయానికి ఏ రాకుమారుడికి ఎక్కువ మద్దతు లభిస్తే వాళ్లు సింహాసనాన్ని అధిష్టిస్తారు. అందరి కంటే ఎక్కువ ధనం ఉన్న రాజు, అతడి ప్రజలు కెప్టెన్సీకి పోటీపడే అవకాశాన్ని అందుకుంటారు. దీంతో రవి, సన్నీ సపోర్ట్ కోసం హౌస్మేట్స్ వెంట పడ్డారు. ఈ క్రమంలో యాంకర్ రవికి విశ్వ, శ్రీరామ్, హమీదా, శ్వేత, యానీ మాస్టర్ సపోర్ట్ చేయగా.. సన్నీకి మానస్, లోబో, ప్రియాంక సింగ్, ప్రియ, సిరి, షణ్ముఖ్, జెస్సీ మద్దతుగా నిలబడ్డారు. తర్వాత సడన్‌గా సిరి.. రవి గ్యాంగ్‌లో జాయిన్ అయిపోయింది. అయితే ఖజానాలో నుంచి ఒక్క పైసా దొంగిలించేది లేదని విశ్వ కుండ బద్ధలు కొట్టి చెప్పేశాడు. కానీ జెస్సీ, సిరి, షణ్ముఖ్, కాజల్ మాత్రం దొంగిలించడమే పనిగా పెట్టుకున్నారు. ఇంతలో ఖజానాలో నుంచి నాణాలు పోయాయని గుర్తించిన విశ్వ.. ఇవన్నీ చేతగానోళ్లు చేసే పనులంటూ చీదరించుకున్నాడు. తర్వాత బిగ్‌బాస్ ప్రవేశపెట్టిన 'మట్టిలో మహాయుద్ధం' అనే కుస్తీపోటీలో రవి వైపు నుంచి నుంచి విశ్వ, శ్వేత, యానీ మాస్టర్; సన్నీ వైపు నుంచి మానస్, జెస్సీ, పింకీ బరిలోకి దిగుతున్నట్లు ప్రకటించారు. ఇందులో ఏ రాజు గెలిస్తే అతడికి 150 నాణాలు లభిస్తాయి. మరి ఈ టాస్క్‌లో ఎవరు గెలిచారనే విషయాన్ని సస్పెన్స్‌లో పెట్టారు. ఈ గేమ్‌లో ఎవరు గెలిచారో తెలియాలంటే రేపటి ఎపిసోడ్ కోసం ఎదురు చూడాల్సిందే! -
నన్ను వాడుకుంటున్నావు: సిరికి షాకిచ్చిన షణ్ముఖ్
Bigg Boss 5 Telugu, Episode 28: జెస్సీని జైలు నుంచి విడుదల చేయడంతో వీకెండ్ ఎపిసోడ్ ప్రారంభమైంది. షణ్ముఖ్ తనను మళ్లీ దూరం పెడుతున్నాడని ఏడ్చేసింది సిరి. జెస్సీతో బానే ఉండి తనకు స్పేస్ ఇవ్వకపోవడంతో మండిపోతోంది అని కాజల్ దగ్గర వాపోయింది. అందుకే ఫ్రెండ్షిప్, కనెక్షన్స్ ఏమీ పెట్టుకోవద్దు, లేదంటే ఇదిగో ఇలా ఒకటే యాపారం ఉంటుందని అంది. తర్వాత షణ్ముఖ్, సిరి ఒకే దగ్గర కూర్చుని మాట్లాడుకున్నారు. 'మెంటల్లీ నెగెటివ్ వైబ్స్ వస్తున్నాయి. నన్ను వాడుకుంటున్నారన్న ఫీలింగ్ వస్తోంది. జెస్సీతో నాకున్న బాండింగ్ వేరు, కాబట్టి వాడు నన్ను వాడుకున్నా ఆ ఫీలింగ్ రాదు. కానీ నీ విషయంలో అలా కాదు' అని సిరి ముఖం మీదే చెప్పాడు. నిన్ను వాడుకున్నారనుకోవడం నీ అభిప్రాయం, తప్పు అనడం లేదు. నేను నీ దగ్గరుంటే గేమ్‌పై ప్రెజర్ పడుతుందని ఫీలవుతున్నావ్, అంతేగా.. ఈ ప్రశ్నలకు నా దగ్గర ఆన్సర్ ఉంది కానీ చెప్పను, టైం వచ్చినప్పుడు నువ్వే తెలుసుకుంటావు అని చెప్పింది సిరి. సింపతీ కార్డ్ వాడొద్దు: నాగ్ హెచ్చరిక తర్వాత నాగార్జున.. ఇంటిసభ్యులకు హాయ్ చెప్తూనే.. జెస్సీ మీద జాలిపడ్డాడు. హౌస్‌లో అతడిని తొక్కేస్తున్నారని చెప్పుకొచ్చాడు. తర్వాత లోబోను నామినేషన్స్‌లో అంతెత్తున అరిచేసి సారీ చెప్పడం కరెక్టా? అని ప్రశ్నించాడు. దీనికతడు తన ప్రేమ గురించి కామెంట్ చేయగానే హర్ట్ అయ్యానని, కానీ గొంతు చించుకోలేదని చెప్పాడు. దీంతో నాగ్ నామినేషన్స్ టైంలో లోబో అరిచిన వీడియోను ప్లే చేయమంటావా? అని ప్రశ్నించగానే అతడు నీళ్లు నమిలాడు. పదేపదే బస్తీ నుంచి వచ్చానంటూ సింపతీ కార్డ్ యూజ్ చేయొద్దని హితవు పలికాడు. మీ వల్ల జెస్సీ సఫర్ అవుతున్నాడు బిగ్‌బాస్ ఇంటిసభ్యులకు స్పెషల్ ఫుడ్ ఐటమ్స్‌ను పంపించడంతో కంటెస్టెంట్లు వాటిని గబగబా ఆరగించారు. అయితే షణ్ముఖ్- సిరి జోడీకి మాత్రం ఘాటైన పచ్చిమిర్చిని పంపించాడు. ఈ సందర్భంగా నాగ్.. షణ్ముఖ్ కూర్చుని కబుర్లు చెప్తున్నాడని, అతడిలోని ఫైర్ బయటకు తీసుకురావాలని మిర్చి పంపించాడని పేర్కొన్నాడు. నీ ఆట నువ్వు ఆడని సిరికి సూచిస్తూనే మీ వల్ల జెస్సీ సఫర్ అవుతున్నాడని తెలిపాడు. తర్వాత నాగ్ గిటార్ అందుకుని శ్రీరామ్ పాడిన పాట ప్లే చేశాడు. ఈ పాట వింటుంటే ఏం ఫీల్ వస్తుందని అడగ్గా.. హమీదా లవ్ ఫీల్ వచ్చిందని పేర్కొంది. దీంతో ఇద్దరి మధ్య లవ్ ట్రాక్ నడుస్తోందని మరోసారి చెప్పకనే చెప్పాడు నాగ్. తర్వాత యాంకర్ రవి సేవ్ అయినట్లు ప్రకటించాడు. లోబో ఉరిమి ఉరిమి చూస్తున్నాడు అనంతరం నాగ్ హౌస్‌మేట్స్‌తో ఓ గేమ్ ఆడించాడు. మొదటగా వచ్చిన రవి.. ప్రియాంక సింగ్‌ను అటెన్షన్ సీకర్‌గా పేర్కొన్నాడు. తర్వాత వచ్చిన ప్రియ.. లోబోను నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడమంటూ వాచ్ యువర్ టంగ్ అని పేర్కొంది. అతడు ఏం చేస్తానో తెలుసా? అంటూ భయపెట్టాడని, ఇప్పటికీ ఉరిమి ఉరిమి చూస్తున్నాడని చెప్పడంతో నాగ్.. బిగ్‌బాస్ హౌస్‌లో అందరూ సేఫ్ అని వెల్లడించాడు. తర్వాత మానస్.. లోబో బ్రెయిన్ వాడితే బాగుంటుందని సూచించాడు. ఇక లోబో, యానీ మాస్టర్ కూడా ప్రియాంక సింగ్‌ను అటెన్షన్ సీకర్‌గా పేర్కొన్నాడు. ఇంతలో ప్రియ కలగజేసుకుంటూ.. శ్రీరామ్- మానస్ మధ్య ఏదైనా ఫైటింగ్ జరిగితే.. నా రెండు కళ్లు కొట్టుకుంటున్నాయ్ అని పింకీ తెగ బాధపడిపోతుందని చెప్పుకొచ్చింది. లోబో భార్యకు నాగ్ స్పెషల్ విషెస్ తర్వాత హమీదా.. సన్నీని బుర్ర వాడమని సూచించింది. కాజల్.. లోబో సింపతీ కోరుకుంటాడని పేర్కొంది. అనంతరం ప్రియ సేఫ్ అయినట్లు నాగ్ ప్రకటించాడు. ఇక మళ్లీ గేమ్ కొనసాగగా నటరాజ్ మాస్టర్.. విశ్వ సింపతీ పొందాలని చూస్తాడని విమర్శించాడు. ఇక విశ్వ, సిరి.. లోబో మెదడు వాడితే బాగుంటుందని సలహా ఇచ్చారు. ఇంతలో లోబో లేచి.. తన భార్య ఫాతిమా.. ఏడు నెలల గర్భవతి అని, ఆమెది ఈరోజు బర్త్‌డే అని చెప్పడంతో నాగ్ స్పెషల్ విషెస్ చెప్పాడు. ప్రియాంక సింగ్, శ్రీరామ్.. లోబోను, శ్వేత.. కాజల్‌ను వాచ్ యువర్ టంగ్ అని పేర్కొన్నారు. సేవ్ అయితే నాలో కొత్త సిరిని చూస్తారు తర్వాత వచ్చిన జెస్సీ.. రవిని మైండ్ యువర్ ఓన్ బిజినెస్ అని వార్నింగ్ ఇచ్చాడు. నీ గేమ్ నువ్వు ఆడుకో, నా మీద ఫోకస్ పెట్టడం ఆపేయ్ అని సూటిగా సుత్తిలేకుండా చెప్పాడు. దీంతో నాగ్ కూడా రవికి మైండ్ యువర్ ఓన్ బిజినెస్ అని మరోసారి వార్నింగ్ ఇచ్చాడు. తర్వాత షణ్ముఖ్.. సిరిని బ్రెయిన్ వాడమని సలహా ఇచ్చాడు. దీంతో సిరి.. తాను సేవ్ అయితే రేపటినుంచి ఇంకో సిరిని చూస్తారని సవాలు విసిరింది. అనంతరం నాగ్.. సన్నీ, కాజల్ సేవ్ అయినట్లు వెల్లడించాడు. దీంతో లోబో, యానీ మాస్టర్, సిరి, నటరాజ్ మాస్టర్ ఇంకా డేంజర్ జోన్లో ఉన్నారు. అయితే వీళ్లలో నటరాజ్ ఎలిమినేట్ అయినట్లు వార్తలు వస్తున్నాయి. -
షణ్ముఖ్, లోబోల పరువు తీసిన నాగార్జున!
బిగ్‌బాస్ హౌస్‌లో కంట్రోల్ తప్పిన కంటెస్టెంట్ల తిక్క కుదిర్చేందుకు వీకెండ్ ఎపిసోడ్ ద్వారా రెడీ అయ్యాడు కింగ్ నాగార్జున. ఎవరు అతి చేశారో? ఎవరు అసలు ఆట ఆడకుండా ఉన్నారో? ఎవరు ఇన్ఫ్లూయెన్నస్ చేస్తున్నారో? ఇలా అన్ని లెక్కలు బయటపెడుతూ ఒక్కొక్కరికీ గట్టిగానే క్లాసులు పీకుతున్నాడు. ఈ మేరకు తాజాగా ప్రోమో రిలీజైంది. మొదటగా షణ్ముఖ్‌ను మిర్చి తినమని చెబుతూ.. గేమ్ ఆడకుండా కూర్చుని కబుర్లు చెప్తున్నావ్, అంతేనని పరువు తీసేశాడు. ఇక సిరిని.. నీ ఆట నువ్వు ఆడని వార్నింగ్ ఇచ్చాడు. మీ ఇద్దరి మూలంగా జెస్సీ సఫర్ అవుతున్నాడని బాంబు పేల్చాడు. తర్వాత నామినేషన్స్ సమయంలో బయటపడ్డ లోబోలోని అపరిచితుడి బిహేవియర్‌ను ప్రస్తావిస్తూ అతడి తప్పులను ఎత్తి చూపాడు. అయితే లోబో మాత్రం నావరకు అంతా బరాబర్ చేశాను అని చెప్పగా.. అరవడం కూడా బరాబరేనా, అట్లాగే అరుస్తావా? అని నాగ్ సూటిగా ప్రశ్నించాడు. దీంతో తటపటాయించిన లోబో గొంతైతే చించుకోలేదు సర్ అని ఆన్సరివ్వగా నాగ్ వీడియో ప్లే చేశాడు. ఆ వీడియోలో లోబో.. ప్రియ పైపైకి వెళ్లి అరవడం స్పష్టంగా కనిపించింది. దీంతో అడ్డంగా దొరికిపోయాననుకున్న లోబో.. సారీ అంటూ నేలచూపులు చూశాడు. ప్రతిసారి బస్తీ నుంచి వచ్చాను అని చెప్తున్నావు... ఇది బస్తీకాదు, విల్లా కాదు, బిగ్‌బాస్ హౌస్. ఇక్కడ అందరూ సమానమే అని తేల్చి చెప్పాడు నాగ్. మొత్తానికి నేటి ఎపిసోడ్లో కంటెస్టెంట్లకు వాయింపులు గట్టిగానే ఉన్నట్లు తెలుస్తోంది. -
దయనీయం: చెత్తబుట్టలో నుంచి ఫుడ్ ఏరుకున్న లోబో
Bigg Boss Telugu 5 Promo: బిగ్‌బాస్ కంటెస్టెంట్లకు ఆకలి విలువేంటో నేర్పుతున్నాడు. కెప్టెన్సీ కంటెండర్ టాస్క్ కోసం హౌస్‌మేట్స్‌ను జంటలుగా విడిపోమన్న బిగ్‌బాస్ వారిని బరువు తగ్గమని ఆదేశించాడు. ఇందుకోసం వారికి తిండి పెట్టకుండా సతాయిస్తున్నాడు. కేవలం ప్రోటీన్స్ షేక్, కొబ్బరి బోండాం నీళ్లు మాత్రమే అందిస్తున్నాడు. దీంతో ఓవైపు ఆకలితో అలమటిస్తూనే మరోవైపు ఎలాగైనా టాస్క్‌లో గెలవాల్సిందేనని కసితో రగిలిపోతున్నారు కంటెస్టెంట్లు. కానీ ఆకలితో నకనకలాడిపోతున్న లోబో తన కడుపు మాడ్చుకోలేక చెత్తబుట్టలో ఫుడ్ కోసం వెతికాడు. ఇది చూసి అక్కడున్న రవి షాకయ్యాడు. బుల్లితెర ప్రేక్షకులు సైతం లోబో పరిస్థితిని చూసి జాలిపడుతున్నారు. కాగా ఈ టాస్క్ ప్రారంభమవడానికి ముందు ఇంట్లోని ఫుడ్ మొత్తాన్ని పంపించేయమని ఆదేశించాడు బిగ్‌బాస్. ఆ సమయంలో లోబో తన యాపిల్‌ను దాచుకుని దాచుకుని తిన్నాడు. దీంతో బిగ్‌బాస్ తన ఆదేశాలను బేఖాతరు చేశారంటూ కెప్టెన్ జెస్సీకి శిక్ష విధించాడు. జెస్సీతో పాటు అతని జోడీ కాజల్ కూడా కెప్టెన్సీకి పోటీపడే అర్హత కోల్పోయారని ప్రకటించాడు. ఈ నిర్ణయంతో జెస్సీ, కాజల్ షాక్‌లోకి వెళ్లిపోయారు. హౌస్‌మేట్స్‌ను టెంప్ట్ చేసేందుకు బిగ్‌బాస్ ఫుడ్ పంపించగా ప్రియాంక సింగ్ తన నోటిని కట్టేసుకోలేక అందరికీ ఊరిళ్లు వచ్చేలా ఆ వంటకాన్ని ఆవురావుమని ఆరగించింది. -
బిగ్‌బాస్ అరాచకం.. తినే కంచాన్ని లాగేసుకున్నాడు!
అక్కినేని నాగార్జున హోస్ట్‌గా వ్యవహరిస్తున్న బిగ్ రియాల్టీషో బిగ్‌బాస్ సీజన్ 5లో టాస్కుల మోతాదు రోజు రోజుకు పెరుగుతోంది. ఇన్ని రోజులు కెప్టెన్సీ కంటెడర్ టాస్క్‌లుగా చిన్న చిన్న గేమ్స్ ఇచ్చిన బిగ్‌బాస్.. ఈ సారి మాత్రం టాస్క్ ఆడాలంటే బరువు తగ్గాల్సిందేనని కండీషన్ పెట్డాడు. మరి ఆ కండీషన్‌ని కంటెస్టెంట్స్ ఫాలో అయ్యారా? ఈ వారం కెప్టెన్సీ పోటీదారులుగా నిలిచేందుకు ఇంటి సభ్యులకు బిగ్‌బాస్ ఎలాంటి టాస్కులు ఇచ్చాడు? వాటిని ఎలా ఆడారో నేటి ఎపిసోడ్లో చదివేద్దాం. గుంట నక్క నేనే కదా: రవి నిన్నటి నామినేషన్స్‌లో మరోసారి తెరపైకి వచ్చిన గుంటనక్క ఇష్యూని రవి మర్చిపోలేకపోతున్నాడు. గుంటనక్క అని నన్నే అన్నావ్ కదా అని నటరాజ్ మాస్టర్ని రవి అడిగాడు. అయితే మాస్టర్ మాత్రం నేరుగా చెప్పకుండా నువ్వెందుకు భుజాలు తడుముకుంటున్నావ్ అని కౌంటర్ ఇచ్చాడు. పికాక్ ఎగిరిపోయిందని లహరిని ఉద్దేశించి రవి దగ్గర జోక్ చేశాడు నటరాజ్ మాస్టర్. సర్లే మాస్టర్ గుంటనక్క నేనే కదా.. నిజం చెప్పండి మాస్టర్.. ప్రతివారం నాగార్జున గారు గుంటనక్క అని అంటే.. అందరూ నా వైపు అదోలా చూస్తున్నారు.. నాకు ఎట్లా ఉంటుంది అన్నా.. అని ఎమోషనల్ అయ్యాడు రవి. దీంతో నటరాజ్ మాస్టర్ నవ్వుతూ.. నువ్వు ఇంకొకరి ఇన్ఫ్లుయన్స్ చేయకు బ్రదర్ అని పరోక్షంగా గుంటనక్క నువ్వే అని చెప్పేశాడు. అలాగే ఆ మాట నేను ఎప్పుడో మర్చిపోయానని, కానీ ఓ ఊసరవెళ్లి నా దగ్గరకు వచ్చి రవికి కరెక్ట్ పేరు పెట్టావు అని చెప్పాడు అని పరోక్షంగా విశ్వను ఉద్దేశించి అన్నాడు. ఈ విషయాన్ని డైరెక్ట్‌గా విశ్వ దగ్గర ప్రస్తావించాడు రవి. ‘నేను విశ్వ అన్నా.. విశ్వ అన్నా అని అంటుంటే నువ్ మాస్టర్ దగ్గరకు పోయి.. గుంటనక్క అని వాడికి కరెక్ట్ పేరు పెట్టావ్ అని అన్నావట’అని విశ్వని నిలదీశాడు రవి. దీంతో విశ్వ షాకయ్యాడు. నేను ఆ మాట అనలేదు డార్లింగ్. ఆ మనిషితో మాట్లాడటమే వేస్ట్ అని మాస్టర్ని అన్నాడు. మరోవైపు నామినేషన్లో లోబో అన్న మాటలకు ప్రియ బాగా హర్ట్ అయింది. తను ఏడుస్తుంటే మిగతా సభ్యులంతా వెళ్లి ఓదార్చారు. లోబో వెళ్లి ప్రియని హగ్ చేసుకొని ఇద్దరి మధ్య ఉన్న గొడవని పోగొట్టేశాడు. (చదవండి: బిగ్‌బాస్: డేంజర్ జోన్లో ఆ ముగ్గురు, ఎలిమినేట్ అయ్యేది ఎవరంటే..) నన్ను ఫ్రెండ్ అని పిలవకు.. రవికి కాజల్ వార్నింగ్ నిన్నటి నామినేషన్స్‌లో ఆర్జే కాజల్‌ని నామినేట్ చేస్తూ ఆమె ఫిజికల్‌గా తనని కొట్టిందని అందుకే నామినేట్ చేస్తున్నట్టు చెప్పారు యాంకర్ రవి. ఆ మాటకి కాజల్ బాగా హర్ట్ అయింది. ఒక్కొక్కరి కూల్ చేసుకుంటు వస్తున్న రవి.. కాజల్‌తో మాట్లాడేందుకు దగ్గరకు రాగా.. ప్లీజ్ రవి.. నీతో నాకు మాట్లాడలని లేదు. ఫిజికల్ అని అంటావా? ఏమనుకోవాలి? నువ్ నాతో మాట్లాడకు రవి అంటూ అక్కడ నుంచి లేచి లోపలికి వెళ్లిపోయి బోరు బోరున ఏడ్చేసింది. లవ్ అంటే ఏంటో చూపిస్తాం బిగ్‌బాస్ : జెస్సీ బిగ్‌బాస్ హౌస్‌లో అందరూ చిన్న పిల్లాడిగా ట్రీట్ చేసే జెస్సి.. తనలోని రొమాంటిక్ యాంగిల్‌ను బయటపెట్టాడు. శ్వేతతో కలిసి శ్వేతతో పులిహోర కలిపాడు ఈ అమాయకపు చక్రవర్తి. శ్వేతకు తన గర్ల్‌ఫ్రెండ్ పాత్ర ఇచ్చి ఓ టాస్క్ఇవ్వడంటూ ఏకంగా బిగ్‌బాస్‌కే విజ్ఞప్తి చేశాడు. ‘నేను రిక్వెస్ట్ చేస్తున్నా బిగ్‌బాస్.. మా ఇద్దరిని కలిపి బాయ్‌ఫ్రెండ్, గర్ల్‌ఫ్రెండ్‌గా ఓ రోల్ పెట్టండి. ‘మనోహర.. మనోహర’అనే రొమాంటిక్ సాంగ్ ప్లే చేయండి’అంటూ బిగ్‌బాస్‌కు విజ్ఞప్తి చేశాడు. ఇక జెస్సీ మాటలకు శ్వేత పడిపడి నవ్వింది. తినే తిండిని లాగేసుకున్నాడు గార్డెన్ ఏరియాలో ఓ వేయింగ్ స్కేల్ ఏర్పాటు చేసి ఇంటి సభ్యులందరి బరువుని కొలిపించాడు బిగ్‌బాస్. అనంతరం వారిని బయట ఉంచి, ఇంట్లోకి అజ్ఞాతవాసులు వచ్చి కిచెన్‌లో ఉన్న ఫుడ్ ఐటమ్స్ అన్ని తీసుకెళ్లారు. దీంతో ఇంటి సభ్యులందరూ కామెడిగా గట్టిగా అరిచారు. డోర్స్ ఓపెన్ చేశాక ఇంట్లోకి వెళ్లి దాచుకున్న ఫుడ్ ఐటమ్స్ తినడం మొదలు పెట్టారు. దీంతో ఇంట్లో మిగిలిఉన్న ఆహార పదార్థాలన్నీ తీసుకురావాల్సిందిగా కెప్టెన్ జెస్సిని ఆదేశించాడు బిగ్‌బాస్. బిగ్‌బాస్ ఆర్డర్ వేయడంతో చేసేదేమిలేక తినే తిండిని ఇచ్చేశారు కంటెస్టెంట్స్. లోబో అయితే ఆపిల్‌ని దాచుకొని మరి తింటూ చివరకు ఇచ్చాడు. సన్నీ కూడా దాచుకున్న ఫుడ్‌ని చాటున తిన్నాడు. జంటలుగా విడిపోయారు కెప్టెన్సీ కంటెండర్ టాస్క్‌లో భాగంగా ఇంటి సభ్యులను జంటలుగా విడిపోవాలని ఆదేశించాడు బిగ్‌బాస్. జోడిని ఎంచుకునే చాయిస్‌ని ఇంటి సభ్యులకే ఇచ్చేశాడు. దీంతో జశ్వంత్-కాజల్, సిరి-షణ్ముఖ్, లోబో- నటరాజ్ మాస్టర్, రామ్-హమిదా, యానీ-శ్వేత, ప్రియా- ప్రియాంక, రవి-విశ్వ, సన్నీ-మానస్ విడిపోయారు. గెలవాలంటే తగ్గాల్సిందే.. ఈ వారం కెప్టెన్సీ పోటీదారులకు ‘గెలవాలంటే తగ్గాల్సిందే’టాస్క్ ఇచ్చాడు బిగ్‌బాస్. ఇందులో భాగంగా ఏ జంట అయితే అందరికంటే ఎక్కువగా బరువుని కోల్పోతారో వారే ఈ వారం కెప్టెన్సీ కంటెండర్‌గా నిలుస్తారు. సమయానుసారం బిగ్‌బాస్ మీకు కొన్ని చాలెంజర్స్ ఇస్తాడు బిగ్‌బాస్. దీంట్లో గెలిచిన జంటకు అర కేజీ బరువు తగ్గుతుంది. ఓడిన జంటకు అరకేజీ బరువు పెరుగుతుంది. ఇక టాస్క్ అనగానే.. జంటలన్నీ బరువు తగ్గేందుకు వర్కౌట్ స్టార్ట్ చేశాయి. హమిదా-శ్రీరామ్ జంట అయితే ఫుడ్‌తో పాటు వాటర్ కూడా తీసుకోవద్దని డిసైడ్ అయింది. ఫస్ట్ చాలెంజ్.. పట్టుకోండి చూద్దాం గెలవాలంటే తగ్గాల్సిందే టాస్క్‌లో భాగంగా తొలి చాలెంజ్‌గా ‘పట్టుకోండి చూద్దాం’అనే గేమ్ పెట్టాడు బిగ్‌బాస్. దీంట్లో భాగంగా.. పవర్ రూమ్ యాక్సెస్ పొందిన జంట..తమతో పోటీకి దిగబోయే జంటను ఎంచుకునే అవకాశం ఉటుంది. ఇందులో నటరాజ్ మాస్టర్-లోబో జంట పవర్ రూమ్ యాక్సెస్ పొంది శ్రీరామ్-హమిదాలను తమ పోటీదారులుగా ఎంచుకున్నారు. ఈ గేమ్‌లో శ్రీరామ్-హమిదా జంట విజయ సాధించింది. -
బిగ్‌బాస్: డేంజర్ జోన్లో ఆ ముగ్గురు, ఎలిమినేట్ అయ్యేది ఎవరంటే..
బిగ్‌బాస్ ఐదో సీజన్ రోజు రోజుకి రసవత్తరంగా మారింది. నామినేషన్ ప్రక్రియలో ఇంటి సభ్యుల అసలు రంగు బయటపడుతోంది. నాలుగో వారంలో హౌస్మేట్స్ ఒక్కొక్కరి బండారాలు బయటపెడుతూ నామినేట్ చేసుకున్నారు. ఈ వారం హయ్యెస్ట్‌గా 8 మంది(నటరాజ్ మాస్టర్, యానీ మాస్టర్, లోబో, రవి, ప్రియ, కాజల్, సిరి హన్మంత్, సన్నీ) ఉన్నారు. దీంతో ఈ వారం ఎవరు నామినేట్ అవుతారనే విషయంపై సోషల్ మీడియాలో తీవ్ర చర్చ జరుగుతోంది. ఈ వారం నామినేషన్ ఉన్న వారిలో రవి. సన్నీ, ప్రియ, సిరి, కాజల్‌లకు ఎలాంటి ఢోకాలేదు. ఎందుకంటే వారికి బయట ఫ్యాన్స్ ఎక్కువగా ఉన్నారు. గేమ్ పరంగా కూడా బాగానే ఆడుతున్నారు. ఎటోచ్చి ఈ వారం రిస్క్‌లో పడేది ఎవరంటే నటరాజ్ మాస్టర్, యానీ మాస్టర్, లోబోలు మాత్రమే. వీరిలో ఎక్కువగా నటరాజ్ మాస్టర్‌కే రిస్కు ఎక్కువ. ఆయన టాస్కుల్లో చక్కగా ఆడుతున్నప్పటికీ.. ప్రవర్తన మాత్రం అటు కంటెస్టెంట్స్‌ని, ఇటు ప్రేక్షకులను ఇరిటేట్ చేస్తుంది. (చదవండి: ఏడేళ్లు సహజీవనం చేశా, నా ఆస్తి అడిగాడు: సరయూ) ముఖ్యంగా ఈ వారం నామినేషన్ ప్రక్రియలో ఆయన దారుణంగా ప్రవర్తించాడు. పులితో వేట.. నాతో ఆట ప్రమాదం అంటూ మీసం తీప్పడం లాంటివి ఓవరాక్షన్‌గా అనిపించాయి. ఎవరైనా తనను నామినేషన్ చేస్తే చాలు తన వెనుక ఎవరో ఉన్నారని, అందుకే తనను నామినేట్ చేశారని ఆరోపించడం, హౌస్‌లో అంతా నటిస్తున్నారని, తాను మాత్రమే ఓపెన్‌గా ఉంటున్నానని తనకు తాను కితాబిచ్చుకోవడం లాంటివి నటరాజ్ మాస్టర్‌పై నెగెటివ్ ఇంప్రెస్ క్రియేట్ చేస్తున్నాయి. ఇంట్లో గుంటనక్క, ఊసరవెళ్లి, గొర్రెలు ఉన్నాయంటాడు.. వారెవరో చెప్పడం. ఇవన్ని ఇంటి సభ్యులతో పాటు ఆడియెన్స్‌కు కూడా మింగుడుపట్టడం లేదు. ఈ వారం కనుక అతని ప్రవర్తలో మార్పు లేకపోతే ఎలిమినేట్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఇక లోబో విషయానికి వస్తే.. ఇంట్లో ఉన్న ఏకైక ఎంటర్టైనర్ అతనే. టాస్కులు సరిగా ఆడకపోవడం అతని మైనస్. అలాగే నిన్నటి నామినేషన్ ప్రక్రియలో ప్రియపై గట్టిగా అరవడం, మీదమీదకు వెళ్లడం లోబో చేసిన అతిపెద్ద మిస్టేక్. అయితే ఆయన చేసే జోకులే అతన్ని కాపాడే చాన్స్ ఉంది. ఒకవేళ ఈ సారి లోబో ఎలిమినేట్ అయితే బిగ్‌బాస్ షో బోరింగ్ ఉంటే అవకాశాలు ఉన్నాయని నెటిజన్స్ అభిప్రాయపడుతున్నారు. ఈ లెక్కన లోబో కాస్త సేఫ్ జోన్లో ఉన్నట్లే తెలుస్తోంది. ఇక యానీ మాస్టర్ విషయానికొస్తే.. ఆమె అందరితో చక్కగా కనెక్ట్ అయినప్పటికీ..నామినేషన్‌కి ఆమె చెప్పే రీజన్ కంటెస్టెంట్స్‌తో పాటు ప్రేక్షకులకు కూడా నచ్చడం లేదు. ప్రతిసారి నా కంటే స్ట్రాంగ్ కంటెస్టెంట్ కనుక నామినేట్ చేస్తున్న అని యానీ చెప్పడం కరెక్ట్ కాదని నెటిజన్స్ అభిప్రాయపడుతున్నారు. ఈ లెక్కన ఆమె కూడా డేంజర్ జోన్లో ఉన్నట్లు కనిపిస్తుంది. అయితే బిగ్‌బాస్ హౌస్‌లో ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియదు. ఈ వారం ఏదైన అద్భుతాలు జరిగితే తప్ప ఈ ముగ్గురిలో ఒక్కరు ఎలిమినేట్ అవ్వడం పక్కా అని నెటిజన్స్ చర్చించుకుంటున్నారు. -
తలదించుకున్న రవి, చెప్పుతో కొట్టినా పడతానన్న లోబో
Bigg Boss Telugu 5, Episode 23: బిగ్‌బాస్ హౌస్‌లో కంటెస్టెంట్లను ఎప్పుడూ వెంటాడే గండం నామినేషన్స్. ఈ నామినేషన్స్‌లో ఇరుక్కున్నవాళ్లు వారమంతా బిక్కుబిక్కుమంటూ టెన్షన్‌తోనే గడపాల్సి వస్తుంది. నామినేట్ కాని ఇంటిసభ్యులు ఎంచక్కా జాలీగా గడుపుతూ ఇంకో వారం దాకా మన బెర్త్‌కు ఏ ఢోకా లేదని ధీమాగా ఉంటారు. నేటి(సెప్టెంబర్ 27) ఎపిసోడ్లో నామినేషన్స్ వాడివేడిగా జరిగాయి. ఒక్కొక్కరి బండారాలు బయటపెడుతూ నామినేట్ చేసుకున్నారు ఇంటిసభ్యులు. మరి ఎవరు ఎవరెవర్ని నామినేట్ చేశారు? హౌస్‌లో ఇంకా ఏమేం జరిగాయో చదివేద్దాం... నువ్వంటే ఇష్టం, ఎలా కనెక్ట్ అయ్యానో తెలీదు: హమీదా లహరి విషయంలో అమ్మ మీద ఒట్టేసి అబద్ధం ఎలా చెప్పానని యాంకర్ రవి తనలో తానే మథనపడ్డాడు. తర్వాత ఇంట్లోకి వచ్చిన అతిథి బేబీ బొమ్మను బిగ్‌బాస్ తిరిగి తీసుకున్నాడు. ఇక హమీదా.. నువ్వంటే నాకిష్టం, నీకు ఎలా కనెక్ట్ అయ్యానో తెలీదు అంటూ మరోసారి శ్రీరామ్ దగ్గర ప్రేమ ఊసులు మాట్లాడింది. అతడు మాత్రం ఇంకా వివరంగా చెప్పంటూ అసలు విషయం తెలుసుకునేందుకు ప్రయత్నించాడు. అనంతరం బిగ్‌బాస్ హౌస్‌లో నాలుగోవారం నామినేషన్ ప్రక్రియ ప్రారంభమైంది. నామినేట్ చేయాలనుకుంటున్న ఇద్దరు ఇంటిసభ్యుల ముఖాల్లోని ఒక భాగాన్ని తీసివేసి స్విమ్మింగ్ పూల్‌లో వేయాలని బిగ్‌బాస్ ఆదేశించాడు. చెప్పు తీసుకుని కొట్టు వింటాను, కానీ..: లోబో మొదటగా వచ్చిన ప్రియ.. తనతో సరిగా ఉండట్లేదని లోబో, మానస్‌ను నామినేట్ చేసింది. విశ్వ.. రవి, నటరాజ్ మాస్టర్‌ను నామినేట్ చేశాడు. లోబో.. నేను లైఫ్‌లో ఒకే ఒక అమ్మాయిని ప్రేమించా. నా లవ్ గురించి చెప్తుంటే నువ్వు అది సినిమా స్టోరీలా ఉందన్నావు. ఆ మాటతో నా ఖలేజా పగిలిపోయింది. నన్ను తిట్టు, చెప్పు తీసుకుని కొట్టు వింటా.. కానీ అలా మాట్లాడకు అంటూ ప్రియపై గయ్యిమని అరిచాడు. అతడు తన మీదకు అలా దూసుకురావడంతో షాకైన ప్రియ.. నాపై అరిచే హక్కు నీకు లేదని వార్నింగ్ ఇచ్చింది. ఆ టైంలో ఆకలేంటి?: లోబో అయినప్పటికీ వెనక్కు తగ్గని లోబో.. నేను ప్రేమించిన, టైంపాస్ చేయలే, అమ్మాయికి రెస్పెక్ట్ ఇచ్చిన అని చెప్తుండగా మధ్యలో అడ్డుకున్న ప్రియ.. తెలుస్తుంది అమ్మాయిలకు ఎంత గౌరవమిస్తావో అని కౌంటరిచ్చింది. జనాలవల్లే తానీ స్టేజీలో ఉన్నానంటూ అరిగిన టేపు రికార్డర్‌లా చెప్పిందే మరోసారి చెప్పాడు లోబో. అంతలోనే ఆకాశం వంక చూసి ఏడ్చేయడంతో రవి అతడిని ఓదార్చాడు. ఈ సీన్ చూసిన ప్రియ మనసులో ఒకటి పెట్టుకుని బయటకు ఒకటి మాట్లాడొద్దు అని చురకలంటించింది. తర్వాత అతడు సిరిని నామినేట్ చేస్తూ.. కాజల్ లవ్‌స్టోరీ చెప్తుండగా ఆకలేస్తోంది అని ఎలా అనగలిగావని విమర్శించాడు. ప్రతిసారి బస్తీ నుంచి వచ్చాననకు: చిరాకు పడ్డ షణ్ముఖ్ శ్రీరామ్.. లాస్ట్ వీక్ తనను నామినేట్ చేసిన శ్వేత, యానీ మాస్టర్‌ను నామినేట్ చేశాడు. తర్వాత షణ్ముఖ్.. మీ వల్ల ఇన్ఫ్లూయెన్స్ అవుతున్నానంటూ రవిని, ప్రియకు రెస్పెక్ట్ ఇవ్వలేదని లోబోను నామినేట్ చేశాడు. దీంతో లోబో మరోసారి తను పేదవాడినంటూ ఫ్లూటు వాయించాడు. దీంతో చిర్రెత్తిపోయిన షణ్ను ప్రతిసారి బస్తీ నుంచి, కింది నుంచి వచ్చానని చెప్పొద్దు, అందరం అక్కడి నుంచే వచ్చామంటూ అతడి నోరు మూయించాడు. తర్వాత వచ్చిన కాజల్.. నామినేషన్స్‌ను వ్యక్తిగతంగా తీసుకుంటారని నటరాజ్ మాస్టర్‌ను, సేఫ్ గేమ్ ఆడొద్దంటూ సన్నీని నామినేట్ చేసింది. మధ్యలో దూరి ఏదో ఒకటి అనేయకండి: మానస్ హెచ్చరిక లోబో ఎప్పుడెలా ఉంటాడో ఎవరికీ తెలీదు, అప్పుడప్పుడు కామెడీ కూడా లిమిట్ దాటుతుంది. మీరు సింపథీకి ట్రై చేస్తున్నారనిపిస్తోందంటూ సిరి లోబోను, తర్వాత యానీ మాస్టర్‌ను నామినేషన్లోకి పంపించింది. మానస్.. నటరాజ్ మాస్టర్‌ను నామినేట్ చేయగా ఇద్దరి మధ్య పెద్ద గొడవే జరిగింది. ఇద్దరు మాట్లాడినప్పుడు మధ్యలో దూరి ఏదో ఒకటి అనేయకండని మానస్ హెచ్చరించాడు. అసభ్యకరమైన భాష వాడొద్దని లోబో ఫొటోలో నుంచి ఓ ముక్కను విసిరేశాడు. శ్వేత.. లోబో, రవిని; హమీదా.. లోబో, నటరాజ్ మాస్టర్‌ను నామినేట్ చేశారు. డైరెక్ట్‌గా చేయి పెట్టడం నచ్చలేదు: ప్రియాంక సింగ్ నటరాజ్ మాస్టర్.. అతిగా నటించకూడదు, నువ్వు వీక్ అనిపిస్తోంది అంటూ విశ్వను చిన్నచూపు చూస్తూ నామినేట్ చేశాడు. నువ్వెవరివి నన్ను నటిస్తున్నావని డిసైడ్ చేయడానికి అని విశ్వ ఫైర్‌కావడంతో మాస్టర్ మీసం మెలేస్తూ మరింత రెచ్చగొట్టాడు. 'సింహంతో వేట నాతో ఆట రెండూ ప్రమాదకరమే, అది అడవిలో ఉంటది, ఇది బిగ్‌బాస్ హౌస్‌లో ఉంటుంది' అని డైలాగులు వల్లె వేయడంతో కాజల్ ఫక్కున నవ్వేసింది. మీకోసం వ్యతిరేకంగా ఒక గ్రూప్ ఫామ్ అవుతుందన్న ఆలోచనే తప్పని నొక్కి చెప్పింది, కానీ అతడు వినిపించుకోనేలేదు. ఇక తనను ఇన్ఫ్లూయెన్స్ చేయొద్దని హెచ్చరిస్తూ రవిని నామినేట్ చేశాడు మాస్టర్. ప్రియాంక సింగ్.. సోఫాలో నిలబడ్డప్పుడు మీరు డైరెక్ట్‌గా చేయి పెట్టారు. అది నాకు నచ్చలేదంటూ లోబోను తర్వాత కాజల్‌ను నామినేట్ చేసింది. పశ్చాత్తాపంతో కుమిలిపోయిన యాంకర్ రవి అనంతరం వచ్చిన రవి.. అందరి ముందుకు రావాలంటేనే సిగ్గుగా ఉందని తలదించుకున్నాడు. శనివారం నా జీవితంలోనే వరస్ట్ రోజు. నేను ముగ్గురికి.. ప్రియ, లహరి, అమ్మకు సారీ చెప్తున్నాను. ప్రియకు చెప్పిన మాటను చెప్పలేదంటూ అమ్మ మీద ఒట్టేశాను అని బాధతో పశ్చాత్తాపపడ్డాడు. తనను కొట్టిందంటూ కాజల్‌ను, మీరు గుంటనక్క అని తననే అన్నారంటూ నటరాజ్ మాస్టర్‌ను రవి నామినేట్ చేశాడు. తర్వాత యానీమాస్టర్ తనను నామినేట్ చేసిన శ్రీరామ్, సిరి ఫొటోల ముక్కలు పూల్‌లో వదిలేసింది. సన్నీ.. తనను పదేపదే సేఫ్ గేమ్ ఆడుతున్నారన్న ప్రియ, కాజల్‌ను; జెస్సీ.. ప్రియాంక, రవిని నామినేట్ చేశారు. మొత్తంగా ఈ నాలుగో వారం నటరాజ్, లోబో, రవి, ప్రియ, కాజల్, సిరి, సన్నీ, యానీ మాస్టర్ నామినేట్ అయినట్లు బిగ్‌బాస్ ప్రకటించాడు. -
నామినేషన్స్: లోబోకు ఇచ్చిపడేసిన సిరి, షణ్ముఖ్
Bigg Boss Telugu 5 Promo: Housemates Fire on Nataraj Master: బిగ్‌బాస్ హౌస్‌లో నటరాజ్ మాస్టర్ ఎప్పుడూ ఎవరో ఒకరిని తిడుతూనే కనిపిస్తాడు. వాళ్లు గేమ్ సరిగా ఆడట్లేదని, వీళ్లు హౌస్‌కు కరెక్ట్ కాదంటూ తెగ చిరాకు ప్రదర్శిస్తుంటాడు. తను చెప్పింది అందరూ ఆచరించాలని చూస్తాడు, కానీ అక్కడ కనీసం అతడు చెప్పేది కూడా ఎవరూ వినిపించుకోరు. హౌస్‌లో గుంటనక్క, ఊసరవెల్లి ఉన్నారంటాడు, కానీ వాళ్లెవరనేది బయటపెట్టడు. అయితే అతడు ఎప్పుడు? ఎందుకు? ఎవరిని తిడుతున్నారో అర్థం కాని కంటెస్టెంట్లు ఈ సారి నామినేషన్లో మాస్టర్‌ను గట్టిగానే వేసుకున్నట్లు కనిపిస్తోంది. నామినేషన్స్‌ను వ్యక్తిగతంగా తీసుకుంటారంటూ కాజల్ నటరాజ్ మాస్టర్‌ను నామినేట్ చేసింది. తనతో ఏదైనా సమస్య ఉంటే నేరుగా వచ్చి చెప్పమని అభ్యర్థించాడు మానస్. అటు హమీదా కూడా తన పనిని ఎవరైనా ఆపితే నచ్చదంటూ మాస్టర్‌ను నామినేట్ చేసింది. విశ్వ, మాస్టర్‌కు మధ్య కూడా హీట్ డిస్కషన్ నడవగా 'సింహంతో వేట, నాతో ఆట రెండూ ప్రమాదమే' అని మాస్టర్ ఓ డైలాగ్ వదిలాడు. దీంతో మరింత చిర్రెత్తిపోయిన విశ్వ.. 'ఎహె, ఇవన్నీ నీ దగ్గర పెట్టుకో' అని చిరాకు ప్రదర్శించాడు. నామినేషన్స్‌లో లోబో మరోసారి తను కింది స్థాయి నుంచి వచ్చానంటూ చెప్పడం ఆరంభించగా షణ్ముఖ్ మధ్యలోనే అడ్డుకున్నాడు. అందరం అక్కడి నుంచే వచ్చామని కౌంటరిచ్చాడు. ప్రతిసారి బస్తీ నుంచి, కింది స్థాయి నుంచి వచ్చానని చెప్పడం తప్పని దుమ్ము దులిపాడు. అటు సిరి కూడా నువ్వు సింపతీ కోసం ట్రై చేస్తున్నావనిపిస్తుందంటూ లోబోను నామినేట్ చేసింది. -
బిగ్‌బాస్: నాలుగోవారం నామినేషన్స్‌లో ఎనిమిది మంది!
'బిగ్‌బాస్‌లో అన్ని టాస్కుల యందు నామినేషన్ టాస్కు వేరయా!' అంటారు బుల్లితెర అభిమానులు. ఎందుకంటే అప్పుడే కదా కంటెస్టెంట్లు కొట్టుకునేది, తిట్టుకునేది, అరుచుకునేది.. ఆ సమయంలోనే కదా వారి నిజస్వరూపాలేంటో తెలుసుకునేది! అందుకనే బిగ్‌బాస్ వీక్షకులకు మండే వచ్చిందంటే చాలు పండగే! టాలీవుడ్ కింగ్ నాగార్జున వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న బిగ్‌బాస్ తెలుగు ఐదో సీజన్ చూస్తుండగానే మూడు వారాలు పూర్తి చేసుకుంది. ఇప్పటివరకు సరయు, ఉమాదేవి, లహరి షారి వరుసగా ఎలిమినేట్ అయ్యారు. తాజాగా నాలుగో కంటెస్టెంట్‌ను బయటకు పంపిచేందుకు నామినేషన్స్ జరగనున్నాయి. అయితే ఈ నామినేషన్ల పర్వానికి సంబంధించిన షూటింగ్ నిన్ననే పూర్తి కావడంతో ఈవారం ఎనిమిది మంది నామినేట్ అయ్యారంటూ తాజాగా ఓ లిస్టు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఈ లిస్టులో సిరి హన్మంత్, ప్రియ, యానీ మాస్టర్, ఆర్జే కాజల్, యాంకర్ రవి, వీజే సన్నీ, నటరాజ్ మాస్టర్ ఉన్నారు. మరి నాలుగోవారం నామినేషన్లో ఉన్నది ఈ 8 మందేనా? అన్నదానిపై స్పష్టత రావాలంటే నేటి ఎపిసోడ్ వచ్చేంతవరకు వేచి చూడాల్సిందే! -
ప్రియపై మండిపడ్డ లోబో, అరవద్దంటూ నటి వార్నింగ్
బిగ్‌బాస్ షోలో కంటెస్టెంట్ల అసలు రంగు బయటపడేది నామినేషన్లోనే. ఈ ప్రక్రియలోనే కంటెస్టెంట్ల మధ్య గొడవలు జరుగుతుంటాయి. కొన్నిసార్లు ఈ తగవులు తారాస్థాయికి చేరుకోవడంతోపాటు వీకెండ్లో నాగార్జున వచ్చి సర్ది చెప్తే కానీ ఆ కొట్లాటలకు కళ్లెం పడదు. మొత్తానికి బిగ్‌బాస్ తెలుగు ఐదో సీజన్లో నాలుగోవారం నామినేషన్‌కు రంగం సిద్ధమైంది. ఈ మేరకు తాజా ప్రోమో రిలీజైంది. ఇందులో విశ్వ, నటరాజ్ మాస్టర్ మధ్య మాటల యుద్ధం జరగనున్నట్లు తెలుస్తోంది. 'బయట యాక్టింగ్ చేస్తావు, అదే యాక్టింగ్ హౌస్‌లోనూ చేస్తున్నావు అని చెప్పడానికి నువ్వెవరు?' అని సూటిగా ప్రశ్నించాడు విశ్వ. దీనికి నటరాజ్ మాస్టర్ బరాబర్ అలాగే మాట్లాడతానని దురుసుగా సమాధానమిచ్చాడు. శ్రీరామచంద్ర.. శ్వేత తనకు వెన్నుపోటు పొడుస్తోందని అభిప్రాయపడ్డాడు. ఇక లోబో ప్రియను నామినేట్ చేస్తూ చెప్పిన కారణం చాలామందికి మింగుడు పడటం లేదు. తొలి ప్రేమ సంగతులు చెప్పమని బిగ్‌బాస్ ఇచ్చిన టాస్కులో లోబో తన ఫస్ట్ లవ్ గురించి చెప్పాడు. అయితే ప్రియ దాన్ని సినిమా స్టోరీలా ఉందని కామెంట్ చేయడం అతడికి నచ్చలేదు. ఇదే విషయాన్ని నామినేషన్లో ప్రస్తావిస్తూ ఆమెపై ఒంటికాలిపై లేచాడు. తన మీదకు అరవద్దంటూ ప్రియ హెచ్చరిస్తున్నా అతడు మాత్రం నేను ఇలానే అరుస్తానంటూ ఆమె మీదకు వెళ్లాడు. అంతలా చిందులు తొక్కిన లోబో చివర్లో ఏడ్చేయడంతో రవి వచ్చి ఓదార్చాడు. ఇదంతా చూసిన ప్రియ.. మనసులో ఒకటి పెట్టుకుని బయటకు ఇంకోటి మాట్లాడొద్దు అని చురకలు అంటిస్తూనే ఎమోషనల్ అయింది. అయితే ఈ ప్రోమో చూసిన నెటిజన్లు.. యాంకర్ రవి, లోబో కలిసి గేమ్ ఆడుతున్నట్లు అనిపిస్తోందని అభిప్రాయపడుతున్నారు. ఎలిమినేట్ అవుతున్న ప్రతి కంటెస్టెంటు సిరి, షణ్ను కలిసి ఆడుతున్నారంటున్నారు గానీ ప్రతిసారి ఒకరినొకరు నామినేట్ చేసుకుంటూనే మళ్లీ కలిసిపోతున్న యాంకర్ రవి, లోబో కలిసి గేమ్ ఆడుతున్నట్లు అనిపిస్తోందని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. రవిని ఏమైనా అంటే లోబోకు కోపం వస్తుందని, అందుకే ప్రియను నామినేట్ చేశాడని కామెంట్లు చేస్తున్నారు. ఏదేమైనా నేటి నామినేషన్లో ఇంకా ఏయే కంటెస్టెంట్ల మధ్య అగ్గి రాజుకుందనేది తెలియాలంటే మరికొద్ది గంటలు వేచి చూడాల్సిందే! -
ఉమాదేవి అవుట్, కింద పడి ఏడ్చేసిన నటరాజ్ మాస్టర్
Bigg Boss Telugu 5, Episode 15: సండేను ఫండేగా మార్చేందుకు రెడీ అయిన నాగార్జున ఆడవాళ్లు, మగవాళ్లకు డ్యాన్స్ కాంపిటీషన్ నిర్వహించాడు. అమ్మాయిలు ఎంచుకునే కప్పులో ఎవరి పేరుంటుందో వాళ్లతో కలిసి డ్యాన్స్ చేయాల్సి ఉంటుందని చెప్పాడు. ఈ క్రమంలో ఉమాదేవి - షణ్ముఖ్, లహరి - జెస్సీ, ప్రియ- యాంకర్ రవి, హమీదా - శ్రీరామ్, ప్రియాంక - మానస్, యానీ మాస్టర్ - విశ్వ, సిరి - నటరాజ్ మాస్టర్ పోటీపడుతూ డ్యాన్స్ చేశారు. ఈ జంటలలో ఎక్కువగా అబ్బాయిలే ఎక్కువ స్కోర్ చేశారు. ఓవరాల్‌గా అబ్బాయిలకు ఎక్కువ పాయింట్లు వచ్చినప్పటికీ బిగ్‌బాస్ మాత్రం అమ్మాయిలు గెలిచినట్లు ప్రకటించి మేల్ కంటెస్టెంట్లకు షాకిచ్చాడు. తర్వాత నాగ్ కాజల్ సేఫ్ అయినట్లు వెల్లడించాడు. హౌస్‌మేట్స్‌కు మటన్ పంపిస్తానన్న నాగ్ ఇక కాజల్ తనకు మటన్ బిర్యానీ తినాలని ఉందని మనసులోని కోరికను బయటపెట్టింది. దీంతో నాగ్ అందులో ఏముంది? వండుకుని తినంటూ పంచ్ ఇచ్చాడు. కానీ అంతలోనే హౌస్మేట్స్ అందరికీ మటన్ పంపిస్తానని కాకపోతే దాన్ని కాజల్ మాత్రమే వండాలని ట్విస్టిచ్చాడు. దీంతో కాజల్ చచ్చాన్రా దేవుడా అనుకున్నా మిగతా హౌస్మేట్స్ మాత్రం ఎలాగైనా ఆమెతో వండించి తీరతాం అని మనసులోనే ధృడంగా అనుకుని ఉంటారు. రాత్రిళ్లు నిద్రపోకుండా తిరిగే దెయ్యం సిరి అనంతరం నాగ్.. ఇంటిసభ్యులతో 'ఇంట్లో ఉన్న దెయ్యం' ఆట ఆడించాడు. మొదటగా ప్రియ.. రాత్రి సరిగా నిద్రపోకుండా దెయ్యంలా అటూ ఇటూ తిరుగుతుందని సిరికి దెయ్యం స్టిక్కర్ అతికించింది. మానస్.. శ్రీరామ్ తీసుకునే కొన్ని నిర్ణయాలు తనకు ఇమ్మేచ్యూర్‌డ్‌గా అనిపించాయంటూ అతడికి స్టిక్కర్ అతికించాడు. లహరి.. ఏదైనా గట్టిగా అరుస్తూ చెప్తుందని ఉమాదేవిని దెయ్యంతో పోల్చింది. హమీదా.. యానీ మాస్టర్‌ను దెయ్యం అనేసింది. శ్రీరామ్.. ఓటమిని తీసుకోలేడంటూ మానస్‌ను దెయ్యంగా అభిప్రాయపడ్డాడు. అందరి మీదా పగ, కానీ దెయ్యం మాత్రం ఆవిడే సన్నీ.. తనకు అందరి మీదా పగ ఉందంటూనే చివరగా ప్రియాంక సింగ్ నుదుటన స్టిక్కర్ అతికించాడు. విశ్వ.. కాజల్ దెయ్యంలా తన వెనకాల పడుతుందన్నాడు. ప్రియాంక.. లేట్‌గా పడుకునే లోబోను దెయ్యమని పేర్కొంది. జెస్సీ, శ్వేత, ఉమాదేవి, లోబో.. సిరిని; యానీ మాస్టర్.. హమీదాను; కాజల్, నటరాజ్ మాస్టర్.. విశ్వను; సిరి.. ఉమాదేవిని దెయ్యంగా అభివర్ణించారు. సన్నీ విషయంలో తప్పు చేశానంటూ షణ్ముఖ్ తనను తానే దెయ్యమని చెప్పుకున్నాడు. అది కుదరదని నాగ్ తెగేసి చెప్పడంతో సిరిని దెయ్యంగా అభివర్ణించాడు. తర్వాత ప్రియ, నటరాజ్ మాస్టర్ సేఫ్ అయ్యాడు. ఉమాదేవి ఎలిమినేట్ అయింది. అయితే ఇక్కడిదాకా వచ్చాను, ఏదో ఒకటి సాధించే వెళ్లాలి అంటూ నటరాజ్ మాస్టర్ కిందపడి వెక్కి వెక్కి ఏడ్చేశాడు. ఇక ఉమ వెళుతుంటే లోబో ఉబికి వస్తున్న కన్నీళ్లను ఆపుకునే ప్రయత్నం చేశాడు. అనంతరం రవి పుట్టిన రోజును పురస్కరించుకుని తన భార్య పంపిన లెటర్ చదివి ఎమోషనల్ అయ్యాడు. అలాగే తనకు గిఫ్ట్ ఇచ్చిన ఉంగరాన్ని ముద్దాడాడు. -
బిగ్‌బాస్: ఉమాదేవి ఎలిమినేషన్‌కు కారణాలివే!
నాకు ఒకరు ఎదురొచ్చినా, నేను ఒకరికి ఎదురెళ్లినా వాళ్లకే రిస్కు.. ఈ డైలాగ్ బిగ్‌బాస్ హౌస్‌లో ఉమాదేవికి సరిగ్గా సరిపోతుంది. ఆమెతో మాట్లాడటం కాదు కదా, ఆమె పక్కన కూచోవాలన్నా కూడా వణికిపోతుంటారు హౌస్మేట్స్. కానీ నామినేషన్స్‌లో మాత్రం ఈ భయాన్ని పక్కనపెట్టి ఆమె మీద ఉన్న కోపాన్నంతా బయటకు కక్కుతుంటారు. అయితే మాటకు మాట, దెబ్బకు దెబ్బ సమాధానంగా ఇవ్వడంలో ఆమెను మించినవాళ్లు లేరు. మరి అలాంటి ఉమాదేవి రెండో వారం ఎలిమినేట్ అయింది. కాదు, ఎలిమినేట్ చేసి ప్రేక్షకులే పంపించివేశారు. అందుకు గల కారణాలేంటో చూసేద్దాం.. నామినేషన్ సిరి, యానీ మాస్టర్, షణ్ముఖ్, విశ్వ.. రెండోవారంలో ఉమాదేవిని నామినేట్ చేశారు. అయితే ఇక్కడ విశ్వ చెప్పిన కారణమేంటంటే.. నాగార్జున ఉమాదేవి కోసం ప్రత్యేకంగా ఆలూ కూర పంపించి.. దీన్ని ఆమె మాత్రమే తినాలని, వేరేవాళ్లకు పంచకూడదని స్పష్టం చేశాడు. అయితే హౌస్‌లో ఓరోజు కూర లేకపోతే నాగ్ పంపించిన ఆలూ కూర ఇవ్వమన్నా ఉమాదేవి అందుకు అంగీకరించలేదంటూ విశ్వ ఆమెను నామినేట్ చేశాడు. నాగ్‌కు ఇచ్చిన మాటకు కట్టుబడే ఆ కూరను ఎవరికీ షేర్ చేయలేకపోయానంది ఉమ. నిజానికి ఆమె చెప్పిన పాయింట్ కరెక్టే, కానీ.. మాట్లాడేటప్పుడు బూతులు దొర్లడంతో అభాసుపాలవక తప్పలేదు. ముక్కు మీద కోపం, నోరు తెరిస్తే బూతులు కోపం వెనక సరైన కారణం ఉంటే అంగీకరిస్తారు ప్రేక్షకులు. కానీ కోప్పడటమే పనిగా పెట్టుకుంటే ఎవరికైనా విసుగు రాక తప్పదు. కనిపించిన ప్రతి కంటెస్టెంట్‌తో కయ్యానికి కాలు దువ్వడమే కాక నోటికొచ్చిన బూతులు మాట్లాడటమే ఆమెను నిందలపాలు చేసింది. ఆ బూతులకు బిగ్‌బాస్ బీప్ వేసినప్పటికీ ఫ్యామిలీ ఆడియన్స్‌కు ఇబ్బందిగా అనిపించింది. దీంతో ఆ వర్గం ఓట్లు బాగా తగ్గిపోయాయి. నిబంధనను తుంగలో తొక్కిన ఉమ బిగ్‌బాస్ హౌస్‌లో హింసకు తావు లేదన్న నిబంధనను తుంగలో తొక్కింది ఉమ. కెప్టెన్సీ కంటెండర్స్ టాస్కులో ప్రియాంక సింగ్‌ను కిందకు తోసేసింది. దీనికి సంబంధించిన వీడియో కొన్నిరోజులపాటు సోషల్ మీడియాలో తెగ వైరల్ అయింది. అంతేకాకుండా ఉమాదేవి కొట్టిందంటూ పలువురు లేడీ కంటెస్టెంట్లు కూడా ఆమెపై ఆరోపణలు చేయడం పెద్ద మైనస్‌గా మారింది. ఈ తప్పులన్నింటినీ సరిదిద్దుకునేలోపు ఆమె ఎలిమినేట్ అయింది. అయితే ఇప్పుడిప్పుడే గొడవలు తగ్గించేసి, ఇకపై బూతులు కూడా మాట్లాడనని శపథం చేసిన ఉమాదేవికి మరో ఛాన్స్ ఇవ్వకుండా అప్పుడే హౌస్ నుంచి పంపించేయడాన్ని చాలామంది తప్పుపడుతున్నారు. హౌస్‌లో ఉన్న చాలామందితో పోలిస్తే ఉమాదేవి బెటర్ అని, ఆమె కంటెంట్ ఇవ్వడంతో పాటు ఎంటర్టైన్ చేసిందని కామెంట్లు చేస్తున్నారు. మొదటి వారంలో అందరినీ బెదరగొట్టిన ఉమా, రెండో వారంలో మాత్రం తన రూటు మార్చుకుని లోబోతో కామెడీ చేస్తూ అదరగొట్టిందంటున్నారు. కానీ అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. బిగ్‌బాస్ ఐదో సీజన్‌కు బైబై చెప్పేసింది. -
వీడియో చూపించిన బిగ్‌బాస్: సిగ్గుతో తలదించుకుని సారీ చెప్పిన సిరి
Bigg Boss Telugu 5, Episode 14: వీకెండ్ వచ్చిందంటే చాలు అత్యంత సుందరంగా ముస్తాబవుతారు హౌస్మేట్స్. వాళ్ల అందాలను చూసి మెచ్చుకునే నాగ్ హౌస్‌లో చేసిన తప్పొప్పులను ఎత్తి చూపుతూ చీవాట్లు కూడా పెడతాడు. దీంతో అప్పటిదాకా ఒకరి మీద ఒకరు నిప్పులు చెరిగిన కంటెస్టెంట్లు నాగ్ రాగానే గప్‌చూప్ అయిపోతుంటారు. ఇదిలా వుంటే నేటి (సెప్టెంబర్ 18) ఎపిసోడ్లో రామ్‌చరణ్, మాస్ట్రో టీమ్.. నితిన్, నభా నటేష్, తమన్నా ముఖ్య అతిథులుగా వచ్చి సందడి చేశారు. ఆ విశేషాలేంటో చదివేయండి.. సాయిధరమ్ తేజ్ కోలుకుంటున్నాడు: రామ్ చరణ్ బిగ్‌బాస్ హమీదాతో ట్రయాంగిల్ ప్లాన్ చేస్తున్నట్లు కనిపించగా లహరి మాత్రం తాను అందరినీ అన్నయ్య అని పిలవడానికి రెడీ అంటోంది. ఇంతలో సన్నీని జైలు నుంచి విడుదల చేశారు. ఇక లోబో, ఉమాదేవి రొమాన్స్ చేసుకోవడం చూసిన రవి, సిరి పడీపడీ నవ్వారు. ఆ తర్వాత హాట్‌స్టార్‌కు బ్రాండ్ అంబాసిడర్‌గా ఎంపికైన రామ్‌చరణ్ స్టేజీ మీదకు వచ్చాడు. ఇంత అందంగా, ఎంతో ఫిట్‌గా ఉన్న నాగ్‌ను అన్న అనే పిలుస్తానన్నాడు. సాయిధరమ్ తేజ్ గురించి చెప్తూ అతడు కోలుకుంటున్నాడని, అతడి ఆరోగ్యం గురించి భయపడాల్సిన పని లేదని స్పష్టం చేశాడు. మా అక్క సంగీత్‌కు కొరియోగ్రాఫర్ యానీ మాస్టరే.. రామ్‌చరణ్‌ను చూసి సర్ప్రైజ్ అయిన ఇంటిసభ్యులు లేచి నిలబడి చప్పట్లు కొట్టారు. ఈ సందర్భంగా చెర్రీ.. యానీ మాస్టర్‌ను చూసి.. తన అక్క సంగీత్‌కు ఈవిడే కొరియోగ్రఫీ చేసిందని మెచ్చుకున్నాడు. ఇవాళ తాను లోబోలాగా డ్రెస్ వేసుకుని వచ్చాననడంతో లోబో గాల్లో తేలిపోయాడు. తర్వాత నాగ్.. ఇంటి సభ్యులను పరిచయం చేస్తూ.. ఉమాదేవి.. మంచి మనిషే కానీ అప్పుడప్పుడూ బూతులు మాట్లాడుతుందన్నాడు. శ్వేత.. పైకి సాఫ్ట్‌గా మాట్లాడుతున్నా మీద పడి కొట్టేసేంత వైల్డ్ అని పేర్కొన్నాడు. బయటకొచ్చాక కలుద్దామంటూ పింకీకి ఆఫర్ నటరాజ్ మాస్టర్ తన జీవితంలో జరిగిన మర్చిపోలేని అనుభూతి గురించి చెప్తూ.. ఒక దగ్గర డిన్నర్ జరుగుతుంటే రామ్‌చరణ్ తనకు ప్లేట్లో ఫుడ్ పెట్టి తీసుకొచ్చి ఇచ్చాడని భావోద్వేగానికి లోనయ్యాడు. తర్వాత చెర్రీ మాట్లాడుతూ.. యాంకర్ రవి కాస్త ఏడిపించడం తగ్గించాలని సూచించాడు. ప్రియాంక.. చెర్రీకి తానో పెద్ద అభిమానిని అని, మీతో ఫొటో దిగాలనుందని మనసులో మాట బయటపెట్టింది. దీంతో చెర్రీ.. బయటకొచ్చాక తప్పకుండా కలుద్దామన్నాడు. అయితే ఈ యంగ్ హీరోను రెండు రోజులు బిగ్‌బాస్ హౌస్‌లో ఉంచేసుకుంటామని ప్రియ తన కోరిక వెలిబుచ్చింది, కానీ దీనికి రాజమౌళి ఒప్పుకోడని కౌంటరిచ్చాడు నాగ్. ఇక షణ్ముఖ్ చెర్రీకి గాల్లో ముద్దులు పంపాడు. తనకోసం ఓ పాట పాడమని చెర్రీ అడగడంతో శ్రీరామ్ అందుకు వెంటనే ఓ పాటందుకున్నాడు. కాజల్‌ను అందరూ పనిమనిషిని చేశారని నాగ్ చెప్పగా పని చేసే తను పనిమంతురాలు అని ప్రశంసించాడు చెర్రీ. ఇక్కడ కూడా అవసరమా? నితిన్ పరువు తీసిన చెర్రీ తర్వాత నాగ్ స్థానంలో హోస్టింగ్ చేసిన చరణ్.. మాస్ట్రో టీమ్‌ను స్టేజీ మీదకు పిలిచాడు. ఇంకా తన పాత్ర నుంచి బయటకు రాని నితిన్ అంధుడిగానే నటిస్తూ వచ్చాడు. ఇది చూసిన చెర్రీ.. ఇక్కడ కూడా అవసరమా? అదీ నాముందు! అనడంతో వెంటనే నితిన్ నార్మల్ అయిపోయాడు. ఈ సందర్భంగా నభా నటేష్, తమన్నా, చెర్రీ, చరణ్ అంతా కలిసి స్టెప్పులేస్తూ స్టేజీని ఓ ఊపు ఊపేసి వీడ్కోలు తీసుకున్నారు. అప్పుడు రోజుకు 60 సిగరెట్లు, ఇప్పుడు 7 మాత్రమే ఇక ఇంటిసభ్యులను సెట్ చేయడానికి సిద్ధమైన నాగ్ టాస్కుల్లో ప్రాణం పెట్టారు కానీ బిహేవియర్ మాత్రం బాలేదని పెదవి విరిచాడు. ఎవరెవరు తమ బిహేవియర్ బాలేదు అనుకుంటున్నారో లేచి నిలబడమనగానే ఉమాదేవి, సిరి, లోబో, శ్వేత, యానీ, శ్రీరామ్, సన్నీ లేచి నిలబడ్డారు. మొదట ఉమా.. నామినేషన్ సమయంలో అసభ్యకరంగా మాట్లాడాను అని తన తప్పు ఒప్పుకుంది. దీనిపై నాగ్ క్లాస్ పీకడంతో ఉమ గుంజీలు తీస్తూ క్షమాపణలు కోరింది. యానీ మాస్టర్ నిలబడగా.. అరవడం తప్పేం కాదన్నాడు నాగ్. తర్వాత లోబో వంతు రాగా.. గతంలో రోజుకు 60 సిగరెట్లు తాగేవాడివి అని నాగ్ గుర్తు చేయడంతో ఇప్పుడు ఏడు మాత్రమే తాగుతున్నానని చెప్పాడు. షో అయిపోయేలోపు సిగరెట్ మానేస్తానని ప్రామిస్ చేశాడు. తప్పైందంటూ చెంపలు వాయించుకున్న శ్వేత నామినేషన్లో అందరికీ మానవత్వం లేదన్నావు, మరి హమీదా ముఖం మీద పెయింట్‌తో ఎందుకు కొట్టావు? అని నాగ్ ప్రశ్నించడంతో శ్వేత అవమాన భారంతో చచ్చిపోయింది. అది కచ్చితంగా తప్పే అని అంగీకరించిన శ్వేత అందరి ముందే రెండుసార్లు చెంపదెబ్బలు కొట్టుకుంది. తర్వాత సన్నీ.. తనను వరస్ట్ పర్ఫామర్‌గా ఎందుకు ఎంచుకున్నారో చెప్పమని నాగ్‌ను ఆవేదనతో అర్థించాడు. దీంతో నాగ్.. సిరి వైపు చూస్తూ.. సన్నీ నీ షర్ట్ లోపల చేయి పెట్టి బెటాన్ తీశాడా? అని ప్రశ్నించాడు. అందుకామె అవునని చెప్పింది. మరింత క్లారిటీ కోసం షణ్ముఖ్‌ను అడగ్గా అతడు కూడా సన్నీ చేయి పెట్టాడు అని పేర్కొన్నాడు. దీంతో నాగ్ వాళ్లకో క్లారిటీ ఇవ్వడానికి టాస్క్‌లోని వీడియో ప్లే చేసి చూపించగా సన్నీ.. సిరి షర్ట్ లోపల చేయి పెట్టలేదని రుజువైంది. దీంతో సిరి అతడికి సారీ చెప్పి హగ్గిచ్చింది. అయితే నిజానిజాలు తెలుసుకోకుండా ఎవరి క్యారెక్టర్‌ను తప్పు పట్టకూడదని నాగ్ హెచ్చరించాడు. ఆ తర్వాత యానీ మాస్టర్, లోబో, ప్రియాంక సేఫ్ అయినట్లు ప్రకటించాడు. -
బిగ్‌బాస్: అర్ధ పావు భాగ్యం కామెడీతో అల్లాడిస్తుందిగా
బిగ్‌బాస్ తెలుగు ఐదో సీజన్లో ఎప్పటికప్పుడు సమీకరణాలు మారిపోతున్నాయి. కూల్ అనుకున్నవాళ్లు ఉగ్రరూపం చూపిస్తుంటే అమాయకులు అనుకున్నవాళ్లు యాటిట్యూడ్ చూపిస్తున్నారు. ఇక బూతులు మాట్లాడుతూ షోను పెంటపెంట చేస్తున్న కార్తీకదీపం ఫేమ్ ఉమాదేవిని ఆపడం మాత్రం ఎవరి వల్లా కావట్లేదు. అయితే ఆమెకు కాస్త నచ్చజెప్పుదామని చూసిన సన్నీ.. కాస్త ప్రేమగా మాట్లాడమని సలహా ఇవ్వగా.. కోపంలోనే ప్రేమను వెతుక్కోమని బదులిచ్చింది. తరచూ హౌస్‌మేట్స్‌తో గొడవలు పెట్టుకునే ఆమెకు నెటిజన్లు గయ్యాలి గంప అన్న బిరుదు కూడా ఇచ్చేశారు. కానీ అదేంటో విచిత్రంగా నేటి ఎపిసోడ్లో మాత్రం ఉమా తన కోపాన్ని అటకెక్కించి అందరినీ నవ్వించాలని కంకణం కట్టుకున్నట్లు కనిపిస్తోంది. ఈ మేరకు తాజాగా ఓ ప్రోమో రిలీజైంది. ఇందులో లోబో, ఉమా వేర్వేరు స్కిట్లతో నవ్వించడానికి రెడీ అయ్యారు. ముందుగా లోబో.. పింకీతో కలిసి తెగ నవ్వించాడు. తర్వాత ఉమా.. సిరికి షణ్నుకు ముడి పెడుతూ కామెడీ పండించింది. మరి వీరి స్కిట్లు చూసి ఎంజాయ్ చేయాలంటే ఎపిసోడ్ వచ్చేంతవరకు వేచి చూడాల్సిందే! అయితే ఈ ప్రోమో చూసిన జనాలు.. హౌస్‌లో ఉమా చేసే ఎంటర్టైన్మెంట్ వేరే లెవల్లో ఉంటుందని కామెంట్లు చేస్తున్నారు. తను ఉంటేనే హౌస్‌కు కళ అని, ఈ వారం తను ఎలిమినేట్ కాకూడదని కోరుకుంటున్నారు. -
బిగ్‌బాస్: ఉన్నట్టుండి కుప్పకూలిన లోబో.. మెడికల్ రూమ్‌కి తరలింపు
