![Bigg Boss 5 Telugu: Manas Act As A Priyanka Singh In Role Play Task - Sakshi](/styles/webp/s3/article_images/2021/12/7/shannu.jpg.webp?itok=orvETfcf)
బిగ్‌బాస్ ఐదో సీజన్ ముగింపు దశకు చేరుకుంది. 13 వారాలు దిగ్విజయంగా పూర్తి చేసుకున్న ఈ బిగ్ రియాల్టీ షోకి కొద్ది రోజుల్లో శుభం కార్డు పడనుంది. ప్రస్తుతం బిగ్‌బాస్ హౌస్‌లో ఆరుగురు మాత్రమే ఉన్నారు. వారిలో శ్రీరామ్ మినహా మిగతావారంతా నామినేషన్‌లో ఉన్నారు. ఇంట్లో ఉన్న ఆ ఆరుగురికి రోల్ ప్లే అనే టాస్క్‌లు ఇచ్చి నవ్వించే ప్రయత్నం చేస్తున్నాడు బిగ్‌బాస్.
ఈ టాస్క్‌లో భాగంగా మానస్ ప్రియాంకలా, సన్నీ మానస్‌లా మారిపోయి తమదైన కామెడీతో నవ్వులు పూయించారు. ముఖ్యంగా మానస్ అయితే.. అచ్చం ప్రియాంకలా ప్రవర్తిస్తూ ఆమెపై తనకు ఉన్న ప్రేమనంతా తీర్చుకున్నాడు. మానస్ పాత్రలో ఉన్న సన్నీతో మసాజ్ కూడా చేయించుకున్నాడు. మరోవైపు షణ్ముఖ్ జెస్సీలా మారి.. సిరిని ఓ రేంజ్‌లో ఆటపట్టించాడు. జెస్సీలా మాట్లాడుతూ.. సిరి ఓ ముద్దు అడిగాడు. దీంతో సిరిగా మారిన శ్రీరామ్ చేతులు అడ్డుపెట్టి షన్నూకు లిప్‌లాక్ ఇచ్చాడు. ఇక కాజల్ సన్నీలా మారి అతన్ని బాగానే ఇమిటేట్ చేశాడు. మొత్తానికి ఈ ప్రోమో చూస్తుంటే మంగళవారం ఎపిసోడ్‌లో నవ్వులే వర్షం కురిచేలా కనిపిస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment