ప్రేమ పెళ్లి.. ఇద్దరు స్నేహితులు బలి | Two Friends Commits Suicides Because Of Fear | Sakshi
Sakshi News home page

ప్రేమ పెళ్లి.. ఇద్దరు స్నేహితులు బలి

Published Thu, Jun 21 2018 7:29 PM | Last Updated on Tue, Nov 6 2018 8:16 PM

Two Friends Commits Suicides Because Of Fear - Sakshi

సాక్షి, యాదాద్రి : జిల్లాలోని వలిగొండ మండలం రెడ్లరేపాకలో దారుణం చోటు చేసుకుంది. మిత్రుడి ప్రేమ వివాహం జరిపించిన ఇద్దరు స్నేహితులు.. యువతి తండ్రి బెదిరింపులకు తాళలేక ఆత్మ హత్యకు పాల్పడ్డారు.వివరాల్లోకి వెళితే..యాదాద్రి జిల్లా రెడ్లరేపాకకు చెందిన వెంకటేశ్‌(22) మాదాపూర్‌ ఇజ్జత్‌నగర్‌లో కారు డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. వెంకటేశ్‌ మిత్రుడు మహేశ్‌ రెడ్డరేపాకకు చెందిన స్వాతిరెడ్డి అనే అమ్మాయిని ప్రేమించాడు.

వీరిద్దరిది ఒకే కులం కాకపోవడంతో వీరి పెళ్లికి యువతి తండ్రి నిరాకరించాడు. దీంతో మహేశ్‌ తను ప్రేమించిన అమ్మాయితే పెళ్లి జరిపించాల్సిందిగా వెంకటేశ్‌ను కోరాడు. వెంకటేశ్‌ మరో స్నేహితురాలు సిరితో కలిసి మహేశ్‌ వివాహాన్ని చేశాడు. దీంతో వీద్దరిపై యువతి తండ్రి పగపట్టాడు. మీ ఇద్దరిని విడువనంటూ బెదిరించాడు.

దీంతో భయానికి లోనైన వెంకటేశ్‌ తాను అద్దెకుంటున్న గదిలో ఉరి వేసుకొని చనిపోయాడు. వెంకటేశ్‌ ఆత్మహత్య విషయం తెలియగానే స్నేహితురాలు సిరి కూడా ఆత్మహత్య చేసుకుంది. దీంతో రెడ్లపాకలో ఘర్షణ వాతావరణం నెలకొంది. ప్రేమవివాహం చేసుకున్న జంట అజ్ఞాతంతో ఉన్నట్లు సమాచారం. కాగా వెంకటేశ్‌ది ఆత్మహత్య కాదని..హత్యే నని కుటుంబసభ్యులు ఆరోపిస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement