అప్పుడు సంపూర్ణేశ్‌బాబు, ఇప్పుడు లోబో.. అదే రిపీట్‌ కానుందా? | Bigg Boss 5 Telugu: Is Logo Is Same Like First Season Sampoornesh Babu | Sakshi
Sakshi News home page

Bigg Boss 5: అచ్చం అలాగే లోబో చేయబోతున్నాడా?!

Published Sat, Sep 11 2021 7:47 PM | Last Updated on Sat, Sep 11 2021 9:42 PM

Bigg Boss 5 Telugu: Is Logo Is Same Like First Season Sampoornesh Babu - Sakshi

ప్రముఖ బుల్లితెర రియాలిటీ షో బిగ్‌బాస్‌ను ప్రేమించే వారు ఎంతమంది ఉంటారో అదంతా చెత్త అంటూ ఏకిపారేసే వారు కూడా అంతే ఉంటారు. ఇక బిగ్‌బాస్‌ హౌజ్‌ అడుగుపెట్టే వారిలో కూడా ఈ షో అంటే ఇష్టంలేని వారే ఉన్నారు. కంటెస్టెంట్స్‌గా వచ్చిన కొంతమంది గతంలో బిగ్‌బాస్‌ షోపై విమర్శలు చేసిన వారున్నారు. అందులో లోబో ఒకడు. గతంలో బిగ్‌బాస్‌ అంటే తనకు అసలు నచ్చదంటూ,  ఆఫర్‌ వచ్చినా కూడా చేయనని ఓ ఇంటర్వ్యూలో చెప్పిన లోబో పాత వీడియో ఇటీవల బయటకు వచ్చిన సంగతి తెలిసిందే. దీంతో నెటిజన్లు అతడిని ఆటాడేసుకుంటున్నారు.

చదవండి: ఈ గేములు సెట్టయితలే, పోయి దుకాణంలో కూర్చుంట: లోబో

ఇదిలా ఉంటే ఇప్పుడు బిగ్‌బాస్‌ సీజన్‌ 5తో హౌజ్‌లో అడుగు పెట్టిన లోబో మొదటి రెండు, మూడు రోజులు బాగానే అలరించాడు. తన కామెడీతో ఇంటి సభ్యులను, ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించాడు. అయితే పవర్‌ రూం టాక్స్‌లో భాగంగా లోబో, షణ్ముక్‌ జస్వంత్‌కు పనివాడిగా మారిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో షణ్ముక్‌ లోబోను గట్టిగా వాడాడు. అతడు మాత్రమే కాకుండా రవి కూడా లోబోతో పనులు చేయించుకున్నాడు. దీంతో స్మోక్‌ రూంలో లోబో తనతోటి కాదంటూ ఆవేదన వ్యక్తం చేశాడు. ఇదంతా ఏందీ, ఇది నేను కాదు. నాతోని కాదు. నాకు అసలు బిగ్‌బాస్‌ నచ్చదు. ఇది నా టేస్ట్‌ కాదు. ఇక్కడ ఉండలేకపోతున్నా’ అంటూ బాధపడ్డాడు. 

చదవండి: బిగ్ బాస్ షో పై తీవ్రస్థాయిలో మండిపడ్డ సిపీఐ నారాయణ

అయితే తొలి సీజన్‌లో సంపూర్ణేశ్‌ బాబు సెల్ఫ్ ఎలిమినేషన్ అందరికీ గుర్తుండే ఉంటుంది కదా. రెండు వారాలు కూడా కాక ముందే తాను ఇక్కడ ఉండలేకపోతున్నానని, ఇంటికి పంపించేయండంటూ కన్నీరు పెట్టుకున్నాడు. దీంతో బిగ్‌బాస్ అతడిని మధ్యలోనే ఇంటికి పంపించేశాడు. ఇప్పుడు లోబో పరిస్థితి కూడా అదే అనిపిస్తుంది. చూస్తుంటే ఇంట్లో పరిస్థితులను లోబో అసలు తట్టుకోలేకపోతున్నాడేమో అనిపిస్తుంది. ఇలాగే ఉండే లోబో రాబోయే రెండు మూడు వారాల్లోనే బయటకు వచ్చేస్తాడ‌ని నెటిజన్లు అంచనా వేస్తున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement