
బిగ్‌బాస్ షోలో కంటెస్టెంట్లను వెంటాడేవి ఎలిమినేషన్స్. ప్రతివారం ఎవరో ఒకరు హౌస్ నుంచి వెళ్లిపోవాల్సిందే! ఇప్పటికే సరయు, ఉమాదేవి, లహరి, నటరాజ్ మాస్టర్, హమీదా వరుసగా ఎలిమినేట్ అవుతూ వచ్చారు. ఇప్పటివరకు ఐదుగురు ఎలిమినేట్ అయితే అందులో నలుగురు అమ్మాయిలే కావడం గమనార్హం. దీంతో ఈ వారం అమ్మాయిని పంపిస్తారా? లేదా అబ్బాయిని వెళ్లగొడతారా? అన్నది ఆసక్తికరంగా మారింది.
ఆరోవారం జరిగిన నామినేషన్స్‌లో శ్రీరామ్ చంద్ర, సిరి, లోబో, విశ్వ, షణ్ముఖ్ జస్వంత్, ప్రియాంక, యాంకర్ రవి, జెస్సీ, శ్వేతా, సన్నీ ఉన్నారు. వీరిలో లోబో, విశ్వ, శ్వేత డేంజర్ జోన్‌లో ఉన్నట్లు అనధికారిక పోల్స్‌లో వెల్లడైంది. అయితే విశ్వ టాస్కుల్లో విశ్వరూపం చూపిస్తూ మిగతా కంటెస్టెంట్లకు గట్టిపోటీ ఇస్తున్నాడు. లోబో.. మొదట్లో ఎంటర్‌టైన్ చేసినా తర్వాత పూర్తిగా సైలెంట్ అయిపోయాడు. కాకపోతే రవికి నమ్మిన బంటుగా ఉండటంతో యాంకర్ ఫ్యాన్స్ ఇతడిని సేవ్ చేసే అవకాశం ఉంది.
మిగిలిందల్లా శ్వేత.. ఆమెకు సోషల్ మీడియాలో పెద్దగా ఫ్యాన్ ఫాలోయింగ్ లేదు. పైగా షోలో హౌస్‌మేట్స్‌తో తరచూ గొడవకు దిగింది. ఇప్పటివరకు జరిగిన ఎలిమినేషన్స్ చూసినట్లైతే ఎక్కువగా గొడవపడిన వాళ్లే బిగ్‌బాస్‌కు దూరమవుతూ వచ్చారు. ఈ లెక్కన ఈ వారం సెట్ శ్వేత ఎలిమినేట్ అయినట్లు లీకువీరులు నెట్టంట ప్రచారం చేస్తున్నారు. అంతేకాదు, తాజాగా రిలీజైన ప్రోమోలో ప్రియ, లోబోలలో ఒకరిని ఎలిమినేట్ చేస్తున్నట్లు ఊదరగొట్టాడు నాగ్. నిజంగానే ఇందులో ఒకరిని ఎలిమినేట్ చేశారట, కాకపోతే అది ఫేక్ ఎలిమినేషన్! లోబోను ఎలిమినేట్ చేసినట్లే చేసి సీక్రెట్ రూమ్‌కు పంపించారట. మరి సీక్రెట్ రూమ్‌ను లోబో తనకు ఎలా అనుకూలంగా మార్చుకుంటాడు, గేమ్‌ను ఎలా టర్న్ చేస్తాడన్నది చూడాలి!
Comments
Please login to add a commentAdd a comment