
Bigg Boss 5 Telugu, 6th Week Elimination: బిగ్‌బాస్ తెలుగు ఐదో సీజన్‌లో ఆరో ఎలిమినేషన్‌కు రంగం సిద్ధమైంది. 19 మంది కంటెస్టెంట్లతో ప్రారంభమైన ఈ షోలో ఇప్పుడు 14 మంది మాత్రమే మిగిలారు. ఈ వారం వీరిలో నుంచి ఏకంగా 10 మంది నామినేట్ అయ్యారు. శ్రీరామచంద్ర, సిరి, లోబో, విశ్వ, షణ్ముఖ్, ప్రియాంక, సన్నీ, శ్వేత, యాంకర్ రవి, జెస్సీ నామినేషన్‌లో ఉన్నారు. మరి ఈ 10 మందిలో నుంచి హౌస్‌కు వీడ్కోలు పలికేదెవరు? అన్నది ఇంట్రస్టింగ్‌గా మారింది.
ఓటింగ్‌లో మొదటి నుంచి టాప్‌లో దూసుకుపోతున్నాడు షణ్ముఖ్ జశ్వంత్. దీంతో అతడు ఎలిమినేట్ అయ్యే ఛాన్స్ అంగుళం కూడా లేదు. ప్రతిసారి తప్పులు చేస్తూ అడ్డంగా దొరికిపోతున్న యాంకర్ రవికి కావాల్సినంత పాపులారిటీ ఉంది కాబట్టి అది అతడిని నీడలా రక్షిస్తోంది. సన్నీ, శ్రీరామ్‌కు కూడా భారీగానే ఓట్లు గుద్దుతున్నారు.. కనుక వీళ్లూ సేఫ్ జోన్‌లోనే ఉన్నట్లు లెక్క! సిరి, ప్రియాంక, జెస్సీ కూడా బయటకు వెళ్లేట్లు కనిపించడం లేదు. మిగిలిందల్లా శ్వేత, విశ్వ, లోబో. వీరిలో ఒకరిపై ఎలిమినేషన్ వేటు పడటం ఖాయంగా కనిపిస్తోంది. విశ్వ రెండోసారి కెప్టెన్‌గా గెలిచి సత్తా చాటడంతో అతడి గ్రాఫ్ ఒక్కసారిగా పెరిగిపోయింది. వరస్ట్ పర్ఫామర్‌గా ఎన్నికైన శ్వేత గ్రాఫ్ అమాంతం పడిపోయింది. ఈ లెక్కన శ్వేత హౌస్‌కు గుడ్‌బై చెప్పే అవకాశాలు పుష్కలంగా ఉన్నట్లు కనిపిస్తోంది. ఇది బిగ్‌బాస్.. ఇక్కడ ఏదైనా జరగొచ్చు, కాబట్టి ఎలిమినేషన్‌లో ఏం ట్విస్ట్ ఇస్తారో? ఎవరిని పంపించేస్తారో చూడాలి!
Comments
Please login to add a commentAdd a comment