Bigg Boss 6 Telugu Today Latest Promo: Keerthi Gets Emotional During Captaincy Task - Sakshi
Sakshi News home page

Bigg Boss 6 Telugu: గాయం కారణంగా కన్నీళ్లు పెట్టుకున్న కీర్తి

Published Tue, Nov 8 2022 3:18 PM | Last Updated on Tue, Nov 8 2022 4:15 PM

Bigg Boss 6 Telugu: Keerthi Gets Emotional During Captaincy Task - Sakshi

బిగ్‌బాస్‌ సీజన్‌-6లో అనుకోని విధంగా గీతూ ఎలిమినేట్‌ అయిన సంగతి తెలిసిందే. ఇది హౌస్‌మేట్స్‌కి కూడా షాకింగ్‌ అనే చెప్పొచ్చు. దీంతో గేమ్‌పై మరింత కసి పెరిగింది. తర్వాత వారం కెప్టెన్సీ పోటీదారుల కోసం బిగ్‌బాస్‌ పాము-నిచ్చెనల టాస్క్‌ను నిర్వహించారు. ఇందులో ఇంటిసభ్యులు రెండు టీమ్స్‌గా విడిపోవాల్సి ఉంటుంది. సగం మంది పామును, మరికొందరేమో నిచ్చెనను కట్టాల్సి ఉంటుంది.

ఆ తర్వాత పాము టీమ్‌ నుంచి ఒకరు వెళ్లి నిచ్చెనను చిన్నగా చేసి ఆ మట్టిని తమ పాము కోసం ఉపయోగించాల్సి ఉంటుంది. ఈ టాస్కులో కీర్తి బాగా ఎమోషనల్‌ అయింది. నిచ్చెన టీమ్‌లో రాజ్‌తో పోటీపడుతూ కిందపడిపోయింది. తన చేతికి తగిల గాయం కారణంగా సరిగ్గా గేమ్‌ ఆడలేకపోతున్నానంటూ కన్నీళ్లు పెట్టుకుంది. మరి ఈ టాస్కులో పామ్‌ వర్సెస్‌ నిచ్చెన టీమ్స్‌లో ఎవరు గెలుస్తారన్నది నేటి ఎపిసోడ్‌లో తేలనుంది. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement