ఇనయా-శ్రీహాన్‌ల మధ్య బిగ్‌ ఫైట్‌.. మధ్యలో దూరిన గీతూ | Bigg Boss 6 Telugu: Captaincy Task Completed Police Team WinsCaptaincy Task Completed Police Team Wins | Sakshi
Sakshi News home page

Bigg Boss 6 Telugu: శ్రీహాన్‌ను మగాడివేనా అంటూ నోరుజారిన ఇనయా.. హౌస్‌మేట్స్‌ షాక్‌

Published Fri, Sep 23 2022 10:41 AM | Last Updated on Fri, Sep 23 2022 11:47 AM

Bigg Boss 6 Telugu: Captaincy Task Completed Police Team WinsCaptaincy Task Completed Police Team Wins - Sakshi

కెప్టెన్సీ కంటెండర్స్‌ టాస్క్‌ ముగుస్తుంది. పోలీస్‌ టీం ఇందులో విజేతగా నిలుస్తుంది. శ్రీహాన్‌-ఇనయాల మధ్య మాటల యుద్దం జరగడానికి గల కారణాలేంటి? కెప్టెన్సీ పోటీదారులుగా చివరగా మిగిలిన వాళ్లెవరు అన్నది బిగ్‌బాస్‌ సీజన్‌-6 19వ ఎపిసోడ్‌లో చూద్దాం.

కెప్టెన్సీ పోటీదారుల కోసం బిగ్‌బాస్‌ నిర్వహించిన అడవిలో ఆట టాస్క్‌ ముగుస్తుంది. ఈ టాస్కులో ఎక్కువ బొమ్మలు ఉన్న పోలీస్‌ టీం విజేతలుగా నిలుస్తారు. కెప్టెన్సీ కంటెండర్స్‌గా సత్య, గీతూ, ఫైమా, ఆదిరెడ్డి, శ్రీహాన్‌లను టీం సభ్యులు ఎన్నుకుంటారు. ఇక ఆ తర్వాత జరిగిన టాస్కులో గీతూ తొలుత ఎలిమినేట్‌ అవుతుంది. ఆ తర్వాత బ్రిక్స్‌ను కాపాడుకునే ప్రయత్నంలో ఫైమా చేతులు ఉపయోగించిందన్న కారణంతో రేవంత్‌ ఆమెను డిస్‌ క్వాలిఫై చేస్తాడు. ఈ విషయంలో ఇద్దరి మధ్య కాసేపు డిస్కషన్‌ జరిగినా రేవంత్‌ సంచలాక్‌గా ఉన్నందున అతని నిర్ణయం ఫైనల్‌ అవుతుంది. అయితే ఫైమా డిస్‌ క్వాలిఫై అనడంతో ఇనయా ఎంట్రీ ఇస్తుంది.

శ్రీహాన్‌ చేతులు తగలడం నేను చూశానంటూ రేవంత్‌కి చెబుతుంది. ఇది విన్న శ్రీహాన్‌... ఏ పిట్ట వచ్చి నీ దగ్గర ఏం కూసినా.. సంచాలక్‌గా నీ నిర్ణయం నువ్ తీసుకో అని అంటాడు. ఇక అక్కడ మొదలవుతుంది రచ్చ. నన్ను పిట్ట అని ఎలా అంటావంటూ ఇనయా నోరేసుకొని పడిపోతుంది. నిన్ను వాడు అంటే తీసుకోలేని వాడివి నన్ను పిట్ట అని ఎందుకు అన్నావ్‌ అని రెచ్చిపోయింది. దీంతో గీతూ ఇచ్చి అతను నిన్ను అనలేదు, నన్నే పిట్ట అన్నాడు అని సర్ధిచెప్పే ప్రయత్నం చేస్తుంది.

అయినప్పటికీ ఇనయా ఆగకపోవడంతో ఇక ఇలా కాదునుకుందో ఏమో కానీ గీతూ ఇనయాని హేళన చేస్తున్నట్లు ప్రవర్తించింది. వచ్చిందీ పాలపిట్టా అంటూ ఇష్టం వచ్చిన పాటలు పాడుతూ మరింత రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తుంది. మరోవైపు ఇనయా.. మళ్లీ నోరేసుకొని పడిపోతుండటంతో శ్రీహాన్‌ అ‍క్కడి నుంచి వెళ్లిపోతాడు. దీంతో మగాడివైతే నేను చెప్పింది విని అంటూ ఇనయా మాటలు హద్దులు దాటుతుంది. మరి ఈ టాస్కులో కెప్టెన్‌గా ఆదిరెడ్డి, సత్య, శ్రీహాన్‌లలో ఎవరు నిలుస్తారన్నది ఇవాల్టి ఎపిసోడ్‌లో చూద్దాం. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement