
బిగ్‌బాస్-6లో ఎంటర్‌టైన్‌మెంట్‌తో పాటు బోలెడం ఎమోషనల్ జర్నీ కూడా కనిపిస్తుంది. ఈవారం బిగ్‌బాస్ పుట్టినరోజు వేడుకల్లో భాగంగా ఇంటిసభ్యులందరూ బిగ్‌బాస్ కోరికలన్నీ తీర్చడానికి ప్రయత్నించారు.దీంతో హౌస్‌మేట్స్ కోరికలు ఏంటో తెలుసుకోవాలనుకుంటున్నట్లు బిగ్‌బాస్ తెలిపాడు. ఇందులో భాగంగా హౌస్‌మేట్స్ తమ కోరికలను బయటపెట్టారు.
సిరి..షూట్స్‌తో ఎంత బిజీగా ఉన్నా సరే ఒక్కసారైనా మా అమ్మానాన్నలకు ఫోన్ చేసి ఎలా ఉన్నారో కనుక్కో అని చెబుతూ శ్రీహాన్ ఎమోషనల్ అవుతాడు. ఏం జరిగినా చూసుకోవడానికి నువ్వు ఉన్నావన్న ధైర్యం ఇవ్వమని బిగ్‌బాస్ వేదికగా అడుగుతాడు. ఇక సుదీప తన భర్తను మిస్ అవుతున్నానని, అతని ఫోటోతో పాటు టీషర్ట్ ఇవ్వాల్సిందిగా కోరుకుంది.
ఇక తన తండ్రి గురించి చెబుతూ అర్జున్ కన్నీళ్లు పెట్టుకుంటాడు. డాడీలా నిన్ను చూసుకోలేను కానీ డాడీ లేని లోటు చూసుకుంటానంటూ ఇనయా బాగా ఎమోషనల్ అవుతుంది. మొత్తంగా ఇవాల్టి ఎపిసోడ్ చాలా ఎమోషనల్‌గా సాగనుందని అర్థమవుతుంది. మరి హౌస్‌మేట్స్ అందరి కోరికలు తెలియాలంటే పూర్తి ఎపిసోడ్ వచ్చేవరకు వేచి చూడాల్సిందే. చదవండి: Bigg Boss 6 : ట్రాక్ తప్పిన ఇనయా గేమ్.. పడిపోయిన ఓటింగ్ గ్రాఫ్