Bigg Boss 6 Telugu: Heated Discussions In 4th Week Nominations - Sakshi
Sakshi News home page

Bigg Boss 6 Telugu: నచ్చితే చెప్తా లేదంటే లేదు అంటూ హేళన చేసిన శ్రీహాన్‌

Published Mon, Sep 26 2022 1:59 PM | Last Updated on Mon, Sep 26 2022 3:42 PM

Bigg Boss 6 Telugu: Heated Discussions In 4th Week Nominations - Sakshi

బిగ్‌బాస్‌ నాలుగోవారం నామినేషన్స్‌ ప్రక్రియ మొదలైంది. ఇందులో భాగంగా ఇద్దరు సభ్యుల తలపై ఒక్కో టమాటాను పూర్తిగా స్మాష్‌ చేసి తాము ఎందుకు నామినేట్‌ చేస్తున్నారో సరైన కారణం చెప్పాల్సి ఉంటుంది. ఈ ప్రక్రియలో శ్రీహాన్‌ ఇనయాల మధ్య పిట్ట టాపిక్‌ వస్తుంది. వాడు అంటే తీసుకోలేని వాడు పిట్ట ఎలా చెప్తావ్‌ అని వాదించావ్‌, నిన్ను పేరు పెట్టి పిట్ట అని అనలేదు కదా అని శ్రీహాన్‌ చెప్పగా, అక్కడ ఉన్నది నేను కాబట్టి నన్నే పిట్ట అన్నావ్‌ అంటూ ఇనయా బదులిస్తుంది.

ఆ తర్వాత శ్రీహాన్‌ను నామినేట్‌ చేయడానికి ఇనయా వెళ్లగా, ఆవలింతలు తీస్తూ ఒక్క నిమిషం ఆగు అంటూ శ్రీహాన్‌ హేళన చేస్తాడు. ఒక కొన్ని ప్రశ్నలు అడుగుతా ఆన్సర్‌ చెయ్‌ అని అడగ్గా.. నచ్చితే చెప్తా, లేదంటే లేదు అంటూ శ్రీహాన్‌ అంటాడు. అయినే సరే ఇనయా తాను అడగాల్సిన ప్రశ్నలు అడిగేస్తుంది.. నా కన్నా నీ ఏజ్‌ తక్కువ అని ఎలా అంటావ్‌? నీ కన్నా బాడీలో పెద్దగా ఉన్నంతమాత్రానా పెద్దదాన్ని అయిపోతానా? అసలు నా ఏజ్‌ గురించి నీకు తెలుసా? అంటూ ఫైర్‌ అవుతుంది.

అసలు ఇవన్నీ తాను అనలేదని, కేవలం తన ఏజ్‌ గురించి మాత్రమే చెప్పానంటూ శ్రీహాన్‌ బదులిస్తాడు. చూస్తుంటే వీరిద్దరి మధ్య పెద్ద గొడవే జరిగినట్లు కనిపిస్తుంది. ఇక సుదీప రేవంత్‌ను నామినేట్‌ చేయగా, ఇంటి, ఇనయాలను గీతూ నామినేట్‌ చేస్తుంది. కోపంలో కొన్నికొన్ని కోల్పోతావ్‌ అంటూ ఆరోహి ఇనయాను నామినేట్‌ చేస్తుంది. మరి ఈ వారం నామినేషన్స్‌లో ఎవరెవరు ఉంటారో చూద్దాం.


 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement