
సిరి, షణ్నుతో ఫ్రెండ్‌షిప్ చేసి జెస్సీ హౌస్‌లో కంటిన్యూ కావాలనుకుంటున్నాడా? అన్న ప్రశ్నకు అతడో స్వార్థపరుడని పెదవి విరిచాడు.
Bigg Boss Buzz, Lobo Interview: ఎంటర్‌టైనర్ ఆఫ్ హౌస్‌గా పేరు తెచ్చుకున్నాడు లోబో. మొదట్లో తెగ నవ్వించినా రానురానూ డల్ అయిపోయాడు. ఆరోవారం ఫేక్ ఎలిమినేషన్ ద్వారా హౌస్ బయటకు వచ్చేసిన లోబో తాజాగా అరియానా గ్లోరీ వ్యాఖ్యాతగా వ్యవహరించే బిగ్‌బాస్ బజ్‌కు హాజరయ్యాడు. ఈ సందర్భంగా అతడు తన దోస్త్ రవిని పదేపదే ఎందుకు నామినేట్ చేయాల్సి వచ్చిందో చెప్పాడు.
అందరూ కొత్త ముఖాలే అని, అందుకే తనకు తెలిసిన రవిని నామినేట్ చేశానని సింపుల్‌గా చెప్పేశాడు. కాజల్ బిగ్‌బాస్ హౌస్‌లో సంవత్సరం ఉండమన్నా ఉంటుందని కామెంట్ చేశాడు. సిరి, షణ్నుతో ఫ్రెండ్‌షిప్ చేసి జెస్సీ హౌస్‌లో కంటిన్యూ కావాలనుకుంటున్నాడా? అన్న అరియానా ప్రశ్నకు అతడో స్వార్థపరుడని పెదవి విరిచాడు. షణ్నుకు డిఫరెంట్ యాటిట్యూడ్ ఉందని, తనకు గేమ్ ఎలా ఆడాలో బాగా తెలుసని చెప్పుకొచ్చాడు.
చెటాకు మాటకు నాలుగు లక్షల మాటలు చెప్పుడు వద్దే వద్దని రవికి సూచించాడు. సిరి.. ఓ పక్క చేసేది చేస్తూనే ఒర్రుతుందన్నాడు. ఇక ఆమె షణ్నుకు చేసే సపర్యల గురించి చెప్తూ.. షణ్ను లేవగానే చేతికి బ్రష్ అందిస్తుంది. అన్ని పనులు చేసి పెడుతుంది. అతడికి వచ్చే భార్య కూడా ఇంతలా చేయకపోవచ్చు. మరోసారి ప్రజల వల్లే తానీ స్టేజీలో ఉన్నానని చెప్తూ ఎమోషనల్ అయ్యాడు లోబో. ప్రస్తుతం ఈ ఇంటర్వ్యూ వీడియో వైరల్‌గా మారింది.