బిగ్‌బాస్ అంటేనే వివాదాలు.. కాంట్రవర్సీలు.. ఒకరినొకరు అరుచుకోవడం. ఎంత ప్రేమగా ఉండాలని చూసినా వారి మధ్య చిచ్చు పెడతాడు బిగ్‌బాస్. ఐదో సీజన్లో కూడా అదే పని చేశాడు బిగ్‌బాస్. కెప్టెన్సీ కంటెండర్ టాస్క్.. ఇంటి సభ్యుల మధ్యవివాదానికి దారి తీసింది. ఎంతో స్నేహంగా కలిసి ఉండే రవి, విశ్వలు గొడవకు దిగారు. చలాకీగా ఉండి లోబో ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. ధైర్యంగా కనిపించే సన్నీ కంటతడి పెట్టాడు.ఇలా ఈ రోజు ఏపిసోడ్‌లో ఎన్నో ఆసక్తికర సంఘటనలు చోటు చేసుకున్నాయి. అవేంటో చదివేయండి మరి. గుంటనక్క దొరికేసింది! నిన్నటి నామినేషన్‌కి బాగా హర్ట్ అయిన నటరాజ్ మాస్టర్.. హౌస్‌లోకి వచ్చిన ఓ గుంట నక్క మంచి మనుషులుగా న్న ఏడుగురిని గొర్రెలుగా తయారు చేసిందని విమర్శించిన విషయం తెలిసిందే. దీనిపై ఈ రోజు యాంకర్ రవి మాస్టర్ని నిలదీశాడు. ఎందుకు అలా ఊహించుకుంటున్నావు? అది తప్పు అని రవి అనగా.. నేను ఊహించుకోవడం కాదు.. అది నిజం అని మరోసారి మాస్టర్ తనను తాను సమర్థించుకున్నాడు. దీంతో అసహనానికి గురైన రవి.. నువ్వు ఏమైనా దేవుడివా? ఎలా తెలుస్తుంది? నేనే ఎక్కిస్తున్నా అని అనుకుంటున్నావా? అని డైరెక్ట్‌గా అడిగేశాడు. దీనికి మాస్టర్ కాస్త వెతకారంగా ఆన్సర్ ఇచ్చాడు. నువ్వు ఎందుకు అలా అనుకుంటున్నావు? నీతో బానే ఉంటున్నాను కదా?అని చెప్పిన నటరాజ్ మాస్టర్.. వీజే సన్నీ అడిగినప్పుడు మాత్రం గుమ్మడి కాయల దొంగ ఎవరు అంటే భూజాలు తడుముకున్నట్లు.. నా తను(రవి) నా దగ్గరకు వచ్చి అడిగేశాడు అని పరోక్షంగా రవినే గుంట నక్క అని చెప్పేశాడు. రెండో వారం కూడా జన్యూన్ రీజన్స్ లేవు: ఉమాదేవి ఇక లోబోని నామినేట్ చేసిన మానస్.. తను ఎందుకు చేశానో వివరించే ప్రయత్నం చేశారు. లోబో మాత్రం తాను కావాలని ఆయిల్ పోయలేదని, అనుకుంటే పడితే దాన్ని కారణం చెప్పి నామినేట్ చేశావని బాధపడ్డాడు. ఇక శ్వేత ఏమో ఉమాదేవి మాటలకు బాగా హర్ట్ అయినట్లుంది. ఆమె వయసుకి ఆమె మాట్లాడిన మాట్లాడిన మాటలకు పొంతనలేదని విమర్శించింది. మరోవైపు రవి, సిరి నటరాజ్ గుంటనక్క మాటలను మరోసారి గుర్తు చేసుకున్నారు. ఆ మాటలతో మాస్టర్‌పై రెస్పెక్ట్ పోయిందని సిరి చెప్పుకొచ్చింది. రవి ఏమో నేను నచ్చజెప్పే ప్రయత్నం చేస్తే మాస్టర్ పట్టించుకోవడంలేదన్నాడు. ఇక స్విమ్మింగ్ పూల్ దగ్గర కూర్చున్న ప్రియ, ఉమాదేవి.. నామినేషన్ గురించి చర్చించుకున్నారు. సెకండ్ వీక్ కూడా జన్యూన్ రీజన్స్ లేవని, అన్ని చెత్త కారణాలు చెప్పి నామినేట్ చేశారని ఉమా చెప్పుకొచ్చింది. లోబో యాటిట్యూడ్ అర్థం కావట్లేదు: రవి నిన్న జరిగిన నామినేషన్ ప్రక్రియలో భాగంగా మానస్‌పై లోబో ఫైర్ అవ్వడాన్ని చర్చింకున్నారు రవి అండ్ లహరి. లోబో యాటిట్యూడ్ ఏంటో అర్థం కావట్లేదన్న రవి.. అతన్ని మంచి దారిలో తీసుకెళ్లి ఫ్రెండ్షిప్ మంచి అర్థం చెబుతానంటే నన్నే నామినేట్ చేస్తున్నాడని బాధను వ్యక్తం చేశాడు. నా మొగుడితో అయినా అలానే మాట్లాడుతా: ఉమాదేవి సన్నీ ఏమో ఉమాదేవికి గీతోపదేశం చేసే ప్రయత్నం చేశాడు. ఇంట్లో కోపం, ప్రేమ రెండూ ఉండాలని, ప్రేమగా మాట్లాడాలని ఆమెను రిక్వెస్ట్ చేశాడు. ఇక ఉమా ఏమో ఎప్పటి మాదిరే ‘నేను ఇలాగే ఉంటా, ఎవరితోనైనా ఇలానే మాట్లాడుతా’నని తెల్చిచెప్పింది. నేను మా ఇంట్లో నా చెల్లి, నా మొగుడితో అయినా కూడా అలానే మాట్లాడుతాను అంటూ ఉమా మరోసారి కౌంటర్ ఇచ్చింది. అందుకు సన్నీ అందరూ ఒకేలా ఉండరు ఇక్కడ కూడా ఒక్కొక్కరు ఒక్కొక్కలా ఉంటారని చెబుతాడు. ఇక తన మెంటాలిటీ తన ఇష్టం అని ఎవరైనా అంగీకరిస్తే అంగీకరిస్తారు లేదంటే లేదు అని ఉమ మరో కౌంటర్ ఇస్తుంది.మరోవైపు కాజల్ దగ్గరకు వెళ్లిన సన్నీ.. నీలో స్వీట్నెస్, క్యూట్ నెస్ మిస్ అవుతుందని చెప్పాడు. నేను స్వీట్‌గా క్యూట్‌గా ఉంటే ఫేక్ అంటున్నారని, అయినా నా వాళ్ల ముందే నేను అలా ఉంటానని, ఇక్కడ నాకు ఆ ఫీలింగ్ రాలేదని, అందుకే ఇలా ఉంటున్నానని కాజల్ చెప్పింది. ‘పంథం నీదా నాదా’ సై నిన్నటి నామినేషన్ కోసం రెండు టీమ్స్‌గా విడిపోయిన ఇంటి సభ్యులు.. ఇప్పుడు అదే టీమ్‌తో కెప్టెన్సీ కంటెండర్ టాస్క్ ఆడాలని బిగ్‌బాస్ ఆదేశించాడు. దీనికి ‘పంథం నీదా నాదా’అనే టైటిల్‌ని పెట్టాడు. ఇందులో భాగంగా రెండు టీమ్స్ ఈ వారం వివిధ టాస్క్‌ల్లో పోటీ పడాల్సి వస్తుంది. తొలుత ‘దొంగలున్నారు జాగ్రత్త’అనే టాస్క్‌ని ఇచ్చాడు. ఇందులో భాగంగా యాక్టివిటీ ఏరియాలో రెండు టీమ్స్‌కి సంబంధించిన డగౌట్స్ ఉంటాయి. నక్క టీమ్( ఉమాదేవి, లహరి, రవి, జెస్సీ, మానస్, సన్నీ, కాజల్, శ్వేత, నటరాజ్)కు సంబంధించిన డగౌట్స్‌లో గద్ద టీమ్( లోబో, యానీ మాస్టర్, శ్రీరామ్, ప్రియ, హమీదా, విశ్వ, సిరి, షణ్ముఖ్, ప్రియాంక)కు చెందిన బ్యాటెన్స్(పిల్లోస్) ఉంటాయి. గద్ద టీమ్ డగౌట్స్‌లో నక్కటీమ్కు చెందిన పిల్లోస్ ఉంటాయి. ప్రతి టీమ్ ఇతర టీమ్‌లోని డగౌట్స్‌లో ఉన్న పిల్లోస్‌ని తెచ్చుకొని తన డగౌట్స్‌లో పెట్టుకోవాలి. అలాగే ఇతర టీమ్‌లోని పిల్లోస్‌ని వారికి దొరకుండా చూసుకోవాలి. ఇలా మొత్తం టాస్క్ పూర్తయ్యే వరకు ఏ టీమ్‌లో ఎక్కువగా పిల్లోస్ ఉంటాయో అవే ఫ్లాగ్స్గా లెక్కించబడతాయి. చివరకు ఏ టీమ్ దగ్గరైతే ఎక్కువగా ఫ్లాగ్స్ ఉంటాయో వాళ్లే విజేతలుగా నిలుస్తారు. గెలిచిన టీమ్ నుంచే కెప్టెన్సీ కంటెండర్ ఎంచుకోబడతారు. ఈ టాస్క్‌ని ఇరు జట్లు సీరియస్‌గా తీసుకున్నాయి. పిల్లోస్ లాక్కునే క్రమంలో సిరి షర్ట్‌లో సన్నీ చేయి పెట్టాడని.. సిరి చాలా పెద్ద గొడవ చేస్తుంది. అయితే సన్నీ మాత్రం నేను అలా చేయలేదని చెప్పాడు. కుప్పకూలిపోయిన లోబో.. మెడికల్ రూమ్‌కి తరలింపు టాస్క్‌లో భాగంగా జరిగిన తోపులాటలో లోబో కళ్లు తిరిగి కిందపడిపోయాడు. దీంతో ఇంటి సభ్యులంతా డాక్టర్ని రప్పించాలని బిగ్‌బాస్‌కు విన్నవించారు. బిగ్‌బాస్ ఆదేశంతో లోబోని మెడికల్ రూమ్‌కి తరలించారు. ఈ మధ్యలోనే రవి-విశ్వ మధ్య గొడవ జరిగింది. నక్క టీమ్ సభ్యుల నుంచి పిల్లోస్ లాక్కునేందకు శ్రీరామచంద్ర ప్రయత్నించడంతో... రవి ఫైర్ అయ్యాడు. రోబోకి అలా ఉంటే.. ఇప్పుడు కూడా గేమ్ అడుతారా ‘ఛీ’అంటూ గట్టిగా అరిచాడు. దీంతో గద్ద టీమ్ సభ్యుడైన విశ్వ.. మాటలు మంచిగా రానివ్వంటూ రవిపై సీరియస్ అయ్యాడు. తర్వాత రవి వెళ్లి విశ్వకి సారీ చెప్పాడు. మొత్తానికి ‘దొంగలున్నారు జాగ్రత్త’టాస్క్.. కంటెస్టెంట్స్ల్లోని కోపాన్ని వెలికితీసింది. ఇక రెండో టాస్క్ ‘సాగరా సోదరా’అయితే మరో రేంజ్లో ఉంటుందని ప్రోమో వదిలి చూపించాడు బిగ్‌బాస్. మరి రెండో టాస్క్‌లో గొడవలు ఏ స్థాయికి చేరాయో రేపటి ఎపిసోడ్లో చదివేద్దాం. -
బిగ్‌బాస్: లీకైన రెండో వారం నామినేషన్ లిస్ట్!
Bigg Boss Telugu 5, Second Week Nominations: బిగ్‌బాస్ తెలుగు ఐదో సీజన్లో డేరింగ్ అండ్ డాషింగ్ కంటెస్టెంట్ సరయూ ఎలిమినేట్ అయిపోయింది. ఇప్పుడు హౌస్‌లో 18 మంది కంటెస్టెంట్లు ఉన్నారు. ఎలాంటి బెరుకు లేకుండా ఉన్నదున్నట్లు ముఖం మీదే మాట్లాడే సరయూ ఎలిమినేషన్‌తో ఇతర కంటెస్టెంట్లలో కదలిక మొదలైనట్లు కనిపిస్తోంది. ఇంకా సైలెంట్‌గా ఓ మూలన కూర్చుంటే తొక్కేస్తారనుకుందో ఏమో కానీ శ్వేత వర్మ నేటి నామినేషన్స్‌లో విరుచుకుపడింది. దీంతో శ్వేతలో ఈ యాంగిల్ ఇంతవరకు చూడలేదంటూ కామెంట్లు చేస్తున్నారు నెటిజన్లు. మొత్తానికి బిగ్‌బాస్ పెట్టిన నామినేషన్ మంట హౌస్‌లో బాగానే రగులుతున్నట్లు కనిపిస్తోంది. ఇదిలా వుంటే ఈవారం నామినేట్ అయిన కంటెస్టెంట్లు వీళ్లేనంటూ ఓ లిస్ట్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. నటరాజ్ మాస్టర్, యానీ మాస్టర్, ఆర్జే కాజల్, లోబో, ప్రియ, ఉమాదేవి, ప్రియాంక సింగ్ నామినేషన్ జోన్లోకి వచ్చారని లీకువీరులు దండోరా వేసి మరీ చెప్తున్నారు. ఒకవేళ ఇదే నిజమైతే ఇందులో కాజల్ మినహా అందరూ కొత్తగా నామినేషన్లోకి ఎంటరైనవారే. మరి ఈసారి నిజంగానే ఏడుగురు కంటెస్టెంట్లు నామినేషన్లో ఉండబోతున్నారా? లేదా ఈ లిస్టులో ఏమైనా మార్పులు చోటు చేసుకోనున్నాయా? అనేది తెలియాలంటే నేటి ఎపిసోడ్ వచ్చేంతవరకు ఆగాల్సిందే! -
నామినేషన్స్: ఆ ఇద్దరినీ చెడుగుడు ఆడేసిన శ్వేత
సండే అసలైన ఫండే అంటాడు కింగ్ నాగార్జున. కానీ బిగ్‌బాస్ ప్రేమికులకు మాత్రం అసలు సిసలైన ఫండే సోమవారం అనే చెప్పుకోవాలి. కారణం.. నామినేషన్స్. కంటెస్టెంట్లు ఎంత కలిసిమెలిసి ఉన్నప్పటికి మండే వచ్చేసరికి మాత్రం నిజస్వరూపాలు బయటపడతాయి. వారి మధ్య ఉన్న చిన్న చిన్న గొడవలు కూడా విశ్వరూపం దాలుస్తాయి. కూల్ అనుకునేవారు కూడా కాళికా రూపం ఎత్తే అవకాశం ఉంటుంది. ఇందుకు ప్రత్యక్ష సాక్ష్యంగా నిలిచింది తాజా ప్రోమో. ఇక రెండో వారం నామినేషన్స్‌ను బిగ్‌బాస్ వెరైటీగా నిర్వహించినట్లు తెలుస్తోంది. ఇంటిసభ్యులను రెండు టీములుగా విడగొట్టాడు బిగ్‌బాస్. లోబో.. మరోసారి యాంకర్ రవిని నామినేట్ చేశాడు. అతడి దోస్తానాకు దండం పెట్టేశాడు. అయితే లోబోతో స్నేహం వద్దని అతడు కట్టిన ఫ్రెండ్షిప్ బ్యాండ్‌ను పక్కన పడేసి అందరికీ షాకిచ్చింది శ్వేత. ఎంతో కూల్‌గా కనిపించే శ్వేత నామినేషన్స్‌లో తన ఉగ్రరూపం చూపించడం చాలామందిని ఆశ్చర్యానికి గురి చేస్తోంది. ఇక తను నామినేట్ చేయాలనుకున్న కంటెస్టెంట్లను చెడుగుడు ఆడేసిందీ భామ. లోబో, హమీదా ఫేక్ అంటూ వారిని నామినేట్ చేసింది. ఆమె ఆవేశాన్ని ఆపడం అక్కడున్న ఎవరి వల్లా కాలేదని తెలుస్తోంది. మొత్తానికి ప్రోమో చూస్తుంటే ఈరోజు గొడవలు మామూలుగా లేవనిపిస్తోంది. మరి ఈ వారం ఎవరెవరు నామినేట్ అయ్యారనేది తెలియాలంటే ఎపిసోడ్ వచ్చేంతవరకు వెయిట్ చేయాల్సిందే! -
అప్పుడు సంపూర్ణేశ్‌బాబు, ఇప్పుడు లోబో.. అదే రిపీట్ కానుందా?
