Bigg Boss Telugu 5, Episode 51: రవి లోబోకు చాలా సపోర్ట్ చేస్తాడు, కానీ అతడు మాత్రం రవికి సపోర్ట్ చేయడు, ఫ్రెండంటాడు, కానీ పదేపదే నామినేట్ చేస్తాడు అని పింకీతో చెప్పుకొచ్చింది యానీ మాస్టర్. ఇంతలో లోబో నమాజ్ చేసుకుంటూ ఏడ్చేశాడు. దీంతో రవి అతడిని దగ్గరకు తీసుకుని ఓదార్చాడు. బిగ్‌బాస్ హౌస్‌లో కంటెస్టెంట్లు అడుగుపెట్టి 50 రోజులు పూర్తయిందన్న బిగ్‌బాస్.. మీకు ఎంతో ప్రియమైనవారి నుంచి లేఖను పొందే అవకాశం లభిస్తుందని ఊరించాడు. కానీ.. ఏదైనా దక్కించుకోవాలంటే ఇంకేదైనా వదులుకోవాల్సి వస్తుందని నామినేషన్ గురించి హింటిచ్చాడు. నామినేషన్ ప్రక్రియలో భాగంగా పోస్ట్ మ్యాన్ ఇద్దరు ఇంటిసభ్యులను పవర్ రూమ్‌కు పిలుస్తుంటాడు. వారి ముందున్న బ్యాగ్‌లోని రెండు లేఖల్లో ఒక్కరికి మాత్రమే లేఖ ఇచ్చి మిగతాది చింపివేయాల్సి ఉంటుంది. లెటర్ అందుకోలేనివాళ్లు నామినేట్ అయినట్లు లెక్క!
నాకు పుట్టకపోయినా నా దగ్గర కూడా ఒక బాబు ఉన్నాడు
మొదటగా పవర్ రూమ్‌లోకి వెళ్లిన మానస్, శ్రీరామ్‌లకు లోబో, ప్రియాంక లేఖలు అందాయి. దీంతో లోబో మాట్లాడుతూ.. తన భార్య గర్భవతి అని, అమ్మ ఆరోగ్యం ఎలా ఉందో తెలుసుకోవాలని ఉందంటూనే పింకీ కోసం తన లేఖను త్యాగం చేశాడు. కానీ ఉబికి వస్తున్న కన్నీళ్లను మాత్రం ఆపుకోలేకపోయాడు. తర్వాత షణ్ను- రవిలకు విశ్వ, సిరి లేఖలు అందాయి. అయితే విశ్వ కోసం తన ప్రియుడు శ్రీహాన్ రాసిన లేఖను ముక్కలు చేయడానికి సిద్ధపడింది సిరి. 'నాకు పుట్టకపోయినా నా దగ్గర కూడా ఒక బాబు ఉన్నాడు, కాబట్టి నీకు పుట్టిన పిల్లల కోసం ఎంత తపన ఉంటుందో నేను అర్థం చేసుకోగలను' అంటూ విశ్వకు లేఖ అందించమని చెప్తూ ఎమోషనల్ అయింది.
ఏడ్చేసిన శ్రీరామ్, ఓదార్చుతూ ముద్దులు పెట్టిన పింకీ
తర్వాత పింకీ- కాజల్‌కు యానీ మాస్టర్, మానస్‌ల లేఖలు అందాయి. యానీ పరిస్థితి అర్థం చేసుకున్న మానస్ తన లేఖను త్యాగం చేశాడు. కానీ పింకీ మాత్రం మానస్ లెటర్ ముక్కలవుతున్నందుకు ఎంతగానో బాధపడిపోయింది. విశ్వ-లోబోలకు రవి, శ్రీరామ్ లెటర్స్ వచ్చాయి. అయితే పెద్ద మనసు చేసుకున్న శ్రీరామ్.. రవి కోసం తన లెటర్‌ను వదులుకునేందుకు సిద్ధపడిపోయాడు. కానీ లోబో మాత్రం రవి తన ఫ్యామిలీని గుర్తు చేసుకునేందుకు బొమ్మ, టీ షర్ట్, లెటర్ ఉన్నాయి కాబట్టి శ్రీరామ్‌కే లెటర్ ఇవ్వాలన్నాడు, ఇందుకోసం రవిని ఒప్పించేందుకు ప్రయత్నించాడు. దీంతో రవి తన లెటర్‌ను చింపివేసి శ్రీరామ్‌కు వచ్చిన లేఖను చదివి వినిపించాడు. తర్వాత కాసేపటికి ఆ లేఖను పట్టుకుని ఒంటరిగా కూర్చున్న శ్రీరామ్ ఇల్లు గుర్తొచ్చి కన్నీళ్లు పెట్టుకున్నాడు. ఇది చూసిన పింకీ అతడి కన్నీళ్లు తుడిచి, హగ్గిచ్చి, బుగ్గపై ముద్దులు పెట్టింది.
అమ్మా, నువ్వే నా ఇన్‌స్పిరేషన్: షణ్ముఖ్
తర్వాత యానీ- సిరిలకు షణ్ముఖ్, కాజల్ లెటర్స్ వచ్చాయి. దీంతో మొదటిసారి కాజల్ తన కన్నీళ్లు ఆపుకోలేక గక్క్క పెట్టి ఏడ్చేసింది. ఇది చూసి కరిగిపోయిన షణ్ను కాజల్‌ను లెటర్ తీసుకోమన్నాడు. అయితే సిరి మాత్రం 'నేనెలాగో అందుకోలేకపోయాను, కనీసం నువ్వైనా తీసుకో' అంటూ ఏడ్చేసింది. కానీ షణ్ను అందుకు ఒప్పుకోకపోవడంతో అతడి లేఖ తునాతునకలైంది. ఇది చూసి దుఃఖాన్ని దిగమింగుకున్న షణ్ను.. 'అమ్మా, క్యాన్సర్‌ను జయించావు, అమ్మమ్మ చనిపోయినప్పుడు ఆ బాధ నుంచి కోలుకున్నావు, నువ్వే నా ఇన్‌స్పిరేషన్, నేను ఈ బాధలో నుంచి బయటపడతాను' అని చెప్పుకొచ్చాడు. కానీ లోపలకు వెళ్లి గుండెలోని భారాన్ని దించుకుంటూ గట్టిగా ఏడ్చేశాడు.
జెస్సీ కోసం త్యాగానికి పూనుకున్న శ్రీరామ్..
ఇక కెప్టెన్ సన్నీకి స్పెషల్ పవర్ లభించింది. దీని ద్వారా జెస్సీ లెటర్‌ను సన్నీ చేతిలో పెట్టాడు బిగ్‌బాస్. జెస్సీకి లెటర్ ఇచ్చి సేవ్ చేయాలంటే ఆల్‌రెడీ సేవ్ అయినవాళ్ల దగ్గరి నుంచి లేఖ అందుకోవాలని చెప్పాడు. దీంతో శ్రీరామ్.. జెస్సీ కోసం తన లేఖను త్యాగం చేసి నామినేట్ అయ్యేందుకు రెడీ అయ్యాడు. కానీ షణ్ను, సిరి, జెస్సీ.. శ్రీరామ్‌కు హగ్గిచ్చి దూరాన్ని చెరిపేసుకోవాలని రవి కండీషన్ పెట్టాడు. ఈ కండీషన్‌కు త్రిమూర్తులు ఒప్పుకోకపోగా మా మధ్య డిస్టబెన్స్ అంతా క్లియర్ అయిపోయిందని చెప్పడంతో రవి వెనక్కు తగ్గాడు. అలా శ్రీరామ్ నామినేషన్‌లోకి వెళ్లి జెస్సీని సేవ్ చేశాడు. తర్వాత కెప్టెన్ సన్నీకి లేఖ అందడంతో ఆనందంలో మునిగి తేలాడు. ఇంతటితో నామినేషన్ ప్రక్రియ పూర్తవగా రవి, లోబో, శ్రీరామ్, సిరి, షణ్ముఖ్, మానస్ నామినేట్ అయ్యారు.
Comments
Please login to add a commentAdd a comment