సిసింద్రీ టాస్క్ ముగిసింది. మొదటిరోజు దూకుడుగా ఆడిన గీతూ రెండోరోజు మాత్రం బోల్తా పడింది. ఆమె చేసిన ప్లాన్ వర్కవుట్ కాలేదు. మరోవైపు తాను చేసిన దానికి రేవంత్ కావాలనే డిస్‌క్వాలిఫై చేశాడంటూ ఫైమా కన్నీళ్లు పెట్టుకుంది. మరి ఈ వారం కెప్టెన్సీ కంటెడర్స్‌గా ఎవరు నియమితులయ్యారు? ఫైమా రేవంత్‌లలో ఎవరు ఎవర్ని టార్గెట్ చేశారు? అన్నది బిగ్‌బాస్ తెలుగు సీజన్-6 పదకొండవ ఎపిసోడ్ హైలైట్స్‌లో చదివేద్దాం.
బిగ్‌బాస్ సీజన్-6లో కెప్టెన్సీ టాస్క్ ముగిసింది. రెండో ఇంటి కెప్టెన్‌ని ఎంచుకోవడానికి బిగబాస్ నిర్వహించిన సిసింద్రీ టాస్కులో మొదటిరోజు ఎవరిని నిద్రలేకుండా చేసిన గీతూ తన బొమ్మ విషయంలో మాత్రం బోల్తా పడింది. తెలివిగా బొమ్మకు ఉన్న బట్టలు తీసేసి, దాన్ని స్టోర్‌రూమ్‌లో దాచిపెట్టింది. అయితే ఆమె ప్లాన్ ఫెయిలైంది. రేవంత్ ఆ బొమ్మను చూసి లాస్ట్ అండ్ ఫౌండ్ వద్ద ఉంచేయడంతో గీతూ కెప్టెన్సీ పోటాదారుల లిస్ట్ నుంచి ఔట్ అయింది. ఇక ఆ తర్వాత రేసులో ఉన్న ఇంటి సభ్యులకు రింగులో కింగ్ టాస్క్ నిర్వహించాడు బిగ్‌బాస్.
ఇందులో పాల్గొన్న సభ్యులు చేతులతో కాకుండా తమకు ఇచ్చిన షీల్డుతోనే అవతలి వాళ్లని రింగునుంచి బయటకు తోసేయాల్సి ఉంటుంది. బజర్ మోగినప్పుడల్లా ఒక్కొక్కరు యాడ్ అవుతుంటారు. చివరికి ఎవరు రింగులో మిగులుతారో వాళ్లే విజేత. ముందుగా ఆరోహి, ఫైమా బరిలోకి దిగారు. వాళ్లింకా పోటీపడుతూ ఉండగానే కీర్తి వచ్చింది. ఆ తర్వాత ఇనయా, అర్జున్ తోడయ్యారు. ముందుగా వీళ్లంతా కలిసి అర్జున్‌ను బయటకు తోసేశారు.
ఆ తర్వాత ఫైమా కింద కూర్చోవడం, చేతులను పదేపదే ఉపయోగించడంతో సంచలక్‌గా ఉన్న రేవంత్ ఆమెను గేమ్ నుంచి డిస్‌క్వాలిఫై చేశాడు. దీంతో ఫైమా తనను ఆడనివ్వకుండా చేశారంటూ వెక్కివెక్కి ఏడ్చింది. అంతముందు రోజు రేవంత్ గెలవకుండా అడ్డుపడిన ఫైమాకు ఆ తర్వాతి రోజు అలాంటి పరిస్థితే ఎదురు అయ్యింది. అయితే ఆమె మాత్రం రేవంత్ కావాలనే ఇలా చేశారండూ కీర్తితో చెప్పి వాపోయింది. ఆ తర్వాత కీర్తి, ఇనయాల మధ్య పోరు ఉండగా నొప్పితో కీర్తి రింగ్ నుంచి బయటకు వచ్చేసింది.
చివరగా ఇస్‌క్రీం టైం అనే టాస్క్‌లో స్క్రీన్‌లో చూపించినట్లుగా కరెక్ట్‌గా ఐసీక్రీం షేప్ పెట్టాల్సి ఉంటుంది. ఈ గేమ్‌లో రాజశేఖర్ విజేతగా నిలిచాడు. ఇక రెండో రౌండ్‌లో ఆర్జే సూర్య గెలిచాడు. మొత్తానికి సిసింద్రీ టాస్క్ ముగిసేసరికి చంటి, ఇనయ, రాజ్(రాజశేఖర్), సూర్యలు ఈవారం కెప్టెన్నీ కంటెండర్‌లుగా నిలిచారు. మరి వీరిలో ఈవారం ఇంటి కెప్టెన్‌గా ఎవరు గెలుస్తారన్నది చూడాల్సి ఉంది.
Comments
Please login to add a commentAdd a comment