Singer Revanth And His Wife Anvitha Blessed With A Baby Girl - Sakshi
Sakshi News home page

Singer Revanth : రేవంత్‌ ఇంట సంబరాలు.. పండంటి బిడ్డకు జన్మనిచ్చిన అన్విత

Published Fri, Dec 2 2022 8:40 AM | Last Updated on Sat, Dec 3 2022 11:39 PM

Bigg Boss 6 Telugu: Singer Revanth Blessed With Baby Girl - Sakshi

బిగ్‌బాస్‌ సీజన్‌-6 టైటిల్‌ గెలవకముందే సింగర్‌ రేవంత్‌ ఇంట సంబరాలు మొదలయ్యాయి. రేవంత్‌ మొదటిసారి తండ్రయ్యాడు. రేవంత్‌ భార్య అన్విత పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చింది. ఈ విషయాన్ని స్వయంగా ఆమె  సోషల్‌ మీడియా వేదికగా షేర్‌ చేసుకుంది. బిగ్‌బాస్‌లోకి ఎంట్రీ ఇచ్చిన సమయానికే అన్విత నిండు గర్భిణి. హౌస్‌లో ఉన్న సమయంలోనే ఆమె సీమంతం కూడా జరిగింది.

ఆ వీడియోను చూసి రేవంత్‌ ఎంతగానో ఎమోషనల్‌ అయ్యాడు. చిన్నప్పటి నుంచి తండ్రిలేని లోటు తనకు తెలుసని, అందుకే ఎప్పుడెప్పుడు నాన్న అని పిలిపించుకోవాలా అని ఎదురుచూస్తున్నట్లు రేవంత్‌ పలుమార్లు చెప్పాడు. ఇప్పుడు పాప పుట్టిన విషయం తెలిస్తే రేవంత్‌ సంతోషానికి అవధులు లేకుండా పోతాయంటూ ఫ్యాన్స్‌ అభిప్రాయపడుతున్నారు.

రేవంత్‌కు పాప పుట్టిన సందర్భంగా పలువురు సినీ ప్రముఖులు సహా నెటిజన్లు రేవంత్‌-అన్విత దంపతులకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. మరోవైపు బిగ్‌బాస్‌ సీజన్‌-6 టైటిల్‌ విన్నర్‌ అయ్యే ఛాన్స్‌ రేవంత్‌కే ఉందని ట్విట్టర్‌లో ట్రెండ్‌ చేస్తున్నారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement