బిగ్‌బాస్-5లో ట్రాన్స్ జెండర్ కంటెస్టెంట్‌గా పరిచయం అయినా ప్రియాంక... తన అంద చందాలతో బిగ్ బాస్ హౌస్‌లోనే గ్లామర్ బ్యూటీగా అవతరించిన ప్రియాంక స్ట్రాంగ్ కంటెస్టెంట్‌గా మారింది. మానస్‌తో ఆమె నడిపే లవ్‌ట్రాక్.. ప్రేక్షకులకు తెగ నచ్చేసింది. వారిద్దరిపై మిగతా సభ్యులు వేసే పంచ్‌లు, జోకులు బాగా పేలుతున్నాయి. తాజా ఎపిసోడ్‌లో ప్రియాంక పెద్దబావ, చిన్నబావ, బుల్లిబావల విషయంలో రవి, లోబోల మధ్య జరిగిన సరదా సంభాషణ నవ్వులు పూయించాయి.
శ్రీరామ్‌ను పెద్ద బావ, మానస్‌ను చిన్నబావ అని, జెస్సీని బుల్లి బావ అంటూ ప్రియాంక చెప్పుకొచ్చింది. పెద్ద బావ ఒప్పుకోవడం లేదన్న.. కట్నం కావాలని అంటున్నాడు అన్నయ్య అంటూ యాంకర్ రవితో అంటే.. రెండో అన్నయను అడుగు అంటూ లోబో వద్దకు పంపించాడు రవి. లోబో మాట్లాడుతూ పింకికి బుల్లి బావ ఎవరు అనగా.. జెస్సీ అని రవి సమాధానం ఇచ్చాడు. అయితే వాడు కూడా క్యారెక్టర్‌లో ఉన్నాడా అంటూ లోబో ఆశ్చర్యం వ్యక్తం చేశారు. దాంతో జెస్పీ గాడికి నేనంటే చాలా ఇష్టం అంటూ ప్రియాంక చెప్పుకొచ్చింది. ‘నీ మాట వినని పెద్దబావ కాళ్లూచేతులు తీసేస్తాను’లోబో అంటే ‘అయ్యయ్యో అలా చేయవద్దు అన్నయ్య’అని ప్రియాంక రిక్వెస్ట్ చేసింది. చిన్నబావ అన్ని విషయాల్లోనూ అడ్జెస్ట్ అవుతాడు.. వాడిని ఇచ్చి పెళ్లి చేస్తాఅని లోబో చెప్పాడు. ‘నీకు కూడా అతడే కదమ్మా కావాల్సింది’అని రవి కౌంటర్ ఇవ్వడం నవ్వులు పూయించింది.
(చదవండి: బిగ్‌బాస్: ఎట్టకేలకు గెలిచిన షణ్ముఖ్.. చెమటలు కక్కిన శ్రీరామ్)
Comments
Please login to add a commentAdd a comment