ప్రముఖ బుల్లితెర రియాలిటీ షో బిగ్‌బాస్‌ను ప్రేమించే వారు ఎంతమంది ఉంటారో అదంతా చెత్త అంటూ ఏకిపారేసే వారు కూడా అంతే ఉంటారు. ఇక బిగ్‌బాస్ హౌజ్ అడుగుపెట్టే వారిలో కూడా ఈ షో అంటే ఇష్టంలేని వారే ఉన్నారు. కంటెస్టెంట్స్‌గా వచ్చిన కొంతమంది గతంలో బిగ్‌బాస్ షోపై విమర్శలు చేసిన వారున్నారు. అందులో లోబో ఒకడు. గతంలో బిగ్‌బాస్ అంటే తనకు అసలు నచ్చదంటూ, ఆఫర్ వచ్చినా కూడా చేయనని ఓ ఇంటర్వ్యూలో చెప్పిన లోబో పాత వీడియో ఇటీవల బయటకు వచ్చిన సంగతి తెలిసిందే. దీంతో నెటిజన్లు అతడిని ఆటాడేసుకుంటున్నారు. చదవండి: ఈ గేములు సెట్టయితలే, పోయి దుకాణంలో కూర్చుంట: లోబో ఇదిలా ఉంటే ఇప్పుడు బిగ్‌బాస్ సీజన్ 5తో హౌజ్‌లో అడుగు పెట్టిన లోబో మొదటి రెండు, మూడు రోజులు బాగానే అలరించాడు. తన కామెడీతో ఇంటి సభ్యులను, ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించాడు. అయితే పవర్ రూం టాక్స్‌లో భాగంగా లోబో, షణ్ముక్ జస్వంత్‌కు పనివాడిగా మారిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో షణ్ముక్ లోబోను గట్టిగా వాడాడు. అతడు మాత్రమే కాకుండా రవి కూడా లోబోతో పనులు చేయించుకున్నాడు. దీంతో స్మోక్ రూంలో లోబో తనతోటి కాదంటూ ఆవేదన వ్యక్తం చేశాడు. ఇదంతా ఏందీ, ఇది నేను కాదు. నాతోని కాదు. నాకు అసలు బిగ్‌బాస్ నచ్చదు. ఇది నా టేస్ట్ కాదు. ఇక్కడ ఉండలేకపోతున్నా’ అంటూ బాధపడ్డాడు. చదవండి: బిగ్ బాస్ షో పై తీవ్రస్థాయిలో మండిపడ్డ సిపీఐ నారాయణ అయితే తొలి సీజన్లో సంపూర్ణేశ్ బాబు సెల్ఫ్ ఎలిమినేషన్ అందరికీ గుర్తుండే ఉంటుంది కదా. రెండు వారాలు కూడా కాక ముందే తాను ఇక్కడ ఉండలేకపోతున్నానని, ఇంటికి పంపించేయండంటూ కన్నీరు పెట్టుకున్నాడు. దీంతో బిగ్‌బాస్ అతడిని మధ్యలోనే ఇంటికి పంపించేశాడు. ఇప్పుడు లోబో పరిస్థితి కూడా అదే అనిపిస్తుంది. చూస్తుంటే ఇంట్లో పరిస్థితులను లోబో అసలు తట్టుకోలేకపోతున్నాడేమో అనిపిస్తుంది. ఇలాగే ఉండే లోబో రాబోయే రెండు మూడు వారాల్లోనే బయటకు వచ్చేస్తాడని నెటిజన్లు అంచనా వేస్తున్నారు. -
ఈ గేములు సెట్టయితలే, పోయి దుకాణంలో కూర్చుంట: లోబో
Bigg Boss Telugu 5, Episode 05: బిగ్‌బాస్ ఐదో సీజన్లో కామెడీ, లవ్ ట్రాక్‌ల సంగతేమో కానీ కొట్లాటలకు మాత్రం కొదవ లేకుండా పోయింది. అర్థం పర్థం లేని విషయాలకు కూడా గొడవ పడుతూ ప్రేక్షకులకు తలనొప్పిగా మారుతున్నారు. కెప్టెన్ వచ్చాక అయినా ఇల్లు చక్కదిద్దుకుంటుందేమో అంటే ఆ తర్వాత కూడా పరిస్థితి ఎక్కడ వేసిన గొంగడి అక్కడే అన్న చందంగా మారింది. తొలి కెప్టెన్‌గా నియామకమైన చలాకీ సిరి వీరిని అందరినీ దారిలో పెడుతుందా? అనేది ఆసక్తికరంగానే మారింది. మరి నేటి(గురువారం) ఎపిసోడ్ హైలైట్స్ ఏంటో చదివేద్దాం.. ఫ్రస్టేషన్ బయటపెట్టిన లోబో కెప్టెన్సీ పోటీదారుడు మానస్‌కు ఇచ్చిన టాస్క్ ప్రకారం.. అర్ధరాత్రి ఎవరు నిద్ర లేచినా ముందు కాజల్‌ను లేపాల్సి ఉంటుంది. కానీ ఈ నియమాన్ని లహరి, శ్రీరామచంద్ర తుంగలో తొక్కడంతో పదేపదే అలారమ్ మోగింది. ఫలితంగా ఇంటి సభ్యుల నిద్ర చెదిరిపోయింది. మరోపక్క షణ్నూకు సపర్యలు చేసి అలిసిపోయాడు అతడి సేవకుడు లోబో. వారు చేయిస్తున్న టాస్క్‌లకు దండం పెట్టేశాడు. స్మోకింగ్ రూమ్‌లో తన ఫ్రస్టేషన్‌ను విశ్వ ముందు బయటపెట్టాడు. 'ఈ గేములు నాకు నచ్చట్లేదు, ఇది నా టేస్ట్ కాదు, నాకు సెట్టయితలేదు. పోయి నా దుకాణంలో ఉంటా, కానీ ఇదంతా ఏంది?' అని అసహనానికి లోనయ్యాడు. దీంతో ఇది టాస్క్ అని, కాస్త ఓపిక పట్టమని ఊరడించాడు విశ్వ. గెలిచిన హమీదా, ప్రియకు కోలుకోలేని దెబ్బ అనంతరం కెప్టెన్సీ పోటీదారుల టాస్క్‌లో హమీదా గెలిచింది. పవర్ రూమ్‌లో అడుగు పెట్టిన ఆమెకు బిగ్‌బాస్ కఠినమైన టాస్కే ఇచ్చాడు. ఆమె ఎంచుకునే కంటెస్టెంట్ హౌస్‌లో ఎప్పటికీ కెప్టెన్ కాలేరని చెప్పాడు. దీంతో ఆమె నటి ప్రియ పేరు చెప్పింది. ఇదే విషయాన్ని హౌస్మేట్స్ దగ్గర చెప్పగా అంతా ఒక్కసారిగా షాకయ్యారు. కానీ ప్రియ మాత్రం దీన్ని స్పోర్టివ్‌గా తీసుకోవడం విశేషం. ఐ లవ్యూ.. మానస్‌ను మధ్యలో లాగిన ప్రియాంక రెస్ట్ రూమ్ క్లీన్ చేస్తున్న లోబో అక్కడికి వచ్చిన ప్రియాంక సింగ్‌ను చూసి తన పని ఆపేశాడు. ఆమెను తదేకంగా చూస్తూ ఐ లవ్యూ అంటూ ప్రపోజ్ కూడా చేశాడు. అయితే ఆమె మాత్రం నీకు దమ్ముంటే మానస్ ఎదురుగా నాకు లైనేయ్ అని సవాలు చేయడంతో ఒక్కసారిగా ఖంగు తిన్నాడు. ఇదే విషయాన్ని లోబో.. మానస్ దగ్గర ప్రస్తావించగా అతడు తేలికగా నవ్వేసి మధ్యలో నా అనుమతి అవసరం లేదని కుండ బద్ధలు కొట్టేశాడు. ఆ తర్వాత కంటెస్టెంట్లు లోబోను అమ్మాయిగా రెడీ చేసి ఓ ఆట ఆడేసుకున్నారు. మరోవైపు ఏమైందో ఏమో కానీ సరయూ ఉన్నట్టుండి ఏడుపందుకుంది. రెండో రోజే అందరూ కలిసి ఉండి నాలుగో రోజుకే ఎలా గ్రూప్స్ అవుతాయని భోరున ఏడ్చేయగా యానీ మాస్టర్ ఆమెను ఓదార్చింది. సంచాకురాలి ఎంపిక విషయంలో రచ్చ అనంతరం 'శక్తి చూపరా డింభకా!' టాస్క్ పూర్తైందని వెల్లడించిన బిగ్‌బాస్ హమీదా, మానస్, విశ్వ, సిరి తొలి కెప్టెన్సీ టాస్క్‌కు పోటీ చేయనున్నట్లు ప్రకటించాడు. 'తొక్కరా తొక్కు హైలెస్సా' అనే టాస్కులో సైకిల్ నిరంతరాయంగా తొక్కుతూ దాని మీదున్న బల్బ్ వెలుగుతూ ఉండేలా జాగ్రత్తపడాలని ఆదేశించాడు. మధ్యలో బజర్ మోగిన ప్రతిసారి మిగతా హౌస్మేట్స్.. పోటీదారుల్లో ఒకరికి నీళ్లు తాగించాల్సి ఉంటుందని స్పష్టం చేశాడు. ఈ టాస్క్‌కు ప్రియ సంచాలకురాలిగా వ్యవహరిస్తే బాగుంటుందని సన్నీ అభిప్రాయపడ్డాడు. అతడి నిర్ణయంతో హౌస్‌లో కొంత రచ్చ జరిగినా ఎక్కువమంది ప్రియనే సంచాలకురాలిగా ఎన్నుకున్నారు. కాజల్ వర్సెస్ సరయూ ఈ టాస్క్‌లో కాజల్.. విశ్వకు ఇమ్యూనిటీ అవసరం లేదంటూ అతడిని డిస్టర్బ్ చేయగా ఆటలో నుంచి అవుటయ్యాడు. అయితే విశ్వను ఒక్కడినే ఎందుకు టార్గెట్ చేశావని సరయూ కాజల్‌ను నిలదీసింది. నేను అమ్మాయిలకే సపోర్ట్ చేస్తానని, విశ్వకు ఇమ్యూనిటీ అవసరం లేదని అతడికే డైరెక్ట్‌గా చెప్పానని క్లారిటీ ఇచ్చింది కాజల్. కాసేపటివరకు వీరి మధ్య ఓరకంగా మాటల యుద్ధమే నడిచిందని చెప్పవచ్చు. మొత్తానికి రసాభాసగా సాగిన ఈ టాస్క్‌లో సిరి గెలుపొంది హౌస్‌కు తొలి కెప్టెన్‌గా అవతరించింది. ఆమెకు ప్రియ కెప్టెన్ బాండ్ తొడిగింది. అనంతరం సిరి.. విశ్వను రేషన్ మేనేజర్‌గా ఎంపిక చేసింది. నాన్‌వెజ్ వండను, శుభ్రం కూడా చేయను ఇక కిచెన్‌లో పనులు పంచుకునే దగ్గర మరోసారి లొల్లి షురూ అయింది. నాన్‌వెజ్ వండలేను, ఎవరైనా నాన్‌వెజ్ వండితే ఆ గిన్నెలను శుభ్రం చేయను అని ఉమాదేవి తేల్చి చెప్పింది. మార్నింగ్ వెజ్ వండేందుకు ప్రియాంక సింగ్ ఉందని లహరి చెప్పగా దాన్ని ఉమాదేవి తప్పుగా అర్థం చేసుకుంది. అంటే వెజ్ వండటానికి నేను పనికి రానని అంటున్నారంటూ కొత్త వాదన ఎత్తుకుని తగవు పెట్టుకుంది. దీంతో చిర్రెత్తిపోయిన లేడీ అర్జున్ రెడ్డి లహరి.. ఆమె అరిస్తే పడాలా? అని నిలదీసింది. దీంతో జోక్యం చేసుకున్న కెప్టెన్.. లహరి 'పనికి రాదు' అనే పదం వాడలేదని ఉమాదేవికి గట్టిగానే క్లారిటీ ఇవ్వడంతో ఈ గొడవ చప్పున చల్లారిపోయింది. ఇప్పుడే ఈ రేంజ్లో గొడవ పడితే రేపటి నుంచి కెప్టెన్ సిరికి కంటెస్టెంట్లు చుక్కలు చూపిస్తారేమో చూడాలి! -
బిచ్చం అడుక్కోవడానికి రాలేదు, రవి ఇక్కడ యాంకర్ కాదు!
Bigg Boss 5 Telugu, September 8th Episode: బిగ్‌బాస్ ఐదో సీజన్లో ఆదిలోనే కయ్యానికి కాలు దువ్వుతున్నారు కంటెస్టెంట్లు. ఓవైపు సమస్యలు పరిష్కరించుకుందాం అంటూనే మరోవైపు గొడవలకు దిగుతున్నారు. ఇక అమాయకుడన్న జెస్సీ ఆవేశంతో రెచ్చిపోతుంటే షణ్ముఖ్‌కు ఇప్పుడిప్పుడే స్క్రీన్ స్పేస్ దొరుకుతోంది. లోబో మరోసారి తన కామెడీతో అందరినీ పొట్టచెక్కలయ్యేలా నవ్వించాడు. ఇంతకీ ఈరోజు ఎవరు పోట్లాడుకున్నారు? నేటి(బుధవారం) ఎపిసోడ్ హైలైట్స్ ఏంటనేవి చూసేద్దాం.. కాజల్‌ను ఓడించాలని కంకణం కట్టుకున్న హౌస్మేట్స్ మానస్ చెప్పినట్లుగా కాజల్ అందరూ పడుకున్నాకే నిద్రించేందుకు రెడీ అయింది. కానీ మిగతా కంటెస్టెంట్లందరూ కాజల్‌ను ఓడించాలని కంకణం కట్టుకున్నారు. ఆ రోజంతా నిద్రపోకూడదని ఫిక్సయ్యారు. ఈ టాస్క్ ముందుకు జరగాలంటే అందరూ నిద్రించాల్సిందేనని కాజల్ మొత్తుకున్నా అందరూ పడుకునేందుకు ససేమీరా అన్నారు. దీంతో చేతులెత్తేసిన కాజల్ తను మాత్రం హాయిగా బెడ్డెక్కి నిద్రపోయింది. దీంతో హౌస్‌లో రెండు మూడు సార్లు అలారమ్ మోగింది. ఇక పొద్దున్నే కిచెన్‌లోనూ అంట్లు తోమడం తన వల్ల కాదని, ఇంట్లో కూడా ఆ పని చేయలేదంది. అయితే ఇది బిగ్‌బాస్ హౌస్ కాబట్టి ఏ పనైనా చేయక తప్పదు. నేనేమైనా వాళ్లింట్లో పని చేస్తున్నానా? ఏడ్చేసిన లహరి నేనేదైనా అడిగితే ఎందుకు సరిగా సమాధానం ఇవ్వవని లహరి హమీదాను ప్రశ్నించింది. కానీ హమీదా తనను బేఖాతరు చేస్తూ నా ఇష్టం, నేనిలాగే మాట్లాడతానని దురుసుగా వ్యవహరించింది. ఆమె మాటలకు హర్ట్ అయిన లహరి.. నేనేమైనా వాళ్లింట్లో పని చేస్తున్నానా? ఎందుకలా రఫ్‌గా మాట్లాడుతుందంటూ ఏడ్చేసింది. కానీ ఆ తర్వాత లహరి, హమీదా ఇద్దరూ ఒకరికొకరు హగ్గులిచ్చుకుని వారి గొడవకు ఎండ్ కార్డ్ వేశారు. ఇదిలావుంటే శ్రీరామచంద్ర, హమీదా మధ్య లవ్ ట్రాక్ మొదలైనట్లు చూపించిన ప్రోమో అంతా వట్టిదేనని రుజువైంది. సాధారణ స్నేహితుల్లా వీరిద్దరూ కాసేపు కబుర్లాడారు. ఆ తర్వాత కాజల్.. సింగర్ శ్రీరామచంద్రను ఎలాంటి అమ్మాయి నచ్చుతుందని అడగ్గా.. సరదాగా, బబ్లీగా ఉండే అమ్మాయి ఇష్టమని వ్యాఖ్యానించాడు. షణ్నూకు సపర్యలు చేసిన లోబో 'శక్తి చూపరా డింభకా' టాస్క్‌లో సిరి గెలుపొందగా ఆమె ఇద్దరు ఇంటిసభ్యులను ఎంచుకుంది. వారిలో ఒకరు ఇంకొకరికి వ్యక్తిగత సేవకుడిగా ఉండాల్సి ఉంటుందని బిగ్‌బాస్ చెప్పగా సిరి.. షణ్ముఖ్‌ను యజమానిగా, లోబోను సేవకుడిగా సూచించింది. ఇదే విషయాన్ని హౌస్‌మేట్స్‌తో చెప్పింది సిరి. దొరికిందే చాన్స్ అనుకున్నాడో ఏమో కానీ వెంటనే లోబోతో మసాజ్ చేయించుకున్నాడు షణ్నూ. తర్వాత హౌస్‌మేట్స్‌ను ఇమిటేట్ చేయమని అసిస్టెంట్‌ను ఆదేశించాడు. దీంతో రెచ్చిపోయిన లోబో అందరినీ అనుకరిస్తూ కామెడీ చేయడంతో కంటెస్టెంట్లు పడీపడీ నవ్వారు. ఆ తర్వాత ర్యాప్ సాంగ్ పాడి ఆకట్టుకున్నాడు. షణ్నూ మీద ప్రతీకారం తీర్చుకుంటానన్న లోబో ఇక సిరిని పవర్ రూమ్‌లోకి పిలిచిన బిగ్‌బాస్.. మీకిచ్చిన టాస్క్‌ను సీరియస్‌గా తీసుకోవాల్సి ఉంటుందని వార్నింగ్ ఇచ్చాడు. దీంతో మిగతావాళ్లకు కూడా సపర్యలు చేస్తున్న లోబో వెంటనే ఆ పనులను ఆపేసి షణ్నుకు సేవలు చేయడం మొదలుపెట్టాడు. అందులో భాగంగా షణ్ముఖ్ బట్టలను కూడా అతడే ఉతకాల్సి వచ్చింది. దీనికి లోలోపలే ఉడుక్కున్న లోబో ఇందుకు తప్పకుండా ప్రతీకారం తీర్చుకుంటానని ప్రతిజ్ఞ పూనాడు. మా అమ్మ వచ్చినప్పుడు రవికి గట్టిగానే ఉంటుంది: మానస్ మానస్.. తనను పదేపదే ప్రియాంక సింగ్‌తో ముడిపెట్టడాన్ని ఇబ్బందిగా ఫీలయ్యాడు. రవి బ్రో బయట యాంకర్ కావచ్చు కానీ ఇక్కడ కాదు కదా, మా అమ్మ వచ్చినప్పుడు రవి బ్రోను ఓ రౌండ్ వేసుకుంటే అప్పుడే తెలుస్తుందని కాజల్‌తో చెప్పుకొచ్చాడు. ఇక కిచెన్‌లో అప్పుడే మంట మొదలైంది. ఆలూ కూర తనకు వడ్డించకుండా ఫ్రిజ్‌లో పెట్టారని యానీ మాస్టర్ మీద మండిపడింది ఉమాదేవి. నేను అడిగినప్పుడు కూర లేదన్నారు, మరి ఇప్పుడెలా ఉందని నిలదీసింది. నేను బిచ్చం అడుక్కోవడానికి రాలేదంటూ ఫైర్ అయింది. ఆలూ కర్రీ పెట్టలేదని శివాలెత్తిన ఉమాదేవి దీంతో యానీ మాస్టర్ సెకండ్ తినేవాళ్లకు కూర సరిపోవట్లేదని తానే ఆలూ కర్రీ ఫ్రిజ్‌లో పెట్టానని, కానీ ఆ విషయం మర్చిపోయానని చెప్పింది. ఆమె సమాధానంతో సంతృప్తి చెందని ఉమాదేవి.. అంటే దీనిప్రకారం మొదట కాకుండా సెకండ్ తినాలన్నమాట అని వ్యంగ్యంగా కౌంటరివ్వగా.. కలిసి తింటే సరిపోతుందని యానీ చెప్పింది. అయినా రెండు కూరలు ఎందుకు చేసుకోవడం? ఒకటే కూర చేసుకుని తింటే చాలని మండిపడింది. ఉమాదేవి తగ్గేలా లేదని అర్థమైన యానీ మాస్టర్ తనే ఓ మెట్టు దిగి సారీ చెప్పడంతో ఆమె కూల్ అయిపోయింది. -
బిగ్‌బాస్: సిరికి బిగ్‌బాస్ వార్నింగ్, ఏడ్చేసిన హమీదా!
బిగ్‌బాస్ హౌస్‌లో కెప్టెన్సీ పోటీదారుల ఎంపిక కోసం 'శక్తి చూపరా డింభకా' టాస్క్ నడుస్తోంది. ఇప్పటికే ఈ టాస్కులో విశ్వ, మానస్లు గెలుపొందారు. తాజాగా రిలీజ్ చేసిన ప్రోమో ద్వారా సిరి హన్మంత్ పవర్ రూమ్‌లోకి వెళ్లే ఛాన్స్ కొట్టేసినట్లు తెలుస్తోంది. తద్వారా పవర్ రూమ్‌లోకి ప్రవేశించిన సిరికి ఇంట్లో ఎవరైనా ఇద్దరిని సెలక్ట్ చేసుకోమన్నాడు బిగ్‌బాస్. ఆ ఇద్దరిలో ఒకరు ఇంకొకరికి వ్యక్తిగత సేవకుడిగా ఉండాలని ఆదేశించాడు. దీనికోసం సిరి... షణ్ముఖ్‌కు లోబో సేవకుడిగా ఉంటాడని వివరించింది. దీంతో లోబో.. షణ్నూకు మసాజ్ చేస్తూ కనిపించాడు. షణ్నూకు అన్ని పనులు చేసిపెడుతున్న లోబోను రవి పనోడివి అని వర్ణించడంతో అందరూ ఫక్కున నవ్వారు. తనను ముప్పుతిప్పలు పెడుతున్నందుకు సతమతమయ్యాడు లోబో. ఇంతలో సిరిని పవర్ రూమ్‌లోకి పిలిచిన బిగ్‌బాస్ ఆమెకు వార్నింగ్ ఇచ్చాడు. మరోపక్క హమీదా, లహరి మధ్య ఏదో వివాదం రాజుకున్నట్లు కనిపిస్తోంది. దీంతో హమీదా మరోసారి కంటతడి పెట్టుకుంది. ఇంతకీ సిరికి బిగ్‌బాస్ ఎందుకు వార్నింగ్ ఇచ్చాడు? హమీదా, లహరి గొడవలో తప్పెవరిది? అన్న విషయాలు తెలియాలంటే నేటి ఎపిసోడ్ వచ్చేంతవరకు ఆగాల్సిందే! -
'షణ్ముఖ్ చిన్నపిల్లోడు' అంటూనే అసిస్టెంట్‌గా మారిన లోబో!
Shanmukh Jaswanth: బిగ్‌బాస్ ఐదో సీజన్లో మోస్ట్ ఎంటర్టైనింగ్ పర్సన్ ఎవరైనా ఉన్నారా? అంటే, చాలామంది హైదరాబాదీ యాంకర్ లోబో అని టపీమని చెప్పేస్తారు. ఓవైపు ముక్కుసూటిగా మాట్లాడుతూనే కంటెస్టెంట్లందరితో కలుపుగోలుగా వ్యవహరిస్తున్నాడు. తన యాసతో, మాటలతో కావాల్సినంత కామెడీ క్రియేట్ చేస్తూ ప్రేక్షకులను కడుపుబ్బా నవ్విస్తున్నాడు. నేటి ఎపిసోడ్లో అతడు చేసే కామెడీ మామూలుగా ఉండదని తెలుస్తోంది. హౌస్‌లో అడుగు పెట్టినప్పటి నుంచీ సైలెంట్‌గా ఉన్న షణ్ముఖ్‌తో కలిసి లోబో నవ్వులు పూయించనున్నట్లు వినికిడి. ఏదైనా టాస్క్ ఫలితమో, బిగ్‌బాస్ ఆదేశమో కానీ షణ్నూకి లోబో సేవకుడిగా వ్యవహరించనున్నట్లు సోషల్ మీడియాలో ఓ వార్త లీకైంది. షణ్నూ చెప్పినట్లు నడుచుకోవడమే కాకుండా అతడి పనులను కూడా లోబోనే చేయాల్సి ఉంటుందట! ఈ టాస్క్‌ను ఇద్దరూ రెచ్చిపోయి చేస్తున్నట్లు సమాచారం. కాగా షణ్నూ చిన్నపిల్లాడంటూ అతడిని నామినేట్ చేయకుండా వదిలేసిన లోబో ఇప్పుడతడికి సేవకుడిగా ఎలా నడుచుకుంటాడో చూడాల్సిందే! -
బిగ్‌బాస్: లోబోతో కలిసి దమ్ము కొట్టిన భామలు
బిగ్‌బాస్ ఐదో సీజన్లో 10 మంది అమ్మాయిలు, 9 మంది అబ్బాయిలు హౌస్‌లో ఎంట్రీ ఇచ్చారు. అయితే మేల్ కంటెస్టెంట్లలో పెళ్లైనవాళ్లు, చిన్నపిల్లే ఉన్నారని.. తనకెవరూ కనెక్ట్ అయ్యేలా లేరని లహరి షారి ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. మరోవైపు ప్రియాంక సింగ్ అందరినీ బ్రో అని పిలిచింది కానీ మానస్‌ను మాత్రం అలా పిలవలేనని సిగ్గులమొగ్గయింది. ఇక యానీ మాస్టర్ మార్నింగ్ డ్యాన్స్‌లో మాత్రమే కనిపిస్తుండగా తాజాగా హమీదా, సరయూ స్మోకింగ్ జోన్లో దర్శనమిచ్చారు. లోబోతో కలిసి ఈ ఇద్దరు భామలు దమ్ము లాగుతూ కనిపించారు. గుప్పుమని పొగలు వదులుతూ ఇంటి ముచ్చట్లను ప్రస్తావించారు. ఇంటి సభ్యుల్లో కొందరు కనెక్ట్ కావడం కష్టమని, బయటే కనెక్ట్ అవుతామంటూ సంభాషించారు. అనంతరం సిగరెట్లను భద్రంగా కవర్లలో దాచుకున్నారు. సిగరెట్లు ప్రతిరోజు వస్తాయో లేదో అని హమీదా అనుమానం వ్యక్తం చేయగా ప్రతిరోజు వస్తాయని బదులిచ్చాడు లోబో. అన్‌సీన్ ఎపిసోడ్లో ప్రసారం చేసిన ఈ వీడియో చూసిన నెటిజన్లు 'అరేయ్ ఏంట్రా ఇది?' అంటూ కామెంట్లు చేస్తున్నారు. View this post on Instagram A post shared by BiggBossTelugu5 (@bbtelugu5offl) -
బిగ్‌బాస్: ముఖం పగిలిపోద్ది.. లోబోకు సిరి వార్నింగ్
బిగ్‌బాస్ హౌస్‌లో కొట్లాటలు సర్వసాధారణం. కానీ మొదటిరోజే కయ్యానికి కాలు దువ్వుతూ ఒకరి మీద మరొకరు నిందలు వేసుకోవడం మాత్రం ఈ సీజన్‌కే చెల్లింది. పలకరింపులు పూర్తయ్యాయో లేదో అప్పుడే చీదరింపులు మొదలెట్టేశారు కంటెస్టెంట్లు. ఇప్పటికే హమీదా, జెస్సీల గొడవ చిలికి చిలికి గాలివానలా మారిన విషయం తెలిసిందే. ఇది మరువక ముందే ఇంట్లో మరో లొల్లి షురూ అయింది. ఈమేరకు మంగళవారం సాయంత్రం ఓ ప్రోమో రిలీజైంది. ఇందులో సిరి హన్మంత్.. లోబోతో జరిగిన వాగ్వాదం గురించి మిగతా కంటెస్టెంట్లతో మాట్లాడుతోంది. ఇంతలో లోబో అడ్డు తగులుతూ ఏదైనా ప్రాబ్లం ఉంటే డైరెక్ట్‌గా తనతో చెప్పమని అరిచాడు. అయితే ఆమె అతడిని చులకన చేస్తూ మాట్లాడటంతో సక్కగ మాట్లాడమని సూచించాడు. నన్ను గెలికితే ఇలాగే ఉంటదని సిరి కౌంటరివ్వడంతో ఒకసారి ముఖాన్ని అద్దంలో చూసుకోమని చెప్పాడు లోబో. దీంతో చిర్రెత్తిపోయిన సిరి ముఖం గురించి మాట్లాడితే ముఖం పగిలిపోద్ది అని తిట్టిపోసింది. దీంతో వీరిద్దరి మధ్య మాటల యుద్ధం గట్టిగానే జరగనున్నట్లు కనిపిస్తోంది. ఇక కాజల్ అత్యుత్సాహాన్ని తట్టుకోలేకపోయింది లహరి. ఎందుకంత హైపర్ అవుతున్నారని కాజల్‌ను సూటిగా ప్రశ్నించింది. దీంతో కాజల్ కంటతడి పెట్టుకుంది. ప్రోమో చూస్తుంటే ఇవాల్టి ఎపిసోడ్లో ఫైట్ గట్టిగానే ఉండనున్నట్లు తెలుస్తోంది. -
హౌస్‌మేట్స్‌కు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్న లోబో
కనివినీ ఎరుగని రీతిలో 19 మంది కంటెస్టెంట్లతో బిగ్‌బాస్ తెలుగు ఐదో సీజన్ మొదలైంది. హౌస్‌లో అడుగుపెట్టగానే పరిచయాలు పెంచుకుని ఇంటిని అలవాటు చేసుకునే పనిలో పడ్డారు హౌస్మేట్స్. కొత్త ప్రదేశం కాబట్టి తొలిరోజే కొందరికి నిద్ర పట్టడం కూడా కష్టమే. అలాంటిది రాత్రిపూట ఎవరైనా గురక పెడితే ఇంకేమైనా ఉందా? బిగ్‌బాస్ హౌస్‌లో కంటెస్టెంట్లకు కూడా ఇలాంటి గడ్డు పరిస్థితే ఎదురైంది. యాంకర్ లోబో అర్ధరాత్రి ఆదమరిచి గుర్రు పెట్టి నిద్రపోతున్నాడు. అతడి గురక సౌండ్‌కు నిద్రలో నుంచి లేచి కూర్చున్నారు హౌస్మేట్స్. యాంకర్ రవి అయితే అతడికి దుప్పటి కప్పి, బయటకు పెద్దగా సౌండ్ వినిపించకుండా రెండు దిండ్లను కూడా లోబో ముఖం మీద పెట్టి ఉంచాడు. అయినా సరే లోబో గురకను ఆపడం ఎవరి తరమూ కాలేదు. దీంతో రాత్రంతా వారికి జాగారమే అయినట్లు కనిపిస్తోంది. మరోవైపు సిరి హన్మంత్, జెస్సీ ఏదో దొంగతనం ప్లాన్ చేసినట్లున్నారు. వీరిద్దరూ కలిసి ఒకరి చెప్పులు, మరొకరి ఇయర్ రింగ్స్‌ను దాచేసినట్లు తెలుస్తోంది. ఇంటి దొంగను ఈశ్వరుడైనా పట్టుకోలేడంటారు. మరి బిగ్‌బాస్ హౌస్‌లో చోరీకి పాల్పడిన ఈ దొంగలను ఇతర కంటెస్టెంట్లు పట్టుకోగలరా? లేదా? అన్నది ఇంట్రస్టింగ్‌గా మారనుంది. -
బిగ్‌బాస్ 5: అడ్డంగా బుక్కైన లోబో..ఆడేసుకుంటున్న నెటిజన్లు
Lobo Controversial Comments On Bigg Boss Reality Show: టన్నుల కొద్దీ కిక్కు అందించేందుకు మొత్తం 19 మంది కంటెస్టెంట్లు రెడీగా ఉన్నారు. వీరిలో ఆరో కంటెస్టెంట్‌గా హౌస్‌లోకి ఎంటర్ అయిన లోబోకు సంబంధించి ఓ ఇంట్రెస్టింగ్ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తుంది. బిగ్‌బాస్ షో చూస్తుంటారా? మీ అభిప్రాయం ఏంటి అని గతంలో ఓ యాంకర్ ప్రశ్నించగా..'బిగ్‌బాస్ షోకు ఓ దండం. అది నా టేస్ట్ కాదు. షోలో చాన్స్ రావకపోడమే మంచిది. నాకు ఆ షో నచ్చదు' అంటూ లోబో చేసిన కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. చాన్స్ రానంత వరకు బిగ్‌బాస్ షోను తిట్టడం, ఆ తర్వాత ఇలా ప్లేటు మార్చడంతో లోబోపై నెటిజన్లు ట్రోల్స్ చేస్తున్నారు. ఇక కట్టుబొట్టు, మాట తీరుకు తోడు హైదరాబాదీ యాసలో యాంకరింగ్ చేస్తూ జనాలను అలరించే లోబో బిగ్‌బాస్ హౌస్‌లో ఎంత మేర అలరిస్తాడన్నది చూడాల్సి ఉంది. #Lobo 😂#BiggBossTelugu5pic.twitter.com/htDetbYrY0 — Why that (@HeeZG0ne) September 6, 2021 చదవండి : బిస్‌బాస్-5 : ఇదిగో 19 మంది కంటెస్టెంట్స్ Bigg Boss: బాస్‌లకే బాస్ అసలైన బిగ్‌బాస్ ఇతనే -
బిగ్‌బాస్ 5: దొంగతనం చేసి దొరికిపోయానన్న లోబో
Lobo In Bigg Boss 5 Telugu: లోబో మరో పేరు మహమ్మద్ ఖయ్యూం. స్కూలులో దొంగతనం చేసి దొరికిపోవడంతో అతడికి తొమ్మిదే తరగతికే టీసీ ఇచ్చి పంపించేశారు. అలా మధ్యలోనే చదువు మానేసిన లోబో మొదట్లో టాటూ షాపులో పని చేసిన అతడు రష్యన్ యువతికి తొలి టాటూ వేశాడు. ఆవిడే ఇతడికి లోబో అని పేరు పెట్టింది. తన కట్టుబొట్టు, మాట తీరు అన్నీ విభిన్నంగా ఉండటం అతడిని ప్రత్యేకంగా నిలబెట్టింది. తన స్టైల్‌కు తోడు హైదరాబాదీ యాసలో యాంకరింగ్ చేస్తూ జనాలను అలరించాడు. నిజానికి లోబో గతంలోనే బిగ్‌బాస్ షోలో పాల్గొనాల్సింది కానీ అతడు తన ఎంట్రీని ముందుగానే లీక్ చేయడంతో నిర్వాహకులు తనను షోలోకి తీసుకోలేదు. ఇక బిగ్‌బాస్ అంతా స్క్రిప్టెడ్ అన్న లోబో షోలో అడుగుపెట్టాక తన మాట వెనక్కు తీసుకుంటాడా? ఏం జరుగుతుంది? అన్నది సస్పెన్స్‌గా మారింది.