siri
-
యాపిల్ స్పైగా ‘సిరి’..? రూ.814 కోట్లకు దావా
ప్రపంచ నం.1 సంస్థ యాపిల్(Apple) తన వర్చువల్ అసిస్టెంట్ ‘సిరి’ని వినియోగదారుల అనుమతి లేకుండా ఉపయోగించడానికి వీలు కల్పించిందని ఆరోపణలు ఎదుర్కొంది. ఈమేరకు అమెరికా ఫెడరల్ కోర్టులో దావా దాఖలైంది. యూజర్లకు తెలియకుండా సిరి మైక్రోఫోన్ సంభాషణలను రికార్డ్ చేసిందని, వాటిని ఇతరులతో పంచుకునే అవకాశం ఉందని దావాలో ఆరోపించారు.‘సిరి’ని యాపిల్ స్పైగా మార్చిందని దావాలో తెలిపారు. ఐఫోన్లు(IPhone), ఇతర డివైజ్‌ల యూజర్లపై సిరి నిఘా పెట్టిందని పేర్కొన్నారు. ఇది వినియోగదారుల వ్యక్తిగత గోప్యతకు, వారి నిబద్ధతకు యాపిల్ ద్రోహం చేయడమేనని దావా పేర్కొంది. ఈ విషయాన్ని యాపిల్ ధ్రువీకరించింది. దావా దాఖలు చేసినవారి వాదనలను ఖండించింది. యూజర్ ప్రైవసీ పట్ల నిబద్ధతతో ఉన్నట్లు తెలిపింది. కానీ కేసును పరిష్కరించాలనే ఉద్దేశంతో 95 మిలియన్ డాలర్లు(రూ.814 కోట్లు) చెల్లించడానికి అంగీకరిస్తున్నట్లు పేర్కొంది. ప్రతిపాదిత సెటిల్మెంట్కు సంబంధించిన వ్యాజ్యం ఈ వారం ప్రారంభంలో ఫెడరల్ కోర్టులో దాఖలు చేశారు. అయితే దీన్ని న్యాయమూర్తి ఆమోదించాల్సి ఉంది.ఇదీ చదవండి: ప్రపంచంలో అధిక వేతనం ఈయనకే..!అసలేం జరిగిందంటే..2014-22 వరకు యాపిల్ తన వర్చువల్ అసిస్టెంట్ ‘సిరి(Siri)’ని వినియోగదారుల అనుమతి లేకుండా ఉపయోగించడానికి వీలు కల్పించిందని ఆరోపణలు వచ్చాయి. యూజర్లకు తెలియకుండా సిరి మైక్రోఫోన్ సంభాషణలను రికార్డ్ చేసిందని, వాటిని ప్రకటనదారులతో పంచుకునే అవకాశం ఉందనేలా దావాలో ఆరోపించారు. ఈ దావా సమస్య పరిష్కారం అయితే సెప్టెంబర్ 17, 2014 నుంచి 2022 చివరి వరకు యాపిల్ ‘సిరి’ ఎనేబుల్డ్ పరికరాలను కలిగి ఉన్న లేదా కొనుగోలు చేసిన యూఎస్‌లోని యూజర్లకు ఈ సెటిల్మెంట్ మనీ అందుతుందని నిపుణులు చెబుతున్నారు. -
ప్రియుడితో బిగ్ బాస్ బ్యూటీ దీపావళి వేడుకలు (ఫోటోలు)
-
ముందుగానే యాపిల్ ఇంటెలిజన్స్ సూట్..?
సమగ్ర యాపిల్ ఇంటెలిజన్స్ సూట్ త్వరలోనే వినియోగదారులకు అందుబాటులోకి రాబోతున్నట్లు బ్లూమ్‌బర్గ్ నివేదించింది. ముందుగా మార్చి 2025 వరకు దీన్ని యాపిల్ ఉత్పత్తుల్లో తీసుకురావాలని సంస్థ గతంలో అధికారికంగా ప్రకటించింది. కానీ బ్లూమ్‌బర్గ్ నివేదిక ప్రకారం సంస్థ గతంలో అనుకున్న సమయం కంటే ముందుగానే యాపిల్ ఇంటెలిజన్స్ సూట్‌ను విడుదల చేయనున్నట్లు తెలిపింది.ఐఓఎస్ 18 సిరీస్‌లో యాపిల్ ఇంటెలిజన్స్ ద్వారా ‘సిరి’లో కొన్ని ఫీచర్లను అప్డేట్ చేయాలని భావిస్తోంది. అందుకు అనుగుణంగా మార్చి 2025 నాటికి ఐఓఎస్ 18.4 వెర్షన్లో సమగ్ర యాపిల్ ఇంటెలిజన్స్ సూట్‌ను అందుబాటులోకి తీసుకురాబోతున్నట్లు ప్రకటించింది. కానీ అంతకుముందే ఈ ఫీచర్లను వినియోగదారులకు అందించనున్నట్లు తెలిసింది. సంస్థ గతంలో ప్రకటించిన విధంగా ఐఓఎస్ 18 సిరీస్ వర్షన్లను ఎప్పుడు అప్డేట్ చేస్తారో తెలిపారు.అక్టోబర్ 2024: ఐఓఎస్ 18.1 ఏఐ ఫీచర్లు ప్రారంభిస్తారు.డిసెంబర్ 2024: ఐఓఎస్ 18.2తో కొన్ని అదనపు ఫీచర్లు ప్రవేశపెడుతారు.జనవరి 2025: ఐఓఎస్ 18.3తో ‘సిరి’ని మరింత మెరుగుపరుస్తారు.మార్చి 2025: ఐఓఎస్ 18.4తో సమగ్ర యాపిల్ ఇంటిలిజెన్స్ సూట్‌ను ప్రవేశపెడుతారు.బ్లూమ్‌బర్గ్ నివేదించిన ప్రకారంగా ముందుగానే యాపిల్ ఇంటిలిజెన్స్ సూట్‌ను ఆవిష్కరిస్తే పైన తెలిపిన ఐఓఎస్ వర్షన్ల విడుదల తేదీల్లో మార్పులుండే అవకాశం ఉంటుంది.ఇదీ చదవండి: కొత్తగా ఉద్యోగంలో చేరారా..? ఇవి తెలుసుకోండి..యాపిల్ ఇంటెలిజన్స్ ‘సిరి’లో గణనీయ మార్పులు చేయబోతున్నట్లు మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి. అందులో ప్రధానంగా సిరి సందర్భోచితంగా వినియోగదారుల అవసరాలు తీర్చనుంది. ఉదాహరణకు మీ స్నేహితుడు మొబైల్లో మీకు తన కొత్త చిరునామాను పంపితే ‘ఈ చిరునామాను తన కాంటాక్ట్ కార్డ్‌కు యాడ్ చేయమని’ చెబితే సిరి ఆ పని పూర్తి చేస్తుంది. సుదీర్ఘ ఈమెయిళ్లు చదవడం సమయంతో కూడుకున్న వ్యవహారం. సిరి సాయంతో దాని సారాంశాన్ని తెలుసుకోవచ్చు. అందుకు అనుగుణంగా రిప్లై ఇవ్వొచ్చు. వీటితోపాటు మరిన్ని ఫీచర్లను అందుబాటులోకి తీసుకురాబోతున్నట్లు మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. సంస్థ అధికారికంగా ప్రకటించిన తర్వాతే కంపెనీ అందించే ఫీచర్లపై స్పష్టత వస్తుంది. -
Bigg Boss Siri Birthday Photos: బిగ్‌బాస్ సిరి బర్త్ డే ఎంత గ్రాండ్ గా చేసుకుందో చూడండి (ఫోటోలు)
-
Siri Hanumanth: పెళ్లి కూతురైన బ్యూటీ సిరి..చూపుతునే చంపేస్తుందిగా! (ఫోటోలు)
-
హే ‘సిరి’ పేరు మారుతోంది!
అమెరికన్ టెక్ దిగ్గజం యాపిల్ కీలక నిర్ణయం తీసుకుంది. తన ఫోన్లోని వాయిస్ అసిస్టెంట్ ‘హే సిరి’ని..‘సిరి’గా మార్చనుంది. తద్వారా యూజర్లకు కావాల్సిన సమాచారాన్ని మరింత వేగవంతంగా ఇవ్వొచ్చని యాపిల్ యాజమాన్యం భావిస్తోంది. అందుకే తన వాయిస్ అసిస్టెంట్ పేరును కుదిస్తుంది. ఈ చిన్న పేరును మార్చేందుకు యాపిల్ కఠినంగా శ్రమిస్తున్నట్లు తెలుస్తోంది. యాపిల్ చేయబోతున్న మార్పులపై బ్లూమ్ బెర్గ్ ప్రతినిధి మార్క్ గుర్మాన్ చెప్పినట్లుగా దివెర్జ్ కథనాన్ని ప్రచురించింది. అందులో యాపిల్ గత కొన్ని నెలలుగా సిరి ఫీచర్‌పై హార్డ్ వర్క్ చేస్తోందని, వచ్చే ఏడాది లేదా 2024లో ఈ కొత్త ఫీచర్‌ను విడుదల చేయొచ్చుని గుర్మాన్ పేర్కొన్నారు. అదే జరిగితే ఐఫోన్ వినియోగదారులు సిరి అని పిలవాల్సి ఉంటుందని అన్నారు. హే’ను తొలగించడానికి కారణం యాపిల్ సంస్థ అమెజాన్, మైక్రోసాఫ్ట్,గూగుల్ సంస్థల తరహాలో వాయిస్ అసిస్టెంట్ మరింత సులభం మార్చేందుకు ఈ మార్పులు చేస్తున్నట్లు తెలుస్తోంది. గతంలో అమెజాన్ వాయిస్ అసిస్టెంట్ హే అలెక్సా, మైక్రోసాఫ్ట్ హే కోర్టానా, గూగుల్ హే గూగుల్ ఇలా రెండు అక్షరాలతో వాయిస్ అసిస్టెంట్ పనిచేసేలా ఫీచర్‌ను బిల్డ్ చేశాయి. క్రమేపీ యూజర్ల ఈ వాయిస్ అసిస్టెంట్‌ను సిరి అని పిలించేందుకు ఇష్టపడుతున్నారు. వారి కోసం హే అనే పదాన్ని తొలగించి అలెక్సా, కోర్టానా అని జోడించాయి. ఇప్పుడు ఆ సంస్థల తరహాలో యాపిల్ సైతం తన వాయిస్ అసిస్టెంట్ హే సిరిని కాస్తా.. సిరిగా మార్చనుంది. -
Bigg Boss 6: నువ్వు ఉన్నావన్న ధైర్యం ఇవ్వు సిరి.. శ్రీహాన్ ఎమోషనల్
బిగ్‌బాస్-6లో ఎంటర్టైన్మెంట్తో పాటు బోలెడం ఎమోషనల్ జర్నీ కూడా కనిపిస్తుంది. ఈవారం బిగ్‌బాస్ పుట్టినరోజు వేడుకల్లో భాగంగా ఇంటిసభ్యులందరూ బిగ్‌బాస్ కోరికలన్నీ తీర్చడానికి ప్రయత్నించారు.దీంతో హౌస్మేట్స్ కోరికలు ఏంటో తెలుసుకోవాలనుకుంటున్నట్లు బిగ్‌బాస్ తెలిపాడు. ఇందులో భాగంగా హౌస్మేట్స్ తమ కోరికలను బయటపెట్టారు. సిరి..షూట్స్‌తో ఎంత బిజీగా ఉన్నా సరే ఒక్కసారైనా మా అమ్మానాన్నలకు ఫోన్ చేసి ఎలా ఉన్నారో కనుక్కో అని చెబుతూ శ్రీహాన్ ఎమోషనల్ అవుతాడు. ఏం జరిగినా చూసుకోవడానికి నువ్వు ఉన్నావన్న ధైర్యం ఇవ్వమని బిగ్‌బాస్ వేదికగా అడుగుతాడు. ఇక సుదీప తన భర్తను మిస్ అవుతున్నానని, అతని ఫోటోతో పాటు టీషర్ట్ ఇవ్వాల్సిందిగా కోరుకుంది. ఇక తన తండ్రి గురించి చెబుతూ అర్జున్ కన్నీళ్లు పెట్టుకుంటాడు. డాడీలా నిన్ను చూసుకోలేను కానీ డాడీ లేని లోటు చూసుకుంటానంటూ ఇనయా బాగా ఎమోషనల్ అవుతుంది. మొత్తంగా ఇవాల్టి ఎపిసోడ్ చాలా ఎమోషనల్‌గా సాగనుందని అర్థమవుతుంది. మరి హౌస్మేట్స్ అందరి కోరికలు తెలియాలంటే పూర్తి ఎపిసోడ్ వచ్చేవరకు వేచి చూడాల్సిందే. చదవండి: Bigg Boss 6 : ట్రాక్ తప్పిన ఇనయా గేమ్.. పడిపోయిన ఓటింగ్ గ్రాఫ్ -
అదిరిపోయే స్మార్ట్ ఫ్యాన్..అమెజాన్ అలెక్సా, సిరి ఇంకా ఎన్నో ఫీచర్లు
ఇక్కడ ఫొటోలో ఉన్నది సాదా సీదా పెడెస్టల్ ఫ్యాన్లాగానే కనిపిస్తోంది గాని, ఇది స్మార్ట్ కూలింగ్ ఫ్యాన్. ఈ ఫ్యాన్ ఎయిర్ కూలర్ కంటే అమోఘంగా పనిచేస్తుంది. ‘నాష్ పీఎఫ్–1’ పేరుతో ఎలక్ట్రిక్ పరికరాల తయారీ సంస్థ ‘నాష్’ దీనికి రూపకల్పన చేసింది. ఈ ఫ్యాన్‌లోని సెన్సర్లు పరిసరాల్లోని ఉష్ణోగ్రతల పెరుగుదలను గుర్తించి, గది వేడెక్కక ముందే చల్లబరుస్తుంది. ఈ ఫ్యాన్ స్మార్ట్‌ఫోన్‌లోని గూగుల్ అసిస్టెంట్, అమెజాన్ అలెక్సా, సిరి వంటి యాప్స్ ద్వారా వాయిస్ కమాండ్లకు అనుగుణంగా స్పందిస్తుంది. వైఫై కనెక్షన్, స్మార్ట్‌ఫోన్ ఉంటే చాలు, ఈ ఫ్యాన్ చాలా స్మార్ట్‌గా పనిచేస్తూ, వేసవి ధాటిని ఏమాత్రం తెలియనివ్వదు. దీని ధర 249 డాలర్లు (రూ.19,817). -
దీప్తి సునయన బ్లాక్ చేసింది.. అప్పటివరకు వదలను: షణ్నూ
-
‘జీతం మాత్రం చక్కగా తీసుకుంటారు.. చేతకాకపోతే వెళ్లిపోండి’ జేసీ ఫైర్
సాక్షి, అనంతపురం: ‘జీతం మాత్రం చక్కగా తీసుకుంటున్నారు...బాధ్యత మాత్రం విస్మరిస్తున్నా రు. ఉన్నతాధికారుల నుంచి వచ్చిన అదేశాలు అమలు చేయాల్సిన బాధ్యత లేదా..? పనిచేయడం చేతకాకపోతే ఇళ్లకు వెళ్లిపోండి.’ అని జాయింట్ కలెక్టర్ అట్టాడ సిరి చెన్నేకొత్తపల్లి, వెంకటాంపల్లి పంచాయతీ కార్యదర్శులు అరుణ్ పాండే, యల్లప్పలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. బుధవారం ఆమె మండలంలోని వెంకటాంపల్లి, చెన్నేకొత్తపల్లి, ఓబుళంపల్లి గ్రామాల్లోని సచివాలయాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆమె వెంకటాంపల్లి, చెన్నేకొత్తపల్లి గ్రామాల్లోని చెత్త నుంచి సంపద తయారీ కేంద్రాలను సందర్శించారు. అవి మరీ అధ్వానంగా ఉండటంతో సంబంధిత పంచాయతీ కార్యదర్శుల కు మెమోలు జారీ చేయాలని ఎంపీడీఓను ఆదేశించారు. అనంతరం వెంకటాంపల్లి ప్రాథమిక పాఠశాలకు వెళ్లి మధ్యాహ్న భోజనాన్ని రుచి చూశారు. భోజనం సరిగా లేకపోవడంతో వెంటనే ఏజెన్సీ మార్చాలని ఎంఈఓ మల్లికార్జునకు సూచించారు. కార్యక్రమంలో స్థానిక సర్పంచులు జయరామిరెడ్డి, చెన్నారెడ్డి పాల్గొన్నారు. అనంతరం జేసీ సిరి కనగానపల్లి మండలంలోని మామిళ్లపల్లిలో పర్యటించి జలకళ పథకం ద్వారా రైతుల పొలాల్లో వేసిన బోరుబావులను పరిశీలించారు. చదవండి: అందరికీ సంక్షేమ ఫలాలు.. ప్రొద్దుటూరు బహిరంగ సభలో సీఎం జగన్ అధికారులు అందజేసిన నివేదికలోని కొలతల ప్రకారం బోరుబావి ఉందా? లేదా ? తెలుసుకునేందుకు పరమేశ్వరరెడ్డి పొలంలోని బోరుబావి లోతును కొలిపించారు. అనంతరం అధికారులు, రైతులతో జేసీ మాట్లాడుతూ ‘వైఎస్సార్ జలకళ’ పథకం మెట్ట ప్రాంత రైతులకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందన్నారు. బోర్లు తవ్వడం, విద్యుత్ సరఫరా పనులు త్వరగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. జేసీ వెంట ఏపీడీ పుల్లారెడ్డి, ఆర్డబ్ల్యూఎస్ అధికారులు, ఉపాధిహామీ సిబ్బంది, రైతులు ఉన్నారు. చదవండి: ఎమ్మెల్యే మద్దాల గిరి కుమారుని వివాహానికి హాజరైన సీఎం జగన్ -
బిగ్‌బాస్‌లోకి పింకీ.. మానస్‌తో మసాజ్ కూడా.. అదెలా అంటారా?
బిగ్‌బాస్ ఐదో సీజన్ ముగింపు దశకు చేరుకుంది. 13 వారాలు దిగ్విజయంగా పూర్తి చేసుకున్న ఈ బిగ్ రియాల్టీ షోకి కొద్ది రోజుల్లో శుభం కార్డు పడనుంది. ప్రస్తుతం బిగ్‌బాస్ హౌస్‌లో ఆరుగురు మాత్రమే ఉన్నారు. వారిలో శ్రీరామ్ మినహా మిగతావారంతా నామినేషన్లో ఉన్నారు. ఇంట్లో ఉన్న ఆ ఆరుగురికి రోల్ ప్లే అనే టాస్క్‌లు ఇచ్చి నవ్వించే ప్రయత్నం చేస్తున్నాడు బిగ్‌బాస్. ఈ టాస్క్‌లో భాగంగా మానస్ ప్రియాంకలా, సన్నీ మానస్‌లా మారిపోయి తమదైన కామెడీతో నవ్వులు పూయించారు. ముఖ్యంగా మానస్ అయితే.. అచ్చం ప్రియాంకలా ప్రవర్తిస్తూ ఆమెపై తనకు ఉన్న ప్రేమనంతా తీర్చుకున్నాడు. మానస్ పాత్రలో ఉన్న సన్నీతో మసాజ్ కూడా చేయించుకున్నాడు. మరోవైపు షణ్ముఖ్ జెస్సీలా మారి.. సిరిని ఓ రేంజ్లో ఆటపట్టించాడు. జెస్సీలా మాట్లాడుతూ.. సిరి ఓ ముద్దు అడిగాడు. దీంతో సిరిగా మారిన శ్రీరామ్ చేతులు అడ్డుపెట్టి షన్నూకు లిప్‌లాక్ ఇచ్చాడు. ఇక కాజల్ సన్నీలా మారి అతన్ని బాగానే ఇమిటేట్ చేశాడు. మొత్తానికి ఈ ప్రోమో చూస్తుంటే మంగళవారం ఎపిసోడ్లో నవ్వులే వర్షం కురిచేలా కనిపిస్తోంది. -
Bigg Boss: చివరి క్షణంలో బిగ్‌బాస్ ట్విస్ట్.. నామినేషన్స్‌లో ఐదుగురు
Bigg Boss 5 Telugu,10th Week Nomination List: బిగ్‌బాస్ హౌస్‌లో సోమవారం వచ్చిందంటే నామినేషన్స్‌తో హోరెత్తిపోతుంది. నామినేషన్స్ నుంచి తప్పించుకునేందుకు ఇంటి సభ్యులు చేయని ప్రయత్నాలు, కుట్రలు ఉండవు. అయితే పదోవారం మాత్రం నామినేషన్ ప్రక్రియని కాస్త డిఫరెంట్‌గా ప్లాన్ చేశాడు బిగ్ బాస్. కాజల్‌కు చెక్ పెట్టేందుకు ప్రయత్నించిన సిరి, రవిలో చివరకు బకరాలయ్యారు. యానీ మాస్టర్‌పై ప్రేమను పెంచుకున్న బిగ్‌బాస్.. ఆమెకు వరుసగా స్పెషల్ పవర్ ఇస్తూ ఇంటి సభ్యులకు షాకిచ్చాడు. దీంతో పదోవారం నామినేషన్స్‌లో ఐదుగురు ఉన్నారు. ఆ ఐదుగురు ఎవరు? వారు ఎలా నామినేట్ అయ్యారు? సిరి, రవిలు వేసిన ప్లాన్ ఏంటి? బిగ్‌బాస్ ఇచ్చిన ట్విస్టులేంటి? చదివేయండి. ప్రస్తుతం హౌజ్‌కి కెప్టెన్‌గా ఉన్నయానీ మాస్టర్ని ఎవరైన నలుగురు కంటెస్టెంట్స్‌ని నామినేట్ చేసి జైలులో కూడా పెట్టాలని ఆదేశించారు బిగ్ బాస్. దీంతో యానీ.. మానస్, కాజల్, సన్నీ, షణ్ముఖ్‌లను నామినేట్ చేసి జైలులో పెట్టింది.యానీ మాస్టర్ చేసిన నామినేషన్‌ని మార్చే అవకాశాన్ని మిగిలిన ఇంటి సభ్యులకు ఇచ్చారు బిగ్ బాస్. దీనిలో భాగంగా.. బజర్ మోగిన ప్రతిసారి లివింగ్ ఏరియాలో ఉన్న తాళాలను పట్టుకుని వాటి ద్వారా తమకి ఇష్టమైన వ్యక్తిని బయటకు తీసుకురావొచ్చు. అలా బయటకు వచ్చిన వ్యక్తి మరో ఇద్దరిని నామినేట్ చేస్తే.. వారిలో ఒకరి నామినేట్ అయి జైలుకు వెళ్లాలి. అయితే మొదట బజర్ మోగేసరికి పింకీ పరుగున వెళ్లి సంకెళ్లను చేజిక్కించుకుంది. వెంటనే మానస్‌ని జైలు నుంచి విముక్తి కల్పించింది. అయితే మానస్.. రవి, జెస్సీలను నామినేట్ చేయగా.. చివరికి ప్రియాంక, మానస్లు చర్చించి జెస్సీని జైలుకి పంపి నామినేట్ చేశారు. ఆ తర్వాతి బజర్‌కి సిరి తాళాలను దక్కించుకొని షణ్ముఖ్‌ని కాదని జెస్సీని బయటకు తీసుకొచ్చింది. అయితే తనను బయటకు తీసుకురావొద్దని ముందు సిరికి చెప్పాడు షణ్ముఖ్. అందుకే అతన్ని కాదని జెస్సీని విడిపించింది. బయటకు వచ్చిన జెస్సీ.. తిరిగి మానస్, ప్రియాంకలను నామినేట్ చేశాడు. ఫైనల్‌గా ఆ ఇద్దరిలో సిరి అందరూ ఊహించినట్టే సిరి మానస్‌ని నామినేట్ చేసింది. ఆ తరువాత జెస్సీ సంకెళ్లను చేజిక్కించుకుని షణ్ముఖ్ జైలు నుంచి బయటకు తీసుకుని వచ్చాడు. షణ్ముఖ్‌కి నామినేట్ చేసే చాన్స్ రావడంతో.. పింకీ, సిరిలను నామినేట్ చేశాడు. వారిలో ప్రియాంక జైలుకు వెళ్లింది. ఇక్కడ పింకీ, షణ్ముఖ్‌ల మధ్య చిన్నపాటి మాటల యుద్దం జరిగింది. కెప్టెన్‌గా ఉన్నప్పుడు ఆమె వల్ల చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నానని, కాబట్టి ఆమెను ఈ వారం ఎలిమినేషన్‌కి నామినేట్ చేస్తున్నానని చెప్పడం పట్ల బాగా హర్ట్ అయిన పింకీ.. ‘ఉన్న నలుగురిలో వేరే ఆప్షన్ లేదని నన్ను నామినేట్ చేయడం ఏమాత్రం కరెక్ట్ కాదు. నా పాయింట్లో నువ్వు కరెక్ట్ కాదు. తరువాత ఎప్పుడైనా నన్ను నామినేట్ చేయాలనుకుంటే సరైన కారణం ఇవ్వు’అంటూ అసహనం వ్యక్తం చేయగా.. ‘నా పాయింట్లో ఇదే కరెక్ట్.. నేను ఇలానే నామినేట్ చేస్తా. అది నా ఇష్టం’అంటూ షణ్ముఖ్ ఆగ్రహం వ్యక్తం చేశాడు. ఇక కాజల్‌పై పగ పెంచుకున్న సిరి ఈ సారి ఎలాగైనా ఆమెను నామినేషన్స్‌కి పంపాలని కుట్రపన్నింది. కాజల్‌ని నామినేషన్స్‌లో ఉంచాలంటే ఇలా గేమ్ ఆడాలంటూ.. రవి, శ్రీరామ్, షణ్ముఖలకు ట్రైనింగ్ ఇచ్చింది. సిరికి మద్దతుగా నిలిచాడు రవి. బజర్ మోగగానే తాళాలను దక్కించుకొని ప్లాన్ ప్రకారం.. పింకీని బయటకు తీసుకొచ్చాడు. ఆమె షణ్ముఖ్, జెస్సీలను నామినేట్ చేయడంతో ఫైనల్‌గా రవి జెస్సీని సేవ్ చేసి షణ్ముఖ్‌ని మళ్లీ జైలు లోపలికి పంపాడు. రవి ఇచ్చిన ప్లాన్ ప్రకారం.. శ్రీరామ్ తాళలను దక్కించుకొని కాజల్‌ని సేవ్ చేశాడు. దీంతో బయటకు వచ్చిన కాజల్.. సిరి, రవిలను నామినేట్ చేయగా.. శ్రీరామ్ సిరిని ఫైనల్ చేసి జైలుకు పంపాడు. ఇలా కాజల్‌ని జైలులో ఉంచాలని కుట్ర పన్నిన సిరి... చివరకు ఆమె వల్లే జైలుపాలై నామినేషన్స్‌లో నిలిచింది. మరోవైపు ఎలాంటి ఒప్పందం లేకుండా నిన్ను బయటకు తెచ్చానని.. నీకు చాన్స్ వస్తే సిరిని సేవ్ చేయాలని కాజల్‌పై ఒత్తిడి తెచ్చాడు శ్రీరామ్. దీనికి కాజల్ ఒప్పుకోలేదు. తన స్నేహితులైన మానస్, సన్నీలలో ఒకరిని బయటకు తెస్తానని చెప్పింది. అలా చెయ్యొద్దని, గతంలో లెటర్ త్యాగం చేసిన షణ్ముఖ్‌ని అయినా బయటకు తీసుకురా అని శ్రీరామ్ చెప్పడంతో.. కాజల్ అదే పని చేసింది. బయటకు వచ్చిన షణ్ముఖ్.. ట్విస్ట్ ఇస్తూ రవి, శ్రీరామ్‌లను నామినేట్ చేశాడు. ఈ ఇద్దర్లో కాజల్ చివరికి రవిని నామినేట్ చేసి జైలుకు పంపింది. చివరికి జైలులో మిగిలిన మానస్, సిరి, సన్నీ, రవిలు నామినేట్ కాగా.. అప్పుడే అయిపోలేదు.. ఇంకా ఉంది అన్నట్టు చివరిలో మరో ట్విస్ట్ ఇచ్చాడు బిగ్‌బాస్. కెప్టెన్ అయిన యానికి మరో పవర్ ఇచ్చాడు. నామినేట్ అయిన సభ్యులు కాకుండా మిగిలిన వారిలో ఒకరిని డైరెక్ట్‌గా నామినేట్ చేయమని ఆదేశించాడు. దీంతో యానీ అంతా ఊహించినట్లే కాజల్‌ని నామినేట్ చేసింది. దంతో పదోవారం నామినేషన్స్‌లో మానస్, సిరి, కాజల్, రవి, సన్నీ ఉన్నట్లు బిగ్‌బాస్ ప్రకటించారు. మరి ఈ ఐదురురిలో ఎవరు పదోవారం బయటకు వెళ్లారో చూడాలి. -
చేనేత మహిళ.. కలల నేతకు అద్దిన కళ
‘‘ఎన్నో చీరలు మగ్గం మీద నేస్తుంటాం. కానీ, ఒక్క చీర కూడా మేం కట్టుకోలేం. బయట దొరికే వందా, రెండు వందల రూపాయల సిల్క్ చీరలు కొనుక్కుంటాం. మా చేతుల్లో రూపుదిద్దుకున్న చీరల డిజైన్లు ఎంత అందంగా ఉన్నాయో కదా, అని ఒకటికి పదిసార్లు చూసుకుంటాం. కానీ, మేం కట్టుకునే చీరల అందం గురించి ఎన్నడూ పట్టించుకోం. అలాంటిది సిరి మేడమ్ మా చీర మాకే కొనిచ్చారు, మేం కట్టుకునేదాకా ఊరుకోలేదు’’ అంటూ విప్పారిన ముఖాలతో తెలిపారు నారాయణపేట్ చేనేత మహిళలు. ‘‘నెల రోజుల క్రితం తెలంగాణలోని నారాయణ్‌పేట్ చేనేత మహిళలను కలిసి, వారి చీరలు వారే కట్టుకున్నప్పుడు ఆ ఆనందాన్ని ఫొటోలుగా తీయాలనిపించింది. అలా తీసుకున్నాను కూడా. వీరికే ఇంకాస్త కట్టూ బొట్టూ మార్చితే మోడల్స్‌కి ఏ మాత్రం తీసిపోరు అనిపించింది. దాంతో ఈ ఆలోచనను సినిమాటోగ్రాఫర్ రఘు మందాటిని కలిసి, ఈ షూట్ ప్లాన్ చేశాను’’ అని వివరించారు ఫ్యాషన్ డిజైనర్ హేమంత్ సిరి. హ్యాండ్లూమ్ డే సందర్భంగా నిన్న హైదరాబాద్ స్టేట్ ఆర్ట్ గ్యాలరీలో ‘తాశ్రిక’ పేరుతో చేనేత మహిళల ఫొటో ప్రదర్శన, డాక్యుమెంటరీ ప్రదర్శించారు. ఈ సందర్భంగా చేనేతల పట్ల తనకున్న మక్కువను ‘సాక్షి’తో పంచుకున్నారు. ‘పుట్టి పెరిగింది అనంతపూర్ జిల్లాలోని హిందూపూర్‌లో. కళల లేపాక్షి మాకు దగ్గరే. హైదరాబాద్ నిఫ్ట్‌లో ఫ్యాషన్ డిజైనింగ్ చేశాను. పదహారు ఏళ్లుగా హ్యాండ్లూమ్స్‌తో డిజైన్స్ చేస్తున్నాను. చేనేతలతో యువతరం మెచ్చేలా మోడ్రన్ డ్రెస్సులను రూపొందించి, షోస్ కూడా ఏర్పాటు చేశాను. ఎప్పుడూ చేనేతలతో మమేకమై ఉంటాను కాబట్టి, వారి జీవితాలు నాకు బాగా పరిచయమే. ఆనందమే ముఖ్యం రోజుల తరబడి దారం పోగులను పేర్చుతూ ఒక్కో చీరను మగ్గం మీద నేస్తారు. ఒక్కో చీర 1200 రూపాయల నుంచి ధర ఉంటుంది. కానీ, అవి అంత సులువుగా అమ్ముడుపోవు. కుటుంబ పోషణ, పిల్లల చదువులకు వారి చేతి వృత్తే ఆధారం. చీర ఖరీదైనదని, వారెన్నడూ వాటిని కలలో కూడా కట్టుకోవాలనుకోరు. సాధారణ రోజుల్లోనే వారి కుటుంబ పరిస్థితులు ఎంత గడ్డుగా ఉంటాయో కళ్లారా చూశాను. అలాంటిది కరోనా సమయంలో చేనేత కుటుంబాల ఇబ్బందులు అన్నీ ఇన్నీ కావు. ఉపాధి లేక వారంతా ఎలా ఉన్నారో, వారి నేత చీరలన్నీ అలాగే మిగిలిపోయి ఉంటాయనుకొని ఒకసారి కలిసి వద్దామని వెళ్లాను. అక్కడి వారి పరిస్థితులన్నీ స్వయంగా చూశాక, ఆ మహిళల ముఖాల్లో కొంచెమైనా ఆనందం చూడాలనిపించింది. అలాగే, నాదైన కంటితో వారిని ఇంకాస్త కళగా చూపాలనుకున్నాను. నా స్నేహితుల్లో ఉన్న మేకప్, హెయిర్ స్టైలిస్ట్‌లతో మాట్లాడాను. ఈ క్రమంలో వారానికి ఒకసారి ఆ ప్రాంతానికి వెళ్లడం, అక్కడి మహిళలతో మాట్లాడటం, వాళ్ల కుటుంబ సభ్యుల్లో నేనూ ఒకదాన్నయిపోయాను. ఫొటో షూట్‌కి అనువైన ప్లేస్ కోసం ఆ చుట్టుపక్కల ప్రాంతాలన్నీ గాలించాం. ఒక ప్రాచీన దేవాలయం కనిపించింది. అక్కడే ఫొటో షూట్‌కి ప్లాన్ చేసుకున్నాం. పదిమంది చేనేత మహిళలను తీసుకొని ఉదయం 5 గంటలకే ఆ దేవాలయానికి చేరుకున్నాం. ముందే అనుకున్నట్టు డిజైనర్ బ్లౌజులు, ఆభరణాలు, మేకప్ సామగ్రి అంతా సిద్ధం చేసుకున్నాం. రెండు కళ్లూ సరిపోలేదు ముస్తాబు పూర్తయ్యాక ఆ చేనేత మహిళల ‘కళ’ చూస్తుంటే నాకే రెండు కళ్లు సరిపోలేదు. వారు చూపించిన ఎక్స్ప్రెషన్స్ అద్భుతం అనిపించింది. జాతీయస్థాయి మోడల్స్‌కి వీరేమాత్రం తీసిపోరు అనిపించారు. ఉదయం 5 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు ఫొటో, వీడియో షూట్ చేశాం. వారి అనుభవాలతో కలిపి డాక్యుమెంటరీ రూపొందించాం. ఈ గ్యాలరీలో ప్రదర్శించిన ఈ మహిళల ఫొటోలతో ఉన్న ఫ్రేమ్‌లు వారి వారి ఇళ్లలో ప్రత్యేకంగా ఉండబోతున్నాయి. ఈ ఫొటోషూట్, డాక్యుమెంటరీ అంతా స్వచ్ఛందంగా పూర్తిచేశాం. నా స్నేహితులు కూడా ఈ పనిలో ఆనందంగా పాలుపంచుకున్నారు. ఈ రంగంలో ఉన్నందుకు చేనేతకు నా వంతుగా ఏదైనా సాయం చేయాలనిపించింది. ఈ మహిళల ముఖాల్లో కనిపించిన కళ వీరి జీవితాల్లోనూ కనిపించాలి. చేనేతలను ఈ తరం మరింతగా తమ జీవనంలో భాగం చేసుకోవాలన్నదే నా ప్రయ త్నం’’ అని వివరించారు డిజైనర్ హేమంత్ సిరి. గ్యాలరీకి వచ్చినవారంతా అబ్బురంగా చేనేత మహిళల ఫొటోలు, డాక్యుమెంటరీని తిలకించడం, అక్కడే ఉన్న చేనేత మహిళలను ఆప్యాయంగా పలకరించడం, కొందరు చీరలు కొనుక్కోవడం, మరికొందరు మీ నుంచి మేమూ చీరల ఆర్డర్స్ తీసుకుంటాం అంటూ ఫోన్ నెంబర్లు అడిగి తీసుకొని వెళ్లడం.. అక్కడ ఉన్నంతసేపూ కళ్లకు కట్టింది. లేపాక్షి దేవాలయ కళను నారాయణ్‌పేట్ కాటన్ చీరల మీద డిజిటల్ ప్రింట్ చేయించి, డిజైన్ చేసిన ప్రత్యేకమైన చీరలు ఇవి. వీటితోనే డాక్యుమెంటరీ, ఫొటో షూట్ చేశాం. ఇందులో 30 ఏళ్ల నుంచి 60 ఏళ్ల వయసున్న మహిళలు పాల్గొన్నారు. వచ్చిన ఆలోచనలను వెంటనే అమల్లో పెట్టడం, అందుకు తగినట్టుగా నారాయణ్‌పేట్ మహిళలు ఆనందంగా సహకరించిన విధానం ఎప్పటికీ గుర్తుండిపోతుంది. – నిర్మలారెడ్డి, సాక్షి ఫీచర్స్ ప్రతినిధి -
డబ్బు తీసుకుంటే ఆస్పత్రి సీజ్ చేస్తా
సాక్షి, అనంతపురం: ‘ఆరోగ్య శ్రీ కింద రోగులకందించే వైద్య సేవలకు సంబంధించి రూ.వేలల్లో డబ్బులు వసూలు చేయడమేంటి? మరోసారి ఇలా చేస్తే ఆస్పత్రిని సీజ్ చేస్తా’ అంటూ నగరంలోని చంద్ర సూపర్ సెష్పాలిటీ ఆస్పత్రి నిర్వాహకుడు డాక్టర్ నిరంజన్‌రెడ్డిని జాయింట్ కలెక్టర్ డాక్టర్ సిరి హెచ్చరించారు. మంగళవారం చంద్ర ఆస్పత్రిలో జేసీ ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. ఆరోగ్య శ్రీ వార్డులో ఉండే వైద్యులు, స్టాఫ్‌నర్సులు, తదితర సిబ్బందిని బయటకు పంపి, రోగులతో ఆస్పత్రిలో అందే సేవలపై ఆరా తీశారు. శానిటేషన్, భోజనం తదితర సౌలభ్యాలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా వివిధ టెస్టింగ్‌ల పేరుతో బాలింత భాగ్యలక్ష్మి నుంచి రూ.4,200 వసూలు చేసిన విషయం వెల్లడైంది. మరో నలుగురి నుంచి కూడా అదనపు డబ్బు వసూలు చేసినట్లుగా రోగుల సంబంధీకులు ఆమె ఎదుట వాపోయారు. దీంతో ఆస్పత్రి నిర్వాహకుడు డాక్టర్ నిరంజన్‌రెడ్డి, ఆరోగ్య శ్రీ జిల్లా మేనేజర్ శివకుమార్‌పై జేసీ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆస్పత్రి నిర్వాహకులు వసూలు చేసిన రూ.4,200ను భాగ్యలక్ష్మీకి తిరిగి ఇప్పించారు. మిగిలిన వారికి కూడా డబ్బు చెల్లించాలని, మరోసారి ఇలాంటి పరిస్థితి పునరావృతమైతే ఉపేక్షించేది లేదన్నారు. (అనంత కలెక్టర్‌కు కేంద్రమంత్రి జవదేకర్ ప్రశంస) 61 ఆస్పత్రుల్లో సేవలన్నీ ఉచితమే జిల్లాలోని 61 ఆరోగ్య శ్రీ నెట్వర్క్ ఆస్పత్రుల్లో సేవలన్నీ ఉచితమేనని జేసీ సిరి స్పష్టం చేశారు. రోగుల మంచాల షీట్లు మార్చడం, బాత్రూంలను శుభ్రంగా ఉంచడం, నాణ్యమైన భోజనం అందించే బాధ్యత ఆయా ఆస్పత్రుల యాజమాన్యాలదేనన్నారు. ఆరోగ్య శ్రీ కింద అడ్మిషన్ అయిన రోగులకు అవసరమైన రోగ నిర్ధారణ పరీక్షలు ఉచితంగా చేయడంతో పాటు శస్త్రచికిత్సలు, డిశ్చార్జ్ సమయంలో మందులు కూడా ఇవ్వాలన్నారు. ఆరోగ్యశ్రీ ఆసరాలో భాగంగా రోగికందాల్సిన భృతిని సకాలంలో బ్యాంక్ ఖాతాలో జమ అయ్యేలా చూడాలన్నారు. కోవిడ్‌పై నిర్లక్ష్యం వద్దు అనంతపురం అర్బన్: జిల్లాలో కోవిడ్ తగ్గుముఖం పట్టిందని నిర్లక్ష్యం చేస్తే ప్రమాదం తప్పదని, ఈ నెల 30వ తేదీ వరకూ చైతన్య కార్యక్రమాలు నిర్వహించాల్సిందేనంటూ వైద్యాధికారులకు జేసీ డాక్టర్ సిరి సూచించారు. కోవిడ్–19 అంశంపై మంగళవారం కలెక్టరేట్లోని రెవెన్యూభవన్‌లో వైద్యాధికారులు, నోడల్ అధికారులతో ఆమె సమీక్షించారు. నవంబరు 2వ తేదీ నుంచి పాఠశాలలు పునఃప్రారంభం కానున్న నేపథ్యంలో అన్ని పాఠశాలల్లో జాగ్రత్త చర్యలు చేపట్టాలన్నారు. బుధవారం ఉదయం 9.30 గంటలకు జిల్లా స్థాయి నుంచి గ్రామ స్థాయి వరకూ చైతన్య ర్యాలీలు చేపట్టాలన్నారు. 22న దుకాణాల్లో కోవిడ్ నిబంధనలు అమలుపై తనిఖీలు చేపట్టాలన్నారు. 23న సినిమా హాళ్ల వద్ద అవగాహన హోర్డింగ్‌లు, పోస్టర్లు, స్టిక్కర్లు ప్రదర్శించాలన్నారున. 24న హోటళ్లు, రెస్టారెంట్లు, షాపింగ్ మాల్స్ యాజమానులతో సమావేశం, 25న సచివాలయాల పరిధిలో అవగాహన కార్యక్రమాలు, 26న ఐఏసీ కార్యక్రమాల, మతపెద్దలతో సమావేశాలు, 27న మాస్‌్కలు, శానిటైజర్ల పంపిణీ, 28న విద్యార్థులకు ఆన్లైన్, ఆఫ్‌లైన్‌లో పోటీలు, 30న కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించాలన్నారు. సమావేశంలో ఇన్చార్జి డీఎంహెచ్ఓ పద్మావతి, ఇతర అధికారులు పాల్గొన్నారు. -
జాయింట్ కలెక్టర్‌గా అట్టాడ సిరి
అనంతపురం అర్బన్: జిల్లా జాయింట్ కలెక్టర్ (విలేజ్, వార్డు సెక్రటేరియెట్ అండ్ డెవలప్మెంట్)గా అట్టాడ సిరి(ఐఎస్ఎస్)ని ప్రభుత్వం నియమించింది. ఈ మేరకు మంగళవారం జీఓ 849ను రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని జారీ చేశారు. పోస్టింగ్ కోసం ఎదురు చూస్తున్న ఆమెను జాయింట్ కలెక్టర్‌గా నియమించారు. అయితే గతంలో ఇదే స్థానంలో ఉపాధి, శిక్షణ డైరెక్టర్‌గా ఉన్న బి.లావణ్యవేణిని ప్రభుత్వం నియమించింది. తాజాగా ఆమెకు బదులు ఎ.సిరిని నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. -
ఓ వైపు కూతురు మరణం, మరోవైపు కొడుకు గాయాలు
వర్గల్(గజ్వేల్): వేములవాడలో దైవదర్శనం చేసుకుని వస్తున్న కుటుంబాన్ని ప్రమాదం వెంటాడింది. కారు టైరు పగిలి అదుపుతప్పి కల్వర్టును ఢీకొనడంతో పదమూడేళ్ల కూతురు అక్కడికక్కడే దుర్మరణం చెందింది. కారు నడుపుతున్న తండ్రితోపాటు, తల్లి, కొడుకు గాయాలపాలయ్యారు. ఈ సంఘటన ఆదివారం సాయంత్రం వర్గల్ మండలం సింగాయపల్లి క్రాస్‌రోడ్డు సమీపంలో రాజీవ్ రహదారిపై జరిగింది. గౌరారం ఎస్సై వీరన్న తెలిపిన సమాచారం ప్రకారం సికింద్రాబాద్ దమ్మాయిగూడకు చెందిన అడ్వకేట్ రవి శనివారం సాయంత్రం భార్య ప్రతిమ, కూతురు సిరి (13), కుమారుడు సాత్విక్ (7)లతో కలిసి దైవదర్శనం నిమిత్తం వేగన్ ఆర్ కారులో బయల్దేరారు. దైవదర్శనం అనంతరం ఆదివారం ఇంటికి తిరుగు ప్రయాణమయ్యారు. వర్గల్ మండలం సింగాయపల్లి క్రాస్‌రోడ్డు సమీపంలో కారు టైరు పేలి అదుపుతప్పి రోడ్డు పక్కన ఉన్న కల్వర్టును బలంగా ఢీకొట్టి అమాంతం రోడ్డుపై పడిపోయింది. వెనక సీటులో కూర్చున్న సిరి తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే దుర్మరణం చెందింది. సాత్విక్ గాయాలపాలయ్యాడు. కారు నడుపుతున్న రవి, అతని భార్య ప్రతిమ స్వల్పంగా గాయపడ్డారు. ఓ వైపు కూతురు మరణం, మరోవైపు కొడుకు గాయాలపాలవడంతో వారు ఒకింత షాక్‌కు గురయ్యారు. క్షతగాత్రులను 108 అంబులెన్స్‌లో సికింద్రాబాద్ లోటస్ ఆస్పత్రికి తరలించారు. బాలిక మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గజ్వేల్ మార్చురీకి తరలించారు. ప్రమాదానికి సంబంధించి ఫిర్యాదు అందలేదన్నారు. -
ఆపిల్ నుంచి ఆ కాంట్రాక్టర్ల తొలగింపు
శాన్ఫ్రాన్సిస్కొ: ప్రముఖ మొబైల్ తయారీదారు ఆపిల్‌కు ‘సిరి’ కాంట్రాక్టర్లు కొత్త తలనొప్పులు తీసుకొచ్చారు. దీంతో ఆపిల్ కంపెనీ ఐర్లాండ్‌లోని తమ సంస్థలో పని చేస్తున్న దాదాపు 300 కాంట్రాక్టు ఉద్యోగులను తొలగించినట్లు ప్రకటించింది. తమ వినియోగదారులకు చెందిన సున్నితమైన విషయాలను 'సిరి' పోగ్రామ్ కాంట్రాక్టర్లు రహస్యంగా విని, ఆపిల్ సేవలను దుర్వినియోగ పరచిన కారణంగా వారిని తొలగించడంతో యూరప్ వ్యాప్తంగా ఈ విషయం చర్చనీయాంశయైంది. ఆపిల్‌తో ఒప్పందం కుదుర్చుకున్న కాంట్రాక్టర్లు, వినియోగదారులు - సిరితో చేసిన సంభాషణలు విని అది ఇచ్చే రెస్పాన్స్‌లో అవసరమైన మార్పులు చేయాలి. కానీ వారు వినియోగదారులు మాట్లాడుకునే వ్యక్తిగత శృంగార సంభాషణలు, డ్రగ్స్, బిజినేస్ డీల్స్‌ను కాంట్రాక్టర్లు పదేపదే విన్నారనే ఆరోపణలు వచ్చాయి. దీనిపై దుమారం రేగడంతో ఆపిల్ కంపెనీ వెంటనే సిరి గ్రేడింగ్ ప్రోగ్రామ్‌ను నిలిపివేసి కాంట్రాక్టర్లపై కొరడా ఝళిపించింది. తమ వినియోగదారులకు మెరుగైన సేవలు అందించాలనే ఉద్దేశ్యంతో తీసుకొచ్చిన ‘సిరి’ సేవలను కాంట్రాక్టర్లు దుర్వినియోగం చేశారని, వాటిలో రికార్డైన సంభాషణలను రహస్యంగా వింటున్నారని ఓ ప్రజావేగు(విజిల్ బ్లోయర్) గార్డియన్ పత్రిక ద్వారా తెలపడంతో వినియోగదారులు షాక్‌కు గురయ్యారు. దీనిపై ఆపిల్ వివరణ ఇస్తూ ‘తమ కంపెనీ ప్రధానంగా వినియోగదారుని భద్రతకి ప్రాధాన్యం ఇస్తుందని, ఈ ఘటనపై వినియోగదారులను క్షమాపణలు కోరుతున్నామని’ తెలిపింది. అంతేకాక సదరు కాంట్రాక్టర్లతో కుదుర్చుకున్న ఒప్పందాన్ని రద్దు చేసుకున్నామని వివరణ ఇచ్చింది. -
న్యూస్ రీడర్ నుంచి సీరియల్ నటిగా!
‘టీవీలో యాంకరింగ్ చేశాను. న్యూస్‌రీడర్‌గా పనిచేశాను. ఇప్పుడు సినిమాలు, సీరియల్స్‌లో వర్క్ చేస్తున్నాను.నటిగా మంచి పేరు తెచ్చుకోవాలన్నదే నా ముందున్న లక్ష్యం’ అంటున్న సీరియల్ నటి సిరి చెబుతున్న ముచ్చట్లివి. ‘‘మాది వైజాగ్. పుట్టి పెరిగింది అక్కడే. డిగ్రీ తర్వాత హైదరాబాద్‌కి వచ్చేశాను. అమ్మ, నేను, అన్నయ్య.. ఇదీ మా కుటుంబం. మా నాన్నగారు చిన్నప్పుడే చనిపోవడంతో అమ్మ చిన్న కిరాణా షాపు పెట్టి, అలా వచ్చిన ఆదాయంతో మమ్మల్ని పెంచింది. ఇప్పుడు ఎంబీయే చేస్తూనే సీరియల్స్‌లో నటిస్తున్నాను. సినిమా అవకాశాల కోసం ట్రై చేస్తున్నాను. అన్నయ్య ఫొటోగ్రఫీ వర్క్ చేస్తున్నాడు. మా బలం అమ్మనే. అగ్నిసాక్షి ఇప్పటి వరకు మూడు సినిమాలలో అవకాశాలు వస్తే చేశాను. ‘అగ్నిసాక్షి’ సీరియల్‌కి ముందు ‘ఉయ్యాల జంపాల’, ‘ఎవరేమోహినీ’లో వర్క్ చేశాను. ఇప్పుడు అగ్నిసాక్షిలో ప్రాధాన్యం ఉన్న రోల్లో నటిస్తున్నాను. సిరిగా ఇప్పుడు అందరిలోనూ మంచి గుర్తింపు వస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది. డిగ్రీ చేస్తూనే యాంకరింగ్ వైపు నేను టీవీలో, సినిమాలో కనిపించడం అమ్మకు నచ్చలేదు. ఈ ఫీల్డ్ అంటే ఉన్న సందేహాలు, నాన్న లేకపోవడంతో మేం భవిష్యత్తులో ఎలా నిలదొక్కుకుంటామో అనే భయాల వల్ల మొదట్లో అమ్మ ఒప్పుకోలేదు. కానీ, నాకు చిన్నప్పటి నుంచి ఆన్‌స్క్రీన్ అంటే బాగా ఇష్టం. అలా డిగ్రీ చేస్తూనే యాంకరింగ్ వైపుకు వచ్చాను. ఆ తర్వాత న్యూస్రీడర్గానూ వర్క్ చేశాను. పది వరకు షార్ట్ ఫిల్మ్స్‌లో నటించాను. అవి చూసిన వాళ్లు అమ్మకు ‘మీ అమ్మాయి చక్కగా ఉంది. మంచి జాబ్ చేస్తోంది. మంచి భవిష్యత్తు ఉంది’ అని మెచ్చుకునేవారు. దీంతో అమ్మకు ఈ ఫీల్డ్ అంటే ఉన్న భయం పోయింది. సిరి ఎక్కడున్నా బతికేస్తుంది అని నమ్మకం వచ్చేసింది. అన్నయ్య కన్నా నేనే బెస్ట్! నాన్నగారు లేకపోవడంతో అమ్మ నన్ను ఇండిపెండెంట్‌గా బతకడం అలవాటు చేసింది. ఇది అమ్మాయిల పని, ఇది అబ్బాయిల పని అని అన్నయ్యను నన్ను ఎప్పుడూ వేరుగా చూడలేదు. పైగా ఎక్కడున్నా ఎవరి మీద ఆధారపడకుండా బతకాలి అంటుండేది. అలా పనులు చేయడంలో, యాక్టివ్‌గా ఉండటంలో అన్నయ్య కన్నా నేనే బెస్ట్ అనిపించుకుంటాను. ఇప్పుడు అమ్మను పనిచేయనివ్వడం లేదు. షాప్ తీసేశాం. ‘మా కోసం ఇన్నాళ్లు కష్టపడ్డావు ఇక రెస్ట్ తీసుకో’ అని అమ్మకు చెబుతుంటాం నేనూ, అన్నయ్య. అభిరుచులు డ్యాన్స్ అంటే పిచ్చి. కానీ, ఒక పద్ధతి ఉండదు (నవ్వుతూ). ఎలా అంటే అలా గెంతులు వేస్తుంటాను. పాటలు కూడా అంతే. సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటాను. ఎప్పుడూ ఫోన్ చేతిలోనే ఉంటుంది. కాస్ట్యూమ్స్ ఎంపిక, కలర్ కాంబినేషన్స్.. చూసుకోవడం ఇష్టంగా చేస్తాను. డ్రీమ్ రోల్ ఎప్పటికీ ఇలా మీ మధ్య ఈ ఫీల్డ్‌లో కొనసాగాలన్నదే నా కల. ఇదే నా జీవితం. ఈ ఫీల్డ్‌లో దేనినీ వదిలేయను. ఇప్పటికీ ఎవరైనా పిలిచి యాంకరింగ్ చేయమన్నా చేస్తాను. షోస్‌లో పాల్గొంటాను. ఒకటి అని ఏమీ లేదు. సినిమా, టీవీ .. యాక్టింగ్‌లో ఆల్‌రౌండర్ అనిపించుకోవాలి. – నిర్మలారెడ్డి -
మన పడక గదులకు అవే ‘చెవులు’
సాక్షి, న్యూఢిల్లీ : ఆఫీసు నుంచి నీవు ఎంతో బడలికతో ఇంటికి వస్తావ్. చేతిలోని బ్యాగ్ తీసి సోఫాలో గిరాటేస్తావ్. టై విప్పుకుంటూ సోఫాలో కూలబడతావ్. ‘ఏమేవ్, ఎక్కడ చచ్చావే! వేడి వేడి టీ పట్టుకురావాలని తెలియదా? ఎన్నిసార్లు చెప్పాలి!’ అంటూ భార్య మీద విసుగ్గా అరుస్తావ్. అంతలో ‘గూగుల్’ సేవలు గుర్తొస్తాయ్. ‘హే గూగుల్! ఫ్యాన్ ఆన్చేయి. టీవీ పెట్టు, వ్యాల్యూమ్ తగ్గించు. చీకటవుతోంది బయట వసారాలో లైట్ వేయి, మధ్య రూమ్‌లో ఫ్యాన్, లైట్ ఆర్పేయ్!’...ఇంతలో కాస్త ఆలస్యంగా భార్య వేడి వేడి చాయ్‌తో వస్తుంది. టీ కప్పు చేతికిస్తుంది. ఓ గుక్క టీ తాగి గూగుల్ సేవలు భార్యకన్నా బాగున్నాయ్ అనుకుంటావ్ నీవు. అసలు విషయం తెలిస్తే అదిరిపోతావ్. ఇప్పటి వరకు ‘గూగుల్ అసిస్టెంట్’కు నీవిచ్చిన ఆదేశాలనే కాకుండా అంతకుముందు భార్యను ఉద్దేశించి ‘ఏమేవ్, ఎక్కడ చచ్చావే’ అంటూ నీవు విసుక్కున్న మాటలన్నింటినీ గూగుల్ హోం స్పీకర్లు రికార్డు చేస్తాయ్. పొద్దున మారాం చేస్తున్న పిల్లల్ని విసుక్కోవడం, పిల్లల్ని సరిగ్గా పెంచడం లేదంటూ భార్యను తిట్టడం, ఏందయ్యా గోలంటూ పక్కింటి పరాందమయ్య మందలింపుపై వంటికాలిపై లేవడం, బూతు మాటలందుకోవడం.. అన్నీ రికార్డవుతాయి. అంతేకాదు గత రాత్రి భార్యతో పంచుకున్న ప్రేమ కలాపాల మాటలు రికార్డవుతాయ్! ఇదంతా ‘గూగుల్ అసిస్టెంట్’గా పిలిచే ‘గూగుల్ స్పీచ్ లేదా వాయిస్ రికగ్నిషన్ టెక్నాలజీ’ ఫలితం. అమెజాన్ అలెక్సా, సిరి కూడా ఈ టెక్నాలజీకి సంబంధించినవే. ఈ పరికరాలు మనం ఇంట్లో మాట్లాడే ప్రతిమాటను రికార్డు చేస్తాయ్. చేస్తున్నాయ్! వాటిని తమ సంస్థ ఆడియో డేటా బేస్‌కు పంపిస్తాయ్. గూగుల్ కంపెనీ ఆ ఆడియో డేటాలను ‘వాయిస్ రికార్డింగ్ టెక్నాలజీ’ని మరింత అభివృద్ధి చేయడం కోసం సబ్ కాంట్రాక్టర్‌కు పంపిస్తోంది. ఆ సబ్‌కాంట్రాక్టర్ ఉద్యోగులు ఆ ఆడియో టేపులను విని వాటి స్క్రిప్టును కూడా రాసుకుంటారు. అసలు బండారం వీరి వద్ద నుంచే వేగుల ద్వారా బెల్జియంలోని వీఆర్టీ, ఎన్డబ్లూఎస్ ఛానళ్లకు లీకయింది. వాటిలో మచ్చుకు వేయి ఆడియో టీపులను ఈ రెండు సంస్థలు సేకరించాయి. వాటిల్లో భార్యాభర్తలు కొట్టుకోవడం, తింటుకోవడం దగ్గరి నుంచి వారి శృంగార లీలల వరకు ఉండగా, పిల్లల అల్లరి, ఆకతాయి చేష్టలు, వారి మధ్య జరిగే సంభాషణలు అన్నీ ఉన్నాయి. ఇదే విషయంలో అమెరికాలోని మసాచుసెట్స్‌కు చెందిన ఓ తల్లి అమెజాన్‌కు చెందిన ‘అలెక్సా’కు వ్యతిరేకంగా సియాటిల్‌లోని ఫెడరల్ కోర్టుకు ఆశ్రయించారు. పిల్లల మాటా ముచ్చట్లను, చర్చలను అన్నింటిని అలెక్సా రికార్డు చేస్తోందని, ప్రైవసి లేకుండా పోయిందంటూ ఆ తల్లి తన పదేళ్ల కూతురితోపాటు కొంత మంది పిల్లల తరఫున కోర్టుకెక్కారు. అలాంటి డేటాను తాము ఎక్కడా బహిర్గతం చేయమని అమెజాన్ హామీ ఇస్తుండగా, ఎప్పటికప్పుడే వినియోగదారుడే తమ డివైస్ నుంచి డేటాను తొలగించుకుంటే సరిపోతుందని గూగుల్ యాజమాన్యం ప్రకటించింది. ఇప్పటి వరకు మన ఊరు, పేరు, చిరునామాను బట్టబయలు చేస్తున్నారు, ఇది ప్రైవసీ హక్కులకు విరుద్ధమంటూ ఆధార్ కార్డుపై సుప్రీం కోర్టుకు, మన అభిప్రాయాలను ఫేస్బుక్ అమ్ముతోందంటూ అంతర్జాతీయ కోర్టుకెక్కి గోల చేస్తున్న మనం, ఇప్పుడు మన ఇంటి గుట్టును బజారులో పెడుతున్న ఈ కొత్త టెక్నాలజీపై ఎక్కడిదాకా వెళ్లాలో!? -
‘సిరి’పైనే పొగాకు రైతుల గురి
మునుపెన్నడూ లేని విధంగా పొగాకు రైతులు ఈ ఏడాది సిరి అనే రకం పొగాకు విత్తనాలపై అమితాసక్తి చూపారు. దక్షిణ ప్రాంత తేలిక నేల ప్రాంతాలైన గుంటూరు, ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో గతంలో సిరి, వీటీ 1158, ఎన్ 98, జీ 11 తదితర రకాలను పొగాకు నారుమడి కోసం రైతులు, నర్సరీ వ్యాపారులు ఉపయోగించగా.. ఈ ఏడాది దీనికి భిన్నంగా సిరి రకం విత్తనాల వైపు మొగ్గు చూపారు. దక్షిణ ప్రాంత రైతులందరూ సిరి విత్తనాలతోనే నార్లు పోశారు. రైతుల ఆసక్తి మేరకు రాజమహేంద్రవరంలోని కేంద్ర పొగాకు పరిశోధనా సంస్థ (సీటీఆర్ఐ) విత్తనాభివృద్ధి శాస్త్రవేత్తలు సిరి విత్తనాలనే రైతుల కోసం అందించారు. రాజమహేంద్రవరంతోపాటు, కందుకూరులో విత్తనాలను కిలో రూ.900 చొప్పన విక్రయించారు. ఈ ఏడాది దాదాపు 8 వేల కిలోల విత్తనాలను రైతులు కొనుగోలు చేశారు. గుంటూరు, ప్రకాశం, నెల్లూరు రైతుల కోసం ఉత్తర ప్రాంతమైన తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల్లోని నర్సరీ వ్యాపారులు కూడా సిరి విత్తనాలతోనే పొగాకు నారుమడులు పెట్టారు. ఉత్తర ప్రాంతానికి అనువైన కన్సన్, ఎల్టీ కన్సన్తోపాటు ఐటీసీ విత్తన రకాలు ఇక్కడ రైతులు ఉపయోగిస్తున్నారు. ఒక ఎకరం నారుమడికి గరిష్టంగా నాలుగు కేజీల విత్తనాలను రైతులు వాడుతున్నారు. అధిక దిగుబడులను ఇవ్వడంతోపాటు ఆకుముడత అతి తక్కువగా ఉంటోంది. అందువల్లే రైతులు సిరి పొగాకు విత్తనాలపై ఆసక్తి చూపుతున్నారు దిగుబడి ఎక్కువ ఆకుముడత తక్కువ ఇతర విత్తనాలతో పోల్చుకుంటే సిరి విత్తనాలు దిగుబడి బాగా వస్తుంది. పైగా ఆకుముడత తక్కువగా ఉంటోంది. అందుకే సిరి విత్తనాలనే నారుమడులకు ఉపయోగిస్తున్నాం. – బాలు కోటిరెడ్డి (89853 11626), పొగాకు రైతు, కనిగిరి, ప్రకాశం జిల్లా విత్తనాలకు డిమాండ్ పెరిగింది గతేడాది వరకు ఎన్ 98, జీ 11 విత్తనాలను ఉపయోగించేవాళ్లం. ఈ ఏడాది సిరి విత్తనాలనే కొనుగోలు చేశాం. కందుకూరులో విత్తనాలు అయిపోవడంతో రాజమహేంద్రవరం వచ్చి తీసుకున్నాం. – జి. అబ్దుల్లా, కొండాపురం, నెల్లూరు జిల్లా – పలుకూరి కోటేశ్వరరెడ్డి, సాక్షి, రాజమహేంద్రవరం -
సిరి కేసు ఆవిరి!
బ్యూటీ పార్లర్లో అనుమానాస్పదంగా మృతి చెందిన సిరి(19) కేసు.. మనీ మాటున ఆవిరవుతోంది. కేసును నీరుగార్చేందుకు అధికార పక్షం, కాంగ్రెస్ పార్టీ నాయకులు నడిపిన హైడ్రామాలో రూ.లక్షలు చేతులు మారాయనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. మృతురాలి కుటుంబానికి రూ.2.50 లక్షలు ముట్టజెప్పి రాజకీయ బ్రోకర్లు రూ.25లక్షలు పంచుకున్నట్లు తెలుస్తోంది. సిరితో సిరి కేసు ఆవిరైపోయింది. అధికార పార్టీ నాయకుల ఒత్తిడితో పాటు లక్షలు చేతులు మారడంతో సాక్ష్యాలను భూస్థాపితం చేసి హత్య కేసును నీరుగార్చారు. పార్లర్ నిర్వాహకురాలి తండ్రి గతంలో ఓ యువతి హత్య కేసులో ప్రధాన నిందితుడైనా కనీసం ఆయనపై ఈగ వాలకుండా మధ్యవర్తులు వ్యవహారాన్ని నోట్ల కట్టలతో మేనేజ్ చేశారు. యువతి మృతి సంగతలా ఉంచితే అసలు అక్కడ జరుగుతున్న వ్యవహారంపై అనేక అనుమానాలు తలెత్తుతున్నాయి. రేపల్లె: పట్టణంలోని డూ అండ్ డై బ్యూటీ పార్లర్లో ఇటీవల అనుమానాస్పద స్థితిలో మృతిచెందిన యువతి సిరి కేసును నీరుగార్చేందుకు అధికార పక్షమైన టీడీపీతో పాటు కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆడించిన హైడ్రామాలో దాదాపు 25 లక్షలు చేతులు మారాయనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. మృతురాలి కుటుంబానికి రూ.2.50 లక్షలు ముట్టజెప్పి, మిగతా సొమ్ము రాజకీయ బ్రోకర్లు పంచుకున్నారని తెలుస్తోంది. పట్టణంలోని 10వ వార్డులో ఉన్న డూ అండ్ డై బ్యూటీ పార్లర్లో యాదాద్రి జిల్లా వరిగొండ మండలం రెడ్లపాలెం గ్రామానికి చెందిన జి.సిరి(19) అనే యువతి బుధవారం అనుమానాస్పద స్థితిలో మృతిచెందింది. బుధవారం సాయంత్రం 4 గంటల ప్రాంతంలో యువతి మరణిస్తే రాత్రి 8గంటలకు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు ఇచ్చిన సమాచారంతో సంఘటనా స్థలానికి చేరుకున్న సిరి తల్లితండ్రులు ఊర్మిళ, యాదయ్యలతో పాటు బంధువులు సిరి మృతిపై అనుమానాలు వ్యక్తం చేశారు. మృతి చెందిన అనంతరం క్షణాల్లో సంఘటనా స్థలానికి రాజకీయ నాయకుల రంగప్రవేశం, మృతురాలి తల్లిదండ్రులతో బేరాలు మాట్లాడి రూ.2.50 లక్షలు వెల కట్టడం, బేరం కుదరగానే గురువారం ఉదయం మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించడం, అనంతరం మృతదేహాన్ని తల్లిదండ్రులకు అప్పగించడం శరవేగంగా జరిగిపోయాయి. రాజకీయ ఒత్తిడులతో కీలక అంశాలకు పాతర సిరి మృతి కేసులో రాజకీయ ఒత్తిడులతో పోలీసులు కీలక అంశాలకు పాతర వేశారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. నియోజకవర్గ ముఖ్య ప్రజాప్రతినిధి తీవ్ర ఒత్తిడి చేయడంతో కేసును నీరుగార్చారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. యువతి ఆత్మహత్య చేసుకున్నట్టు చెబుతున్న గదిలో కాకుండా శవం వేరే గదిలో ఉండడం, ఉరి వేసుకున్నట్టు చెబుతున్న గదిలో దుస్తులు చెల్లాచెదురుగా పడి ఉండడం గమనించినా పట్టించుకోలేదు. అనుమానాస్పద స్థితిలో మృతి చెందినట్టు గ్రహించినా క్లూస్ టీమ్‌ను ఎందుకు రప్పించలేదనే ప్రశ్నలు ఉదయిస్తున్నాయి. సిరి తల్లిదండ్రులు ఊర్మిళ, యాదయ్య తన కుమార్తె ఆత్మహత్య చేసుకునేంత పిరికిది కాదని నిర్వాహకులే చంపి వుంటారని చెప్పినా పోలీసులు ఎందుకు కేసు నమోదు చేయలేదన్న ప్రశ్నలు వ్యక్తమవుతున్నాయి. బ్యూటీ పార్లర్లో సిరితో పాటు పనిచేస్తున్న దీనా అనే యువతి ఫిర్యాదుమేరకు కేసు నమోదు చేయడంపై మహిళా సంఘాలు మండిపడుతున్నాయి. పార్లర్ నిర్వాహకురాలి తండ్రి గతంలో హత్య కేసులో నిందితుడు బ్యూటీ పార్లర్ నిర్వాహకురాలు తోట సింధు హైదరాబాద్‌లో ఉంటుండడంతో ఆమె తండ్రి పార్లర్ నిర్వహణ బాధ్యతలు చూస్తుంటారు. ఆయన 2003లో పట్టణంలో జరిగిన భట్టిప్రోలు మండలం పల్లెకోన గ్రామానికి చెందిన ఆషా అనే యువతి హత్య కేసులో ప్రధాన నిందితుడు. కలప వ్యాపారం చేసే ఆయన కర్ణాటక, తమిళనాడు, కేరళ, మహారాష్ట్ర నుంచి కలప తెప్పిస్తూ కోట్లలో వ్యాపారాన్ని నిర్వహిస్తున్నారు. ఆయా ప్రాంతాల నుంచి కలప వ్యాపారులు వచ్చిన సమయంలో ఈ బ్యూటీ పార్లర్లో విడిది చేస్తుంటారని స్థాని కుల ఆరోపణ. బ్యూటీ పార్లర్‌కు మహిళల కన్నా పురుషులే ఎక్కువగా వస్తున్నారని చుట్టుపక్కల వారు ఆరోపిస్తున్నారు. -
మృతి కేసు మాఫీకి రూ.2.5 లక్షలు!
రేపల్లె: ఓ బ్యూటీపార్లర్‌లో చనిపోయిన యువతి మృతి కేసు మాఫీ కోసం టీడీపీ, కాంగ్రెస్ నేతలు ఆమె మృతదేహం వద్దే వేలంపాట నిర్వహించిన తీరు సభ్యసమాజం తలదించుకునేలా చేసింది. గుంటూరు జిల్లా రేపల్లెలోని డూ అండ్ డై బ్యూటీపార్లర్‌లో తెలంగాణలోని యాదాద్రి జిల్లా రెడ్లరేపాలెంకు చెందిన జి.సిరి(19) అనే యువతి బుధవారం మృతిచెందిన సంగతి తెలిసిందే. తమ కుమార్తె ఆత్మహత్య చేసుకునేంత పిరికిది కాదని.. ఆమె మరణంపై అనుమానాలున్నాయని సిరి తల్లిదండ్రులు చెబుతున్నా.. వారిని బెదిరిస్తూ.. కేసును మాఫీ చేసేందుకు వేలంపాట నిర్వహించారు. హైదరాబాద్‌లో ఉంటున్న సిరి బుధవారమే ఈ బ్యూటీపార్లర్‌లో ఉద్యోగంలో చేరింది. ఉరిపోసుకున్నట్లు చెబుతున్నా.. ఆమె గదిలోని దుస్తులన్నీ చెల్లాచెదురుగా పడి ఉండటం సందేహాలను రేకెత్తిస్తోంది. బ్యూటీపార్లర్‌లో జరుగుతున్న ‘వ్యవహారాలకు’ ఒప్పుకోకపోవడం లేదా బయటకు చెబుతానని బెదిరించడం వల్లే ఆమెను నిర్వాహకులే హత్య చేసి ఉంటారని స్థానికులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. అయితే తాను ప్రేమించిన యువకుడు మృతిచెందటంతో మనస్తాపానికి గురై.. యువతి ఉరి వేసుకుని మృతిచెందిందంటూ బ్యూటీపార్లర్ నిర్వాహకులు కొత్త కథనం తెరపైకి తీసుకొచ్చారు. ప్రేమ వ్యవహారమే మృతికి కారణం అంటూ ప్రచారం మొదలుపెట్టారు. ఇంత జరుగుతున్నా... బ్యూటీ పార్లర్ అసలు నిర్వాహకురాలి జాడలేకపోవడం గమనార్హం. కాంగ్రెస్ నేత సమక్షంలో.. కేసు మాఫీ కోసం బ్యూటీపార్లర్ నిర్వాహకుల స్థానంలో అంతా తానై ఓ కాంగ్రెస్ పార్టీ నేత రాజీ ప్రయత్నాలు చేశారు. సిరి అనుమానాస్పద స్థితిలో మృతి చెందిందంటూ విలపిస్తున్న ఆమె తల్లిదండ్రులు ఉర్మిళ, యాదయ్యలను, బంధువులను బెదిరిస్తూ.. మృతదేహం ఉన్న గదిలోనే ఆమె మృతి కేసు మాఫీకి పాట నిర్వహించారు. నిర్వాహకుల తరఫున రూ.2.50 లక్షలకు మధ్యవర్తిత్వం చేశారు. అనంతరం సిరి తల్లిదండ్రులు, బంధువులను బయటకు పంపించారు. అలాగే టీడీపీ నియోజకవర్గ ముఖ్య ప్రతినిధి ఒకరు ఓ పోలీసు అధికారికి ఫోన్ చేసి కేసు మాఫీ చేయాలని సూచించినట్లు విశ్వసనీయంగా తెలిసింది. ఇంత తంతు జరుగుతున్నా పోలీసులు ప్రేక్షక పాత్ర పోషించటంపై పలు విమర్శలు వ్యక్తమవుతున్నాయి. కాగా, ఈ బ్యూటీపార్లర్ నిర్వాహకురాలి తండ్రి 2001లో పట్టణంలో జరిగిన ఆషా అనే యువతి హత్య కేసులో ప్రధాన నిందితుడు. హత్య కేసు అనంతరం వడ్రంగి పనిచేసే వ్యక్తి చిన్నచిన్నగా కలప వ్యాపారం ప్రారంభించి ప్రస్తుతం రూ. కోట్లలో వ్యాపారం చేస్తున్నాడు. బ్యూటీపార్లర్‌కు మహిళల కన్నా పురుషులే ఎక్కువగా వస్తున్నారని, రాత్రి సమయాల్లోనూ పురుషుల రాకపోకలు అధికంగా ఉంటాయని చుట్టుపక్కలవారు తీవ్ర ఆరోపణలు చేస్తున్నారు. -
ప్రేమ పెళ్లి.. ఇద్దరు స్నేహితులు బలి
సాక్షి, యాదాద్రి : జిల్లాలోని వలిగొండ మండలం రెడ్లరేపాకలో దారుణం చోటు చేసుకుంది. మిత్రుడి ప్రేమ వివాహం జరిపించిన ఇద్దరు స్నేహితులు.. యువతి తండ్రి బెదిరింపులకు తాళలేక ఆత్మ హత్యకు పాల్పడ్డారు.వివరాల్లోకి వెళితే..యాదాద్రి జిల్లా రెడ్లరేపాకకు చెందిన వెంకటేశ్(22) మాదాపూర్ ఇజ్జత్‌నగర్‌లో కారు డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. వెంకటేశ్ మిత్రుడు మహేశ్ రెడ్డరేపాకకు చెందిన స్వాతిరెడ్డి అనే అమ్మాయిని ప్రేమించాడు. వీరిద్దరిది ఒకే కులం కాకపోవడంతో వీరి పెళ్లికి యువతి తండ్రి నిరాకరించాడు. దీంతో మహేశ్ తను ప్రేమించిన అమ్మాయితే పెళ్లి జరిపించాల్సిందిగా వెంకటేశ్‌ను కోరాడు. వెంకటేశ్ మరో స్నేహితురాలు సిరితో కలిసి మహేశ్ వివాహాన్ని చేశాడు. దీంతో వీద్దరిపై యువతి తండ్రి పగపట్టాడు. మీ ఇద్దరిని విడువనంటూ బెదిరించాడు. దీంతో భయానికి లోనైన వెంకటేశ్ తాను అద్దెకుంటున్న గదిలో ఉరి వేసుకొని చనిపోయాడు. వెంకటేశ్ ఆత్మహత్య విషయం తెలియగానే స్నేహితురాలు సిరి కూడా ఆత్మహత్య చేసుకుంది. దీంతో రెడ్లపాకలో ఘర్షణ వాతావరణం నెలకొంది. ప్రేమవివాహం చేసుకున్న జంట అజ్ఞాతంతో ఉన్నట్లు సమాచారం. కాగా వెంకటేశ్‌ది ఆత్మహత్య కాదని..హత్యే నని కుటుంబసభ్యులు ఆరోపిస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు. -
దివ్యమైన సిరి
సామర్లకోట: జిల్లాలోని సామర్లకోటలో ఉన్న సిరి మానసిక దివ్యాంగుల కేంద్రం ప్రేమాలయంగా ఖ్యాతినార్జించింది. సుమారు 200 మంది ఇక్కడ ఆశ్రయం పొందుతున్నారు. వారు ఆర్థికంగా వృద్ధి చెందడానికి వృత్తి శిక్షణ ఇస్తూ వారి భవితకు బాటలు వేస్తున్నారు నిర్వాహకులు. గోపీదేవి అనే సాధారణ మహిళ 1994లో పెద్దాపురం రోడ్డు బడేలమ్మ చెరువు ఎదురుగా మానసిక దివ్యాంగుల సేవా సంస్థ ‘సిరి’ని స్థాపించారు. అనేక మంది సూచనల మేరకు ఈ సంస్థ సేవలు విస్తృతం చేసే లక్ష్యంతో పెద్దాపురం మండలం ఆనూరులోనూ, ప్రత్తిపాడులోనూ శాఖలు ఏర్పాటు చేశారు. నిరుపేద మహిళలకు ఉచితంగా విద్య, వసతి, ఉపాధి అవకాశాలను కల్పించడమే కాకుండా మానసిక వికలాంగుల జీవితాల్లో వెలుగులు నింపుతూ ఆ వెలుగుల్లో తానూ ప్రకాశిస్తూ తన జీవితానికి అర్థం పరమార్థం సేవలోనే అంటూ ఎంతో ఆనందం వ్యక్తం చేస్తున్నారు గోపీదేవి. ఆమె చేస్తున్న సేవలు గుర్తించి అనేక మంది తమ తమ పుట్టిన రోజు వేడుకలను ఈ కేంద్రంలో విద్యార్థుల మధ్య జరుపుకొంటున్నారు. నిరుపేద మానసిక వికలాంగులకు సేవ చేయాలనే దృఢ సంకల్పంతో తల్లిదండ్రుల ప్రోత్సాహంతో ఏ విధంగా ఈ స్థాయికి చేరుకున్నదీ ఆమె మాటల్లోనే.. ‘ శ్రీకాకుళంలో బీఏ పట్టా తీసుకున్న అనంతరం మానసిక వికలాంగులకు సేవ చేయాలనే కోరికతో మెంటల్ రిటార్డేషన్లో డిప్లమో చేశాను. నా ఉత్సాహం గమనించిన మా నాన్న దాశెట్టి సూర్య కుమార్ ఇచ్చిన రెండు లక్షల రూపాయల ఆర్థిక సహాయంతో మా తాతయ్య అప్పలరాజు స్వస్థలమైన సామర్లకోటలో మానసిక దివ్యాంగుల సేవాసంస్థ ‘సిరి’ని స్థాపించాను. మానసిక దివ్వాంగులకు ప్రేమ, ఆదరణతోపాటు నాణ్యమైన విద్య, ఉపాధి అవకాశాలను కల్పించాలనే ఉద్దేశంతో చెన్నైలో ఉండే తల్లిదండ్రుల ఆర్థిక సహాయంతో, ప్రజల నుంచి సేకరించిన విరాళాలతో సంస్థ కార్యకలాపాలు నిర్వహిస్తున్నాం. 2000 సంవత్సరంలో తమ సంస్థ ‘సిరి’కి ప్రభుత్వ గుర్తింపు లభించింది. దీంతో మరింత ఉత్సాహంతో మతిస్థిమితం లేని బాలబాలికలకు ఉచిత విద్య, భోజనం, ఫిజియోథెరపీ, స్పీచ్ థెరపీ, శారీ పెయింటింగ్, సర్ఫ్ తయారీ, రీడింగ్, రైటింగ్, ప్రవర్తన సర్దుబాటు, వృత్తి విద్యలలో నాణ్యమైన శిక్షణ ఇస్తున్నాం. సంస్థలో నిర్వహిస్తున్న సేవలకు రాష్ట్ర ప్రభుత్వం ఎనిమిది సార్లు ‘బెస్ట్ సోషల్ వర్కర్’ పురస్కారాలను ప్రదానం చేసింది. కేవలం అవార్డుల కోసం కాకుండా మానసిక పరిపక్వతలేని 5–15 సంవత్సరాల వయస్సు కలిగిన బాలబాలికలకు పై విభాగాల్లో శిక్షణ ఇస్తున్నాం. శిక్షణ పొందిన విద్యార్థులకు బ్యాంకుల ద్వారా రుణాలు ఇప్పించి స్వయం ఉపాధికి అవకాశం కల్పిస్తున్నాం. దాతల ద్వారా సేకరించిన విరాళాలు ఫిక్స్డ్ డిపాజిట్ చేసి ఆ మొత్తం మీద వచ్చే వడ్డీతో పిల్లలకు జీవితకాలం భోజన వసతి కల్పిస్తున్నాం. రాష్ట్రం నలుమూలల నుంచి 200 మంది విద్యార్థులు సిరి మానసిక సంస్థలో శిక్షణ పొందుతున్నారు. వీరికి 40మంది సుశిక్షితులైన ఉపాధ్యాయులు శిక్షణ ఇస్తున్నారు. 15 ఏళ్లు పైబడిన మతి స్థిమితం లేని మహిళలకు భవిష్యత్‌లో ఆసరాగా ఉండేందుకు షెల్టర్‌ను ఏర్పాటు చేస్తున్నాం. ప్రేమకు, ఆప్యాయతలకు నోచుకోని నిరుపేద మానసిక వికలాంగులకు చేయూత ఇవ్వడం ద్వారా స్వయంగా ఆ భగవంతుడికే సేవ చేసినట్లు భావించి దాతలు సహృదయంతో స్పందించి ఆర్థికంగా మరింత సహకారం అందించాలని కోరుతున్నాను.’ -
‘సిరి’నవ్వులు.. ఇక లేవు
బ్రెయిన్‌స్ట్రోక్‌తో చిన్నారి మృతి రామగుండంలో విషాదం వినాయక నిమజ్జనం వాయిదా రామగుండం(కరీంనగర్ జిల్లా): ఆ చిన్నారి గారాల మాటలు.. బుడిబుడి అడుగులు వేస్తుంటే వచ్చే మువ్వల శబ్దాలకు ఆ తల్లిదండ్రులు ఎంతో ఆనందపడేవారు.. ఆమెచేసే సందడితో ఆ ఇంట్లో నిత్యం పండగే... అలా హాయిగా గడిచిపోతున్న ఆ ఇంట్లో ఒక్కసారిగా విషాదం అలుముకుంది. రెండున్నరేళ్ల సంబరాల ‘సిరు’లు కురిపించిన ఆ చిన్నారికి అప్పుడే నూరేళ్లు నిండాయి. బ్రెయిన్‌స్టోక్ రావడంతో పాప మృతిచెందింది. ఆ కుటుంబానికి తీరని దుఃఖం మిగిలిచ్చింది. ఈ సంఘటన రామగుండం పట్టణంలోని పాత బజార్లో జరిగింది. కుటుంబ సభ్యులు, బంధువుల కథనం ప్రకారం.. పాతబజార్‌లో ఉంటున్న కట్కూరి శ్రావణ్–సంధ్య దంపతులకు కుమారుడు, కూతురు సుశ్రుత(సిరి) సంతానం. వినాయక నవరాత్రోత్సవాల్లో రెండున్నరేళ్లు సిరి ఉత్సాహంగా పాల్గొంది. వారి ఇంటిముందే ఏర్పాటుచేసిన వినాయకుడి మండపంలో ఆదివారం రాత్రి నిర్వహించిన భజన, సాంస్కృతిక కార్యక్రమాల్లో సందడి చేసింది. రాత్రి 11గంటల వరకు సందడి చేసింది. అనంతరం ఇంటికి వెళ్లి నిద్రపోయింది. కొద్దిసేపటికి నిద్రలోనే వాంతులు చేసుకుంది. తల్లిదండ్రులు దిష్టి తగిలిందేమోనని అనుకున్నారు. సోమవారం వేకువజామున 3 గంటలకు నిద్రలేచిన సిరి నీళ్లు కావాలని అడిగింది. నీళ్లు తాగిన వెంటనే ఫిట్స్‌తోపాటు నోటి నుంచి నురుసులు రావడంతో తల్లిదండ్రుల ఆందోళన చెందారు. గోదావరిఖనిలోని ప్రయివేటు ఆస్పత్రికి తీసుకెళ్లారు. అక్కడ ప్రాథమిక చికిత్స చేయించి మెరుగైన వైద్యం కోసం కరీంనగర్‌లోని ప్రతిమ ఆస్పత్రికి తరలించారు. అక్కడి నుంచి హైదరాబాద్‌కు తరలించే ప్రయత్నం చేస్తుండగా పరిస్థితి విషమంగా ఉందని డాక్టర్లు తెలిపారు. ఐసీయూకు తరలించారు. కొద్ది సేపట్లోనే మూడుసార్లు హార్ట్స్ట్రోక్, బ్రెయిన్‌స్ట్రోక్ వచ్చింది. వెంటనే చిన్నారి కోమాలోకి వెళ్లింది. డాక్టర్లు పరిశీలించి బ్రెయిన్లో రక్తం గడ్డకట్టి ఉండవచ్చని తెలిపారు. 48 గంటల వరకు ఏమీ చెప్పలేమని పేర్కొన్నారు. పరిస్థితి విషమించి బుధవారం వేకువజామున సుశ్రుత మృతిచెందింది. చిన్నారి హఠాన్మరణంతో పట్టణంలో విషాదం నెలకొంది. చిన్నారి తాత కట్కూరి ఆత్మలింగం పట్టణ ఆర్యవైశ్య సంఘం అధ్యక్షుడు కావడంతో బుధవారం నిర్వహించాల్సిన నిమజ్జనం వాయిదా వేశారు.