Bigg Boss 6 Telugu: Team Donga Vs Team Police Latest Promo Out - Sakshi
Sakshi News home page

Bigg Boss 6 Telugu: దొంగల టీమ్‌లో ఉండి పోలీసులను గెలిపిస్తానని రేవంత్‌ శపథం

Published Wed, Sep 21 2022 3:15 PM | Last Updated on Wed, Sep 21 2022 4:16 PM

Bigg Boss 6 Telugu: Team Donga Vs Team Police Latest Promo Out - Sakshi

బిగ్‌బాస్‌ -6లో కెప్టెన్సీ పోటీదారుల కోసం అడవిలో ఆట గేమ్‌ కొనసాగుతుంది. ఇందులో పోలీసులు, దొంగలుగా రెండు టీమ్స్‌గా విడిపోయారు. అయితే దొంగల టీమ్‌లో ఏమాత్రం యూనిటీ (ఐక్యత)లేకపోవడంతో వాళ్లమధ్యే గొడవలు జరిగినట్లు తెలుస్తుంది. నిన్నటి ఎపిసోడ్‌లో గీతూతో రేవంత్‌ డీల్‌ కుదుర్చుకున్నాడని అనుమానపడిన దొంగల టీమ్‌ ఈరోజు రేవంత్‌ దాచుకున్న బొమ్మలనే దొంగతం చేస్తారు. దీనికి సత్య కూడా సహాయం చేస్తుంది.

అయితే తన బొమ్మలు తన దొంగలు టీమ్‌ సభ్యులే కొట్టేశారని తెలిసి రేవంత్ ఆశ్చర్యపోతాడు. నిద్రపోదామనుకున్నా, కానీ నిద్రపోనూ, పోలీసుల టీమ్ ను గెలిపిస్తా అంటూ శపథం చేస్తాడు. వాళ్లకంటే తాను దారుణమైన కన్నింగ్‌ అని, ఇలా చేయడానికి మినిమం సెన్స్‌ ఉండాలంటూ మండిపడతాడు. అంతేకాకుండా పోలీసులకు తన దగ్గరున్న వస్తువులు చేస్తుందుకు కూడా ఆఫర్‌ చేస్తాడు.

దీంతో సుదీప నీ వరకు వస్తే గేమ్‌ వచ్చిందా?నువ్వు టీమ్ మొత్తాన్ని డిస్ క్వాలిఫై చేస్తావా అంటూ రేవంత్‌కు నచ్చజెప్పే ప్రయత్నం చేస్తుంది. మరి చివరికి రేవంత్‌ ఏం చేశాడు? పోలీసులతో చేరి నిజంగానే వాళ్లను గెలిపించాడా? లేక మనసు మార్చుకున్నాడా అన్నది ఈరోజు ఎపిసోడ్‌లో చూడాల్సి ఉంది. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement