నామినేషన్స్‌: ఆ ఇద్దరినీ చెడుగుడు ఆడేసిన శ్వేత | Bigg Boss Telugu 5 Promo: Swetha Varma Says Lobo, Hamida Fake | Sakshi
Sakshi News home page

Bigg Boss 5 Telugu: రవి దోస్తానాకు దండం పెట్టిన లోబో

Sep 13 2021 4:25 PM | Updated on Sep 13 2021 8:50 PM

Bigg Boss Telugu 5 Promo: Swetha Varma Says Lobo, Hamida Fake - Sakshi

సండే అసలైన ఫండే అంటాడు కింగ్‌ నాగార్జున. కానీ బిగ్‌బాస్‌ ప్రేమికులకు మాత్రం అసలు సిసలైన ఫండే సోమవారం అనే చెప్పుకోవాలి. కారణం.. నామినేషన్స్‌. కంటెస్టెంట్లు ఎంత కలిసిమెలిసి ఉన్నప్పటికి మండే వచ్చేసరికి మాత్రం నిజస్వరూపాలు బయటపడతాయి. వారి మధ్య ఉన్న చిన్న చిన్న గొడవలు కూడా విశ్వరూపం దాలుస్తాయి. కూల్‌ అనుకునేవారు కూడా కాళికా రూపం ఎత్తే అవకాశం ఉంటుంది. ఇందుకు ప్రత్యక్ష సాక్ష్యంగా నిలిచింది తాజా ప్రోమో.

ఇక రెండో వారం నామినేషన్స్‌ను బిగ్‌బాస్‌ వెరైటీగా నిర్వహించినట్లు తెలుస్తోంది. ఇంటిసభ్యులను రెండు టీములుగా విడగొట్టాడు బిగ్‌బాస్‌. లోబో.. మరోసారి యాంకర్‌ రవిని నామినేట్‌ చేశాడు. అతడి దోస్తానాకు దండం పెట్టేశాడు. అయితే లోబోతో స్నేహం వద్దని అతడు కట్టిన ఫ్రెండ్‌షిప్‌ బ్యాండ్‌ను పక్కన పడేసి అందరికీ షాకిచ్చింది శ్వేత.

ఎంతో కూల్‌గా కనిపించే శ్వేత నామినేషన్స్‌లో తన ఉగ్రరూపం చూపించడం చాలామందిని ఆశ్చర్యానికి గురి చేస్తోంది. ఇక తను నామినేట్‌ చేయాలనుకున్న కంటెస్టెంట్లను చెడుగుడు ఆడేసిందీ భామ. లోబో, హమీదా ఫేక్‌ అంటూ వారిని నామినేట్‌ చేసింది. ఆమె ఆవేశాన్ని ఆపడం అక్కడున్న ఎవరి వల్లా కాలేదని తెలుస్తోంది. మొత్తానికి ప్రోమో చూస్తుంటే ఈరోజు గొడవలు మామూలుగా లేవనిపిస్తోంది. మరి ఈ వారం ఎవరెవరు నామినేట్‌ అయ్యారనేది తెలియాలంటే ఎపిసోడ్‌ వచ్చేంతవరకు వెయిట్‌ చేయాల్సిందే!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement