Keerthi Bhat
-
పాపకు, నాకు డీఎన్ఏ టెస్టు చేయాలన్నారు, ఎప్పుడూ అనుమానమే!: కీర్తి
చిన్నవయసులోనే ఎన్నో కష్టాలు చూసింది కీర్తి భట్ (Keerthi Bhat). అయినవారిని పోగొట్టుకుంది, ప్రేమించినవాడి చేతిలో మోసపోయింది. పెంచుకున్న పాప దూరమై తల్లడిల్లింది. ఇలా నిత్యం కష్టాలతోనే సావాసం చేసిన కీర్తి సీరియల్స్‌తో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైంది. తెలుగు బిగ్‌బాస్ ఆరో సీజన్‌తో మరింత గుర్తింపు తెచ్చుకుంది. నటుడు విజయ్ కార్తీక్‌ను పెళ్లాడబోతున్న ఆమె అతడితో కలిసి ఒకే ఇంట్లో ఉంటోంది. విజయ్ కంటే ముందు కీర్తి ఓ వ్యక్తిని ప్రేమించగా.. అతడి చేతిలో దారుణంగా మోసపోయింది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో కీర్తి.. మాజీ ప్రియుడి అరాచకాల్ని బయటపెట్టింది.నా వెంటపడ్డాడునాపాటికి నేను పని చేసుకుంటూ పోతున్న సమయంలో ఓ వ్యక్తి నా వెనకాల పడ్డాడు. ఒకే సెట్లో ఉండేసరికి అతడి లవ్ ప్రపోజల్‌కు నేనూ ఓకే చెప్పాను. తన ఇంటికి కూడా వెళ్లేదాన్ని. నాలుగు నెలలకు అతడి అనుమానపు బుద్ధి బయటపడింది. నేను చేస్తున్న సీరియల్ హీరోతో కలిసి ఏదైనా షోకు వెళ్లడానికి ఒప్పుకునేవాడు కాదు. వెళ్తే.. నాకు, అతడికి ఏదో ఎఫైర్ ఉందని అనుమానించేవాడు.బిగ్‌బాస్‌కు వెళ్లేముందే..ఫిలిం ఇండస్ట్రీ అంటేనే అందరితో కలిసి ఉండాలి. హీరో, హీరోయిన్ అన్నాక షోకు వెళ్లాలి, కలిసి డ్యాన్స్ చేయాలి, రీల్స్ చేయాలి. కానీ, నేను ఏదీ చేయకూడదని ఆంక్షలు పెట్టేవాడు. ఎక్కడికి వెళ్లినా అతడు, అతడి తల్లి డౌట్ పడేవారు. ఇదేంటి? ఇలా నరకంలో పడిపోయాను అనిపించింది. నేను దాచుకున్న డబ్బు అంతా వాళ్లకే ఖర్చు పెట్టాను. దానికి ప్రతిఫలంగా వాళ్లు సైకోలా ప్రవర్తించేవారు. బిగ్‌బాస్‌కు వెళ్లేముందు నేను దత్తత తీసుకున్న పాప చనిపోయింది. నా లవ్ బ్రేకప్ అయింది. అయితే పాప నా కూతురే కావొచ్చన్న అనుమానంతో డీఎన్ఏ టెస్ట్ చేయించాలనుకున్నారు. అక్కడే ఆగిపోయాడువాళ్లు డీఎన్ఏ టెస్ట్ అడిగినందుకు నేను భయంతో పాప చనిపోయిందని చెప్పానని నోటికొచ్చింది వాగుతున్నారు. అది విని నాకెంత బాధేసిందో! ఇంకా నేను ఆ అబ్బాయిని డబ్బులు అడిగానట.. నన్ను ఇంత చెడ్డదానిగా చిత్రీకరించాలా? ఇంతవరకు ఎన్నడూ అతడి గురించి చెడుగా మాట్లాడలేదు. అలాంటిది నేను ఎంత హర్ట్ అయి ఉంటే ఇప్పుడిదంతా చెప్తున్నాను. నాపై విషం కక్కిన ఆ వ్యక్తి జీవితంలో ఎదగకుండా అక్కడే ఆగిపోయాడు. కానీ నేను ఒక రేంజ్‌కు వచ్చాను అని కీర్తి భట్ భావోద్వేగానికి లోనైంది. ఇకపోతే కీర్తి భట్ రోడ్డు ప్రమాదంలో కుటుంబాన్ని కోల్పోయింది. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడ్డ కీర్తికి పిల్లలు పుట్టరని వైద్యులు తేల్చేశారు.చదవండి: నేను సింగిల్.. రూ.50 కోట్లు తీసుకుంటే తప్పేంటి?: బాలీవుడ్ హీరో -
పెళ్లికి ముందే ప్రియుడితో పూజ.. 'అబ్బాయి పేరెంట్స్ అయినా చెప్పాలిగా'
కష్టాలు నాకు చుట్టాలని కొందరు అంటూ ఉంటారు. కానీ కీర్తి భట్‌కు కష్టాలు చుట్టాలుగా కాదు ఏకంగా కుటుంబ సభ్యులమే అంటూ తన ఇంట్లో, జీవితంలో తిష్ట వేశాయి. ఫ్యామిలీతో కలిసి సంతోషంగా ఉంటున్న సమయంలో విధి కీర్తి జీవితంతో ఆడుకుంది. యాక్సిడెంట్లో కుటుంబం మొత్తాన్ని కోల్పోయింది. అమ్మానాన్న, అన్నయ్య.. ముగ్గురూ దూరమవడంతో ఎవరూ లేని అనాథగా మారింది.సినిమాల నుంచి సీరియల్స్దురదృష్టవంతురాలినని కుంగిపోయింది. కానీ ఇలా బాధపడుతూ కూర్చుంటే కరెక్ట్ కాదని తనకు తాను సర్ది చెప్పుకుంది. బాధను దిగమింగుకుంటూ జీవితాన్ని ఒంటరిగా ఎదుర్కోవాలనుకుంది. నచ్చిన ఫీల్డ్‌లో తన సత్తా చూపించాలనుకుంది. అలా కీర్తి భట్ (Keerthi Bhat) నటనవైపు అడుగులు వేసింది. కన్నడలో టీవీ సీరియల్స్ చేసింది. రెండు కన్నడ చిత్రాల్లోనూ నటించింది. తర్వాత మనసిచ్చి చూడు సీరియల్‌తో తెలుగులో ఎంట్రీ ఇచ్చింది. కార్తీకదీపం ధారావాహికలోనూ మెరిసింది.ఎప్పటికీ తల్లి కాలేవన్న వైద్యులుఈ సీరియల్స్ ద్వారా వచ్చిన క్రేజ్‌తో తెలుగు బిగ్‌బాస్ ఆరో సీజన్లో అడుగుపెట్టింది. ఈ సీజన్లో ఫస్ట్ కంటెస్టెంట్‌గా అడుగుపెట్టిన ఆమె సెకండ్ రన్నరప్‌గా నిలిచి ఎందరికో ఆదర్శంగా నిలిచింది. అయితే బిగ్‌బాస్ షో (Bigg Boss Reality Show)కు వెళ్లేముందు కూడా మరోసారి కష్టాలు తనను పట్టికుదిపేశాయి. యాక్సిడెంట్ వల్ల కీర్తి ఎప్పటికీ తల్లి కాలేదని వైద్యులు తేల్చి చెప్పడంతో ఆమె ఓ పాపను దత్తత తీసుకుని పెంచుకుంది. కానీ ఆ సంతోషం కూడా ఎంతోకాలం ఉండలేదు. బిగ్‌బాస్ ఆఫర్ వచ్చిన సమయంలోనే పాప మరణించింది.(చదవండి: 'మీరు అనుకున్నది సాధిస్తే'.. ప్రమాదం తర్వాత అజిత్ వీడియో రిలీజ్!)2023లో ఎంగేజ్మెంట్ఇలా ఎన్నో కష్టాలు దాటి ఇక్కడిదాకా వచ్చింది కీర్తి. త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నానంటూ 2023లో కీర్తి గుడ్‌న్యూస్ చెప్పింది. హీరో, దర్శకుడు విజయ్ కార్తీక్‌ను వివాహం చేసుకోనున్నట్లు ప్రకటించింది. అదే ఏడాది విజయ్‌తో ఎంగేజ్మెంట్ జరిగింది. ఆ మరుసటి ఏడాది నుంచి కాబోయే భర్తతో కలిసి ఒకే ఇంట్లో ఉంటోంది. నిశ్చితార్థం అయిపోయి రెండేళ్లవుతున్నా ఇంకా పెళ్లి డేట్ చెప్పట్లేదు. తాజాగా కీర్తి.. కాబోయే భర్తతో కలిసి తొలిసారి పూజలో పాల్గొంది. ఈ మేరకు సోషల్ మీడియాలో ఓ వీడియో షేర్ చేసింది. భార్యాభర్తల్లా పూజ చేస్తున్నారేంటి?ఇది చూసిన ఓ నెటిజన్.. మిస్ కన్నడ కీర్తి గారు.. పెళ్లికి ముందు ఇలా కలిసి పూజ చేయడం తెలుగు సాంప్రదాయం కాదు. కార్తీక్.. కనీసం మీకు మీ తల్లిదండ్రులైనా చెప్పలేదా? అయినా ఈ జనరేషన్లో పేరెంట్స్ మాట ఎవరూ వినరు. ముఖ్యంగా ఈ ఇండస్ట్రీలోనివాళ్లు అసలే వినరు అని పెదవి విరిచాడు. దీనికి కీర్తి స్పందిస్తూ.. పెళ్లికి ముందే మేము ఇలా పూజ చేస్తే ఏమవుతుందో కాస్త చెప్పగలరా? ఒకరిని నిందించేముందు సరైన కారణాలు చెప్పండి అని ఘాటుగా రిప్లై ఇచ్చింది.ఎవరీ కార్తీక్?కీర్తికి కాబోయే భర్త కార్తీక్ విషయానికి వస్తే.. చిత్తూరులోని మదనపల్లిలో పుట్టి పెరిగిన విజయ కార్తీక్ మొదట సాఫ్ట్వేర్ కంపెనీలో పని చేశాడు. తర్వాత సినిమా మీదున్న ప్రేమతో ఉద్యోగాన్ని వదిలేసి ఇండస్ట్రీలో చేరాడు. కన్నడ భాషలో నాలుగు సినిమాల్లో హీరోగా నటించాడు. తెలుగులో ఏబీ పాజిటివ్, చెడ్డీ గ్యాంగ్ సినిమాలు చేశాడు.చదవండి: 'మీరు అనుకున్నది సాధిస్తే'.. ప్రమాదం తర్వాత అజిత్ వీడియో రిలీజ్! -
కాబోయే భర్తతో కలిసి పూజ చేసిన బిగ్‌బాస్ బ్యూటీ కీర్తి భట్ (ఫోటోలు)
-
ప్రియుడితో కలిసి ట్విన్నింగ్ డ్రెస్‌లో బిగ్ బాస్ బ్యూటీ
-
Keerthi Bhatt: కాబోయే భర్తతో సీరియల్ నటి కీర్తి బర్త్‌డే సెలబ్రేషన్స్ (ఫోటోలు)
-
ఎక్కడెక్కడో టచ్ చేశారు.. వస్తావా అంటే తెలియక సరే అన్నాను: కీర్తి భట్
బిగ్ బాస్ షోతో చాలామంది పేరు తెచ్చుకున్నారు. అలా ఆరో సీజన్లో పాల్గొని గుర్తింపు తెచ్చుకున్న సీరియల్ నటి కీర్తి భట్. పలు సీరియల్స్‌లో హీరోయిన్గా నటించింది. యాక్సిడెంట్ జరిగిన తర్వాత కొన్నాళ్లు కోమాలో ఉండి, తిరిగి కోలుకుంది. రీసెంట్‌గానే ప్రియుడితో ఎంగేజ్ మెంట్ చేసుకున్న ఈ బ్యూటీ.. త్వరలో పెళ్లి చేసుకోబోతుంది. ఈ క్రమంలోనే జంటగా ఓ ఇంటర్వ్యూకి వచ్చింది. తనకు జరిగిన దారుణమైన అనుభవాల్ని బయటపెట్టింది.స్వతహాగా కన్నడ అమ్మాయి అయిన కీర్తి భట్.. 2019లో 'మనసిచ్చి చూడు' అనే సీరియల్‌తో తెలుగులోకి ఎంట్రీ ఇచ్చింది. 'కార్తీకదీపం'లోనూ నటించింది. 2022లో ప్రసారమైన బిగ్‌బాస్ షోలో ఆకట్టుకునే ప్రదర్శన చేసింది. ప్రస్తుతం 'మధురానగరిలో' సీరియల్ చేస్తోంది. 2017లో కీర్తి భట్ ప్రయాణిస్తున్న కారు ప్రమాదానికి గురవగా.. ఈమె తల్లిదండ్రులు, అన్న-వదిన మృత్యువాతపడ్డారు. అదృష్టం బాగుండి కీర్తి ప్రాణాలతో బయటపడింది. కానీ కొన్నాళ్ల పాటు కోమాలో ఉండి వచ్చింది. అప్పుడే దారుణమైన సంఘటనలు జరిగాయని కీర్తి చెప్పుకొచ్చింది.'ఫ్యామిలీకి యాక్సిడెంట్ అయిన తర్వాత నన్ను మంగళూరు తీసుకెళ్లారు. అక్కడే 35 రోజులు ఉండాల్సి వచ్చింది. అక్కడ నాకు చాలా చేదు అనుభవాలు ఎదుర్కొన్నా. నన్ను ఎక్కడెక్కడో టచ్ చేసేవారు. తెలుస్తుంది కానీ స్పర్మ లేకపోవడం వల్ల నెట్టేయడానికి కూడా బలముండేది కాదు. కోలుకున్న తర్వాత అక్కడి నుంచి ఎవరికీ చెప్పకుండా వచ్చేశాను. ఎటైనా వెళ్లాలంటే డబ్బులు కావాలి. ఆటో వాళ్ల దగ్గరకి వెళ్తే.. '200 ఇస్తా వస్తావా' అంటే సరే వస్తానని అనేదాన్ని. తర్వాత వాళ్ల లుక్ చూసి అర్థమయ్యేది' అని కీర్తి భట్ తనకెదురైన దారుణాల్ని బయటపెట్టింది. -
ఆ లింక్‌పై క్లిక్ చేశా..రూ.2 లక్షలు పోయాయి: కీర్తి భట్ ఆవేదన
దేశంలో సైబర్ నేరాలు రోజు రోజుకి విపరీతంగా పెరిగిపోతున్నాయి. అంతా డిజిటల్ మయం ఐపోయేసరికి దానికి తగ్గట్లే కేటుగాళ్లు కొత్త కొత్త ఐడియాలతో సైబర్ నేరాలకు పాల్పడుతున్నారు. సామాన్యులే కాదు సెలెబ్రిటీలు కూడా ఈ సైబర్ నేరాల బారిన పడుతున్నారు. తాజాగా బిగ్‌బాస్ ఫేం కీర్తిభట్ సైబర్ నేరగాళ్ల చేతిలో దారుణంగా మోసపోయింది. కొరియర్ కోసం ఓ లింక్ క్లిక్ చేసి రూ. 2 లక్షలు పోగొట్టుకుంది. ఈ విషయాన్ని తన యూట్యూబ్ చానల్లో తెలియజేస్తూ ఓ వీడియోని వదిలారు. అసలేం జరిగింది? ఆమె మాటల్లోనే.. ‘నాకొక ముఖ్యమైన కొరియర్ రావాల్సి ఉంది. వారం రోజులు అయినా రాకపోవడంతో మెయిన్ కొరియర్ సెంటర్ వాళ్లకి కాల్ చేశా. వాళ్లు డెలివరీ చేశాం.. మెహదీపట్నంలో ఉందని చెప్పారు. ట్రాక్ చేసి చూస్తే నిజంగానే మెహదీపట్నంలో ఉన్నట్లు కనిపించింది. ఆ తర్వాత నాకొక కాల్ వచ్చింది. వాళ్లు హిందీలో మాట్లాడుతూ.. ‘మికొక కొరియర్ రావాలికదా? అన్నారు. అవును ఇంకా రాలేదు అని చెప్పాను. మీ లొకేషన్ అడ్రస్ అప్డేట్ కాలేదు మేడం. ఒక్కసారి వాట్సాఫ్ ద్వారా మీ అడ్రస్ని పంపించండి అని ఒక నెంబర్ ఇచ్చారు. నేను కాల్ మాట్లాడుతూ.. ఆ నెంబర్‌కి అడ్రస్ పంపించాను. ఆ తర్వాత మళ్లీ కాల్ చేసి అప్డేట్ కావడం లేదు.. నార్మల్ మెసేజ్ చేస్తా..దానికి రిప్లై ఇవ్వండి అని చెప్పారు. నేను ఆ నెంబర్‌కి హాయ్ అని మెసేజ్ పెట్టాను. ఆ తర్వాత నా మొబైల్ నెంబర్‌కి ఒక లింక్ వచ్చింది. దాన్ని క్లిక్ చేయమని చెప్పారు. ఆ లింక్‌ని కాపీ చేసి వాళ్లు పంపిన వేరే నెంబర్‌కి ఫార్వర్డ్ చేయమన్నారు. అలాగే చేశాను. ఆ తరువాత ముందు పంపిన వాట్సాప్ నెంబర్‌కి అదే లింక్‌ని ఫార్వర్డ్ చేసి.. దాన్నిఓపెన్ చేయమన్నారు. అడ్రస్ అప్డేట్కి రూ.2 రూపాయిలు ఎక్స్ ట్రా పే చేయాల్సి వస్తుంది మేడమ్ అని అన్నారు. రెండు రూపాయలే కదా అనుకొని నేను సరే అన్నాను. యూపీఐ మెన్షన్ చేయమని అన్నారు. నాకు డౌట్ వచ్చి.. చేయనని చెప్పాను. అప్పుడు బ్యాంక్‌కి లింక్ అయిన రిజిస్టర్ నెంబర్ ఇదేనా అని అడిగారు. ఇదే అని చెప్పాను. నాకు ప్రాసెసింగ్ అని మెసేజ్ వచ్చింది. మేడమ్ మీకు కాసేపు ఆగి కాల్ చేస్తాం.. అప్డేట్ ఇస్తాం అని అన్నారు. వాళ్లు ఫోన్ కట్ చేసిన కాసేపటికి రెండు రూపాయిలు నా అకౌంట్ నుంచి కట్ అయ్యింది. సరే రెండు రూపాయిలే కదా అని నేను పట్టించుకోలేదు. ఆ తరువాత నేను షూటింగ్‌కి వెళ్లిపోయాను. సరిగ్గా మిడ్నైట్ 12 గంటలకు రూ. 99 వేలు ట్రాన్స్ఫర్ అయినట్లు మెసేజ్ వచ్చింది. ఆ వెంటనే మరో రూ.99 వేలు కట్ అయినట్లు మెసేజ్ వచ్చింది. బ్యాలెన్స్ చెక్ చేస్తే..నిజంగానే రూ. 2లక్షలు ట్రాన్స్ఫర్ అయినట్లు చూపించింది. . వెంటనే నాకు ఏం చేయాలో తెలియక.. కార్తీక్‌కి ఫోన్ చేస్తే.. సైబర్లో కంప్లైంట్ ఇచ్చాం. నా అకౌంట్‌ని బ్లాక్ చేయించాను. సైబర్ క్రైమ్ వాళ్లు యాక్షన్ తీసుకున్నారు. ట్రాకింగ్ స్టార్ట్ చేశారు. ఖచ్చితంగా డబ్బులు తిరిగి వస్తాయని అంటున్నారు. ఆలస్యం చేయకుండా వెంటనే కంప్లైంట్ ఇచ్చాం కాబట్టి.. ట్రాన్స్ఫర్ కాకుండా వాళ్ల అకౌంట్లను బ్లాక్ చేయించగలిగాం. ఇంకా నా డబ్బులు తిరిగి రాలేదు కానీ కచ్చితంగా వస్తాయని పోలీసులు చెబుతున్నారు. ఈ విషయంలో సైబర్ క్రైమ్ వాళ్లకి సెల్యూట్ చేస్తున్నా. ఇలాంటి సైబర్ క్రైమ్ నేరాలు మీకు జరగొచ్చు. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండండి.ఇలాంటి సైబర్ నేరాలు జరిగినప్పుడు 1930 టోల్ ఫ్రీ నెంబర్‌కి కాల్ చేయండి’ అని కీర్తీభట్ సూచించింది. -
ఏంటీ కీర్తి..? కుమారి ఆంటీ ఫుడ్ గురించి అంత మాట అనేశావ్..!
సోషల్ మీడియా ప్రభావంతో స్ట్రీట్ ఫుడ్ ఆంటీ కుమారి బాగా పాపులర్ అయింది. మధ్యాహ్నం 12 అయితే చాలు కుమారి ఆంటీ స్ట్రీట్ ఫుడ్ కోసం జనాలు బారులు తీరుతున్నారు. దీంతో భారీగా ట్రాఫిక్ ఇబ్బందులు ఎదురు కావడం.. పోలీసులు హెచ్చరించడం వంటివి కూడా జరిగాయి. చివరకు తెలంగాణ ముఖ్యమంత్రి కార్యాలయం రియాక్ట్ అయ్యే వరకు ఆమే ఫేమస్ అయింది. చివరకు సీఎం రేవంత్ రెడ్డి కూడా సమయం వచ్చినప్పుడు తాను కూడా అక్కడ భోజనం చేస్తానని చెప్పారు. అంతలా రెండు రాష్ట్రాల్లో కుమారీ ఆంటీ ఫుడ్ ఫేమస్ అయింది. హైదరాబాద్‌లోని ఎందరో యూట్యబర్స్, నెటిజన్లు ఫుడ్ తిని తమ అభిప్రాయాలను సోషల్‌మీడియా ద్వారా షేర్ చేయడం చూశాం.. తాజాగా బిగ్‌బాస్ ఫేమ్, సీరియల్ నటి కీర్తి భట్ తనకు కాబోయే భర్త విజయ్ కార్తీక్‌తో పాటు కుమారి ఆంటీ ఫుడ్ స్టాల్ వద్దకు వెళ్లి భోజనం రుచి చూశారు. ఆపై వారి అభిప్రాయాన్ని యూట్యూబ్‌లో పంచుకున్నారు. మేము కుమారి ఆంటీనే చూద్దమని వస్తే.. ఆ సమయంలో ఆంటీ లేదని కీర్తి తెలిపింది. వైట్ రైస్, చికెన్ కర్రీ, చికెన్ ఫ్రై తిందామని తీసుకున్నాం. కానీ తమకు నచ్చలేదని కీర్తి తెలిపింది. ఎక్కువగా కారం ఉండటం వల్ల అంత రుచిగా లేదని వారు తెలిపారు. పక్కనే ఉన్న మరో రోడ్‌సైడ్ హోటల్లో భోజనం చేశామని వారు తెలిపారు. అది కొంచెం బెటర్ అని వారిద్దరూ తెలిపారు. కుమారీ ఆంటీ ఫుడ్‌కు అసలు ఎందుకు అంత హైప్ వచ్చిందో తెలియదు. ధరలు కూడా కాస్త ఎక్కువగానే ఉన్నాయి. కొంచెం వైట్ రైస్, నాలుగు చికెన్ ముక్కలు వేసి రూ. 170 తీసుకున్నారు. ఆ ధరకు ఫుడ్ ఏ మాత్రం వర్త్ కాదు. మాకు నచ్చలేదు. కుమారి ఆంటీ కంటే నేను చాలా బాగా చేస్తాను.' అని కీర్తి తెలిపింది. అందరూ ఫుడ్ బాగుంది అంటే మేము కూడా తిందామని అక్కడికి వచ్చినట్లు వారు తెలిపారు. ఇదీ తమ అభిప్రాయం మాత్రమేనని చెప్పారు. ఆమె వ్యాపారానికి నష్టం చేయాలని తమ అభిప్రాయం కాదని చెప్పుకొచ్చారు. ఆమె వ్యాపారం మరింత మంచిగా జరిగి ఆపై ఒక పెద్ద హోటల్ ఆమె పెట్టాలని కోరుకుంటున్నట్లు కీర్తి తెలిపింది. అంతే గానీ తమ అభిప్రాయాన్ని ఎవరూ తప్పుగా తీసుకోకండి అని చెప్పింది. -
Keerthi Bhat: పెళ్లికి ముందే భర్తతో కలిసుంటున్న బిగ్‌బాస్ 'కీర్తి'.. తన ఇల్లు చూశారా? (ఫోటోలు)
-
నా జీవితంతో ఆడుకోకండి.. మీ అమ్మతోనే నడిరోడ్డుపై కొట్టిస్తా: కీర్తి
బిగ్‌బాస్ హౌస్‌లో కొట్లాటలు కామన్.. వీరు గొడవపడ్తారు అంతలోనే మళ్లీ కలిసిపోతారు. కానీ బయట జరిగే కొట్లాటలు, గొడవలు, వివాదాలు మాత్రం అంతకుమించి అన్నట్లుగానే ఉంటాయి. సోషల్ మీడియాలో జరిగే ఫ్యాన్స్ వార్‌కు అయితే లెక్కే లేదు. అయితే కంటెస్టెంట్లను విమర్శించి, అక్కడితో ఆగకుండా వారి కుటుంబాలను కూడా గొడవలోకి లాగుతున్నారు. అసభ్యపదజాలంతో దూషిస్తున్నారు. గౌతమ్‌కు సపోర్ట్ చేయడమే పాపమైపోయింది! పొరపాటున ఏ సెలబ్రిటీ అయినా తమ ఫేవరెట్ కంటెస్టెంట్‌కు సపోర్ట్ చేయట్లేదని తెలిస్తే ఇక అంతే సంగతులు. బిగ్‌బాస్ బ్యూటీ కీర్తి భట్.. ఇటీవల ఎలిమినేట్ అయిన గౌతమ్ కృష్ణకు సపోర్ట్ చేస్తూ మాట్లాడింది. అతడికి వెల్కమ్ చెప్తూ జరిపిన సెలబ్రేషన్స్‌లో పాల్గొంది. అంతే.. సీరియల్ బ్యాచ్‌కు కాకుండా గౌతమ్‌కు మద్దతు తెలపడంతో అమర్దీప్ ఫ్యాన్స్ ఆమెను పచ్చిబూతులు తిడుతూ వేధిస్తున్నారట. దీంతో ఆవేదనకు గురైన కీర్తి సోషల్ మీడియాలో వీడియో రిలీజ్ చేసింది. సోలోగా ఆడేవారికే నా సపోర్ట్ 'కొద్ది రోజుల నుంచి నాకు చాలా మెసేజ్‌లు వస్తున్నాయి. బిగ్‌బాస్ షో నుంచి బయటకు వచ్చిన గౌతమ్ కృష్ణ సెలబ్రేషన్స్‌కు నేను వెళ్లాను. అప్పుడు ఇంటర్వ్యూలు అడిగితే ఇచ్చాను. అందులో ఎవరి గురించీ చెడుగా మాట్లాడలేదు. కానీ అమర్ ఫ్యాన్స్ కొందరు నన్ను చెండాలమైన బూతులు తిడుతున్నారు. నీ తల్లి కూడా ఒక ఆడదే కదా.. నేను బిగ్‌బాస్ హౌస్ లోపల ఉన్నప్పుడు ప్రియాంక, మానస్, మహేశ్ తప్ప నాకెవరూ సపోర్ట్ చేయలేదు. సోలోగా ఎవరు ఆడతారో వారికే నేను సపోర్ట్ చేస్తున్నాను. ఒక్కొక్కరికీ ఒక్కొక్కరు నచ్చుతారు. గౌతమ్ నాకు ముందునుంచీ పరిచయమే లేదు. తను ఒంటరిగా ఆడటం నచ్చింది.. అందుకే తన దగ్గరకు వెళ్లి సపోర్ట్ చేశా.. నా జీవితంలో నాకు నచ్చింది చేస్తాను. ఎందుకిలా వేధిస్తున్నారు? నడిరోడ్డుపై కొడతా మీకు దండం పెడతా.. మీ ఇంట్లో కూడా ఆడపిల్లలు ఉన్నారు. ఫ్యాన్స్ అన్న పేరుతో ఇతరులను బాధపెట్టకండి. ఇంత గలీజ్‌గా మాట్లాడొద్దు. నా తప్పుంటే మీ అందరి కాళ్లు మొక్కుతా.. తప్పు లేదంటే మాత్రం అస్సలు ఊరుకోను. సోషల్ మీడియాలో అలాంటి కామెంట్లు పెడుతుంటే చూసి చాలా హర్ట్ అవుతున్నాను. నా జీవితంతో ఎందుకు ఆడుకుంటున్నారు? అమ్మాయిలను గౌరవించండి. లోపల ఉన్న నలుగురి స్నేహితులకు పరోక్షంగా సపోర్ట్ చేస్తున్నాను. అది మీకేం తెలుసు? నా తిండి నేను తింటున్నాను. ఎవరి దగ్గరా అడుక్కోవట్లే.. నేను తిని నలుగురికి ఇస్తున్నాను. వీలైతే మీరు సాయం చేయండి. ఎవరు ఏ ఐడీ నుంచి మెసేజ్‌లు పెడుతున్నారో అవన్నీ ట్రాక్ చేసి మీరెక్కడున్నా వచ్చి నడి రోడ్డుపై కొడతా.. మీ అమ్మతోనే కొట్టిస్తా..' అని ఆగ్రహించింది కీర్తి భట్. View this post on Instagram A post shared by Keerthi Keshav Bhat (@keerthibhatofficial) View this post on Instagram A post shared by Keerthi Keshav Bhat (@keerthibhatofficial) చదవండి: స్టార్ హీరోతో బెడ్రూమ్ సీన్... ఆ అత్యాచార సీన్ కంటే బెటరేనన్న బ్యూటీ -
హీరోతో కీర్తి నిశ్చితార్థం, ఫోటోలు వైరల్
బుల్లితెర నటి, బిగ్‌బాస్ కంటెస్టెంట్ కీర్తి భట్ త్వరలో కొత్త జీవితం ఆరంభించనుంది. దర్శకుడు, హీరో విజయ్ కార్తీక్ తోటను పెళ్లాడనుంది. తాజాగా వీరిద్దరి నిశ్చితార్థం ఘనంగా జరిగింది. ఆదివారం జరిగిన వీరి ఎంగేజ్మెంట్ వేడుకకు బుల్లితెర సెలబ్రిటీలతో పాటు బిగ్‌బాస్ కంటెస్టెంట్లు సైతం హాజరై సందడి చేశారు. ఈ వేడుకలో కీర్తి, విజయ్ ఇద్దరూ ఆకుపచ్చని దుస్తుల్లో మెరిసిపోయారు. కాబోయే భార్య కాలికి పట్టీ తొడిగిన విజయ్ అనంతరం ఆమె వేలికి ఉంగరం తొడిగాడు. అటు కీర్తి కూడా అతడి వేలికి ఉంగరం తొడిగి తనను ముద్దాడింది. ఇందుకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. కాగా వీరిద్దరూ ఇటీవలే ఓ షోలోనూ పాల్గొని స్టేజీపై పూలదండలు మార్చుకున్నారు. ఈ సందర్భంగా తనకు పిల్లలు పుట్టరని తెలిసినా ప్రేమించి, పెళ్లి చేసుకునేందుకు సిద్ధమయ్యాడంటూ భావోద్వేగానికి లోనైంది కీర్తి. విజయ్ మాత్రమే కాదు, ఆయన కుటుంబం కూడా ఈ విషయం తెలిసి తనను కోడలిగా అంగీకరించినందుకు సంతోషం వ్యక్తం చేసింది. మొత్తానికి త్వరలో పెళ్లిపీటలెక్కబోతున్న ఈ జంటకు అంతా శుభం జరగాలని కోరుకుంటున్నారు అభిమానులు. బిగ్‌బాస్ ఆరో సీజన్లో పాల్గొన్న కీర్తి ఈ సీజన్లో టాప్ 3 కంటెస్టెంట్‌గా నిలిచింది. ప్రస్తుతం ఆమె సీరియల్స్ చేస్తోంది. విజయ్ కార్తీక్ విషయానికి వస్తే.. చిత్తూరులోని మదనపల్లిలో పుట్టి పెరిగిన ఇతడు మొదట సాఫ్ట్వేర్ కంపెనీలో పని చేశాడు. అయితే సినిమాల మీద ఆసక్తితో ఉద్యోగాన్ని వదిలేసి సినిమా ఇండస్ట్రీలో చేరాడు. కన్నడ భాషలో నాలుగు చిత్రాల్లో హీరోగా నటించాడు. తెలుగులో ఏబీ పాజిటివ్, చెడ్డీ గ్యాంగ్ సినిమాలు చేశాడు. చదవండి: ‘భోళా శంకర్’కు రూ.50 కోట్ల నష్టం.. అప్పుడే ఓటీటీలోకి..! -
నిశ్చితార్థం ఫిక్స్.. కాబోయే భర్తతో కలిసి కార్డులు పంచుతున్న కీర్తి
బిగ్‌బాస్ బ్యూటీ, నటి కీర్తి భట్.. హీరో విజయ కార్తీక్ ప్రేమలో ఉన్న సంగతి తెలిసిందే! వీరిద్దరి ప్రేమకు కార్తీక్ కుటుంబం కూడా పచ్చజెండా ఊపింది. తమ వంశాన్ని ముందుకు తీసుకెళ్లలేదని తెలిసినా కీర్తిని కోడలిగా తెచ్చుకునేందుకు సిద్ధమైంది. కీర్తియే తమకు చిన్నపిల్ల అని, కావాలంటే వేరే పిల్లల్ని దత్తత తీసుకుంటామని పెద్ద మనసుతో వీరి ప్రేమను అర్థం చేసుకున్నారు కార్తీక్ తల్లిదండ్రులు. ఇటీవలే ఓ షోలో కీర్తి, కార్తీక్ దండలు కూడా మార్చుకున్నారు. తాజాగా వీరి పెళ్లి పనులు షురూ అయ్యాయి. కీర్తి-కార్తీక్‌ల నిశ్చితార్థానికి ముహూర్తం ఫిక్స్ చేశారు. ఈ మేరకు ఎంగేజ్మెంట్ వేడుకకు రావాల్సిందిగా తమ బంధుమిత్రులకు ఆహ్వానపత్రికలు పంచుతున్నారు. ఈ క్రమంలో జానకి కలగనలేదు సీరియల్ నటి ప్రియాంక జైన్, నటుడు అమర్ దీప్ దగ్గరకు వెళ్లి కార్డులు ఇచ్చారు. ఈ విషయాన్ని ప్రియాంక తన యూట్యూబ్ ఛానల్లో తెలియజేస్తూ ఓ వీడియో రిలీజ్ చేసింది. ఇందులో జానకి కలగనలేదు సీరియల్ సెట్లోకి వెళ్లిన కీర్తి, కార్తీక్ అక్కడున్న అందరికీ ఆహ్వానపత్రికలు పంచారు. ఆగస్టు 20న బేగంపేట్‌లో నిశ్చితార్థం జరగనున్నట్లు వెల్లడించారు. ఆ కార్డు చూశాక ప్రియాంక జైన్.. నిజంగానే మీకు పెళ్లి చేసుకోవాలని ఉందా? అని తిక్క ప్రశ్న వేసింది. పెళ్లి మాట ఎత్తితేనే తనకు భయమేస్తుందని చెప్పుకొచ్చింది. అయితే మీరు మంచి జీవితం కొనసాగించాలని కోరుకుంటున్నాను అని పేర్కొంది. మొత్తానికి కీర్తి ఎంగేజ్మెంట్ డేట్‌ను ఈ వీడియోతో లీక్ చేసింది జానకి. త్వరలో కొత్త జీవితం ప్రారంభించబోతున్న జంటకు అభిమానులు ముందుగానే శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. చదవండి: కోట్ల ఆస్తి.. 30 ఏళ్లకే అనాథలా తనువు చాలించిన హీరోయిన్ ఆనందం హీరో ఇప్పుడేం చేస్తున్నాడో తెలుసా? -
హీరోతో కీర్తి నిశ్చితార్థం.. వంశాన్ని ముందుకు తీసుకెళ్లలేనంటూ ఎమోషనల్
సీరియల్స్ ద్వారా గుర్తింపు తెచ్చుకుని బిగ్‌బాస్ షోతో ఎంతోమంది అభిమానులను సంపాదించుకుంది నటి కీర్తి భట్. రోడ్డుప్రమాదంలో తన కుటుంబం మొత్తాన్ని కోల్పోయిన ఆమె జీవితంలో ఎన్నో కష్టనష్టాలను, బాధలను అనుభవించి ఈ స్థాయికి ఎదిగింది. యాక్సిడెంట్లో తీవ్రంగా గాయపడ్డ కీర్తి.. ఎప్పటికీ పిల్లల్ని కనలేదని వైద్యులు చెప్పారు. దీంతో ఆమె పెళ్లికి ముందే పాపను దత్తత తీసుకుని పెంచుకుంది. ఆ చిన్నారిలోనే సంతోషాన్ని వెతుక్కుంది. కానీ ఆ ఆనందం కూడా ఎంతోకాలం నిలవలేదు. బిగ్‌బాస్ ఆఫర్ వచ్చిన సమయంలోనే పాప కన్నుమూసింది. తాజాగా కీర్తి భట్ గుడ్‌న్యూస్ చెప్పింది. త్వరలోనే పెళ్లి పీటలెక్కబోతున్నట్లు తెలిపింది. ఈ మేరకు ఓ షోలో దర్శకుడు, హీరో విజయ కార్తీక్ తోటతో నిశ్చితార్థం జరిగింది. ఇందుకు సంబంధించిన ప్రోమో నెట్టింట చక్కర్లు కొడుతోంది. ఇందులో కార్తీక్, కీర్తి పూలదండలు మార్చుకున్నారు. 'నీకు నేను తోడుగా ఉంటా, సపోర్ట్‌గా ఉంటా.. నీ తల్లిదండ్రులను నా పేరెంట్స్ అనుకుంటా! నన్ను వదలకుండా ఇలాగే చూసుకో' అంటూ కంటతడి పెట్టుకుంది కీర్తి. తర్వాత వీరిద్దరూ ఉంగరాలు మార్చుకున్నారు. తనకు కాబోయే అత్తామామల గురించి కీర్తి మాట్లాడుతూ.. 'నేను వారి వంశాన్ని నెక్స్ట్ లెవల్‌కు తీసుకుని వెళ్లలేనని నాకు తెలుసు. ఆ విషయాన్ని వాళ్లకు చెప్తే ఒకటే మాట అన్నారు. నీకు పాప ఎందుకమ్మా? నువ్వే మాకు పాప.. మనం పాపను దత్తత తీసుకుందాం' అన్నారు అంటూ భావోద్వేగానికి లోనైంది కీర్తి. కీర్తికి కాబోయే భర్త కార్తీక్ విషయానికి వస్తే.. చిత్తూరులోని మదనపల్లిలో పుట్టి పెరిగిన విజయ కార్తీక్ మొదట సాఫ్ట్వేర్ కంపెనీలో పని చేశాడు. తర్వాత సినిమా మీదున్న ప్రేమతో ఉద్యోగాన్ని వదిలేసి ఇండస్ట్రీలో చేరాడు. కన్నడ భాషలో నాలుగు సినిమాల్లో హీరోగా నటించాడు. తెలుగులో ఏబీ పాజిటివ్, చెడ్డీ గ్యాంగ్ సినిమాలు చేశాడు. View this post on Instagram A post shared by @keerthi_mahesh_universe View this post on Instagram A post shared by keerthi_bhat💙 (@always_keerthibhat_fanz) చదవండి: ఈ వారం ఓటీటీలోకి 24 సినిమాలు హీరోయిన్ సీక్రెట్ పెళ్లిపై నటి సంచలన వ్యాఖ్యలు.. ఊహించని ట్విస్ట్ -
అనాధ అని బాయ్‌ఫ్రెండ్ వదిలేశాడు: కీర్తి ఎమోషనల్
బిగ్‌బాస్ తెలుగు ఆరో సీజన్లో సెకండ్ రన్నరప్‌గా నిలిచింది కీర్తి. డబ్బులు ఎర చూపినా సరే వద్దంటూ అభిమానులు తనను ఏ పొజిషన్లో చూడాలనుకుంటున్నారో ఆ స్థానానికే కట్టుబడి ఉంటానంది. అలా మూడో స్థానంలోనే హౌస్ నుంచి బయటకు వచ్చేసింది. తనకంటూ ఎవరూ లేరని బాధపడుతున్న కీర్తికి బిగ్‌బాస్ షో ద్వారా ఎంతోమంది అభిమానులయ్యారు. ఆమెను తెలుగింటి అమ్మాయిగా, ఇంట్లో కూతురిగా స్వీకరించారు. కానీ ప్రేమించిన వ్యక్తి మాత్రం తన ఎదుగుదలను అనుమానించి మధ్యలోనే వదిలేశాడు. తన బ్రేకప్ గురించి కీర్తి తాజా ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. 'నేను ఒకతడిని ప్రేమించాను. ఇద్దరం బానే ఉండేవాళ్లం. కానీ ఓ పరిస్థితిలో అతడు నాకు బ్రేకప్ చేసి వదిలేశాడు. అంటే.. నాకు బ్యాక్‌గ్రౌండ్ లేదు కదా. నేను ఏం చేసి ఇండస్ట్రీకి వచ్చానో అన్న అనుమానంతో వదిలేశాడు. ఇక్కడిదాకా వచ్చిందంటే ఏం చేసి వచ్చిందో అని దగ్గరివాళ్లే చులకనగా మాట్లాడుతుంటే చాలా కష్టంగా ఉంటుంది. అతడికి అలా అనిపించిందంటే నేను తప్పుడు వ్యక్తిని ఎంపిక చేసుకున్నట్లే.. ఇంకా ఈ విషయం గురించి మాట్లాడితే మళ్లీ ఏడ్చుకుంటూ ఉండిపోతాను. ఇప్పుడంతా హ్యాపీగా ఉంది. త్వరలోనే మళ్లీ ఓ పాపను దత్తత తీసుకుంటాను' అని చెప్పింది. చదవండి: నా కూతురికి ఆమె పేరే పెట్టుకున్నాను: అలీ హిట్ 2 ఓటీటీలోకి వచ్చేది అప్పుడే! -
బిగ్ బాస్ 6 కంటెస్టెంట్ కీర్తి భట్ తో " చిట్ చాట్ "
-
బిగ్‌బాస్ 6: టాప్ 3 కంటెస్టెంట్ కీర్తి.. 15 వారాల రెమ్యునరేషన్ ఎంతో తెలుసా?
బుల్లితెరపై తెలుగు బిగ్‌బాస్ 6 సీజన్ సందడికి ఎండ్ కార్డ్ పడింది. ఆదివారం బిగ్‌బాస్ గ్రాండ్ ఫినాలే ఘనంగా ముగిసింది. ఈ సీజన్లో రేవంత్ విజేత నిలిచి ట్రోఫీ కైవసం చేసుకోగా.. శ్రీహాన్ రన్నర్‌గా నిలిచాడు. ఇక టాప్ 3 కంటెస్టెంట్‌గా కీర్తి నిలిచింది. మొదటి నుంచి కీర్తి హౌజ్‌లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. హౌజ్ సింపతి గేన్ చేస్తుందంటూ ఎన్ని కామెంట్స్ వచ్చినా తడబడకుండా ఆమె ముందుకు సాగుతూనే ఉంది. ఆటలో సైతం తన మార్క్ చూపిస్తూ వచ్చింది. చేతి వేలు దెబ్బతిన్నా ఆటలో.. ఎక్కడ తగ్గేదేలే అంటూ ముందకు సాగింది. గాయపడినప్పటికీ మిగతా కంటెస్టెంట్స్‌కి గట్టి పోటినిచ్చింది. తన ఆటతీరుతో ఎంతోమంది ప్రేక్షక హృదయాలను గెలుచుకున్న కీర్తి టాప్ 3లో నిలిచింది. ఫినాలేలో బిగ్‌బాస్ ఇచ్చిన ఆఫర్‌ను వద్దనుకుని రూ. 30 లక్షల ప్రైజ్‌మనీని చేజార్చుకుంది. ఎవరూ చెప్పిన వినకుండా విన్నర్ అవుతాననే కాన్ఫిడెంట్‌తో రూ. 30 లక్షల బ్రీఫ్‌కేస్‌ను తిరస్కరించింది. దీంతో కొందరు ఆమెది ఓవర్ కాన్ఫీడెన్స్ అంటూ కామెంట్స్ చేస్తుండగా.. ఆడియన్స్ మాత్రం ఆమె కాన్ఫిడెన్స్‌కి ఫిదా అవుతున్నారు. మరికొందరు ఆ బ్రీఫ్‌కేస్ తీసుకుని ఉంటే తన శ్రమ తగిన ఫలితం ఉండేదంటూ చర్చించుకుంటున్నారు. ఈ నేపథ్యంలో కీర్తి 15 వారాలకు ఎంత రెమ్యునరేషన్ తీసుకుందనేది ఆసక్తిగా మారింది. పలు టీవీ సీరియల్స్ ద్వారా గుర్తింపు పొంది బిగ్‌బాస్ హౌజ్‌లో అడుగుపెట్టిన కీర్తి ఒక్కొ వారానికి గానూ రూ. 50 వేల నుంచి రూ. 75 వేలు తీసుకుందని వినికిడి. ఈ బజ్ ప్రకారం.. 15 వారాలపాటు హౌజ్‌లో కొనసాగిన కీర్తి మొత్తం రూ. 8 లక్షల నుంచి రూ. 11 లక్షల పైనే తీసుకుందని వినికిడి. దీనిప్రకారం హౌజ్‌లో లేడీ కంటెస్టెంట్స్‌తో పోలిస్తే అందరి కంటే కీర్తి రెమ్యునరేషన్ ఎక్కువని తెలుస్తోంది. చదవండి: మొత్తం బిగ్‌బాస్ ద్వారా రేవంత్ ఎంత సంపాదించాడో తెలుసా? ‘కాంతార’ భూత కోల వేడుకలో అనుష్క సందడి, వీడియో వైరల్ -
కీర్తి వల్ల ఆత్మహత్యలు ఆగుతాయి: ఆదిరెడ్డి
స్పెషల్ గెస్టులతో బిగ్‌బాస్ ఫినాలే అదిరిపోయింది. అయితే సెలబ్రిటీలను ఊరికే పిలుస్తారా? వారితో ఎలిమినేషన్ ప్రక్రియను నిర్వహిస్తారు. మొదటగా నిఖిల్ హౌస్‌లోకి వెళ్లి టాప్ 5 కంటెస్టెంట్లలో ఒకరైన రోహిత్‌ను ఎలిమినేట్ చేసి తనతోపాటు స్టేజీపైకి తీసుకొచ్చాడు. తర్వాత ధమాకా హీరోహీరోయిన్లు రవితేజ, శ్రీలీల జింతాత స్టెప్పుతో స్టేజీని అల్లాడించారు. అనంతరం ఆదిరెడ్డి ఎలిమినేట్ అయ్యాడు. పదిమంది నామీద పడి మాట్లాడినా నేను ఎదురునిలబడగలనన్న ధైర్యం బిగ్‌బాస్‌తో వచ్చిందన్నాడు ఆది. తర్వాత అతడు టాప్ 3 కంటెస్టెంట్ల గురించి మాట్లాడుతూ.. 'కీర్తి బిగ్‌బాస్ షోలో కనిపించడం వల్ల తెలుగు రాష్ట్రాల్లో చాలా ఆత్మహత్యలు ఆగుతాయి. అన్ని కష్టాల్లో ఉన్న ఆమె అంత ధైర్యంగా ముందుకెళ్లడం చాలామందికి ఇన్స్పిరేషన్. రేవంత్‌లో 20 తప్పులు ఉంటే 40 పాజిటివ్‌లు ఉంటాయి. భార్య గర్భవతిగా ఉన్నప్పుడు ఆమెను వదిలి వచ్చి హౌస్‌లో గేమ్ ఆడటం అంటే మామూలు విషయం కాదు. నాకంటే ఆ ముగ్గురు బాగా ఆడారు. కాబట్టి వాళ్లకంటే ముందే ఎలిమినేట్ అయినందుకు సంతోషంగా ఉంది' అన్నాడు. చదవండి: కాసేపట్లో పెళ్లి పెట్టుకుని గ్రాండ్ ఫినాలేకు వచ్చిన బిగ్‌బాస్ కంటెస్టెంట్ బిగ్‌బాస్ తెలుగు 6 సీజన్ లవర్ బాయ్ ఎవరంటే? -
రూ.5 లక్షలు గెలుచుకున్న శ్రీహాన్, రియలైజ్ అయిన కీర్తి
మాజీ కంటెస్టెంట్ల రాకతో బిగ్‌బాస్ హౌస్‌కు కొత్త కళ వచ్చింది. మొదటగా రోల్ రైడా హౌస్‌లో అడుగుపెట్టి త్వరలో బీబీ జోడీ షో రాబోతుందంటూ గుడ్‌న్యూస్ చెప్పాడు. అది కంటెస్టెంట్లు జంటలుగా పాల్గొనే రియాలిటీ డ్యాన్స్ షో అని తెలిపాడు. తర్వాత ఫైనలిస్టులకు ఆల్ ద బెస్ట్ చెప్పి వీడ్కోలు తీసుకున్నాడు. తర్వాత మెహబూబ్, అషూ జంటగా లోపలకు ఎంట్రీ ఇచ్చారు. వారు హౌస్‌మేట్స్‌తో ఫన్నీ గేమ్స్ ఆడించారు. అందులో భాగంగా ఏ ప్రశ్న అడిగినా తప్పు సమాధానమే చెప్పాలన్నారు. ఇందులో కీర్తి.. శ్రీహాన్ గర్ల్‌ఫ్రెండ్ ఎవరు? అని అడగ్గా ఆదిరెడ్డి టపీమని ఇనయ పేరు చెప్పాడు. దీంతో హౌస్మేట్స్ పడీపడీ నవ్వారు. అంతలోనే బ్యాడ్‌న్యూస్ అంటూ.. హౌస్‌లో ఒకరిని తమతోపాటు ఎలిమినేట్ చేసి తీసుకెళ్తామనగానే అందరి ముఖాలు వాడిపోయాయి. మరీ టెన్షన్ పెట్టడం మంచిదికాదని భావించిన వాళ్లు ఇది ప్రాంక్ అని చెప్పడంతో హౌస్మేట్స్ ఊపిరి పీల్చుకున్నారు. వారు వెళ్లిపోగానే అవినాష్- అరియానా వచ్చి డ్యాన్స్ చేసి, పంచ్‌లు పేల్చుతూ ఫుల్ ఎంటర్టైన్ చేశారు. ఆ తర్వాత చైతూ, కాజల్ వచ్చి ఫైనలిస్టులను సర్ప్రైజ్ చేశారు. శ్రీహాన్ అంటే ఎంటర్టైన్మెంట్, రేవంత్.. కోపం, ఆదిరెడ్డి.. కాన్ఫిడెంట్, రోహిత్.. కామ్ అండ్ కంపోజ్డ్, కీర్తి గేమ్ బాగా ఆడుతుందంటూ ఒక్కొక్కరి గురించి షార్ట్ అండ్ స్వీట్‌గా చెప్పాడు చైతూ. అనంతరం కొన్ని వస్తువులు వాడుతూ డ్యాన్స్ చేయాలని టాస్క్ ఇచ్చారు. ఈ టాస్క్‌లో కీర్తి గెలిచి ఫ్రైడ్ చికెన్ సంపాదించుకుంది. ఈ జంట వెళ్లిపోగానే రవి-భాను లోపలకు ఎంట్రీ ఇచ్చారు. ఫైనలిస్టులకు టంగ్ ట్విస్టర్స్ ఇచ్చి వాటిని స్పీడ్‌గా చెప్పాలన్నాడు. అందరూ బానే చెప్పినా తెలుగు రాని కీర్తి కొంత తడబడుతూ దాన్ని పూర్తి చేసింది. తర్వాత బిగ్‌బాస్ ఓ టాస్క్ ఇచ్చాడు. సీజన్ ముగింపుకు వచ్చేసరికి ఎవరి మీద అభిప్రాయం మారిందో చెప్పాలన్నాడు. ముందుగా శ్రీహాన్ మాట్లాడుతూ.. మొదట్లో కీర్తి మంచి ఫ్రెండ్‌గా ఉండేది. కానీ రానురానూ గొడవలయ్యాయి. జీవితంలో ఎన్నో కష్టాలు దాటుకుంటూ వచ్చి ఇక్కడ గేమ్ మీద ఫోకస్ పెట్టి ఇంతవరకు రావడం చిన్న విషయం కాదంటూ ఆమెకు హ్యాట్సాఫ్ చెప్పాడు. నెక్స్ట్ ఆదిరెడ్డి.. మొదట్లో రేవంత్ యాటిట్యూడ్ చూపిస్తున్నాడనిపించింది. కానీ చాలాకాలానికి అది యాటిట్యూడ్ కాదని అర్థమైందన్నాడు. రోహిత్ వంతు రాగా ఆదిరెడ్డి తప్పును అంగీకరిస్తారని తెలుసుకున్నానన్నాడు. రేవంత్ మాట్లాడుతూ.. ఆదిరెడ్డి రివ్యూయర్ కాబట్టి మానిప్యులేటర్ అనుకునేవాడిని. ఈ మధ్యకాలంలో అతడితో ఎక్కువగా ఉంటున్నాను. ఆ సమయంలోనే ఆయన్ను నేనెందుకు అర్థం చేసుకోలేకపోయానని ఫీలయ్యానని చెప్పాడు. కీర్తి వంతు రాగా.. శ్రీహాన్ జెన్యూన్ కాదు, డ్రామా చేస్తున్నాడనుకున్నాను. నాకు సారీ చెప్పినప్పుడు కూడా అది నిజమని నమ్మలేదు. కానీ తర్వాత ఆ అభిప్రాయం మారింది అని చెప్పింది. ఇకపోతే కొన్నివారాలుగా ఆన్లైన్లో లెన్స్‌కార్ట్ స్టైలిష్ కంటెస్టెంట్ పోటీ జరుగుతున్న విషయం తెలిసిందే కదా! ఇందులో శ్రీహాన్ గెలిచి స్టైలిష్ కంటెస్టెంట్ ఆఫ్ ద సీజన్‌గా నిలవడమే కాకుండా రూ.5 లక్షల రూపాయలు గెలుచుకున్నాడు. ఆ మరుసటి రోజు అఖిల్ సార్థక్, తేజస్విని మదివాడ హౌస్‌లోకి వచ్చి ఆటపాటలతో సందడి చేసి వీడ్కోలు తీసుకున్నారు. చదవండి: అర్జున్ కల్యాణ్‌కు నేనంటే లవ్.. వీడియో చూసి షాకైన శ్రీసత్య బిగ్‌బాస్ విన్నర్ అతడే! -
సస్పెన్స్‌కు తెరపడింది.. బిగ్‌బాస్6 విన్నర్ అతడే!
బిగ్‌బాస్ సీజన్-6కి మరికాసేపట్లో శుభం కార్డు పడనుంది. ఇప్పటికే సత్య ఎలిమినేట్ అవగా చివరగా ఐదుగురు సభ్యులు ఫినాలేకు చేరుకున్నారు. ఈ క్రమంలో బిగ్‌బాస్ విన్నర్ ఎవరన్న దానిపై నెట్టింట బాగా చర్చ నడుస్తుంది. గత సీజన్లతో పోలిస్తే ఈ సీజన్ అట్టర్ ఫ్లాప్ అన్న అభిప్రాయం ప్రేక్షకుల్లో ఉంది. ఇదిలా ఉంటే ఎన్నడూ లేనంతగా ఈ సీజన్‌కు పొలిటికల్ రంగు కూడా పులుముకుంది. టాప్-2లో ఉండాల్సిన ఇనయాను కావాలనే ఎలిమినేట్ చేయడం, మిడ్ వీక్ ఎలిమినేషన్ అని చెప్పి ఫినాలేకు ఒకరోజు ముందు సత్యను ఎలిమినేట్ చేయడంపై ఇప్పటికే ఆడియెన్స్ ఫైర్ అవుతున్నారు. దీనికి తోడు పొలిటికల్ పవర్‌తో రేవంత్‌ను విన్నర్ కాకుండా చేసేందుకు కూడా విశ్వ ప్రయత్నాలు జరిగాయంటూ నెట్టింట వార్తలు పుట్టుకొస్తున్న నేపథ్యంలో అసలు బిగ్‌బాస్ సీజన్-6 విజేత ఎవరన్నదానిపై హౌస్మేట్స్ ఫ్యామిలీతో పాటు ఆడియెన్స్‌లోనూ తీవ్ర ఉత్కంఠ నెలకొంది. నిన్న(శుక్రవారం)అర్థరాత్రే ఓటింగ్ లైన్స్ క్లోజ్ అయ్యాయి. సోషల్ మీడియాలో అందుతున్న ఓటింగ్ ప్రకారం చివరగా రోహిత్ నిలిచినట్లు తెలుస్తుంది. ఇక టాప్-4 ప్లేస్‌ను కీర్తి దక్కించుకుంది. టాప్-3లో ఆదిరెడ్డి, రేవంత్, శ్రీహాన్‌లు ఉన్నారు. వీరిలో అత్యదికంగా ఓట్లు సంపాదించుకొని సింగర్ రేవంత్ సీజన్-6 విజేతగా నిలవగా, శ్రీహాన్ రన్నరన్ స్థానాన్ని కైవసం చేసుకున్నారు. ఇక కామన్ మ్యాన్‌గా ఎంట్రీ ఇచ్చిన ఆదిరెడ్డి టాప్-3తో సరిపెట్టుకున్నట్లు తెలుస్తుంది. మరి ఇందులో ఎంతనిజం ఉందన్నది అఫీషియల్ అనౌన్స్మెంట్ వచ్చేవరకు వేచి చూడాల్సిందే. -
శ్రీసత్య ఎలిమినేట్, క్షమించమని చేతులెత్తి వేడుకున్న శ్రీహాన్
Bigg Boss 6 Telugu, Episode 104: బిగ్‌బాస్ ఇచ్చిన ఛాలెంజ్‌లు గెలవడమే కాకుండా ఏకాభిప్రాయంలోనూ నెగ్గి రోహిత్, శ్రీసత్య ప్రేక్షకులను ఓట్లడిగే అవకాశాన్ని దక్కించుకున్నారు. నేడు మిగతావారికి కూడా ఛాన్స్ రావాలన్న ఉద్దేశంతో మరిన్ని టాస్కులు పెట్టాడు. అలా వాటిలో శ్రీహాన్, కీర్తి గెలిచి ప్రేక్షకులతో మాట్లాడారు. ముందుగా శ్రీహాన్ మాట్లాడుతూ.. 'నాకు ఓటడిగే అర్హత ఉందో, లేదో మీరే నిర్ణయించాలి. దానికంటే ముందు నేను తెలీకుండా చేసిన తప్పులకు క్షమాపణలు అడుగుతున్నా. నా మాటల వల్ల, యాటిట్యూడ్ వల్ల కొందరు బాధపడుతున్నారని తర్వాత తెలిసింది. నాకు తెలియకుండానే వారిని బాధపెట్టానని అర్థమయ్యాక నా తప్పులు సరిదిద్దుకున్నాను. అవన్నీ మనసులో పెట్టుకోకుండా మీరు నన్ను ఇక్కడి వరకు తీసుకొచ్చారు. టికెట్ టు ఫినాలే రేవంత్ వదిలేయడం వల్ల నాకు వచ్చింది అని అందరూ అంటుంటే బాధగా ఉంది. కానీ గేమ్ అంతా మీరు చూశారు. ఊహించని పరిస్థితుల మధ్య బిగ్‌బాస్ షోకు వచ్చాను. ట్రోఫీ గెలవడం నాకు చాలా ముఖ్యం. మీ ప్రేమను ఓట్ల రూపంలో చూపించి గెలిపించండి. ఎక్కువ క్షమించేవాళ్లే ఎక్కువ ప్రేమిస్తారు. నేను తప్పు చేసినందుకు క్షమించండి' అంటూ చేతులెత్తి వేడుకున్నాడు. అలాగే ఇండియన్ ఆర్మీ జవాన్లకు, అన్నం పెట్టే రైతులకు ఎప్పటికీ రుణపడి ఉంటానంటూ సెల్యూట్ చేశాడు. తర్వాత కీర్తి మాట్లాడుతూ.. 'ఇన్నిరోజులు బిగ్‌బాస్ హౌస్‌లో కీర్తిని చూశారు. బయట ఎలా ఉన్నాను? లోపల ఎలా ఉన్నాను? అన్నీ చూశారు. మీ ఇంటి కూతురిలా నాకు సపోర్ట్ చేశారు. మున్ముందు కూడా అలాగే మద్దతిస్తారనుకుంటున్నాను. నా శక్తిని మించి ఆడాను. నేను స్ట్రాంగ్‌గా ఉన్నాను. నాలాంటివాళ్లు కూడా బలంగా ఉండాలనుకుంటున్నాను. ట్రోఫీ గెలిచినా కూడా ఆ డబ్బులు నాకోసం వాడుకోను. నాలాంటి అనాధల కోసం, సామాజిక కార్యక్రమాల కోసం ఆ డబ్బులు వాడతాను. అందరికీ ఓట్లేయండి, కానీ నాక్కొంచెం ఎక్కువ ఓట్లేయండి' అని కోరింది. తర్వాత ఉదయం ఆరుగంటలకే హౌస్‌మేట్స్‌ను నిద్ర లేపిన బిగ్‌బాస్ అర్జంటుగా బ్యాగులు సర్దేసుకోండి, ఒకరిని మిడ్ వీక్ ఎలిమినేషన్ ద్వారా బయటకు పంపించేస్తానని చెప్పాడు. ఈ మాటతో షాకైన కంటెస్టెంట్లు చేసేదేం లేక బుద్ధిగా తమ బట్టలు సర్దేసుకుని గార్డెన్ ఏరియాలో వచ్చి నిల్చున్నారు. మీ అభిప్రాయంలో ఎవరు వెళ్లిపోతారనుకుంటున్నారో చెప్పమని మెలిక పెట్టాడు బిగ్‌బాస్. దీంతో శ్రీహాన్.. రోహిత్ పేరు, కీర్తి.. ఆదిరెడ్డి, శ్రీసత్య.. రేవంత్, ఆదిరెడ్డి.. కీర్తి, రోహిత్.. శ్రీహాన్ ఎలిమినేట్ కావచ్చని అభిప్రాయపడ్డారు. తర్వాత బిగ్‌బాస్ మాట్లాడుతూ.. మెజారిటీ ఇంటిసభ్యులు కీర్తి వెళ్లిపోతుందని నిర్ణయించారు. కానీ ప్రేక్షకుల నిర్ణయం ప్రకారం శ్రీసత్య టాప్ 5కి చేరుకోకుండా ఈ క్షణమే ఎలిమినేట్ అయిందని ప్రకటించాడు. ఎలిమినేషన్‌ను ముందే పసిగట్టిన శ్రీసత్యకు బాధను లోలోపలే దిగమింగి బయటకు మాత్రం చిరునవ్వుతో నిలబడింది. కానీ రేవంత్ బాధ ఆపుకోలేక ఏడ్చేశాడు. చివరికి అందరికీ ఆల్ ద బెస్ట్ చెప్తూ హౌస్‌కు వీడ్కోలు పలికింది శ్రీసత్య. చదవండి: బిగ్‌బాస్ షో నుంచి తప్పుకోనున్న నాగ్ రేవంత్ తండ్రి చనిపోయినా బతికే ఉన్నాడని అబద్ధం చెప్పాం -
కీర్తి ఎలిమినేట్ అవుతుందన్న హౌస్మేట్స్? జరగబోయేది ఇదే!
ఏ బుధవారమో, గురువారమో మిడ్ వీక్ ఎలిమినేషన్ జరుగుతుందనుకుంటే దాన్ని శుక్రవారం దాకా లాక్కొచ్చాడు బిగ్‌బాస్. కానీ ఎలిమినేట్ కానుంది ఎవరో ఆల్రెడీ సోషల్ మీడియాలో లీకైంది. శ్రీసత్య ఈరోజు బిగ్‌బాస్ హౌస్ నుంచి పెట్టాబేడా సర్దుకుని రావడం ఖాయమని తెలిసిపోయింది. కానీ బిగ్‌బాస్ మాత్రం ఎవరు ఎలిమినేట్ అవుతారో గెస్ చేయండని ఇంటిసభ్యులను అడిగాడు. ఇందుకు శ్రీహాన్.. రోహిత్ పేరు చెప్పగా, ఆదిరెడ్డి, శ్రీసత్య.. కీర్తి వెళ్లిపోతుందని, కీర్తి.. ఆదిరెడ్డి ఎలిమినేట్ అవుతాడేమోనని అభిప్రాయపడ్డారు. 'మెజారిటీ ఇంటిసభ్యులందరూ కీర్తిని టాప్ 5కి అనర్హురాలుగా భావించారు. కానీ ప్రేక్షకుల అభిప్రాయంలో ఎలిమినేట్ కానుంది ఎవరంటే...' అన్న సస్పెన్స్‌తో ప్రోమో ముగించాడు బిగ్‌బాస్. ఇక హౌస్‌మేట్స్‌కు ఝలక్ ఇస్తూ కీర్తికి బదులుగా శ్రీసత్యను ఎలిమినేట్ చేయనున్నారు. అప్పుడు కంటెస్టెంట్ల ఎక్స్ప్రెషన్ ఏంటో చూడాలంటే నేటి ఎపిసోడ్ చూసేయాల్సిందే! చదవండి: నా తప్పులు క్షమించి విన్నర్‌ను చేయండి: శ్రీసత్య ఇనయకు ఇదివరకే పెళ్లయిందా? వైరల్ అవుతున్న ఫోటో -
నన్ను ఛీ, తూ అని బయటకు గెంటేసినవారికి ఇప్పుడు చెప్తున్నా: కీర్తి
Bigg Boss 6 Telugu, Episode 102: రేవంత్, ఆదిరెడ్డి, శ్రీసత్య, రోహిత్‌లు వారి జర్నీలు చూసి గాల్లో తేలిపోతున్నారు. ఈరోజు శ్రీహాన్, కీర్తిల వంతు వచ్చింది. మొదటగా శ్రీహాన్ గార్డెన్ ఏరియాలోకి వచ్చాడు. అప్పుడే అతడి తల్లి ఫోన్ చేసి బిగ్‌బాస్‌కు వెళ్లాలన్న కోరిక ఎలాగో నెరవేరింది. ఇక ట్రోఫీ గెల్చుకుని రా అని కొడుకును ప్రేమగా కోరింది. తప్పకుండా టైటిల్ కొట్టే వస్తానని ధీమాగా చెప్పాడు శ్రీహాన్. బిగ్‌బాస్ శ్రీహాన్‌తో మాట్లాడుతూ.. 'బిగ్‌బాస్ ప్రయాణంలో ఎన్ని భావోద్వేగాలు ఉంటాయో ఆట కోసం, గెలుసు కోసం సభ్యులు పడే తపన ఎలాంటిదో మునుపటి సీజన్లో దగ్గరి నుంచి చూశారు. ఈసారి స్వయంగా ఆ అనుభవాన్ని పొందేందుకు హౌస్‌లో అడుగుపెట్టారు. అందరితో సరదాగా ఉండటం, అవసరమొచ్చినప్పుడు ఎవరినైనా ఎదురించడం.. ఈ రెండూ మీలో ఉన్నాయి. మీలోని అల్లరి మీకు స్నేహితులను తీసుకొచ్చింది. కలిసి మీరు చేసిన వినోదం నవ్వులను పంచింది. వ్యక్తిత్వాన్ని నిర్ణయించేది మాటలు మాత్రమే కాదు, చేతలు కూడా అనే విషయం మీకు బాగా తెలుసు. మీరు తోటి ఇంటిసభ్యుల కోసం నిలబడ్డ తీరు స్నేహానికి మీరిచ్చే విలువను తెలుపుతుంది. ఎక్కడ తగ్గాలో, ఎక్కడ నెగ్గాలో తెలిసిన శ్రీహాన్ తన స్నేహితుల కోసం తగ్గారు. ఆట ఎలా ఆడాలో తెలుసుకుని అదే స్నేహితులతో పోటీపడి టికెట్ టు ఫినాలే నెగ్గారు. కొన్ని సందర్భాల్లో ఇతరులకు మీరొక సేఫ్ ప్లేయర్ అనిపించినా వారి మాటలకు మీ ఆటతో సమాధానం చెప్పారు. సోషల్ మీడియా నుంచి ఎదిగి సాధ్యమైనంత ఎక్కువమందికి వినోదం పంచడానికి ఇతర సభ్యుల సహకారం లేకుండా మీకు మీరుగా అవకాశం వచ్చిన ప్రతిసారి ప్రయత్నించిన తీరు అందరికీ నచ్చింది. ఆ విషయమే మిమ్మల్ని ఇక్కడివరకూ తీసుకొచ్చింది. మీ పొరపాట్లు మీ రెండు వారాలు కెప్టెన్సీ దూరమయ్యేలా చేశాయి. ఎత్తుపల్లాలతో సాగే ఈ ప్రయాణంలో మీరు ఒంటరిగా గడిపిన క్షణాలు గార్డెన్లో మీరు దించుకున్న గుండె బరువును బిగ్‌బాస్ విన్నారు. ఇంట్లో వారితో మాట్లాడే వచ్చే బలం ఎంతో అని తెలిసినా ఆ అవకాశాన్ని తోటిసభ్యుల కోసం వదులుకున్నారు. పట్టుకోవడంలోనే కాదు వదిలేయడంలో కూడా బలముంటుంది. దాంతో ఏదైనా సాధించొచ్చు. మీ బలాన్ని, వినోదాన్ని, పట్టుదలను ఇలాగే కొనసాగించి అనుకున్నవన్నీ సాధించాలని బిగ్‌బాస్ కోరుకుంటున్నాడు అని చెప్పాడు. ఇది విన్న శ్రీహాన్ నన్ను చాలా బాగా అర్థం చేసుకున్నారు అంటూ ఎమోషనలయ్యాడు. తర్వాత కీర్తి గార్డెన్ ఏరియాలోకి వచ్చింది. ఇంతలో ఫోన్ రింగైంది. అవతలి నుంచి మానస్ మాట్లాడుతూ.. 'ఒళ్లు హూనమైపోతున్నా, వేలికి ఫ్రాక్చర్ అయినా, సాఫ్ట్ టార్గెట్ అనుకుని నామినేట్ చేసినా ఎక్కడా బెదరకుండా ఆడిన ఆట చూసి నాకే కాదు లోపలున్న హౌస్‌మేట్స్‌కు, బయటున్న ప్రేక్షకులకు మబ్బులు వదిలిపోయాయి. ప్రతి ఒక్కరి ఇంట్లో నీలాంటి కూతురు ఉంటే చాలు, ఇంకేం అవసరం లేదనుకునేలా చేశారు. అమ్మాయిలు ఎందులోనూ తక్కువ కాదని, అన్నింటిలో ముందుంటారని నిరూపించావు. ఈ సీజన్లో ఫస్ట్ లేడీ కెప్టెన్ అయ్యావు, అలాగే ఫస్ట్ లేడీ విన్నర్ అవ్వాలని అందరం కోరుకుంటున్నాము' అని చెప్పి ఆమె పెదాలపై ఆత్మస్థైర్యంతో కూడిన నవ్వులు పూయించాడు. తర్వాత బిగ్‌బాస్ మాట్లాడుతూ.. 'కీర్తి, కల్పితం కన్నా నిజ జీవితం ఎంతో నాటకీయమైనది. ఒకవైపు మీ బరువైన గతం మిమ్మల్ని లోపలి నుంచి దహిస్తుంటే కణకణమండే కొడవలిలా జీవితంపై దండయాత్ర చేసేందుకు మీరు చూపించిన గుండె నిబ్బరం ఎంతోమందికి స్ఫూర్తి. అడవిలో మహావృక్షం ఒకటే ఉంటుంది. అది తాను ఒంటరినని బాధపడి తల వంచితే ఆకాశం తాకే తన ఎదుగుదలను చూడలేదు. మీకుగా సంపాదించిన పేరు, ప్రేమను ఎన్నో రెట్లు చేయడానికి బిగ్‌బాస్ ఇంట్లోకి అడుగుపెట్టారు. మొదటినుంచీ మొండిధైర్యాన్ని చూపిస్తూ వచ్చారు. ఇంట్లో మిమ్మల్ని అర్థం చేసుకునేవారు కనపడక కలవరపడ్డారు. మీదంటూ ఒక కుటుంబం లేదని బాధపడ్డారు. భాష మీ భావాలను వ్యక్తపరిచేందుకు పరిమితిగా మారినా మీ కన్నీళ్లు మనసులోని భావాలను దాచలేకపోయాయి. కొన్నిసార్లు ఇంట్లో పరిస్థితులు మీరెంత బలమైనవారో మర్చిపోయేలా చేసినట్లనిపించింది. సింపతీ కోసమే మీ ప్రయత్నం అని మిగతావారు నిందించినప్పుడు మీ మనసు గాయపడింది. మీరనుకున్న విషయాన్ని బలంగా వినిపించినా మద్దతు తెలిపే స్నేహితులు లేక నిరాశ చెందారు. కానీ మీ ఆట ఆగలేదు. గాయాలు మిమ్మల్ని ఆపలేకపోయాయి. అన్నింటినుంచీ తేరుకుని మొదటి ఫీమేల్ కెప్టెన్‌గా నిలిచారు. పద్నాలుగు వారాల సుదీర్ఘ ప్రయాణం తర్వాత గ్రాండ్ ఫినాలేకు చేరాలనే కోరిక సాధ్యమవడానికి కారణం మీ ఒక్కరు మాత్రమే కాదు, మీ కుటుంబం కూడా! ఎందుకంటే ఇప్పుడు మీ కుటుంబ సభ్యుల సంఖ్య ఒకటి కాదు కొన్ని లక్షలు.. అని ముగించాడు. బిగ్‌బాస్ మాటలతో కీర్తి పులకరించపోయింది. 'ఈ రోజు నా జీవితంలో గుర్తుండిపోతుంది. ఎవరైతే నన్ను ఛీ,తూ అన్నారో, నువ్వు చూడటానికి బాగోలేవు అంటూ బయటకు గెంటేశారో వారికి నేనీరోజు చెప్తున్నాను. ఇదీ కీర్తి.. ఈరోజు నా పేరెంట్స్ ఆత్మకు శాంతి దొరుకుతుందని భావిస్తున్నాను. ఇన్నాళ్లకు నేను మనస్ఫూర్తిగా నవ్వుతున్నాను. నన్ను ఇక్కడివరకు తీసుకొచ్చిన ప్రేక్షకులకు రుణపడి ఉంటాను' అంది కీర్తి. చదవండి: బిగ్‌బాస్ 6 విజేత ఎవరో తెలుసా? ఎక్కడ నెగ్గాలో కాదు ఎక్కడ తగ్గాలో తెలుసు -
కుటుంబం లేదని బాధపడ్డారు.. కీర్తిని ఏడిపించిన బిగ్‌బాస్
బిగ్‌బాస్ హౌస్‌లో కంటెస్టెంట్లు వంద రోజులు ప్రయాణించారు. ఇప్పుడు ఒక్కసారి వెనక్కు తిరిగి చూసుకుంటే వారు చేసిన చిలిపి పనులు, అల్లర్లు, కష్టాలు, కొట్లాటలు, కోపతాపాలు, సంతోషాలు, ఏడుపులు.. ఇలా అన్నీ కనిపిస్తున్నాయి. వీటన్నింటి పరిగణనలోకి తీసుకున్న బిగ్‌బాస్ వారి వ్యక్తిత్వాన్ని మెచ్చుకుంటూ జర్నీ వీడియోలు చూపిస్తున్నాడు. తాజాగా కీర్తి గురించి బిగ్‌బాస్ మాట్లాడుడూ.. కల్పితం కన్నా నిజ జీవితం ఎంతో నాటకీయమైనది. ఒకవైపు మీ బరువైన గతం మిమ్మల్ని లోపలి నుంచి దహిస్తుంటే మీరు చూపించిన గుండె నిబ్బరం ఎందరికో స్ఫూర్తి. అడవిలో మహావృక్షం ఒకటే ఉంటుంది. అది తాను ఒంటరినని బాధపడి తల వంచితే ఆకాశం తాకే తన ఎదుగుదలను చూడలేదు. ఇంట్లో మిమ్మల్ని అర్థం చేసుకునేవారు కనపడక కలవరపడ్డారు. మీదంటూ ఒక కుటుంబం లేదని బాధపడ్డారు. సింపతీ కోసమే మీ ప్రయత్నం అని మిగతావారు నిందించినప్పుడు మీ మనసు గాయపడింది. కానీ మీ ఆట ఆగలేదు. గాయాలు మిమ్మల్ని ఆపలేకపోయాయి. గ్రాండ్ ఫినాలేకు చేరాలనే కోరిక సాధ్యమవడానికి కారణం మీరు ఒక్కరు మాత్రమే కాదు, కుటుంబం కూడా! ఎందుకంటే మీ కుటుంబ సభ్యుల సంఖ్య ఒకటి కాదు కొన్ని లక్షలు. కష్టాల పునాదులపై నిర్మించి విజయాన్ని కదపడం అంత సులభం కాదు అంటూ బిగ్‌బాస్ కీర్తిని ఆకాశానికి ఎత్తేయడంతో ఆమె ఆనంద భాష్పాలు రాల్చింది. చదవండి: ఎక్కడ నెగ్గాలో కాదు ఎక్కడ తగ్గాలో తెలుసు: శ్రీహాన్ -
ఎలిమినేషన్‌ను ముందే ఊహించిన ఇనయ? నాగార్జున హింట్
Bigg Boss 6 Telugu, Episode 98: ఫినాలే దగ్గరపడుతుండటంతో నాగార్జున ఫన్నీ టాస్కులు మానేసి సీరియస్ టాస్కులు ఆడించాడు. మొదటగా బిగ్‌బాస్ హౌస్‌లో ఓట్ల క్యాంపెయినింగ్ మొదలుపెట్టాడు. ఈ క్రమంలో శ్రీహాన్ మాట్లాడుతూ.. రేవంత్ తప్పులను అంగీకరించడు. అతడికి కోపం ఎక్కువ. కానీ నేను తప్పులను ఒప్పుకోవడమే కాకుండా వాటిని సరిదిద్దుకుంటాను. తనకంటే బాగా ఎంటర్టైన్ చేస్తాను. అందుకోసం నాకు ఓటేసి గెలిపించాలి అని చెప్పాడు. ఇక రేవంత్ మాట్లాడుతూ.. నేను ఏ టాస్కునూ వదల్లేదు. విన్నర్‌కు కావాల్సిన అన్ని లక్షణాలు నాకున్నాయి. శ్రీహానే కాదు, ఇక్కడ ఎవరినీ నాకు కాంపిటీటర్‌గా అనుకోలేదు అని చెప్పాడు. దీంతో శ్రీహాన్ మధ్యలో కలగజేసుకుంటూ ఒకటి చెప్పాలి సర్ అని అడిగాడు. దీనికి నాగ్.. రేవంత్ ఫ్లిప్పర్ అని చెప్పాలనుకున్నావు, అంతేనా? అన్నాడు. దీంతో అందుకున్న రేవంత్.. శ్రీహాన్ వెనకాల మాట్లాడతాడని తెలుసు, ఇంతకుముందు కూడా విన్నాను, కానీ ఎప్పుడూ తనను అడగలేదని చెప్పాడు. అతడి మాట విని షాకైన శ్రీహాన్.. నీకు చెప్పిన విషయాలే మాట్లాడానే తప్ప వెనకాల కొత్తగా ఏమీ మాట్లాడలేదు అని బదులిచ్చాడు. తర్వాత మిగతా ఐదుగురు కూడా తమలో ఉన్న పాజిటివ్ అంశాలను చెప్తూ దానికోసం ఓట్లేయాలన్నారు. అనంతరం హౌస్మేట్స్ దెయ్యం టాస్కులో ఎంత భయపడ్డారో వారికే వీడియో వేసి చూపించాడు నాగ్. చీకటి గదిలో తాము చేసిన విన్యాసాలు చూసి కంటెస్టెంట్లు పడీపడీ నవ్వుకున్నారు. ఆ తర్వాత హౌస్‌మేట్స్‌తో మరో గేమ్ ఆడించాడు నాగ్. బెస్ట్ అనుకున్న ముగ్గురికి స్టార్ రేటింగ్స్ ఇచ్చి, వేస్ట్ అనుకున్న ముగ్గురికి క్రాస్ సింబల్ ఫేస్‌పైన ముద్రించాలన్నాడు. అలా ఈ గేమ్‌లో ఎవరెవరు ఎవరికి స్టార్స్, ఎవరికి క్రాస్ గుర్తులు ఇచ్చుకుంటూ వెళ్లారంటే.. కంటెస్టెంట్ 3 స్టార్స్ 2 స్టార్స్ 1 స్టార్ సింగిల్ క్రాస్ డబల్ క్రాస్ (బ్యాడ్) ట్రిపుల్ క్రాస్ (వెరీ బ్యాడ్) ఆదిరెడ్డి. శ్రీహాన్ రేవంత్ రోహిత్ శ్రీసత్య ఇనయ కీర్తి కీర్తి రోహిత్ ఇనయ రేవంత్ శ్రీహాన్ కీర్తి ఆదిరెడ్డి శ్రీసత్య శ్రీహాన్ రేవంత్ ఆదిరెడ్డి రోహిత్ ఇనయ కీర్తి ఇనయ కీర్తి శ్రీసత్య రేవంత్ శ్రీహాన్ రోహిత్ ఆదిరెడ్డి రేవంత్ శ్రీసత్య శ్రీహాన్ కీర్తి ఆదిరెడ్డి రోహిత్ ఇనయ శ్రీహాన్ రేవంత్ ఆదిరెడ్డి శ్రీసత్య ఇనయ కీర్తి రోహిత్ రోహిత్ ఆదిరెడ్డి రేవంత్ కీర్తి శ్రీహాన్ శ్రీసత్య ఇనయ తర్వాత కీర్తి, రేవంత్ సేవ్ అయినట్లు ప్రకటించాడు నాగ్. దీంతో టికెట్ టు ఫినాలే సాధించిన శ్రీహాన్‌తో పాటు రేవంత్, కీర్తి ఫైనల్ వీక్‌కు వెళ్లారని ప్రకటించాడు నాగ్. మిగిలిన నలుగురిలో ఎవరు ఎలిమినేట్ అవుతారో హౌస్మేట్స్ గెస్ చేయాలన్నాడు. ముందుగా శ్రీహాన్.. రోహిత్ వెళ్లిపోతాడని అభిప్రాయపడగా కీర్తి.. ఆదిరెడ్డి ఎలిమినేట్ అయిపోతాడేమోనని చెప్పుకొచ్చింది. రేవంత్ వంతు రాగా.. ఎన్నడూ ఎవిక్షన్‌కు భయపడని ఇనయ మొట్టమొదటిసారి నిన్న భయపడింది. దాన్నిబట్టి ఆమె ఎలిమినేట్ కావచ్చేమోననుకున్నాడు. దీంతో ఇనయ అందుకుంటూ.. నిన్ననే కదా నేను టాప్ 5 కంటెస్టెంట్ అన్నావు, అంతలోనే మాట మార్చి ఈ వారం వెళ్లిపోతానని చెప్తున్నావేంటి అంటూ నిలదీసింది. రేవంత్ ఇప్పుడు తన మనసులో ఉన్నది మాట్లాడాడంటూ జరగబోయేది ఇదేనని చెప్పకనే చెప్పాడు నాగ్. ఇకపోతే మొన్నటిదాకా ప్రైజ్‌మనీని బిగ్‌బాస్ పెంచగా ఈసారి నాగార్జున ఇంటిసభ్యులకు మర ఓ బంపర్ ఆఫర్ ఇచ్చాడు. తన ముందున్న మూడు సూట్‌కేసుల్లో డబ్బులున్నాయని, ఎక్కువ అమౌంట్ ఉన్న కరెక్ట్ సూట్‌కేస్ సెలక్ట్ చేసుకోమన్నాడు. హౌస్మేట్స్ అత్యధికంగా రూ.3 లక్షలున్న సూట్‌కేసు సెలక్ట్ చేసుకున్నారు. దీంతో ఈ మూడు లక్షలు కలపగా ఫైనల్ ప్రైజ్‌మనీ రూ.50 లక్షలకు చేరింది. ఈ అరకోటి రూపాయలతో పాటు విన్నర్ రూ.25 లక్షల విలువైన 605 గజాల స్థలాన్ని గెలుచుకోనున్న విషయం తెలిసిందే! దీనికి తోడు మారుతి సుజుకి బ్రెజ్జా కారు సైతం సొంతం చేసుకోనున్నట్లు ప్రకటించడంతో హౌస్మేట్స్ ఎగిరి గంతేశారు. చదవండి: లేడీ టైగర్‌ను పంపించేస్తారా? మా ఓట్లంటే లెక్క లేదా? టాప్ 3లో ఉంటుందనుకున్న ఇనయ ఎలిమినేట్? -
డబుల్ ఎలిమినేషన్? ఆమెను పంపించడం ఖాయమా?
బుల్లితెర హిట్ షో బిగ్‌బాస్ తెలుగు ఆరో సీజన్ ముగింపుకు వచ్చింది. ప్రారంభంలో పస లేని ఈ షో ఇప్పుడిప్పుడే రసవత్తరంగా మారింది. ఆరిపోయే దీపానికి వెలుగెక్కువ అన్నట్లుగా క్లైమాక్స్‌కు వచ్చాక షో వెలుగులు సంతరించుకుంటోంది. మొన్నటికాదా గొడవలు, పగలతో రగిలిపోయిన హౌస్మేట్స్ ఇప్పుడిప్పుడే ఫన్‌కు ఎక్కువ ప్రాధాన్యమిస్తున్నారు. ప్రస్తుతం హౌస్‌లో ఏడుగురు సభ్యులు మిగిలారు. ఇందులో ఒకరిని బయటకు పంపించే సమయం ఆసన్నమైంది. ఆల్రెడీ శ్రీహాన్ టికెట్ టు ఫినాలే గెలిచి నామినేషన్స్ నుంచి తప్పించుకుని మొట్టమొదటి ఫైనలిస్టుగా నిలిచాడు. రేవంత్ ఎలాగో విన్నర్ మెటీరియల్ కాబట్టి అతడు ఓటింగ్‌లో ఎప్పటిలాగే టాప్‌లో ఉంటూ వస్తున్నాడు. తర్వాతి స్థానాల్లో ఇనయ, ఆదిరెడ్డి, రోహిత్ ఉన్నారు. చివరి రెండు స్థానాల్లో శ్రీసత్య, కీర్తి తచ్చాడుతున్నారు. నిజానికైతే ఈ వారం శ్రీసత్య ఎలిమినేట్ కావాల్సిందే! కానీ ఫ్యామిలీ వీక్ తర్వాత శ్రీసత్యలో చాలా మార్పు వచ్చింది. వెటకారం పూర్తిగా తగ్గించేసింది. గేమ్‌లో తన ఫ్రెండ్స్ అని కూడా చూడకుండా శ్రీహాన్, రేవంత్‌పైనా అరిచేసింది. వరుస టాస్కులు గెలిచింది. అందరితో కలిసిపోయి గొడవలకు దూరంగా ఉంది. ఫలితంగా ఈ వారం తన గ్రాఫ్ బాగా పెరిగింది. కీర్తి.. తన వేలి నొప్పి కారణంగా పలు టాస్కులు గెలవలేకపోయింది. అలా అని ఆడలేదని కాదు, తనవంతు ప్రయత్నం చేసింది. కానీ ప్రస్తుతం ఉన్నవారిలో ప్రేక్షకులు శ్రీసత్య, కీర్తిలలో ఒకరిని ఎలిమినేట్ చేయాలని భావిస్తున్నట్లు అనధికారిక పోల్స్ చెప్తున్నాయి. పైగా ఈ వారం శ్రీసత్య గ్రాఫ్ పెరిగి ఓట్ల శాతం పెరగడంతో కీర్తి వెనకబడినట్లు కనిపిస్తోంది. ఈ లెక్కన కీర్తి ఎలిమినేట్ కావొచ్చేమో, లేదంటే శ్రీసత్య- కీర్తి ఇద్దరినీ బిగ్‌బాస్ బయటకు పంపించేస్తాడేమో! ఈ సీజన్ సిక్స్ కాబట్టి ఫినాలేకు సిక్స్ మెంబర్స్‌ను పంపించే ప్లాన్స్ ఉంటే మాత్రం వీళ్లిద్దరిలో ఏ ఒక్కరో ఎలిమినేట్ కాక తప్పదు. మరి బిగ్‌బాస్ ఎవరిని ఎలిమినేట్ చేస్తాడు? ఎవరు ఫినాలేకు దూరం కానున్నారో చూడాలి! చదవండి: రోడ్డు మీద చెప్పుల్లేకుండా తిరిగా: శ్రీహాన గర్ల్‌ఫ్రెండ్ సిరి ఫైమాకు గోల్డెన్ గిఫ్ట్ ఇచ్చిన ప్రియుడు -
భయపడి చస్తూనే గెలిచేశారుగా, ఇప్పుడు ప్రైజ్‌మనీ ఎంతంటే?
Bigg Boss Telugu 6, Episode 95: ఇప్పటిదాకా నేను ఆడతానంటే నేను ఆడతానని ముందుకు వచ్చిన హౌస్మేట్స్ ఈరోజు దెయ్యం టాస్కులో మాత్రం నావల్ల కాదు బాబోయ్ అంటూ బెంబేలెత్తిపోయారు. అయినా సరే విడిచిపెట్టని బిగ్‌బాస్ వారిని చీకటి గదిలోకి పిలిచి ముచ్చెమటలు పట్టేలా చేశాడు. ఇంతకీ ఈ టాస్కులో వారు గెలిచారా? లేదా? అసలు ప్రైజ్‌మనీ లెక్క సెట్టయిందా? అనే విషయాలు తెలియాలంటే నేటి ఎపిసోడ్ హైలైట్స్ చదివేయాల్సిందే! దెయ్యం దెబ్బకు జడుసుకుని చస్తున్నారు హౌస్మేట్స్. మరీ ముఖ్యంగా దెయ్యం పేరెత్తితేనే వణికిపోతున్నాడు ఆదిరెడ్డి. చూడటానికి తాటిచెట్టులా ఉన్నావు, అలా భయపడతావేంటి భయ్యా అని రేవంత్ సెటైర్లు వేశాడు. ఇకపోతే బిగ్‌బాస్ ఇంటిసభ్యులకు నేడు ఐదో ఛాలెంజ్ ఇచ్చాడు. ఇందులో రోహిత్, ఆదిరెడ్డి పాల్గొన్నారు. వీరిలో విజేతను ఎంచుకోండంటూ మిగతా ఇంటిసభ్యులకు తలా ఇరవై వేలు అప్పజెప్పాడు బిగ్‌బాస్. ఈ ఛాలెంజ్‌లో ఆదిరెడ్డి విజయం సాధించాడు. శ్రీసత్య మినహా మిగతా నలుగురు ఆదిరెడ్డికి సపోర్ట్ చేయడంతో వారి దగ్గరున్న మొత్తం కలిపి రూ.80 వేలు గెలుచుకున్నారని ప్రకటించాడు బిగ్‌బాస్. తర్వాత పరమాన్నం కోసం కప్పులు తెచ్చుకోండని శ్రీహాన్‌కు చెప్పాడు రేవంత్. అన్నం తిన్నాక పరమాన్నం తింటే బాగుంటుందని అందరూ అభిప్రాయపడ్డారు. దీంతో రేవంత్.. నేను మీకు తినమని చెప్పలేదు, కేవలం రుచి చూడమన్నాననంతేనని మాట మార్చాడు. ఈ మాటతో అవాక్కైన శ్రీహాన్, శ్రీసత్య.. ఇందాకే కదా, కప్పులు తెచ్చుకో అన్నావ్ అని నిలదీయగా నేను జస్ట్ టేస్ట్ చూడమన్నాను, ప్రతిదాంట్లో తప్పులు వెతక్కండి అని అలిగాడు. రేవంత్‌కు తన తప్పులు చెప్తే అస్సలు తీసుకోడంటూ అసహనం వ్యక్తం చేశాడు శ్రీహాన్. అనంతరం బిగ్‌బాస్ ఇంటిసభ్యులకు ఇచ్చిన ఆరో ఛాలెంజ్‌లో శ్రీహాన్, కీర్తి పోటీపడ్డారు. హౌస్మేట్స్ అందరూ నీకే ఓటేస్తారు కాబట్టి బాగా ఆడి గెలవమని శ్రీహాన్‌కు సిగ్నల్స్ ఇచ్చింది కీర్తి. అన్నట్లుగానే ఈ గేమ్‌లో హౌస్మేట్స్ అందరూ శ్రీహాన్‌కే సపోర్ట్ చేయగా అతడు గెలవడంతో ప్రైజ్‌మనీలో రెండు లక్షలు జమయింది. ఈ టాస్కులో కుండ పగలగొట్టగా దాని మట్టి ఏరుకుని తిన్నారు శ్రీసత్య, ఇనయ, కీర్తి. ఇది చూసిన బిగ్‌బాస్.. ఇకనుంచి మీకు రేషన్‌కు బదులుగా మట్టి పంపిస్తే సరిపోతుందా అని ఆటపట్టించాడు. తర్వాత ఇంటిసభ్యులకో డిఫరెంట్ టాస్క్ ఇచ్చాడు. సమయానుసారం కన్ఫెషన్ రూమ్‌కి పిలుస్తానని, అప్పుడు తాను చెప్పిన ఆజ్ఞలను పాటిస్తే డబ్బులు లభిస్తాయన్నాడు. మొదట ఆదిరెడ్డిని పిలిచాడు. కన్ఫెషన్ రూమ్ గదంతా చీకటిగా ఉండటంతో ఒక్క అడుగు కూడా ముందుకు వేయలేకపోయాడు ఆది. గదిలోని క్యాండిల్ వెతికి బయటకు తీసుకెళ్లమని ఆదేశించాడు బిగ్‌బాస్. అతడికి ఎంతసేపటికి క్యాండిల్ దొరకకపోవడంతో ఎవరైనా తోడు కావాలా? అని అడిగాడు. దీంతో అతడు శ్రీహాన్ పేరు చెప్పాడు. ఇక అప్పటికే భయపడి చస్తున్న ఆదిరెడ్డిని తన భయంతో మరింత హడలెత్తించాడు. ఇద్దరూ భయపడి చస్తూనే వస్తువులను వెతికారు. వీరి భయాన్ని చూసి ప్రేక్షకులు నవ్వాపుకోవడం కష్టమే! ఫైనల్‌గా ఇద్దరూ కలిసి క్యాండిల్, గన్ సాధించి పట్టుకోవడంతో మరింత డబ్బు జమైంది. ఫైనల్‌గా ఈ రోజు ఎపిసోడ్ ముగిసే సమయానికి ప్రైజ్‌మనీ రూ. 44,35,100కి చేరింది. చదవండి: రేవంత్ ఫుడ్ గొడవలు, ఇక మారడా? బుట్టబొమ్మతో లవ్‌లో పడ్డ సల్మాన్ ఖాన్ -
ఆదిరెడ్డితో ఫ్రెండ్షిపే వద్దన్న శ్రీహాన్, రోహిత్
బిగ్‌బాస్ తెలుగు ఆరో సీజన్లో ప్రస్తుతం ఎనిమిది మంది మాత్రమే మిగిలారు. వీరిలో రోహిత్ మినహా అందరూ ఏదో ఒక వారం కెప్టెన్ అయ్యారు. ఇప్పటికే ఈ సీజన్లో బెస్ట్ కెప్టెన్ ఎవరు? వరస్ట్ కెప్టెన్ ఎవరు? అని ఆరా తీస్తే ఇనయ బెస్ట్, ఆదిరెడ్డి వరస్ట్ కెప్టెన్ అని తేలింది. ఇక ఈ రోజు మరో ఇంట్రస్టింగ్ గేమ్ ఆడించాడు నాగ్. హౌస్ నుంచి బయటకు వెళ్లాక జీవితాంతం ఎవరితో ఫ్రెండ్షిప్ చేస్తారు? ఎవరితో ఫ్రెండ్షిప్ను ఇక్కడే కట్ చేస్తారని అడిగాడు. దీనికి శ్రీహాన్, రోహిత్.. రేవంత్ లైఫ్‌లాంగ్ ఫ్రెండ్ అని, ఆది రెడ్డిని తరచూ కలవడం కష్టమని చెప్పారు. కీర్తి మాట్లాడుతూ.. ఇనయ బాగా క్లోజ్ అయిందని చెప్పింది. తర్వాత రేవంత్ తెలివిగా అబ్బాయిల్లో నుంచి శ్రీహాన్, అమ్మాయిల్లో నుంచి శ్రీసత్య జీవితాంతం స్నేహితులుగా ఉండిపోతారని చెప్పాడు. ఇక హౌస్మేట్స్ వ్యక్తిత్వానికి సరిపోయేలా కొన్ని సినిమా పోస్టర్లను వారికి అంకితం చేశాడు బిగ్‌బాస్. అలా శ్రీసత్యకు అందాల రాక్షసి పోస్టర్, శ్రీహాన్‌కు దేశముదురు, ఇనయకు ఓ పిట్టకథ ఇలా పోస్టర్లు వేసుకుంటూ వెళ్లారు. చదవండి: బ్యూటీ సెలూన్ అమ్మి పాత ఇల్లు కొన్న కమెడియన్ క్రికెటర్‌తో లవ్.. మా మధ్య స్నేహం చెడింది: నటి -
విర్రవీగుతున్న రేవంత్.. ఓడిపోయినా బిల్డప్ కొడుతున్నాడే!
Bigg Boss 6 Telugu, Episode 89: టికెట్ టు ఫినాలే రేస్‌లో ఏకాభిప్రాయం పేరుతో ఇంటిసభ్యులను ఓ ఆటాడుకుంటున్నాడు బిగ్‌బాస్. ఛాలెంజ్ ఇచ్చిన ప్రతిసారి ఆ ఛాలెంజ్‌లో ఏ నలుగురు పాల్గొంటారో ఏకాభిప్రాయంతో పేర్లు చెప్పమంటున్నాడు. దీంతో హౌస్మేట్స్ ఇదెక్కడి గొడవరా బాబూ అని తలలు బాదుకుంటున్నారు. ఈరోజు మొదటగా ఇవ్వబోయే ఛాలెంజ్‌లో ఏ నలుగురు పార్టిసిపేట్ చేస్తారో ఏకాభిప్రాయంతో చెప్పమన్నాడు బిగ్‌బాస్. మళ్లీ ఏకాభిప్రాయం ఏంట్రా దేవుడా అనుకున్న హౌస్మేట్స్ చిరాకు ప్రదర్శించారు. ఈ సమయంలో ఆదిరెడ్డి తెలివిగా ఆలోచించి ఓ నిర్ణయానికి వచ్చాడు. ఈ ఛాలెంజ్‌లో తను, రేవంత్ పక్కకు తప్పుకునేందుకు రెడీ అన్నాడు. కానీ నెక్స్ట్ ఛాలెంజ్‌లో ఫైమా, శ్రీహాన్ తప్పుకుంటానంటేనే ఈసారికి మేము సైడ్ అవుతామన్నాడు. అతడి నిర్ణయానికి అందరూ అంగీకారం తెలిపారు. దీంతో బిగ్‌బాస్ ఇచ్చిన రోల్ బేబీ రోల్ అనే టాస్క్‌లో రోహిత్, ఫైమా, శ్రీహాన్, కీర్తి పాల్గొన్నారు. సంచాలకులైన ఇనయ, శ్రీసత్య టవర్ పొడవుగా పేర్చిన శ్రీహాన్‌ను విజేతగా ప్రకటించారు. ఈ టవర్ గేమ్‌లో శ్రీహాన్‌కు 4, రోహిత్‌కు 3, ఫైమాకు 2, కీర్తికి 1 పాయింట్స్ లభించాయి. సంచాలకులపై నిర్ణయంపై కీర్తి అసహనం వ్యక్తం చేసింది. ఇష్టమొచ్చినవాళ్లకు ఇచ్చుకోండి అంటూ కోపంతో ఊగిపోతూ ఆవేశంలో తన టవర్‌ను తన్నేసింది. తర్వాత బెడ్రూమ్లోకి వెళ్లి కన్నీళ్లను ఆపుకునేందుకు ప్రయత్నించింది. మరోవైపు బిగ్‌బాస్ మార్కుల పట్టిక రిలీజ్ చేయగా శ్రీహాన్ 10, ఆది రెడ్డి 9, రేవంత్ 8, ఫైమా 7, రోహిత్ 4, కీర్తి 3 పాయింట్లతో ఉన్నారు. ఈ లెవల్ ముగిసే సమయానికి తక్కువ పాయింట్లు ఉన్న కీర్తిని రేసు నుంచి తొలగించాడు బిగ్‌బాస్. తర్వాత టికెట్ టు ఫినాలే రేసులో నెక్స్ట్ లెవల్ ప్రారంభమైంది. ఇప్పుడు ఇచ్చే మొదటి ఛాలెంజ్‌లో ఏ ముగ్గురు పాల్గొంటారో చెప్పాలన్నాడు బిగ్‌బాస్. ముందుగా అనుకున్న రూల్ ప్రకారం ఈసారి ఫైమా, శ్రీహాన్ గేమ్ నుంచి సైడవగా రేవంత్, ఆది రెడ్డి, రోహిత్ ఆటలో పాల్గొన్నారు. గుడ్డు జాగ్రత్త గేమ్‌లో అద్భుతంగా ఆడిన ఆదిరెడ్డికి 3, రోహిత్‌కు 2, రేవంత్‌కు 1 పాయింట్ వచ్చింది. ఓటమిని జీర్ణించుకోలేని రేవంత్ సంచాలకురాలైన కీర్తి కావాలనే మనసులో ఏదో పెట్టుకుని నన్ను తప్పించాలని చూసిందని ఉడికిపోయాడు. నేనెక్కడ గెలుస్తానోన్న భయంతో, నామీదే ధ్యాస పెట్టిందని, అలా భయపడాలి అంటూ తనకు తానే సెల్ఫ్ డబ్బా వాయించుకున్నాడు. ఓడిన ప్రతిసారి అందుకు ఇతరులే కారణమని నిందించడం అతడికి అలవాటుగా మారింది. ఇక ఇప్పటివరకు ఆడిన గేమ్ ఆధారంగా మార్కుల పట్టికలో ఆదిరెడ్డి(12 పాయింట్లు), శ్రీహాన్(10), రేవంత్(9), ఫైమా(7), రోహిత్(6) వరుస స్థానాల్లో ఉన్నారు. అనంతరం బిగ్‌బాస్.. కంటెస్టెంట్లు ట్రోఫీ గెలవడానికి గల ప్రాముఖ్యతను వివరించమన్నాడు. ► మా అమ్మకు ఇచ్చిన మాట కోసం ట్రోఫీ గెలవాలి. వాళ్లు మొదటిసారి కోరిన కోరికను నెరవేర్చాలి - శ్రీహాన్ ► నాన్న పేరు నిలబెట్టేందుకు ట్రోఫీ గెలుచుకోవాలని ఉంది - రోహిత్ ► బిగ్‌బాస్ షోలో మొదటి రోజు నుంచి ప్రతి టాస్కులో ఆడుతూనే ఉన్నాను. ఎన్ని అవాంతరాలు వచ్చినా ముందుకు వెళ్తూనే ఉన్నాను. అందరికంటే ఆ ట్రోఫీ నాకే ఎక్కువ ముఖ్యం - రేవంత్ ► నా జీవితంలో ఏదీ అంత ఈజీగా దొరకలేదు, పోరాడి సాధించాను. బిగ్‌బాస్ ట్రోఫీ గెలిస్తే ఆ కిక్కే వేరు. కప్పు కొట్టాలన్న అమ్మానాన్న కల నెరవేర్చాలని ఉంది - శ్రీసత్య ► నాలాంటి అమ్మాయిలకు నేను ఆదర్శంగా నిలబడేందుకు ట్రోఫీ గెలవాలి - కీర్తి ► కుటుంబం కోసం, అలాగే అమ్మాయిలకు ఆదర్శంగా నిలబడేందుకు ట్రోఫీ గెలుచుకోవాలని ఉంది - ఫైమా ► మొదటిసారి ఓ కామన్ మ్యాన్ 13 వారాలు హస్‌లో ఉన్నాడు. అడ్డదారులు తొక్కకుండా జెన్యూన్‌గా ఆడి ట్రోఫీ గెలిస్తే హ్యాపీ - ఆదిరెడ్డి ► నువ్వు అమ్మాయివి, నువ్వేం చేయలేవు, చదువుకోలేదు అని నన్ను నానామాటలన్నారు. ఏమీ లేకపోయినా ఏదైనా సాధించవచ్చని నిరూపించాలనుకుంటున్నా. అందుకే ఈ ట్రోఫీ గెల్చుకుని చాలామందికి ఆదర్శంగా నిలవాలనుకుంటున్నా. ఈ కప్పు కొట్టి నాన్నకు అంకితమిస్తా - ఇనయ చదవండి: డిప్రెషన్ నుంచి బయటకు వచ్చాక అదే చేశా, అమ్మకు తెలిస్తే చెప్పుతో కొడుతుంది కాలితో ఒక్క తన్ను తన్నిన కీర్తి, షాకైన హౌస్మేట్స్ -
కాలితో ఒక్క తన్ను తన్నిన కీర్తి, షాకైన హౌస్మేట్స్
బిగ్‌బాస్ హౌస్‌లో టికెట్ టు ఫినాలే కోసం రేవంత్, ఆదిరెడ్డి, శ్రీహాన్, కీర్తి, ఫైమా, రోహిత్ తలపడుతున్నారు. వీరికి వరుస ఛాలెంజ్‌లు ఇస్తూ ఒక్కొక్కరిని పోటీ నుంచి తప్పిస్తున్నాడు బిగ్‌బాస్. ఈ క్రమంలో హౌస్‌మేట్స్‌కు రోల్ బేబీ రోల్ అనే టాస్క్ ఇచ్చాడు. ఇందులో దొర్లుకుంటూ వెళ్లి బ్రిక్స్ తెచ్చుకుని వాటిని టవర్లా కట్టాల్సి ఉంటుంది. ఎవరు బాగా ఎత్తయిన టవర్ కడితే వారే గెలిచినట్లు! ఈ టాస్క్‌కు ఇనయ, శ్రీసత్య సంచాలకులుగా వ్యవహరించగా ఫైమా, కీర్తి, శ్రీహాన్, రోహిత్ ఆడారు. శ్రీహాన్ టవర్ ఎత్తుగా ఉందని శ్రీసత్య చెప్పడంతో కీర్తికి చిర్రెత్తిపోయింది. శ్రీహాన్ టవర్‌లో గ్యాప్ కనిపించట్లేదా? అన్ని విషయాలు కూడా పరిగణనలోకి తీసుకోవాలి అని వాదించింది. నీ టవర్‌లో కూడా గ్యాప్స్ ఉన్నాయని శ్రీసత్య చెప్తుండగా ఆమె మాట వినిపించుకోలేదు కీర్తి. మీకు నచ్చినవారికి ఇచ్చుకోండి అంటూ తన టవర్‌ను ఒక్క తన్నుతో నేలకూల్చింది. ఆమె ప్రవర్తనతో అందరూ షాకయ్యారు. చదవండి: ఓటమిని జీర్ణించుకోలేకపోయిన రేవంత్, గొప్పోడివయ్యా రోహిత్ సిద్ధూకు హెడ్వెయిట్? డీజే టిల్లు నుంచి అనుపమ అవుట్ -
ఓటమిని జీర్ణించుకోలేకపోయిన రేవంత్, గొప్పోడివయ్యా రోహిత్!
Bigg Boss Telugu 6, Episode 88: ఎలాగైనా సరే టికెట్ టు ఫినాలే కొట్టాల్సిందేనని కసిగా ఆడుతున్నారు హౌస్మేట్స్. అయితే మొదట్లోనే ఆటలో అవుట్ అయిన శ్రీసత్య, కీర్తి, ఇనయలకు మరో ఛాన్స్ ఇచ్చాడు బిగ్‌బాస్. 'రంగు పడితే రివైవల్' గేమ్‌లో గెలిచినవారు తిరిగి రేసులో పాల్గొంటారని చెప్పాడు. ఈ గేమ్‌లో ముగ్గురమ్మాయిలు పోటాపోటీగా ఆడగా కీర్తి గెలిచి తిరిగి రేసులో నిలబడింది. అనంతరం శ్రీసత్య, ఇనయ మినహా పోటీలో ఉన్న మిగతా ఆరుగురు 'జెండాల జగడం' అనే గేమ్‌లో పాల్గొన్నారు. ఈ ఆటలో రేవంత్, ఆదిరెడ్డి తొలి రెండు స్థానాల్లో, ఫైమా, శ్రీహాన్, కీర్తి, రోహిత్ వరుసగా మూడు, నాలుగు, ఐదు, ఆరు స్థానాల్లో నిలబడ్డారు. తర్వాత నెక్స్ట్ ఛాలెంజ్‌లో పాల్గొనే నలుగురి సభ్యులు ఎవరో ఏకాభిప్రాయంతో చెప్పమని ఆదేశించాడు బిగ్‌బాస్. బిగ్‌బాస్ ఇచ్చిన ఈ ట్విస్ట్‌తో హౌస్మేట్స్ డీలా పడ్డారు. ఎంతో కీలకమైన టికెట్ టు ఫినాలే గేమ్‌లో ఏకాభిప్రాయం ఏంటని అసహనం వ్యక్తం చేశారు. నన్ను గేమ్‌లో నుంచి తీసేస్తే మాత్రం ఏ ఒక్కడినీ గెలవనివ్వను అని శ్రీహాన్ వార్నింగ్ ఇవ్వగా నాదీ అదే మాట అంటూ వంత పాడాడు రేవంత్. ఆడి ఓడిపోయినా సర్వాలేదు కానీ ఏకాభిప్రాయం వల్ల అసలు ఆటనే ఆడకపోవడం తట్టుకోలేమన్నాడు రోహిత్. దీంతో బిగ్‌బాస్.. ఆటలో లేని ఇనయ, శ్రీసత్యలను ఎవరు గేమ్‌లో ఉండాలి? ఎవరు గేమ్ నుంచి తప్పుకోవాలో డిసైడ్ చేయమన్నాడు. దీంతో వాళ్లు గత గేమ్‌లో చివరి ర్యాంకింగ్‌లో ఉన్న కీర్తి, రోహిత్‌లను ఆటలో నుంచి తొలగించారు. వారి నిర్ణయంపై కీర్తి రుసరుసలాడింది. ఇనయ వెళ్లి తనతో మాట్లాడించేందుకు ప్రయత్నించగా అది కాస్తా గొడవగా మారింది. దీంతో అటు కీర్తి, ఇటు ఇనయ ఇద్దరూ కంటతడి పెట్టుకున్నారు. రోహిత్ మాత్రం సరైన నిర్ణయమే తీసుకున్నారని మెచ్చుకోవడంతో శ్రీసత్య అతడి నిజాయితీని పొగడకుండా ఉండలేకపోయింది. ఇక బ్యాలెన్స్ ద స్కోర్స్ గేమ్‌లో ఫైమా మొదట అవుట్ అయింది. తర్వాత రేవంత్, శ్రీహాన్ వరుసగా ఓడిపోగా ఆదిరెడ్డి కడ వరకు నిలబడ్డారు. ఓటమిని జీర్ణించుకోలేకపోయిన రేవంత్ కోపంతో శ్రీసత్యపై చిటపటలాడాడు. ఈ గేమ్‌లో పర్ఫామెన్స్‌కుగానూ బిగ్‌బాస్ మార్కుల పట్టికను విడుదల చేశాడు. ఇందులో ఆదిరెడ్డికి 9, రేవంత్‌కు 8, శ్రీహాన్‌కు 6, ఫైమా 5 పాయింట్స్‌తో వరుస స్థానాల్లో ఉన్నారు. ఇకపోతే ఆదిరెడ్డి టికెట్ టు ఫినాలే గెలిచినట్లు సోషల్ మీడియాలో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి, మరి ఇందులో నిజమెంతుందో తెలియాలంటే రేపటి వరకు ఆగాల్సిందే! చదవండి: నన్ను సైడ్ చేస్తే ఎవ్వడినీ గెలవనివ్వను: శ్రీహాన్ పుష్ప సినిమా చూశా.. కానీ ఆ హీరో ఎవరో తెలియదు: నటి -
'టికెట్ టు ఫినాలే' మళ్లీ బరిలో నిలబడ్డ కంటెస్టెంట్
బిగ్‌బాస్ షోకి ముగింపు దగ్గరపడింది. మరో రెండు వారాల్లో గ్రాండ్ ఫినాలే జరగనుంది. నేరుగా ఫైనల్స్‌కు వెళ్లేందుకు టికెట్ టు ఫినాలే టాస్క్ ప్రవేశపెట్టాడు బిగ్‌బాస్. ఇప్పటికే ఈ గేమ్ నుంచి శ్రీసత్య, కీర్తి, ఇనయ అవుట్ అయ్యారు. కానీ వారికి మరో అవకాశం కల్పించి తిరిగి గేమ్‌లోకి రావడానికి ఓ ఛాలెంజ్ ఇచ్చాడు బిగ్‌బాస్. ముగ్గురమ్మాయిలకు రంగు పడుద్ది అనే టాస్క్ ఇచ్చాడు. ఈ గేమ్‌లో ఇనయ, కీర్తి.. సత్యను టార్గెట్ చేయడంతో ఆమె అవుట్ అయింది. తర్వాత మిగిలిన ఇద్దరూ పోటాపోటీగా ఆడారు. రసవత్తరంగా జరిగిన ఈ పోటీలో కీర్తి గెలిచి తిరిగి టికెట్ టు ఫినాలే గేమ్‌లో అడుగుపెట్టింది. చదవండి: మీరిద్దరూ ఏం చేస్తున్నారసలు.. దొరికిపోయిన శ్రీహాన్ రష్యాలోనో తగ్గేదే లేదంటున్న పుష్పరాజ్ -
ఆ కంటెస్టెంట్ పరువు తీసిన రాజ్, అతడే విన్నర్ అని వెల్లడి
Bigg Boss Telugu 6, Episode 85: ఎవరు తప్పు చేశారో నిలబెట్టి క్లాసు పీకే నాగార్జున ఈసారి మాత్రం డిఫరెంట్‌గా వారి తప్పొప్పులను వారితోనే చెప్పించాడు. హౌస్‌మేట్స్‌లో ఉన్న బ్యాడ్ క్వాలిటీస్ ఏంటో చెప్పమని ఆదేశించాడు నాగ్. ముందుగా రోహిత్ మాట్లాడుతూ.. 'కీర్తి ఎక్కువ బాధపడుతుంది, ఫైమా, శ్రీసత్యలో వెటకారం ఎక్కువ. ఇనయ ఎవరికీ అవకాశమివ్వకుండా మాట్లాడుతుంది, రాజ్ పాయింట్ లేకున్నా అరుస్తాడు, రేవంత్‌కు కోపమెక్కు. శ్రీహాన్ గేమ్ కన్నా ఫ్రెండ్షిప్కు ఎక్కువ ప్రాధాన్యతనిస్తాడు' అంటూ వారిలోని లోపాలను ఏకరువు పెట్టాడు. ఇలా అందరి గురించి చెప్పుకుంటూ పోతే ఎపిసోడ్ సాగదీయాల్సి వస్తుందనుకున్నాడో ఏమోకానీ నలుగురి కంటెస్టెంట్లలోని చెడు లక్షణాలు చెప్తే సరిపోతుందన్నాడు నాగ్. దీంతో ఇనయ మాట్లాడుతూ.. 'శ్రీసత్య గేమ్‌ను లైట్‌గా తీసుకుంటుంది. రేవంత్ ఎక్కువ కన్ఫ్యూజన్ అవుతున్నాడు. రాజ్ నేనున్నానని చూపించుకోవడానికి అరుస్తాడు. ఆదిరెడ్డి ఆడకుండా కూర్చోవడం కరెక్ట్ కాదు' అని చెప్పింది. కీర్తి వంతు రాగా రేవంత్ అన్న ఓవర్ అగ్రెసివ్, శ్రీసత్య, శ్రీహాన్ వెటకారం, రోహిత్ ఎక్కువ కలవకపోవడం మైనస్ అని చెప్పింది. ఆదిరెడ్డి మాట్లాడుతూ.. 'రేవంత్ బాగా ఆడతాడు, కానీ తాను బాగా ఆడతానని నిరూపించుకోవాల్సిన అవసరం లేదు. ఇనయ చాలా మాటలు వదిలేస్తుంది. శ్రీసత్యకు కాన్ఫిడెన్స్ తగ్గిపోయింది. రోహిత్ గట్టిగా స్పందించరు' అని చెప్పాడు. ఫైమా.. సరేవంత్ కోపం నచ్చదు. ఇనయ మాటతీరు మార్చుకోవాలి. రోహిత్ గేమ్‌లో పెద్దగా పర్ఫామెన్స్ కనిపించట్లేదు. కీర్తి ఎక్కువ ఎమోషనల్ అవుతుందిస అని చెప్పింది. శ్రీసత్య.. రోహిత్ సరైన టైమ్‌కు రియాక్ట్ అవడు. కీర్తి ఏం చెప్పినా వినిపించుకోదు. ఇనయ ఎదుటివాళ్లకు మాట్లాడే ఛాన్స్ ఇవ్వదు. శ్రీహాన్ గేమ్ కన్నా ఫ్రెండ్షిప్కు ఎక్కువ ప్రాధాన్యతనిస్తాడు అని చెప్పింది. రాజ్ మాట్లాడుతూ.. రోహిత్ గట్టిగా మాట్లాడడు. ఇనయ ప్రతిదానిలో దూరుతుంది. శ్రీహాన్ గేమ్ కన్నా స్నేహానికే ఎక్కువ ప్రాధాన్యతనిస్తాడు. శ్రీసత్య నామినేషన్లో తను చెప్పాలనుకుంది చెప్పి వెళ్లిపోతుందన్నాడు. ఇక శ్రీహాన్ వంతురాగా రాజ్‌కు కాన్ఫిడెన్స్ తక్కువ. రోహిత్ మంచితనం కొన్నిసార్లు సేఫ్‌గా కనిపిస్తుంది. రేవంత్ కొన్ని స్టేట్మెంట్లు వదిలేస్తాడు. సరదాగా అయినా సరే వద్దని వారించినా అర్థం చేసుకోడు. శ్రీసత్య వేరేవాళ్ల మాట నమ్మి ఫ్రెండ్‌ను దూరం పెట్టొద్దు అని సూచనలిచ్చాడు. రేవంత్.. ఫైమా వెటకారం తగ్గించుకోలేదని, ఆదిరెడ్డి మానిప్యులేటర్ అని, ఇనయ, కీర్తి కావాలని రెచ్చగొడుతారని మనసులో ఉన్న కోపాన్నంతా కక్కేశాడు. అందరూ మాట్లాడింది విన్న నాగ్.. మీలోని చెడు లక్షణాలను సరిచేసుకున్నవారు గెలుపుకు దగ్గరవుతారని సూచించాడు. తర్వాత వంట రాదన్న కీర్తితో ఆలూ ఫ్రై చేయించుకుని మరీ తిన్నాడు నాగ్. అనంతరం ఇంటిసభ్యులతో ఫన్ గేమ్స్ ఆడించాడు. ఇకపోతే నామినేషన్స్‌లో అందరినీ సేవ్ చేసుకుంటూ రాగా చివరకు ఫైమా, రాజ్ ఇద్దరే మిగిలారు. ఎవిక్షన్ ఫ్రీ పాస్ రాజ్ కోసం వాడతానంది ఫైమా. అయితే రాజ్ మాత్రం నువ్వు ఆడి సంపాదించింది నీ కోసమే వాడుకో అని చెప్పాడు. దీంతో ఫైమా దాన్ని వాడకుండా వదిలేద్దామనకుంది. కానీ నాగార్జున మాత్రం.. ఓటింగ్‌లో చివరి రెండు స్థానాల్లో మీ ఇద్దరే ఉన్నారని, మీలో ఒకరికి ఎవిక్షన్ ఫ్రీ పాస్ వాడితే మిగతా ఒకరు ఎలిమినేట్ అవుతారని స్పష్టం చేశాడు. అంటే ఓటింగ్‌తో సంబంధం లేకుండా పాస్‌తో గండం గట్టెక్కొచ్చని నొక్కి చెప్పాడు. దీంతో ఫైమా మనసు మార్చుకుని తనకోసం ఎవిక్షన్ ఫ్రీ పాస్ వాడింది. ఫలితంగా ఎలిమినేషన్ నుంచి సేవ్ అయింది. అయితే ఆడియన్స్ ఓట్ల ప్రకారం చివరి స్థానంలో ఉన్న ఫైమా ఎలిమినేట్ అవ్వాలని, కానీ పాస్ సాయంతో ఆమె సేవ్ అయి రాజ్ ఎలిమినేట్ అయ్యాడని ప్రకటించాడు నాగ్. దీంతో ఫైమా, ఇనయ ఎమోషనలయ్యారు. స్టేజీ మీదకు వచ్చిన రాజ్‌తో పంచ్, హగ్స్ గేమ్ ఆడించాడు నాగ్. ఫైమా, ఆది, రోహిత్, రేవంత్‌కు హగ్స్ ఇస్తానని, మిగతా నలుగురికి పంచ్ ఇచ్చాడు. వెళ్లేముందు కంటెస్టెంట్లకు విలువైన సూచనలిచ్చాడు రాజ్. ఫైమా దగ్గర కొంత ఫన్ తక్కువైందని, ఆదిరెడ్డి తను మాట్లాడిందే కరెక్ట్ అనుకుంటాడని, రోహిత్ కొన్ని సందర్భాల్లో మాట్లాడితే బాగుండన్నాడు. రేవంత్‌ది చిన్నపిల్లాడి మెంటాలిటీ అని, అతడు కచ్చితంగా టైటిల్ కొడతాడని ఫిక్సైపోమన్నాడు. శ్రీహాన్ అందరితో గట్టిగా మాట్లాడతాడు, కానీ ఫ్రెండ్స్ తప్పులను గట్టిగా చెప్తే బాగుండన్నాడు. శ్రీసత్యను నామినేషన్లో సరైన పాయింట్లు చెప్పమన్నాడు. ఇనయను టాప్ 5లో చూడాలనుకుంటున్నానని, ఆలోచించి మాట్లాడమని సూచించాడు. హౌస్‌లో కీర్తి తనకెప్పుడూ కనిపించలేదంటూ ఆమె పరువు తీశాడు. ఫైనల్‌గా రాజు ఎక్కడైనా రాజే అంటూ అతడిని పంపించేశాడు నాగ్. చదవండి: రాజశేఖర్ ఎలిమినేషన్‌కు కారణాలివే! నిజానికైతే ఫైమా ఎలిమినేట్ కావాల్సింది! -
ఇనయ కల నెరవేర్చిన బిగ్‌బాస్, శ్రీహాన్ కాళ్లు మొక్కిన సిరి
Bigg Boss Telugu 6, Episode 82: పన్నెండు వారాల ఎడబాటుకు తెర దించుతూ కంటెస్టెంట్ల ఫ్యామిలీ మెంబర్స్‌ను హౌస్‌లోకి పంపుతున్నాడు బిగ్‌బాస్. వారిని చూసి గుండెల నిండా ఊపిరి పీల్చుకుంటున్నారు హౌస్మేట్స్. తమ వాళ్లను చూడగానే తెలియకుండానే కన్నీళ్లు కార్చుతున్నారు. వారితో కలిసి చిందులేస్తున్నారు. మరి ఈరోజు ఎపిసోడ్లో ఏయే కంటెస్టెంట్ల ఫ్యామిలీస్ వచ్చాయో చూద్దాం.. పన్నెండు వారాల తర్వాత ప్రేయసి కళ్లముందుకు రావడంతో భావోద్వేగానికి లోనయ్యాడు శ్రీహాన్. హౌస్‌లోకి వెళ్లగానే శ్రీహాన్‌ను గట్టిగా పట్టుకుని అతడిపై ముద్దుల వర్షం కురిపించింది సిరి. ఈ పదేళ్లు నా వెనకుండి నువ్వెలా నడిపించావో, భవిష్యత్తు అంతా కూడా నువ్వ నాతోనే ఉండాలంటూ తన పేరు పచ్చబొట్టు పొడిపించుకున్నానని మెడపై ఉన్న టాటూ చూపించింది. తర్వాత సిరి కొడుకు చైతూ హౌస్‌లో ఎంట్రీ ఇచ్చి సర్ప్రైజ్ చేశాడు. వచ్చీరాగానే ఈ చిచ్చరపిడుగు తన బుల్లిబుల్లి మాటలతో అందరినీ నవ్వించాడు. ఎవరెలా మాట్లాడతారో వారి డైలాగులను సరిగ్గా దింపేశాడు. తర్వాత.. ఇంతందం దారి మళ్లిందా.. పాటకు సిరి, శ్రీహాన్ స్టెప్పులేశారు. వారిద్దరి మధ్యలో చైతూ వచ్చేందుకు ప్రయత్నించడంతో పానకంలో పుడకలా వస్తావేంట్రా అని తిట్టలేక నవ్వుకున్నాడు శ్రీహాన్. చివరగా వెళ్లిపోయేముందు శ్రీహాన్ పాదాలు తాకి వీడ్కోలు తీసుకుంది సిరి. ఇక రాత్రిపూట కడుపులో మండుతుందని పాలు అడిగాడు రాజ్.. ఎప్పటిలాగే స్ట్రిక్ట్ మాస్టర్ రేవంత్ కుదరదని తెగేసి చెప్పాడు. అడిగినప్పుడు ఇవ్వడానికి ఏం ప్రాబ్లమ్ అని లోలోనే గునుక్కున్నాడు రాజ్. తర్వాతి రోజు కీర్తి కోసం ఆమె స్నేహితుడు, బుల్లితెర నటుడు మహేశ్ వచ్చాడు. ఆమెతో కలిసి డ్యాన్స్ చేసి గోరుముద్దలు తినిపించాడు. ఎవ్వరూ కోల్పోలేనిది నువ్వు కోల్పోయావు. కానీ ఆ దేవుడు నీకు ఇచ్చిన ఛాన్స్ బిగ్‌బాస్. ఇక్కడ నీతో నీకే పోటీ.. లక్షల మంది సైన్యం నీ వెంట ఉన్నారు.. అదే నీ బలం.. అంటూ ఆమెలో పాజిటివిటీ నింపాడు. తను దత్తత తీసుకున్న పాప ఫొటోను బహుమతిగా అందించాడు. అయితే ఆమెను కాపాడుకోలేకపోయానని బోరున ఏడ్చింది కీర్తి. అనంతరం మహేశ్.. ఇనయను ముద్దుపెట్టమని అడగడంతో అందరూ సర్ప్రైజ్ అయ్యారు. అతడికి నో చెప్పడం ఇష్టం లేని ఇనయ ఫ్లయింగ్ కిస్ ఇచ్చింది. అనంతరం ఇనయ సుల్తాన తల్లి నజ్బూర్ హౌస్‌లోకి వచ్చింది. ఆమెను చూడగానే ఎమోషనలైంది ఇనయ. 'నాకోసం నువ్వు మనసులో ఇంత బాధపడుతున్నావని తెలీదు, అందుకే వచ్చాను. నీ జీవితం నువ్వు చూసుకున్నావు, ఇంత కష్టపడ్డావు. బిగ్‌బాస్‌కు వచ్చావు. గెలిచి రావాలి. నువ్వు బాగుండాలనేదే నా కోరిక' అని చెప్పింది. హైదరాబాద్‌కు షిఫ్ట్ అయిపోదాం అని ఇనయ అడిగితే అది తర్వాత మాట్లాడుకుందాం, ముందైతే బాగా ఆడి గెలిచి రా అని బదులిచ్చింది. కేజీఎఫ్‌లోని అమ్మ సాంగ్ వేయడంతో తల్లి కాళ్ల మీద పడి ఏడ్చింది ఇనయ. అనంతరం ఆమె అక్కడి నుంచి వీడ్కోలు తీసుకుంది. తల్లిని బిగ్‌బాస్ హౌస్‌లో చూడాలన్న తన కల నెరవేరడంతో ఇనయ తెగ సంతోషపడిపోయింది. చదవండి: ఇనయను, ఆమె తల్లిని కలిపిన బిగ్‌బాస్ భారత ఆర్మీని అవమానించిందంటూ నటిపై ట్రోలింగ్ -
ఇనయను ఆమె తల్లిని కలిపిన బిగ్‌బాస్, కీర్తి కోసం వచ్చింది ఎవరంటే?
బిగ్‌బాస్ హౌస్‌లో ఓపక్క టీచింగ్ క్లాసులు మరోపక్క ఫ్యామిలీస్ ఎంట్రీతో నవ్వులు వెదజల్లుతున్నాయి. ఈ క్రమంలో శ్రీహాన్ ఫ్లర్టింగ్ ఎలా చేయాలనేది కంటెస్టెంట్లకు నేర్పిస్తున్నాడు. అమ్మాయిలను ఎలా పడగొట్టాలని టిప్స్ ఇస్తున్నాడు. తర్వాత కీర్తి కోసం ఆమె స్నేహితుడు, నటుడు మహేశ్ హౌస్‌లో అడుగుపెట్టాడు. అతడిని చూడగానే కీర్తి కళ్లల్లో ఆనందం కట్టలు తెచ్చుకుంది. వీరిద్దరూ ఈ ప్రపంచాన్నే మర్చిపోతూ స్టెప్పులేశారు. కీర్తికి తన చిన్ననాటి ఫొటో గిఫ్ట్ ఇవ్వడంతో కంట్లో నుంచి నీళ్లు జలజలా రాలాయి. 'జీవితంలో చాలా కోల్పోయావు, ఆ దేవుడు నీ నుంచి ఎన్నో తీసేసుకున్నాడు. కానీ అదే దేవుడు నీకు మళ్లీ ఇంకో అవకాశం ఇచ్చాడు, అదే బిగ్‌బాస్ అని కీర్తిలో ధైర్యం నింపేందుకు ప్రయత్నించాడు. సినిమాల్లో రాణించేందుకు ఇల్లు వదిలేసి వచ్చిన ఇనయ తన కుటుంబంతో సంబంధాలు పూర్తిగా తెగిపోయాయని ఎన్నోసార్లు బాధపడింది. అలాంటిది.. ఆమెను తిరిగి తల్లితో కలిపాడు బిగ్‌బాస్. ఇనయ తల్లిని హౌస్‌లోకి పంపించాడు. ఆమెను చూడగానే కాళ్లమీద పడిపోయింది ఇనయ. గుండెల్ని పిండేసే ఈ ఎమోషనల్ ఎపిసోడ్ చూడాలంటే కొద్ది గంటలు ఆగాల్సిందే! చదవండి: కొడుకుతో హౌస్‌లో అడుగుపెట్టిన సిరి యశోద ఓటీటీ విడుదల ఆపాలంటూ ఆదేశం -
ఆ ఒక్క ప్రశ్నతో దొరికిపోయిన కీర్తి, రాజ్ నిందతో ఏడ్చిన ఇనయ
జనాలు చూస్తున్నారు, జనాలు చూస్తున్నారు.. బిగ్‌బాస్ హౌస్‌లో ప్రతీ కంటెస్టెంటూ చెప్పే మాట ఇది. అలా అని ఇక్కడ ఇలా మాట్లాడకూడదు, అక్కడ అలా ప్రవర్తించకూడదు అని ఎవరూ నోరూ, కాళ్లు చేతులు కట్టేసుకుని కూర్చోలేదు. పైగా తామేం చేసినా రైటే అని, అది జనాలు అంగీకరిస్తారని ఎవరికి వారు ఊహల్లో తేలిపోమారు. ఇప్పుడిప్పుడే వారి కళ్ల ముందు ఏర్పడుకున్న మబ్బులు నెమ్మదిగా తొలగిపోతున్నాయి. ఆడియన్స్ అడిగే ప్రశ్నలతో ఉలిక్కిపడుతున్నారు హౌస్మేట్స్. ఈ మధ్యే శ్రీసత్య, శ్రీహాన్‌లను వాయించిన ప్రేక్షకులు నేడు రాజ్, కీర్తి, ఇనయల గురించి అడిగేశారు. ఈ క్రమంలో కీర్తికి.. 'ఇతర కంటెస్టెంట్ల సపోర్ట్‌తోనే మీరు కెప్టెన్ అయ్యారు కదా, మరి నాకెవరూ సపోర్ట్ చేయలేదు, సోలో ప్లేయర్ అని ఎందుకంటారు? సింపతీ ట్రై చేస్తున్నారా?' అన్న ప్రశ్న ఎదురైంది. దీనికి కీర్తి.. సింపతీ ఒకటీరెండు రోజులు ఉంటుందే తప్ప జీవితాంతం ఉండదని చెప్పింది. తర్వాత హౌస్‌లో మీ నిజమైన ఫ్రెండ్స్ ఎవరు? మీ వెనకాల ఎవరు మాట్లాడరని అనుకుంటున్నారని రాజ్‌ను అడిగాడో ఆడియన్. దీనికతడు ఇనయ నా వెనకాల మాట్లాడుతుందనిపిస్తుందన్నాడు. ఒకప్పుడు స్నేహితుడుగా ఉన్న రాజ్ ప్రతిదానికీ తననే తప్పుపడుతుండటంతో తట్టుకోలేక ఏడ్చేసింది ఇనయ. చదవండి: 12వ వారం నామినేషన్స్‌లో ఎవరున్నారంటే? -
ఆ ఐదుగురి మనసు స్వచ్ఛమైనది, మిగతావాళ్లు..: మెరీనా
Bigg Boss Telugu 6, Episode 78: ఈరోజు పెద్ద ట్విస్టులు, సర్ప్రైజ్లు లేకుండా సాదాసీదాగా సాగింది ఎపిసోడ్. ఊహించినట్లే మెరీనా ఎలిమినేట్ అయిపోగా ఆమె భర్త రోహిత్ మినహా మిగతా ఎవ్వరూ బాధపడలేదు. మరి హౌస్‌లో ఈ రోజు ఏం జరిగింది? మెరీనా వెళ్లిపోయేముందు హౌస్మేట్స్ గురించి ఏం చెప్పింది? అనేది నేటి ఎపిసోడ్ హైలైట్స్‌లో చూద్దాం.. నాగార్జున హౌస్‌లో ఉన్న పదిమందిలో ఎవరు బాటమ్ 5లో ఉంటారో చెప్పమని కంటెస్టెంట్లను ఆదేశించాడు. ఎవరు ఎవరెవరి పేర్లు చెప్పారంటే.. కంటెస్టెంట్ బాటమ్ 5 కంటెస్టెంట్లు ఆదిరెడ్డి మెరీనా, రోహిత్, రాజ్, కీర్తి, ఇనయ ఇనయ రాజ్, శ్రీసత్య, మెరీనా, రోహిత్, ఆదిరెడ్డి కీర్తి శ్రీసత్య, మెరీనా, శ్రీహాన్, రాజ్, ఆదిరెడ్డి రాజ్ మెరీనా, రోహిత్, ఆదిరెడ్డి, ఇనయ, శ్రీహాన్ ఫైమా మెరీనా, రోహిత్, ఇనయ, కీర్తి, రాజ్ మెరీనా శ్రీహాన్, మెరీనా, ఇనయ, రాజ్, ఫైమా/శ్రీసత్య శ్రీహాన్ రోహిత్, మెరీనా, కీర్తి, రాజ్, ఆదిరెడ్డి రోహిత్ శ్రీహాన్, కీర్తి, మెరీనా, ఇనయ, రాజ్ శ్రీసత్య మెరీనా, రోహిత్, కీర్తి, ఇనయ, రాజ్ రేవంత్ మెరీనా, రోహిత్, కీర్తి, రాజ్, ఇనయ హౌస్ అంతా బల్లగుద్ది మరీ మెరీనాకు టాప్‌లో ఉండే అర్హతే లేదని స్పష్టం చేసింది. అన్నట్లుగానే నాగ్ మెరీనా ఎలిమినేట్ అయినట్లు ప్రకటించాడు. ఆమె ఎలిమినేషన్‌ను హౌస్మేట్స్ ముందే పసిగట్టడంతో రోహిత్ తప్ప ఏ ఒక్కరూ బాధపడలేదు. నిత్యం వైఫైలా తన చుట్టూ తిరుగుతూ ఉండే మెరీనా ఒక్కసారిగా వెళ్లిపోవడాన్ని తట్టుకోలేకపోయాడు రోహిత్. బాధను భరించలేక బయటకు ఏడ్చేశాడు. కాసేపు ఇద్దరూ తమ చుట్టూ ఉన్న ప్రపంచాన్ని మర్చిపోయి ఒకరిపై ఒకరు ముద్దుల వర్షం కురిపించుకున్నారు. అనంతరం స్టేజీపైకి వచ్చిన మెరీనాతో హౌస్‌లో ప్యూర్ ఎవరు? ఇంప్యూర్ ఎవరు? అనే గేమ్ ఆడించాడు నాగ్. ముందుగా మెరీనా స్వచ్ఛమైన వాళ్ల లిస్ట్ చెప్పుకొచ్చింది. రోహిత్‌లాంటి స్వచ్ఛమైన వ్యక్తిని ఎక్కడా చూడలేదంది. కీర్తి ఏదో బాధలో ఉంటుందంటారు.. ఆమె బాధ నిజమని, తనేమీ యాక్ట్ చేయట్లేదని చెప్పింది. ఆదిరెడ్డి తనలో తానే మాట్లాడుకోవడం చూసి దెయ్యంతో మాట్లాడుతున్నాడేమో అనుకునేదాన్ని, ఆ తర్వాత క్లారిటీ వచ్చిందని పేర్కొంది. అతడితో ఉంటే మనవాళ్లతో ఉన్న ఫీలింగ్ వస్తుందని తెలిపింది. రేవంత్‌కు కోపం వస్తే కోపం, బాధ అనిపిస్తే బాధ అన్నీ చూపిస్తాడని అదే స్వచ్ఛతకు నిదర్శనమని వివరించింది. నాకేదైనా ప్రాబ్లమ్ వస్తే సాయం చేయడానికి ముందుకొచ్చే మొదటి వ్యక్తి రేవంత్ అని పొగిడింది. రాజ్ దగ్గర యాటిట్యూడ్ లేదని, ఒక్కో మెట్టు ఎక్కుతూ తనను తాను బిల్డ్ చేసుకుంటున్నాడని చెప్పుకొచ్చింది. తర్వాత ఇనయ, శ్రీసత్య, శ్రీహాన్, ఫైమాలను ఇంప్యూర్ జాబితాలో పెట్టింది. అప్పుడప్పుడైనా ఎదుటివాళ్లు చెప్పేది వినమని ఇనయకు సూచించింది. శ్రీసత్య మానిప్యులేట్ అయినట్లు అనిపించిందని, ఫైమా కొన్నిసార్లు మాటలు వదిలేస్తుందని పేర్కొంది. శ్రీహాన్‌ను ఇప్పటికైనా ఇంట్లో అందరినీ సమానంగా చూడమని సూచించింది. అంతేకాకుండా కోపం వచ్చినప్పుడు కంట్రోల్లో ఉండాలి, ఓసారి నామీద అరిచావు, నేను సైలెంట్ క్యాండిడేట్ కాబట్టి సరిపోయింది, అక్కడ వేరేవాళ్లు ఉంటే పరిస్థితి మరోలా ఉండేదని ఘాటుగా హెచ్చరించింది. అనంతరం బిగ్‌బాస్ జర్నీకి ఫుల్స్టాప్ పెడుతూ స్టేజీ నుంచి వెళ్లిపోయింది. చదవండి: గీతూ పేరెంట్స్‌తో మాట్లాడా: బాలాదిత్య మెరీనా ఎలిమినేట్ అవ్వడానికి కారణాలివే! -
ఆదిరెడ్డి ఇమేజ్ టోటల్ డ్యామేజ్.. గీతూకి పట్టిన గతి రాకుండా చూస్కో!
Bigg Boss 6 Telugu, Episode 77: ఓవర్ కాన్ఫిడెన్స్ వల్ల ఎదుటివాళ్ల కంటే మనకే ఎక్కువ నష్టం అన్న విషయాన్ని పసిగట్టలేకపోతున్నాడు ఆదిరెడ్డి. ఇప్పటికే ఓవర్ కాన్ఫిడెన్స్‌తో చేజేతులా గేమ్‌ను నాశనం చేసుకుని గీతూ బయటకు వెళ్లిపోయింది. ఇప్పుడు అదే బాటలో నడుస్తున్నాడు ఆది. దీంతో నాగార్జున అతడికి చీవాట్లు పెట్టి తప్పులను సరిదిద్దుకునేందుకు అవకాశం ఇచ్చాడు. మరి ఇంకా ఎవరెవరికి ఎలాంటి క్లాస్‌లు పీకాడు? ఎవరి బండారాలు బయటపెట్టాడు అనేది తెలియాలంటే నేటి ఎపిసోడ్ హైలైట్స్ చదివేయాల్సిందే! కెప్టెన్సీ అంటే అధికారం కాదని, బాధ్యత అని రేవంత్‌కు గుర్తు చేశాడు నాగార్జున. ఏదైనా పని చెప్పేటప్పుడు మాట్లాడే తీరు చూసుకోమని విసుక్కున్నాడు. శక్తి ఆటలో ప్రదర్శించమని, మాటలో కాదు అని చురకలంటించాడు అనంతరం ఆదిరెడ్డికి గట్టిగానే క్లాస్ పీకాడు. ఓ కథ చెప్పి మరీ అతడిని దోషిగా నిలబెట్టాడు. నోటికొచ్చిన స్టేట్మెంట్లు పాస్ చేస్తున్నావని గడ్డి పెట్టాడు. ఎవిక్షన్ ఫ్రీ పాస్ వేస్ట్, అది దక్కించుకుంటే ఓట్లు పడవు అని ఆడకుండా మూలన కూర్చున్నావు. ప్రేక్షకులు ఏమనుకుంటున్నారో డిసైడ్ చేయడానికి నువ్వేమైనా తోపా? తురుమా? అని తిట్టిపోశాడు. నువ్వు కామన్ మ్యాన్‌గా ఆడటానికి వచ్చావు, కేవలం మాట్లాడటానికి కాదు, గేమ్‌లో ఉన్న వాళ్లను ఇన్ఫ్లూయెన్స్ చేసి నీ అభిప్రాయాలను వారితో చెప్పిస్తున్నావు. గేమ్ విషయంలో ఎక్కువ ఆలోచించి లూప్‌లు వెతికితే నీకూ గీతూ పరిస్థితే వస్తుంది అని స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చాడు. అంతేకాక కెప్టెన్సీ కంటెండర్ గేమ్‌లో నువ్వు రూపాయి పెట్టి కూడా ముందుకు వెళ్లొచ్చు, కానీ లక్ష రూపాయలు రాశావు. ఇమ్యూనిటీ కోసమే కదా.. అని లాజిక్ అడిగాడు. ఇదే ప్రశ్న రాజ్ అడిగితే ఏదేదో చెప్పి అతడి నోరు మూయించాడు ఆది. ఇప్పుడు నాగ్ కూడా అదే అడిగేసరికి అడ్డంగా దొరికిపోయాడు. ఇకపోతే శ్రీహాన్ కెప్టెన్‌గా ఉన్నప్పుడు శ్రీసత్యకు వంట రాదంటే వదిలేసి కీర్తిని మాత్రం వంట రాదంటే నేర్చుకుని చేయమని ఆర్డర్ ఇచ్చాడు. ఇదే అంశాన్ని ఓ ఆడియన్ అడగ్గా.. తనకసలు గుర్తే లేదని జవాబిచ్చాడు. దీంతో నాగ్.. గుర్తు లేకపోతే నేను గుర్తు చేస్తానన్నట్లుగా ఓ వీడియో వదిలాడు. అందులో శ్రీసత్య నాకు రాదు, చేయను అని స్పష్టంగా చెప్పింది. అయినా ఆమెను వదిలేసి, కీర్తిని మాత్రం వంట నేర్చుకుని చేయమన్నాడు. అంత అడ్డంగా దొరికినప్పటికీ సరిగా వినపడలేదంటూ మళ్లీ కవర్ చేయడానికి ప్రయత్నించాడు. అలాగే కుక్కలు మొరిగితే దేవలోకానికి ఏమీ కాదని కీర్తి చెప్పిన సామెతను సామెతలాగే చూడాలే తప్ప దాన్ని పట్టుకుని రాద్ధాంతం చేయనవసరం లేదని శ్రీహాన్, శ్రీసత్యలకు మొట్టికాయలు వేశాడు. ఇక ప్రతివారం నామినేషన్స్‌ను ఎక్కువగా ఎంజాయ్ చేసేది శ్రీసత్య. పక్కనోళ్లు నామినేట్ చేసుకుంటుంటే మరీ ముఖ్యంగా ఇనయను నామినేట్ చేసేటప్పుడు తెగ నవ్వుతుంటుంది. సరిగ్గా ఇదే పాయింట్ లేవనెత్తాడు నాగ్. నామినేషన్స్‌లో నీకు నవ్వెందుకు వస్తుందని అడిగాడు. లోపల ఉన్న అహంకారం, వెటకారం వల్లే ఆ నవ్వు వస్తుందని ఆమె పరువు తీశాడు. అనంతరం బిగ్‌బాస్ హౌస్‌లో మీమ్స్ గేమ్ జరిగింది. అందులో భాగంగా అక్కడున్న మీమ్ కార్డులు ఎవరికి సూటవుతాయో వారికి ఇవ్వాలన్నాడు నాగ్. రేవంత్‌ను ఇవే తగ్గించుకుంటే మంచిది అన్నాడు ఆది. శ్రీసత్యకు ఓరి.. దీని వేషాలూ అన్న మీమ్ ఇచ్చాడు శ్రీహాన్. రాజ్.. ఓన్లీ వన్స్ ఫసక్ అనేలా మాట్లాడుతున్నాడంది ఫైమా. ఫైమాకు అట్లుంటది మనతోని ట్యాగ్ ఇచ్చాడు రాజ్. శ్రీహాన్‌కు సరె సర్లే, చాలా చూశాం ట్యాగ్ ఇచ్చింది కీర్తి. వీడెవడు ఓవరాక్షన్ చేస్తున్నాడు.. చైల్డ్ ఆర్టిస్టా? అన్న మీమ్‌ను శ్రీహాన్‌కు ఇచ్చింది ఇనయ. మస్తు షేడ్స్ ఉన్నాయ్రా నీలో, ఆట్.. కమల్ హాసన్ అన్న మీమ్ శ్రీహాన్‌కే సూటవుతుందన్నాడు రోహిత్. చాలా ఉన్నాయ్ దాచాం.. లోపల కుప్పలు కుప్పలుగా ఉన్నాయ్ అన్న మీమ్‌ను శ్రీహాన్‌కు ఇచ్చింది శ్రీసత్య. ఇదేందయ్యా ఇది, నేనేడా చూడలా.. అన్న మీమ్ రోహిత్కిచ్చింది మెరీనా. ఆదిరెడ్డి పని అయిపాయే అన్నాడు రేవంత్. నిజంగానే ఈరోజు ఎపిసోడ్లో ఆదిరెడ్డి పని అయిపోయింది. చదవండి: టాప్ 10లో నుంచి ఎలిమినేట్ అయింది ఎవరంటే? పంచ్ ప్రసాద్ భార్య నిజంగా గ్రేట్, పెళ్లికి ముందే ప్రాబ్లమ్ తెలిసినా.. -
తగ్గేదే లేదంటున్న బిగ్‌బాస్, విన్నర్‌కు మిగిలేది ఎంతంటే?
Bigg Boss 6 Telugu, Episode 74: వీలైనంత ప్రైజ్‌మనీని తగ్గించాలని బిగ్‌బాస్ కంకణం కట్టుకున్నట్లున్నాడు. కంటెస్టెంట్లు నో చెప్పడానికి వీలు లేని కెప్టెన్సీ కంటెండర్ టాస్క్‌కు ఓ రేటు ఫిక్స్ చేశాడు. అలా ప్రైజ్‌మనీలో నుంచి కావాల్సినంత దండుకుంటున్నాడు. ఇంతకీ ప్రైజ్‌మనీ ఎన్ని లక్షలు తగ్గింది? నేటి ఎపిసోడ్ హైలైట్స్ ఏంటో చదివేద్దాం.. రివ్యూలు వద్దని స్వయంగా నాగార్జునే చెప్పినా పట్టించుకోని ఆదిరెడ్డి ఈవారం ఎవరు వెళ్తారని సత్యతో డిస్కషన్ పెట్టాడు. దీనికామె క్షణం ఆలోచించకుండా కీర్తి అని చెప్పింది. అటు ఆదిరెడ్డి కూడా నాకూ అలాగే అనిపిస్తోందని వంత పాడాడు. అనంతరం బిగ్‌బాస్.. బీబీ ట్రాన్స్పోర్ట్ అనే కెప్టెన్సీ కంటెండర్స్ టాస్క్ ఇచ్చాడు. ఇందులో భాగంగా బీబీ ట్రక్కు సమయానుసారం ఒక్కో స్టాప్ దగ్గర ఆగిపోతుంది. అలా ఆగిన ప్రతిసారి ఎవరైతే ముందు వచ్చి ఎక్కుతారో వారే కెప్టెన్సీ పోటీదారులవుతారు. అయితే ప్రతి స్టాప్‌లో ఆ వాహనం ఎక్కేందుకు ఓ ధర ఉంటుందని, దాన్ని విన్నింగ్ ప్రైజ్‌మనీలో నుంచి తీసేస్తామని చెప్పాడు. దీనితోపాటు ఆ ట్రక్కు ఎక్కలేకపోయిన మిగతా ఇంటి సభ్యులు తమలో కెప్టెన్సీకి అనర్హులుగా భావించే ఇద్దరి పేర్లను చెప్తే వారిలో ఎవరు పోటీలో పాల్గొంటారు? ఎవరు రేస్ నుంచి తప్పుకుంటారనేది పోటీదారులు నిర్ణయిస్తారు. మొదటి రౌండ్లో ఆదిరెడ్డి గెలవగా అతడు తన కెప్టెన్సీ కంటెండర్‌షిప్ కోసం లక్ష రూపాయలు వాడతానన్నాడు. ఇక ఇంటిసభ్యులు పోటీలో నుంచి ఎవరిని తప్పిద్దామని చర్చలు మొదలుపెట్టారు. శ్రీహాన్.. రోహిత్ కెప్టెన్‌గా ఇంటిని చూసుకోగలడన్న నమ్మకం లేదన్నాడు. దీనికి రోహిత్ ఆన్సరిస్తూ.. నువ్వు నన్ను కాంపిటీషన్‌గా చూస్తున్నావేమో, అందుకే పక్కన పెడుతున్నావని కౌంటరిచ్చాడు. దీనికి శ్రీహాన్.. అసలు నువ్వు నాకు కాంపిటీషనే కాదని బిల్డప్ ఇవ్వడం గమనార్హం. ఇక కీర్తి.. శ్రీసత్య, శ్రీహాన్ పేరు చెప్పడంతో శ్రీహాన్ వెటకారం మొదలుపెట్టాడు. అలా వీళ్లిద్దరూ మళ్లీ గొడవపడ్డారు. చివరగా రోహిత్, ఫైమాలను నిల్చోబెట్టగా వీళ్లలో రోహిత్‌కు ఛాన్స్ ఇచ్చి ఫైమాను తొలగించాడు ఆదిరెడ్డి. రెండోసారి రేవంత్ గెలిచి కెప్టెన్సీ కంటెండర్‌గా నిలిచాడు. ఈ రౌండ్లో ప్రైజ్‌మనీలో నుంచి రూ.25 వేలు తగ్గించాడు బిగ్‌బాస్. హౌస్మేట్స్ ఏకాభిప్రాయంతో శ్రీహాన్, రాజ్‌లను ఎన్నుకున్నారు. కెప్టెన్సీ కంటెండర్లయిన రేవంత్, ఆది.. శ్రీహాన్‌ను గేమ్‌లో ఉంచాలనుకుని రాజ్‌ను సైడ్ చేశారు. మూడో రౌండ్లో రోహిత్ గెలిచి కెప్టెన్సీ కంటెండర్‌గా నిలిచాడు. ఇందుకుగానూ రూ.45,000 కట్ చేశాడు. హౌస్మేట్స్ ఏకాభిప్రాయంతో శ్రీహాన్, శ్రీసత్యలను నిలబెట్టగా కెప్టెన్సీ కంటెండర్లు శ్రీహాన్‌ను గేమ్‌లో కంటిన్యూ చేయనున్నట్లు ప్రకటించారు. నాలుగో రౌండ్లో శ్రీహాన్ గెలిచి కెప్టెన్సీ కంటెండర్‌గా నిలవగా ఇందుకోసం రూ.30,000 కోత పెట్టాడు బిగ్‌బాస్. కంటెండర్లు మెరీనాను ఆటలో కంటిన్యూ చేసి కీర్తిని సైడ్ చేశారు. ఐదో రౌండ్లో కంటెండర్‌షిప్ కోసం పోటీపడేందుకు రూ.70 వేలు పెట్టాడు బిగ్‌బాస్. ఈసారి ఇనయ ముందుగా ట్రక్ ఎక్కి కంటెండర్‌గా నిలిచింది. మొత్తానికి కెప్టెన్సీ కంటెండర్ టాస్క్ ద్వారా రూ.3 లక్షలు కోత పెట్టడంతో ప్రైజ్‌మనీ రూ. 41,00,300 చేరింది. తర్వాత శ్రీహాన్, శ్రీసత్య, రేవంత్ సరదాగా మాట్లాడుకున్నారు. శ్రీహాన్, శ్రీసత్య మాట్లాడుకున్నప్పుడు నేను ఆటలో అరటిపండు అయ్యాననే టైంలో రాజ్ క్లోజ్ అయ్యాడన్నాడు రేవంత్. ఆ మాటతో మండిపడ్డ శ్రీహాన్.. మేము మాట్లాడుకునేటప్పుడు నిన్ను రావద్దని అనలేదు కదా? అని ప్రశ్నించాడు. నేనేదో చాలా సాధారణంగా అన్నానని రేవంత్ అన్నా సరే శ్రీహాన్ వినిపించుకోలేదు. మేమిద్దరం కలిసి నిన్ను ఏదో చేస్తున్నామన్నట్లుగా చెప్తున్నావని సీరియస్ అయ్యాడు. అటు శ్రీసత్య కూడా మధ్యలో అందుకుంటూ.. ఇప్పుడేంటి, నేను శ్రీహాన్‌తో ఎక్కువగా మాట్లాడొద్దు, అంతే కదా అని సూటిగా అడిగేసింది. చిన్నమాటను ఎక్కడికో తీసుకువెళ్తున్నారని భావించిన రేవంత్ గొడవ చేయడం ఎందుకని సైలెంట్‌గా అక్కడి నుంచి వెళ్లిపోయాడు. ఇక ఈ వారం రోహిత్, ఆదిరెడ్డి, రేవంత్, శ్రీహాన్, ఇనయ కెప్టెన్సీ కంటెండర్లుగా నిలిచారు. వీరిలో రేవంత్ కెప్టెన్‌గా అవతరించినట్లు తెలుస్తోంది! చదవండి: కాంతార హీరోకు గోల్డెన్ గిఫ్ట్ ఇచ్చిన రజనీకాంత్ ఓటీటీలో ప్రిన్స్, ఎప్పటినుంచి స్ట్రీమింగ్ అంటే? -
మూడు రోజులు ఫ్యామిలీ అంతా తిండి లేక పస్తులున్నాం: శ్రీసత్య
బిగ్‌బాస్ సీజన్ 6ను రసవత్తరంగా మార్చడంలో కంటెస్టెంట్లు సఫలం కాలేదని వారి మీద కక్ష గట్టినట్టున్నాడు బిగ్‌బాస్. విన్నర్ క్వాలిటీస్ ఏ ఒక్కరికీ సరిగా లేవనుకున్నాడో, లేదా వారికి రూ.50 లక్షలు అనవసరం అనుకున్నాడో ఏమో కానీ ప్రైజ్‌మనీలో నుంచి కోత పెట్టడం మొదలు పెట్టాడు. సండే రోజు నాగార్జున విజేత రూ.50 లక్షలు గెలుచుకుంటాడని ప్రకటించాడు. అంతలోనే అనేక ట్విస్టుల మధ్య ఈ ప్రైజ్‌మనీ రూ. 44,00,300కు పడిపోయింది. ఈ ఊచకోత ఇంకా జరిగేట్లు కనిపిస్తోంది. ఇకపోతే ఇంటిసభ్యులకు డబ్బెందుకు అవసరం? వారు డబ్బు వల్ల ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొన్నారు? వారికి ప్రైజ్‌మనీ ఎందుకు అవసరం? అనేది చెప్పాలన్నాడు. మొదటగా ఫైమా మాట్లాడుతూ.. 'మా అమ్మకు మేము నలుగురం ఆడపిల్లలం.. చిన్నప్పటినుంచి చాలా కష్టాలు పడ్డాం. రోజూ పొలం పనికి వెళ్లి ఆ డబ్బుతో నిత్యావసరాలు తెచ్చుకునేవాళ్లం. ఊర్లో ఎన్నో కిరాయి ఇళ్లు తిరిగాం, ఎన్నో అవమానాలు పడ్డాం. ఒకసారైతే మాకంటే వేరేవాళ్ల అద్దె ఎక్కువ ఇస్తామన్నారని మమ్మల్ని ఇల్లు ఖాళీ చేయమన్నారు. కానీ ఎంత తిరిగినా ఉండటానికి ఇల్లు దొరకలేదు. మా అమ్మకు మంచి ఇల్లు కట్టివ్వాలన్నదే నా కోరిక' అని చెప్పింది. ఆదిరెడ్డి వంతు రాగా.. 'మా నాన్న సరిగా పనిచేయకపోవడం వల్ల అమ్మ ఎన్నో కష్టాలు పడింది. ఆమె తొమ్మిది నెలల గర్భవతిగా ఉన్నప్పుడు కూడా నెత్తిన గడ్డిమోపు వేసుకుని పని చేసేది. నాకిప్పుడు పెద్దగా ప్రాబ్లమ్స్ లేవు. కానీ మా ఆవిడకు ఇల్లంటే ఇష్టం. బిగ్‌బాస్ ప్రైజ్‌మనీతో సొంతిల్లు కొనాలన్నదే నా డ్రీమ్' అన్నాడు. శ్రీసత్య మాట్లాడుతూ.. 'అదృష్టమో దురదృష్టమో తెలియదు కానీ నాన్న చిన్నప్పటి నుంచి నాకు ఏ లోటూ తెలియకుండా పెంచారు. కష్టమనేదే లేకుండా చూసుకున్నారు. కానీ ఒకానొక సమయంలో ఫ్యామిలీలో హెల్త్ ఇష్యూస్ మొదలయ్యాయి. నా జీవితంలో మొట్టమొదటిసారి మా కుటుంబమంతా మూడు రోజులు తిండి లేక పస్తులున్నాం. డబ్బు లేకపోతే మన ముఖం కూడా ఎవరూ చూడరు. అమ్మకు వైద్యం చేయించేందుకు ఇల్లు కూడా అమ్మేశాం. నేను సంపాదించేదంతా అమ్మ వైద్యానికే అవుతుంది. బిగ్‌బాస్ విన్నింగ్ ప్రైజ్‌మనీతో మా అమ్మ కోలుకునేలా మంచి వైద్యం చేయించడంతో పాటు సొంతిల్లు కొనాలనుంది' అని చెప్పుకొచ్చింది. కీర్తి మాట్లాడుతూ.. నాకు సొంతంగా ఏదీ కొనాలని లేదు. కానీ నాలాంటి అనాధల కోసం ఒక ఆశ్రమం పెట్టాలని ఉందని చెప్పింది. చదవండి: ప్రైజ్‌మనీకి గురి పెట్టిన బిగ్‌బాస్ -
నేనే విన్నర్, నా ప్రైజ్‌మనీలో నుంచి డబ్బులు కట్ చేస్తారా?: ఆది
Bigg Boss Telugu 6, Episode 73: నామినేషన్స్‌లో జరిగిన గొడవను పరిష్కరించుకునే ప్రయత్నం చేశారు కీర్తి, సత్య. కానీ గొడవ సద్దుమణగడం కాదు కదా అది మరింత అగ్గి రాజుకుంది. శ్రీసత్య వైఖరితో ఏడ్చేసిన కీర్తి.. శ్రీసత్యకు రెచ్చగొట్టే అలవాటుందని నాకు బిగ్‌బాస్‌కు రాకముందే తెలుసు. తన క్యారెక్టరే అంత అని ఊరుకున్నా.. కానీ ఈరోజు నన్ను ఇమిటేట్ చేసి మాట్లాడటం నచ్చలేదని మిగతా వాళ్ల దగ్గర బాధపడింది. తను చేసింది తప్పని ఫీలైందో మరేంటో కానీ అర్ధరాత్రి శ్రీసత్య.. కీర్తి దగ్గరకు వెళ్లి సారీ చెప్పింది. నెక్స్ట్ డే ఏదో చిన్న విషయంలో శ్రీహాన్‌కు, రేవంత్‌కు మధ్య గొడవైంది. ఈ ఫ్రస్టేషన్లో తన మనసులో ఉన్న కోపాన్నంతా శ్రీసత్య ముందు కక్కేశాడు శ్రీహాన్. 'రేవంత్ నన్ను నామినేట్ చేసి నా తప్పు చెప్పాలనుకున్నాడట.. అలాగైతే వాడిదగ్గర వంద తప్పులు కనిపిస్తున్నాయి. కానీ నేను నా ఫ్రెండ్‌ను బయటకు పంపించి నువ్వు తప్పు చేశావని చెప్పాలనుకోను, పక్కకు పిలిచి అతడి తప్పేంటో చెప్తా. పదిమందిలో వాడిని లోకువ చేయను. కానీ వాడు మాత్రం అందరి ముందు నా తప్పు చెప్పాలనుకున్నాడు' అంటూ రగిలిపోయాడు. అనంతరం బిగ్‌బాస్.. నామినేషన్స్‌లో ఉన్నవారు తమను సేవ్ చేసుకుని ఇమ్యూనిటీ దక్కించుకునేందుకు ఒక అవకాశం ఇచ్చాడు. కానీ ఆ ఇమ్యూనిటీకి ఒక ధర ఉందని, ఆ మొత్తం విన్నర్ ప్రైజ్‌మనీ నుంచి తగ్గిస్తామని చెప్పాడు. నామినేట్ అయిన సభ్యులు చేయాల్సిందల్లా.. వారు ఏ ధరకు ఇమ్యూనిటీని కొనుక్కుంటారో చెక్‌లో రాయాల్సి ఉంటుంది. ఏ సభ్యుడు ఎక్కువ ధర రాస్తాడో వారు సేవ్ అవుతారని ట్విస్ట్ ఇచ్చాడు. అది కూడా లక్ష నుంచి రూ.5 లక్షల మధ్యే రాయాల్సి ఉంటుందన్నాడు. దీంతో శ్రీహాన్ లక్ష రాయగా ఆదిరెడ్డి తానసలు ఇమ్యూనిటీయే కోరుకోవట్లేదని చెప్పాడు. 'ఒక సామాన్యుడిగా అడుగుపెట్టాను. జనాలకు నా ఆట నచ్చి వారి సపోర్ట్‌తో 11 వారాలు హౌస్‌లో ఉన్నాను. ఇలాంటి ఇమ్యూనిటీ కోరుకుని ఇక్కడిదాకా రాలేదు. ఈ సీజన్ గెలుస్తానని నాకు గట్టిగా నమ్మకముంది. అంటే నా ప్రైజ్‌మనీలో నుంచి రూ.5 లక్షలు కట్ అవుతాయన్నమాట! నా దాంట్లో నుంచి కట్ అవుతాయని తెలిసినా ఆ ఇమ్యూనిటీతో ముందుకు వెళ్లాలని లేదు. జనాల ఓట్లతో ముందుకు వెళ్తాను. ఇకపోతే ఇమ్యూనిటీ కోసం ఎక్కువ అమౌంట్ రాసేవారికి ఇంట్లో ఉండే అర్హతే లేదు' అంటూ గాల్లో మేడలు కట్టేశాడు ఆది. అనంతరం అతడు లక్ష రూపాయలు రాశాడు. శ్రీసత్య, కీర్తి, రేవంత్.. రూ.4,99,999, రోహిత్.. రూ.2,51,001, రాజ్.. రూ.4,99,700, మెరీనా, ఇనయ.. రూ.4,99,998 రాశారు. చెక్‌పై రాసే మొత్తాన్ని ఎవరితో షేర్ చేసుకోవద్దని చెప్పినా శ్రీసత్య.. శ్రీహాన్‌తో కోడ్ భాషలో చెప్పిందంటూ ఆమెపై అనర్హత వేటు వేశాడు బిగ్‌బాస్. అలాగే ఒకే అమౌంట్ ఇద్దరూ రాస్తే వారిని రిజెక్ట్ చేశాడు. దీంతో చివరగా రోహిత్, రాజ్ మిగిలారు. వీరిలో రాజ్ రాసిన చెక్ ధర ఎక్కువగా ఉండటంతో అతడు ఇమ్యునిటీ పొందినట్లు ప్రకటించాడు. అతడు రాసిన రూ.4,99,700 విన్నర్ ప్రైజ్‌మనీలో కోత పెట్టగా రూ.45,00,300 మిగిలింది. తర్వాత ఈ ప్రైజ్‌మనీని కాపాడుకోమంటూ సమయానుసారంగా ఛాలెంజ్‌లు ఇస్తానన్నాడు బిగ్‌బాస్. మొదటి ఛాలెంజ్‌లో భాగంగా కేవలం రన్స్ తీస్తూనే సెంచరీ పూర్తి చేయమన్నాడు. ఇందులో రోహిత్, రేవంత్ పాల్గొని 82 పరుగులు తీశారు. సెంచరీ పూర్తి చేయకపోవడంతో బిగ్‌బాస్ మరో లక్ష ప్రైజ్‌మనీ కట్ చేశాడు. దీంతో విన్నర్ ప్రైజ్ మనీ రూ.44,00,300కు వచ్చింది. ఇక ఈ వారం కెప్టెన్ ఫైమా, రాజ్ మినహా మిగతా ఎనిమిది మంది నామినేషన్లో ఉన్నారు. చదవండి: భలే ట్విస్ట్, ప్రైజ్‌మనీ కట్ -
చెత్త రీజన్స్, చెత్త నామినేషన్స్.. కాకపోతే ఓ ట్విస్ట్!
Bigg Boss 6 Telugu, Episode 72: బిగ్‌బాస్ హౌస్‌లో టాప్ 10 కంటెస్టెంట్లు ఉన్నారు. ఇక మీదట గేమ్ మరింత రంజుగా మారనుంది. అసలైన నామినేషన్స్ హీట్ ఇప్పుడు మొదలు కానుంది అనుకుంటే అంతా తలకిందులైంది. ఈరోజు నామినేషన్స్ అసలు నామినేషన్స్లానే లేవు. ఇస్తినమ్మా వాయినం పుచ్చుకుంటినమ్మ వాయినం అన్నట్లుగా నువ్వు నాకు వేశావు, నేను నీకు వేస్తున్నా అన్నట్లుగా ఒకరినొకరు నామినేట్ చేసుకున్నారు. మరి ఎవరు ఎవర్ని నామినేట్ చేశారో తెలియాలంటే ఇది చదివేయండి.. నాకు బాగా క్లోజ్ అయినవారందరూ వెళ్లిపోతున్నారు. గీతూ, బాలాదిత్య ఇద్దరూ వెళ్లిపోయారు, అంటే నేను కూడా వెళ్లిపోతానని హింటిస్తున్నావా బిగ్‌బాస్? అని తనలో తనే మదనపడ్డాడు ఆది రెడ్డి. అనంతరం ఇంట్లో నామినేషన్ ప్రక్రియ మొదలైంది. ఈ ప్రక్రియలో భాగంగా ఇంట్లో ఉండి వ్యర్థం అనుకున్న ఇద్దరు ఇంటిసభ్యులపై చెత్త బుట్ట గుమ్మరించాలన్నాడు బిగ్‌బాస్. ముందుగా ఫైమా.. బూతు మాట్లాడావంటూ రోహిత్‌ను నామినేట్ చేసింది. రోజులు గడిచేకొద్దీ నీ కసి కోపంగా మారుతోంది. గేమ్‌ను పర్సనల్‌గా తీసుకుని కావాలని ఫిజికల్ అవుతున్నావంటూ ఇనయపై చెత్త గుమ్మరించింది. ► ఆదిరెడ్డి.. శ్రీహాన్, రోహిత్ ► ఇనయ.. ఆదిరెడ్డి, రాజ్ ► శ్రీహాన్.. రోహిత్, కీర్తి ► మెరీనా.. రేవంత్, ఇనయ ► రాజ్.. మెరీనా, ఇనయ ► శ్రీసత్య.. ఇనయ, కీర్తి ► రోహిత్.. రేవంత్, ఆదిరెడ్డి ► కీర్తి.. శ్రీసత్య, మెరీనా ► రేవంత్.. రోహిత్, మెరీనాలను నామినేట్ చేశారు. ఈ నామినేషన్స్‌లో కీర్తి- శ్రీసత్యల మధ్య ఇగో ఫైట్ నడిచింది. గేమ్ ఓడిపోయిన కోపంలో బూతులు మాట్లాడాడన్న కారణంతోనే రోహిత్‌కు ఎక్కువ ఓట్లు పడ్డాయి. అటు ఇనయది కూడా అదే పరిస్థితి. ఆవేశంలో నోటి నుంచి బూతులు వచ్చేస్తున్నాయి, కాస్త చూసుకోమని హెచ్చరించారు ఇంటిసభ్యులు. అంతకు మించి పెద్దగా వాదనలేమీ జరగలేదు. ఫైనల్‌గా ఈ వారం కెప్టెన్ ఫైమా మినహా ఇనయ, రోహిత్, మెరీనా, ఆదిరెడ్డి, కీర్తి, శ్రీహాన్, శ్రీసత్య, రేవంత్, రాజ్‌లు నామినేషన్లో ఉన్నారు. కాకపోతే ఓటింగ్ లైన్లు రేపు రాత్రి ఓపెన్ కానున్నాయి. అంటే నామినేషన్స్‌లో నుంచి సేవ్ అయ్యేందుకు హౌస్‌మేట్స్‌కు ఓ సువర్ణావకాశం ఇవ్వనున్నాడు బిగ్‌బాస్. మరి ఈ ఛాన్స్ ఎవరు దక్కించుకుంటారో చూడాలి! చదవండి: బాలాదిత్య, వాసంతిల పారితోషికం ఎంతో తెలుసా? సినిమాలకు బ్రేక్, హీరో షాకింగ్ నిర్ణయం -
వాసంతి ఎలిమినేట్, ఆ ముగ్గురే తన ఫేక్ ఫ్రెండ్స్!
Bigg Boss 6 Telugu, Episode 71: బిగ్‌బాస్ తెలుగు ఆరో సీజన్ 21 మందితో మొదలైంది. పది వారాలు గడిచేసరికి 11 మంది ఎలిమినేట్ అవగా హౌస్‌లో ప్రస్తుతం పది మంది మాత్రమే మిగిలారు. దీంతో బిగ్‌బాస్ షో మరింత రసవత్తరంగా మారనుంది. ఇకపోతే ఈరోజు గ్లామర్ ఆఫ్ ది హౌస్ వాసంతి ఎలిమినేషన్ ఎలా జరిగింది? ఆమె హౌస్ నుంచి బయటకు వచ్చాక ఏం మాట్లాడింది? అనేది తెలియాలంటే నేటి ఎపిసోడ్ హైలైట్స్ చదివేయాల్సిందే! ఎప్పటిలాగే సండే ఫండే అనేమాటకు కట్టుబడి నాగ్ హౌస్‌మేట్స్‌తో గేమ్స్ ఆడించాడు. ఇందుకోసం రేవంత్, ఇనయ, మెరీనా, రాజ్, ఫైమాలను A టీమ్‌గా.. కీర్తి, శ్రీహాన్, రోహిత్, వాసంతి, శ్రీసత్యలను B టీమ్‌గా విడగొట్టాడు నాగ్. మొదట ఆడించిన ఫన్ గేమ్‌లో టీమ్ A (రేవంత్) గెలిచింది. తర్వాత కనుక్కోండి చూద్దాం అనే టాస్క్ ఇచ్చాడు. ఇందులో హౌస్‌మేట్స్‌తో పాటు సెలబ్రిటీల చిన్నప్పటి ఫొటో చూపించి అదెవరో కనుక్కోవాలన్నాడు. తప్పు సమాధానం చెప్పినవారికి చిత్రవిచిత్ర పనిష్మెంట్స్ ఇచ్చాడు. ఈ క్రమంలో రాంగ్ ఆన్సర్లిచ్చిన ఫైమా.. ముగ్గురు కంటెస్టెంట్లు అయిన బాలాదిత్య, రేవంత్, రాజ్‌లను ఇమిటేట్ చేసి నవ్వించింది. తర్వాత వాసంతి గోడకుర్చీ వేసి ఎనిమిదవ ఎక్కం చదివింది. కానీ ఇక్కడ కూడా తప్పు చదివి నవ్వులపాలైంది. ఆ తర్వాత తప్పు జవాబు చెప్పిన ఇనయ, కీర్తి కోడిలా గెంతుతూ పాట పాడారు. రెండో గేమ్‌లో కూడా B టీమ్‌పై A టీమ్ విజయం సాధించింది. దీంతో A టీమ్‌కు గిఫ్ట్ హ్యాంపర్ అందించారు. నాగార్జున నామినేషన్లో ఉన్న ఒక్కొక్కరినీ సేవ్ చేసుకుంటూ రాగా చివరికి వాసంతి, మెరీనా ఇద్దరు మాత్రమే మిగిలారు. వీరిలో వాసంతి ఎలిమినేట్ అయినట్లు ప్రకటించాడు నాగ్. హౌస్‌ను వీడేందుకు మనసొప్పని వాసంతి కన్నీళ్లతో బయటకు వచ్చేసింది. స్టేజీపైకి వచ్చిన వాసంతితో.. 5 ఫేక్ ఫ్రెండ్స్, 5 బెస్ట్ ఫ్రెండ్స్ ఎవరని గేమ్ ఆడించాడు. దీనికి ఆమె ఐదుగురు పేర్లు చెప్పలేనంటూ మెరీనా, ఇనయ, రేవంత్, కీర్తి తన బెస్ట్ ఫ్రెండ్స్ అని చెప్పింది. ఫైమా, ఆదిరెడ్డి, రాజ్ ఫేక్ ఫ్రెండ్స్ అని పేర్కొంది. వాసంతి ఎలిమినేషన్‌తో హౌస్‌లో 10 మంది మాత్రమే మిగిలారు. మీ పది మందిలో ఒకరే విజేత అని, వారికి రూ.50 లక్షల బహుమతి ఉంటుందని ప్రకటించాడు నాగ్. మరి ఈ టాప్ 10 కంటెస్టెంట్ల నెక్స్ట్ గేమ్ ఎలా ఉండనుంది? ఎవరు టాప్ 5కి చేరువవుతారు? ఎవరు విన్నర్‌గా నిలిచి అర కోటి రూపాయలు అందుకుంటారో చూడాలి! చదవండి: పేరెంట్స్ గుండెల మీద తన్నాను, తప్పు తెలిసి అమ్మ కాళ్ల మీద పడ్డా: సూర్య ఎవరు చేసిన పనికి వాళ్లే బాధ్యులు.. గీతూ ఎలిమినేషన్‌పై బాలాదిత్య కామెంట్స్ -
ఫిజికల్ అన్నారంటే తోలు తీసేస్తా: రేవంత్ వార్నింగ్
కెప్టెన్ అవుదామంటే కంటెండర్ కూడా కాలేకపోయానని ఏడ్చేసింది ఇనయ. అటు సత్య కూడా గేమ్‌లో కంటతడి పెట్టుకుంది. మరోవైపు కెప్టెన్సీ పోటీదారులవ్వడానికి బిగ్‌బాస్ నాగమణి అనే టాస్క్ ఇచ్చాడు. ఈ టాస్క్‌లో భాగంగా టీమ్ సభ్యులు వారికిచ్చిన నాగమణులను కాపాడుకోవాల్సి ఉంటుంది. అవతలి టీమ్ వాటిని దక్కించుకునేందుకు ప్రయత్నించాల్సి ఉంటుంది. ఇచ్చిందే ఫిజికల్ గేమ్ కావడంతో కిందామీదా పడి ఎలాగైనా మణులు సాధించేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ క్రమంలో రేవంత్.. ఎవరో గట్టిగా లాగుతున్నారు, ఇంతకింతా ఉంటుంది. మళ్లీ ఎవరైనా నన్ను ఫిజికల్ అన్నారంటే తోలు తీసేస్తా అని హెచ్చరించాడు. అనడమే కాదు తన మణులు లాక్కోడానికి వచ్చినవాళ్లను తోసిపారేశాడు. దీంతో ఫిజికల్ అవొద్దు అని కీర్తి, ఆదిరెడ్డి హెచ్చరించారు. అయినా తగ్గని రేవంత్... నేను ఆపడానికి ట్రై చేస్తుంటే వాళ్లు చేతకాక ఫిజికల్ అంటున్నారని సీరియసయ్యాడు. ఇకపోతే ఈ గేమ్‌లో స్నేక్ టీమ్ గెలిచినట్లు సమాచారం. ఆ టీమ్‌లో శ్రీహాన్ కూడా ఉన్నాడు. కానీ అతడికి ఈవారం కెప్టెన్సీ కంటెండర్ అయ్యే అర్హత లేదని నాగార్జున పనిష్మెంట్ ఇచ్చిన విషయం తెలిసిందే కదా! దీంతో అతడు తన స్థానంలో శ్రీసత్యను సెలక్ట్ చేసినట్లు తెలుస్తోంది. చదవండి: బిగ్‌బాస్ హౌస్‌లో తన్నులాట -
Bigg Boss 6 Telugu: గాయం కారణంగా కన్నీళ్లు పెట్టుకున్న కీర్తి
బిగ్‌బాస్ సీజన్-6లో అనుకోని విధంగా గీతూ ఎలిమినేట్ అయిన సంగతి తెలిసిందే. ఇది హౌస్‌మేట్స్‌కి కూడా షాకింగ్ అనే చెప్పొచ్చు. దీంతో గేమ్‌పై మరింత కసి పెరిగింది. తర్వాత వారం కెప్టెన్సీ పోటీదారుల కోసం బిగ్‌బాస్ పాము-నిచ్చెనల టాస్క్‌ను నిర్వహించారు. ఇందులో ఇంటిసభ్యులు రెండు టీమ్స్‌గా విడిపోవాల్సి ఉంటుంది. సగం మంది పామును, మరికొందరేమో నిచ్చెనను కట్టాల్సి ఉంటుంది. ఆ తర్వాత పాము టీమ్ నుంచి ఒకరు వెళ్లి నిచ్చెనను చిన్నగా చేసి ఆ మట్టిని తమ పాము కోసం ఉపయోగించాల్సి ఉంటుంది. ఈ టాస్కులో కీర్తి బాగా ఎమోషనల్ అయింది. నిచ్చెన టీమ్‌లో రాజ్‌తో పోటీపడుతూ కిందపడిపోయింది. తన చేతికి తగిల గాయం కారణంగా సరిగ్గా గేమ్ ఆడలేకపోతున్నానంటూ కన్నీళ్లు పెట్టుకుంది. మరి ఈ టాస్కులో పామ్ వర్సెస్ నిచ్చెన టీమ్స్‌లో ఎవరు గెలుస్తారన్నది నేటి ఎపిసోడ్లో తేలనుంది. -
ఇనయను మళ్లీ ఓ ఆటాడుకున్న ఆది రెడ్డి, నామినేషన్స్‌లో 9 మంది!
బిగ్‌బాస్ హౌస్ నుంచి గీతూ వెళ్లిపోవాలని చాలామంది బలంగా కోరుకున్నారు. కానీ నిన్నటి ఎపిసోడ్లో మాత్రం గీతూ వెళ్లిపోతుంటే ఎంతోమంది ఎమోషనలయ్యారు. ఆమె బిగ్‌బాస్‌ను వీడలేక వీడుతుంటే భారంగా నిట్టూర్చారు. ఈరోజు గీతూ లేకుండానే నామినేషన్స్ ప్రక్రియ మొదలైంది. ఈ మేరకు తాజాగా ఓ ప్రోమో రిలీజైంది. శ్రీహాన్‌కు, నాకూ బయట ఒక లైఫ్ ఉంది. మా ఇద్దరి గురించి తప్పుగా మాట్లాడటం నచ్చలేదని ఇనయను నామినేట్ చేసింది శ్రీసత్య. పోయినవారం హ్యుమానిటీ గురించి మాట్లాడావు.. అని కీర్తి మాట్లాడటం మొదలు పెట్టిందో లేదో మధ్యలో అందుకున్నాడు శ్రీహాన్. హ్యుమానిటీ గురించి నేను హైలైట్ చేసుకోలేదు, హీరోయిన్లా నువ్వు చెప్పుకున్నావు అని కౌంటరిచ్చాడు. దీనికి కీర్తి.. ఇక్కడ ఎవరూ హీరోయిన్ కాదు, ఎవరూ హీరో కాదు, ఇదే కొంచెం తగ్గించుకోండి అని చురకలంటించింది. కావాలని ఒకరిని కొట్టడం తప్పని రేవంత్.. వాసంతిని నామినేట్ చేశాడు. దీంతో అవాక్కైన వాసంతి.. నువ్వు మనుషులను ఎలా విసిరేస్తున్నావో ఫుటేజీతో సహా అందరం చూశామని ఎద్దేవా చేసింది. అటు ఆదిరెడ్డి.. రేవంత్‌తో పాటు ఇనయను నామినేట్ చేశాడు. బాత్రూమ్లోకి వెళ్లి గడియ పెట్టుకుని ఏడవడం, బిగ్‌బాస్ పిలిస్తేనే బయటకు వస్తాననడం తప్పనిపించలేదా? అని అడిగాడు. దీనికామె అది నాకు, బిగ్‌బాస్‌కు మధ్య విషయం, మధ్యలో మీకెందుకు అని ప్రశ్నించింది. మీ ఇద్దరికీ ఉంటే మీరు బయటకు పోయి మాట్లాడుకోండి అని చిరాకు పడ్డాడు ఆది. అయినా ఇప్పటికీ దాన్ని తప్పుగా ఫీలవకపోవడం నా దురృదృష్టం అని చెప్పుకొచ్చాడు. ఇకపోతే ఈ వారం తొమ్మిది మంది నామినేషన్లో ఉన్నట్లు తెలుస్తోంది. రోహిత్, రాజ్, కెప్టెన్ శ్రీసత్య మినహా మిగిలిన తొమ్మిది మంది.. వాసంతి, రేవంత్, కీర్తి, శ్రీహాన్, ఆదిరెడ్డి, ఇనయ, మెరీనా, బాలాదిత్య, ఫైమా నామినేషన్స్‌లో ఉన్నారట! చదవండి: కంటెంట్ క్వీన్ ఎలిమినేట్ అవడానికి కారణాలివే! నేనిక్కడే ఉంటా బిగ్‌బాస్, ఎక్కడికీ పోను: ఏడ్చిన గీతూ -
ఆ పిల్ల కాళ్లల్లో ఐరన్ రాడ్స్.. మీకది తెలుసా?: ఆరోహి ఫైర్
కొందరు ఎంత కష్టపడ్డా గుర్తింపు రాదు. శ్రమకు తగ్గ ఫలితం అందుకోరు. అయినా సరే వెనుకడుగు వేయకుండా ఫైట్ చేస్తూనే ఉంటారు. గత సీజన్లో పాల్గొన్న మానస్ ఈ కోవకే చెందుతాడు. తోటి కంటెస్టెంట్లకు టఫ్ కాంపిటీషన్ ఇచ్చినా కూడా అతడికి ఎక్కువ హైప్ రాలేదు. ఈ సీజన్లో మానస్ స్నేహితురాలు కీర్తి కూడా అదే జాబితాలో చేరిపోయింది. తన హెల్త్ కండీషన్ పక్కనపెట్టి మరీ అటు ఇంటిపనిలో ఇటు బిగ్‌బాస్ గేమ్‌లో తలమునకలవుతోంది, ఫైటర్‌లా పోరాడుతోంది. అయినా సరే తన కృషి, పట్టుదల ఎవరికీ కనిపించకుండా పోతోంది. పైపెచ్చు అసలు తను గేమే ఆడట్లేదన్న మాటలు పడాల్సి వస్తోంది. దీనిపై ఆరోహి రావు తీవ్రంగా స్పందించింది. 'కీర్తి ఫిజికల్ టాస్కులు ఏం ఆడట్లేదు, ఎందుకు సపోర్ట్ చేస్తున్నారని కొందరు మెసేజ్ చేశారు. వారికి నేనిచ్చే సమాధానం ఏంటంటే.. ఆ పిల్ల రెండు కాళ్లలో ఐరన్ రాడ్స్ ఉన్నాయి. ఈ విషయం మీకు తెలుసో లేదో నాకు తెలీదు. అయినా సరే ఎప్పుడూ ఆ ప్రస్తావన తేకుండా, సింపతీ ట్రై చేయకుండా, డ్రామా చేయకుండా తన బెస్ట్ ఇస్తోంది. రోడ్డు ప్రమాదంలో గాయపడ్డ గుర్తుల తాలూకు పెద్ద పెద్ద మచ్చలు తన చేతులకు, కాళ్లకు ఇప్పటికీ ఉన్నాయి. అవి శరీరం మీదే కాదు మనసులో కూడా ఉన్నాయి. మచ్చ కదా అంత జల్ది పోదు. అన్నీ మంచిగున్న మనమే అలసిపోతున్నం. అలాంటిది అది లోపల ఫైట్ చేస్తోంది. ఎప్పటికీ నేను కీర్తినే సపోర్ట్ చేస్తాను' అని రాసుకొచ్చింది. ఇది చూసిన నెటిజన్లు కీర్తి ధైర్యానికి హ్యాట్సాఫ్ చెప్తున్నారు. View this post on Instagram A post shared by Keerthi Keshav Bhat (@keerthibhatofficial) చదవండి: నీ భార్యతో లింకు పెట్టకు, పరువు నష్టం దావా వేస్తా: బిగ్‌బాస్ కంటెస్టెంట్ గీతక్కా, నిన్ను ఏడిపించకపోతే చూడు: ఆది మాస్ వార్నింగ్ -
ఇనయ నాటకాలు ఆడుతోంది, నేనేంటో చూపిస్తా: శ్రీహాన్
Bigg Boss 6 Telugu, Episode 54: మొత్తానికి గీతూ అనుకుంది సాధించింది. బాలాదిత్య- మెరీనా గేమ్‌లో ఉండటానికి వీల్లేదని డిసైడ్ అయిన గీతూ అన్నంత పని చేసింది. చేపల చెరువు టాస్క్‌లో సంచాలకురాలిగా వ్యవహరించిన గీతూ బాలాదిత్య జంటను గేమ్ నుంచి సైడ్ చేసింది. అత్యధిక చేపలున్న శ్రీహాన్- శ్రీసత్య ఇద్దరూ కెప్టెన్సీ కంటెండర్లుగా ఎన్నికయ్యారని బిగ్‌బాస్ ప్రకటించాడు. మరి వీరితోపాటు కెప్టెన్సీ బరిలో ఎవరెవరు దిగారు? ఈ రోజు ఎపిసోడ్ హైలైట్స్ ఏంటో చదివేద్దాం.. గీతూ మహిమ వల్ల శ్రీహాన్-శ్రీసత్య కెప్టెన్సీ పోటీదారులుగా నిలిచారు. మిగిలిన నాలుగు జంటలు.. చర్చించుకుని ఒక్కో జంట నుంచి ఒక్కొక్కరి చొప్పున కెప్టెన్సీ పోటీదారుల పేర్లు వెల్లడించమన్నాడు బిగ్‌బాస్. దీంతో రేవంత్- ఇనయ జోడీ నుంచి రేవంత్, సూర్య- వాసంతి జంట నుంచి సూర్య, రోహిత్- కీర్తి జంట నుంచి కీర్తి, ఫైమా- రాజ్ జోడీ నుంచి ఫైమా కంటెండర్లుగా నిలబడ్డారు. కెప్టెన్సీ కోసం పోటీపడలేనందుకు ఇనయ వాష్‌రూమ్ ఏరియాలో సూర్యను పట్టుకుని తెగ ఏడ్చేసింది. కెప్టెన్సీకి ఒక్క అడుగు దగ్గరవడానికి చిక్కుల్లో కెప్టెన్సీ అనే టాస్క్ పూర్తి చేయాలన్నాడు బిగ్‌బాస్. ఈ గేమ్‌లో అందరికంటే త్వరగా చిక్కుముడులు విప్పి కీర్తి, సూర్య, శ్రీహాన్ కెప్టెన్సీ కోసం పోటీపడ్డారు. అయితే హౌస్మేట్స్ ఎవరిని కెప్టెన్‌గా చూడాలనుకోవట్లేదో వారికి కత్తిపోట్లు గుచ్చాలన్నాడు బిగ్‌బాస్. రాజ్, రోహిత్, రేవంత్.. సూర్యకు, బాలాదిత్య, గీతూ.. కీర్తికి కత్తిపోట్లు గుచ్చారు. ఇనయ.. శ్రీహాన్‌కు కత్తి గుచ్చింది. దీంతో హర్టయిన శ్రీహాన్.. ఇదంతా ప్రోమోకట్, కంటెంట్ కోసమేనన్నాడు. 'నెక్స్ట్ వీక్ ఎవరైనా నీది- సూర్యది బాండింగ్ మిస్ అవుతున్నామంటే వెంటనే వెళ్లి అతడితో కలిసిపోయినా ఆశ్చర్యపడనక్కర్లేదు. ప్రతిసారి సరదాగా తీసుకుంటాను అనుకుంటుందేమో! కరెక్ట్ సమయం వచ్చినప్పుడు చెప్తా. అన్ని నాటకాలు ఆడుతోంది. ఎందుకీ యాక్టింగ్. స్టేబులిటీ లేదని నన్నంది. ఆమె వారానికోసారి రంగు మారుస్తోంది. నాకు నమ్మకద్రోహం చేసింది. నాకు కత్తి గుచ్చినందుకు బాధపడేలా చేస్తా' అని రగిలిపోయాడు శ్రీహాన్. మిగిలినవాళ్లు శ్రీహాన్‌కు సపోర్ట్ చేయడంతో అతడు కెప్టెన్ అయ్యాడు. ఆ విశేషాలు రేపటి ఎపిసోడ్లో చూద్దాం.. చదవండి: బన్నీ భార్య స్నేహారెడ్డి చీర ఖరీదెంతో తెలుసా? అప్పుడే విషం చిమ్మి అంతలోనే కలిసిపోయిన బావామరదళ్లు -
లవ్ ట్రాక్ ఎత్తేసిన సునయ, ఇప్పుడు కొత్త డ్రామా!
Bigg Boss 6 Telugu, Episode 44: 'సునయ' లవ్ ట్రాక్ ప్రేక్షకులకు రోత పుడుతుందని అర్థమైనట్లుంది. అందుకే ఇకపై కలిసి ఉండటం కన్నా గొడవలు పెట్టుకోవడం బెటర్ అని ఇనయ, సూర్య డిసైడ్ అయ్యాడు. అనుకున్న ప్లాన్ ప్రకారం అందరిముందు దెబ్బలాడుకున్నారు. అటు సూర్య మాత్రం.. నాకు ఎక్కువ అటెన్షన్ ఇవ్వడం వల్ల ఇనయ గేమ్ దెబ్బతినడం నచ్చట్లేదు. ఆమె గేమ్‌ను నేనే మారుస్తా. మా ఇద్దరి మధ్య నిజంగానే డిష్యుం డిష్యుం జరిగేలా చేస్తా. కానీ ఇనయ అంటే నాకిష్టం. ఇండిపెండెంట్ ఉమెన్ను నేను ఇష్టపడతా అంటూ కెమెరాలతో మనసులో మాట పంచుకున్నాడు సూర్య. అటు గీతూ.. ఇండస్ట్రీలో ఒక్కరంటే ఒక్కరు కూడా తనను ఫ్లర్ట్ చేయలేదని చెప్పింది. ఎందుకక్కా? అని రేవంత్ అడగ్గా బహుశా అందంగా లేనేమోనని బదులిచ్చింది. దానికి ఆది రెడ్డి కంపను తెచ్చుకుని అతికించుకోవడం ఎందుకులే అని ఊరుకున్నారులేనని దిమ్మతిరిగే పంచ్ ఇచ్చాడు. కాసేపటికే బిగ్‌బాస్ ఇంట్లో నామినేషన్ ప్రక్రియ మొదలైంది. ఫైమా.. వాసంతి, బాలాదిత్యను; రోహిత్.. రేవంత్, శ్రీహాన్‌ను; శ్రీసత్య.. బాలాదిత్య, రేవంత్‌ను; బాలాదిత్య.. రేవంత్, ఫైమాను, ఆది రెడ్డి.. అర్జున్, వాసంతిని; మెరీనా.. రేవంత్; ఆది రెడ్డిని; గీతూ.. వాసంతి, బాలాదిత్యను; రాజ్.. బాలాదిత్య, వాసంతిని; ఇనయ.. బాలాదిత్య, శ్రీహాన్‌ను; అర్జున్.. బాలాదిత్య, ఆది రెడ్డిని; వాసంతి.. రాజ్, రేవంతిని; కీర్తి.. బాలాదిత్య, శ్రీహాన్‌ను; రేవంత్.. మెరీనా, శ్రీసత్యను; సూర్య.. బాలాదిత్య, రేవంత్‌ను నామినేట్ చేశారు. శ్రీహాన్.. డ్రామా క్వీన్ అంటూ ఇనయను నామినేట్ చేశాడు. 23 ఏళ్లుగా స్ట్రాంగ్ అని చెప్పే కీర్తి ఇంట్లో ప్రతిదానికి ఏడుస్తుంది, అంటే ఆమె వీక్ కంటెస్టెంట్ అని చెప్తూ కీర్తిని నామినేట్ చేశాడు. ఇక ఈ ప్రక్రియలో తాను నామినేషన్‌కు భయపడుతున్నానని ఆదిరెడ్డి, రాజ్ అనడంతో వాసంతి చిర్రెత్తిపోయింది. నామినేషన్స్‌కు ఇక్కడ ఎవరూ భయపడట్లేదా? నేనొక్కదాన్నే భయపడుతున్నానా? ఏమైనా అంటే ఇదే కారణం వెతుక్కుంటారని చిటపటలాడింది. తనకు నామినేషన్స్ నథింగ్ అని, హెయిర్ తన జీవితం అయినా అయినా దాన్ని కట్ చేసుకున్నా అని చెప్పుకొచ్చింది. మొత్తంగా ఈ ఏడోవారం రోహిత్, వాసంతి, ఆదిత్య, రేవంత్, శ్రీహాన్, ఆదిరెడ్డి, ఇనయ, అర్జున్, కీర్తి, శ్రీసత్య, మెరీనా, రాజ్, ఫైమా నామినేట్ అయినట్లు ప్రకటించాడు బిగ్‌బాస్. చదవండి: అది ఫేవరెటిజమా?: యాంకర్‌నే నిలదీసిన సుదీప ఆ బిగ్‌బాస్ కంటెస్టెంట్ ఒంటరిగా రమ్మన్నాడు -
బిగ్‌బాస్: నాగార్జుననే నిలదీసిన కీర్తి.. షాకిచ్చిన ఆడియన్స్!
బిగ్‌బాస్ హౌస్‌లో వీకెండ్ వస్తే సందడి నెలకొంటుంది. హోస్ట్ నాగార్జున వచ్చి హౌస్‌మేట్స్‌తో ఆటలు ఆడించడంతో పాటు వారంలో వారి చేసిన తప్పొప్పులు ఏంటో చెబుతాడు. నాగ్ ఏం చెప్పిన హౌస్మేట్స్ వింటారు. సూచించిన సలహాలను పాటిస్తూ ఆటను మెరుగు పరుచుకుంటారు. కొన్నిసార్లు తప్పులేకున్నానా నాగార్జున ఫైర్ అయితే బాధ పడ్డారే తప్ప తిరిగి ప్రశ్నించిన కంటెస్టెంట్స్ ఎవరూ లేరు. కానీ తొలిసారి బిగ్‌బాస్ 6లో ఓ కంటెస్టెంట్స్ నాగార్జునను నిలదీసింది. ఇంట్లో టాస్క్‌లు బాగా ఆడుతున్నప్పటికీ తనకు ఎందుకు యావరేజ్ రేటింగ్ ఇచ్చారని ప్రశ్నించింది. ఆ కంటెస్టెంట్స్ ఎవరో కాదు కీర్తి భట్. (చదవండి: మా వాడికి ఫెవిస్టిక్లా అతుక్కుపోయింది..ఇనయాపై సూర్య గర్ల్‌ఫ్రెండ్ ఫైర్) శనివారం నాటి ఎపిసోడ్లో నాగార్జున హౌస్మేట్స్ ఆటతీరుకి రేటింగ్ ఇచ్చాడు. ఆట తీరును బట్టి ప్రతీ కంటెస్టెంట్‌కి ‘గుడ్, యావరేజ్ మరియు డెడ్’ రేటింగ్ ఇచ్చాడు. ఇందులో భాగంగా కీర్తికి ‘యావరేజ్’ రేటింగ్ వేశాడు నాగ్. దీంతో కీర్తి చాలా ఫీలైంది. వెంటనే లేచి ‘సార్.. ఏం అనుకోనంటే మిమ్మల్ని ఒకటి అడగొచ్చా?’అని అనడంతో నాగార్జున ‘ఏంటో చెప్పమ్మ పర్లేదు’ అన్నాడు. అప్పుడు కీర్తి మాట్లాడుతూ.. సార్..ఈ వారం నేను అన్ని టాస్కులను బాగా ఆడాను..ఆ బాల్ టాస్క్ లో అయితే ఫైమా కంటే నేనే బాగా ఆడాను..ఆమెకి ఏమో గుడ్ అని ఇచ్చారు..నాకు ఏమో బ్యాడ్ అని ఇచ్చారు..ఎందుకు సార్? నేను ఇంటి పనులు చేస్తున్నాను..టాస్కులు ఆడుతున్నాను..అందరితో కలిసిపోయి బాగున్నాను..నాలో ఏమి లోపం ఉందొ చెప్తే నేనే సరి చేసుకుంటాను’ అని కీర్తి అడిగింది. కీర్తి ప్రశ్నకు నాగార్జున తనదైన శైలీలో సమాధానం ఇచ్చాడు. ‘ నువ్వు ఆ బాల్ టాస్కు గురించే మాట్లాడుతున్నావ్.. వారం మొత్తం టాస్కు ఒక్కటే ఆడవా ?. ఫైమా కంటే బాగా ఆడాను అని నువ్వు అంటున్నావు..ఇదే విషయం ని ఆడియన్స్‌ని అడుగుతాను..వాళ్ళు ఏమి చెప్తారో చూద్దాం’ అని ఆడియన్స్ ఒపీనియర్ అడిగాడు. వాళ్లంతా ముక్తకంఠంతో ‘నో’అని సమాధానం ఇచ్చారు. అప్పుడు నాగార్జున..‘చూశావా.. ఆడియన్స్ ఏమి అన్నారో..పోనీ నేను నీకు ఒక నిమిషం సమయం ఇస్తున్నాను..ఆడియన్స్ తో నువ్వు మాట్లాడి వాళ్ళు చెప్పిన ఒపీనియన్ ని తప్పు అని నిరూపించగలవా’ అని అడగగా..అప్పుడు కీర్తి మాట్లాడుతూ ‘ఆడియన్స్ అంతా చూస్తున్నారు కదా సార్’ అనగా.. ‘చూస్తున్నారు కాబట్టే అలా చెప్పారు..నీకు చాలా క్యాలిబర్ ఉంది..నీ నుంచి వాళ్ళు ఇంకా ఎక్కువ కోరుకుంటున్నారు. .అది ఇవ్వడానికి ట్రై చెయ్..నీలో ఆ ఫైర్ ని పెంచడానికే ఇదంతా చెబుతున్నాను’అని నాగ్ అన్నారు. అప్పుడు కీర్తి ‘ఓకే సార్... వచ్చే వీక్ మరింత బాగా ఆడతాను’ అంటూ కూర్చుంది. మొత్తానికి నాగ్ని ఎదురించిన కీర్తికి ఆడియన్స్ పెద్ద షాకే ఇచ్చారు. -
తన గొయ్యి తనే తీసుకున్న రోహిత్, తప్పించుకున్న వాసంతి!
బిగ్‌బాస్ షో మొదలై 50 రోజులైనా కాలేదు, అప్పుడే కంటెస్టెంట్లను సర్ప్రైజ్లతో ముంచెత్తుతున్నాడు బిగ్‌బాస్. బ్యాటరీ రీచార్జ్ టాస్క్ ద్వారా హౌస్‌మేట్స్‌కు వారి ఇంటిసభ్యుల నుంచి ఆడియో కాల్, వీడియో మెసేజ్, ఫొటో ఫ్రేమ్, బిర్యానీ.. ఇలా తమకు నచ్చిన ఆప్షన్లను సెలక్ట్ చేసుకునే అవకాశం కల్పించాడు. అయితే ఇందుకోసం ఇంటిసభ్యుల నుంచి కొన్ని త్యాగాలను ఆశిస్తున్నాడు. ఈ క్రమంలో బాలాదిత్య సిగరెట్లు మానేయగా ఫైమా అతి కష్టం మీద ఇంగ్లీష్‌లో సినిమా కథలను వివరించింది. తాజాగా బిగ్‌బాస్ వీటన్నిటికంటే క్లిష్టమైన త్యాగాన్ని కోరినట్లు తెలుస్తోంది. వాసంతి, రోహిత్‌లలో ఎవరైనా ఒకరు రెండు వారాలపాటు స్వతాహాగా నామినేట్ కావాలని ఆదేశించాడు. దీంతో రోహిత్ తాను నామినేట్ అవడానికి సిద్ధమని వెల్లడించాడు. ఇక్కడ బిగ్‌బాస్.. కంటెంట్ ఇవ్వని రోహిత్, వాసంతిలలో ఒకరిని బయటకు పంపించేందుకే వారిద్దరి పేర్లను ప్రస్తావించినట్లు తెలుస్తోంది. వారిద్దరూ గేమ్ ఆడట్లేదు, ఎంటర్టైన్ కూడా చేయట్లేదు.. ఇప్పుడు రోహిత్ సెల్ఫ్ నామినేట్ కావడంతో అతడు త్వరలోనే ఎలిమినేట్ అవడం ఖాయంగా కనిపిస్తోంది. ఇకపోతే తాజాగా రిలీజైన ప్రోమోలో రేవంత్‌కు ఫొటో ఫ్రేమ్, కీర్తికి మానస్ ఆడియో మెసేజ్, ఫైమాకు వీడియో కాల్ వచ్చినట్లు చూపించారు. మరి ఈ సర్ప్రైజ్లతో బూస్ట్ అందుకున్న హౌస్మేట్స్ ఇకనైనా గేమ్‌లో తమ ప్రతాపం చూపిస్తారా? లేదా? అనేది చూడాలి! చదవండి: విన్నర్ అయిపోతానన్న గీతూ, అంతొద్దు.. కేవలం టాప్ 5లోనే ఉంటావన్న తండ్రి -
ఇనయకు తెలిస్తే శ్రీసత్యను చెప్పుతో కొట్టడం ఖాయం.. కీర్తి
Bigg Boss Telugu 6, Episode 38: బిగ్‌బాస్ షో ఆరో వారంలోకి ఎంట్రీ ఇచ్చింది. ఈ సందర్భంగా కంటెస్టెంట్ల కోసం బిగ్‌బాస్ కొన్ని సర్ప్రైజ్లు ప్లాన్ చేశాడు. ఆడియో కాల్, వీడియో కాల్, ఇంటి నుంచి ఫుడ్ అంటూ వారిని సర్ప్రైజ్ చేశాడు. అయితే ఇక్కడే ఏదో మెలిక కూడా పెట్టాడు. మరి ఆ సర్ప్రైజ్లు ఎవరెవరికి దక్కాయో తెలియాలంటే నేటి ఎపిసోడ్ హైలైట్స్ చదివేయాల్సిందే! నామినేషన్స్ ముగిసినా దాన్నుంచి బయటపడలేకపోయింది కీర్తి. 'ఇనయను నీ ఎంకమ్మ అనడం పెద్ద బూతు అని శ్రీసత్య అందరి ముందు నొక్కి చెప్పింది. కానీ అదే శ్రీసత్య ఇనయను ఘోరమైన బూతులు అంది. అదేంటో చెప్తే ఇనయ ఆమెను చెప్పు తీసుకుని కొట్టడం ఖాయం. ఆమె ఏమందో చెప్తే హౌస్ అల్లకల్లోలం అయిపోతుంది' అని ఫైమాతో చెప్పుకొచ్చింది కీర్తి. మరుసటి రోజు బిగ్‌బాస్ ఇంటిసభ్యులకు బ్యాటరీ రీచార్జ్ టాస్క్ ఇచ్చాడు. అందులో భాగంగా గార్డెన్ ఏరియాలో 100% చార్జ్ ఉన్న బ్యాటరీని ఏర్పాటు చేశారు. ఈ వారం హౌస్మేట్స్ కోసం బిగ్‌బాస్ కొన్ని సర్ప్రైజ్లను ప్లాన్ చేశాడు. అయితే ఇంటిసభ్యులు ఎంచుకునే ప్రతి సర్ప్రైజ్కు బదులుగా బ్యాటరీలోని కొంత చార్జ్ తగ్గిపోతుంది. అంతేకాక ఇంటి నియమాలను ఉల్లంఘిస్తే కూడా చార్జ్ తగ్గిపోతుందని చెప్పాడు బిగ్‌బాస్. ముందుగా శ్రీహాన్‌ను పిలిచి నాన్నతో వీడియో కాల్ మాట్లాడటానికి 58%, సిరితో ఆడియో కాల్‌కు 30%, ఇంటి నుంచి మటన్ బిర్యానీ కావాలంటే 15% బ్యాటరీ ఉపయోగించాలని బిగ్‌బాస్ తెలిపాడు. మొదట ఇవేవీ తనకు వద్దనుకున్నాడు, కానీ బిగ్‌బాస్ ఏదో ఒకటి ఎంపిక చేసుకోవాల్సిందేనని హెచ్చరించడంతో మటన్ బిర్యానీ కావాలని చెప్పాడు. తర్వాత సుదీపను పిలిచి నీ భర్తతో మాట్లాడతావా? టీషర్ట్ కావాలా? మీ అమ్మ చేసిన చికెన్ కర్రీ కావాలా? అని అడిగాడు. అందుకామె కన్నీరుమున్నీరుగా విలపిస్తూ ఉన్నదాంట్లో తక్కువ బ్యాటరీ ఉన్న ఆడియో కాల్(30%)ను ఎంచుకుంది. దీంతో ఆమె తన భర్త రంగనాథ్‌తో తనివితీరా మాట్లాడింది. అటు శ్రీహాన్ తన మటన్ బిర్యానీని గీతూతో షేర్ చేసుకున్నాడు. రేవంత్ పడుకోవడంతో 5% , గీతూ సరిగా మైక్ ధరించకపోవడంతో మరో 5% తగ్గిపోయింది. తర్వాత ఆదిరెడ్డి అందరి గురించి ఆలోచించను, ఇప్పుడు తనకు ఫ్యామిలీనే ముఖ్యం అనుకున్నాడు. ఎక్కువ బ్యాటరీ కట్ అయ్యే ఫ్యామిలీతో వీడియో కాల్(40%)ఆప్షన్‌ను సెలక్ట్ చేసుకున్నాడు. దీంతో అతడు తన భార్యాకూతురితో వీడియో కాల్ మాట్లాడగా... ఈ సంతోషంతో ఆదిరెడ్డికి రాత్రి నిద్ర కూడా పట్టినట్లు లేదు. చదవండి: వాళ్లు బిగ్‌బాస్ హౌస్‌లో ఎందుకుంటున్నారో తెలీట్లేదు స్టేజ్‌పై ఏడ్చేసిన త్రివిక్రమ్ శ్రీనివాస్ -
నీవల్లే చంటి వెళ్లిపోయాడు.. నామినేషన్లో ఒకటే గుద్దుడు!
Bigg Boss 6 Telugu, Episode 37: మండే వచ్చిందంటే చాలు బయట వాతావరణం కూల్‌గా ఉన్నా బిగ్‌బాస్ హౌస్‌లో మాత్రం హీట్ ఓ రేంజ్లో ఉంటుంది. వారంలో ఎన్నడూ నోరు మెదపని కంటెస్టెంట్ కూడా నామినేషన్స్‌లో గొంతు విప్పాల్సిందే! అవసరమైతే పోట్లాటకు, కుదిరితే కొట్లాటకు సైతం రెడీగా ఉండాల్సిందే! ఆ లెవల్లో ఉంటాయి బిగ్‌బాస్ నామినేషన్స్. మరి ఈ ఆరోవారం నామినేషన్స్ ఎలా జరిగాయి? ఎవరు ఎవర్ని నామినేట్ చేశారో తెలియాలంటే ఈ హైలైట్స్ చదివేయండి. మొన్నటిదాకా శ్రీసత్య- అర్జున్, సూర్య-ఆరోహిలను జంటలుగా చూపించారు. అయితే శ్రీసత్య తనకు ఇంట్రస్ట్ లేదని, ఎంత ట్రై చసినా వేస్ట్ అని చెప్పేయడంతో వారి ప్రేమ కహానీ అక్కడే ఆగిపోయింది. అటు ఆరోహి ఎలిమినేట్ అవడంతో ఇనయ వెంటపడ్డాడు సూర్య. ప్రస్తుతానికి హౌస్‌లో వీరేదో ప్రేమపక్షులు అన్నంత రేంజ్లో పర్ఫామెన్స్ ఇస్తున్నారు. ఇదిలా పక్కన పెడితే ఆటకు కాకుండా అందానికే ఎక్కువ ప్రాముఖ్యతనిచ్చే వాసంతి అంటే రేవంత్‌కు ఇంట్రస్ట్ ఉందంటూ ఆదిరెడ్డి చెవులు కొరికింది గీతూ. దీనికి అర్జున్ కూడా అవునంటూ వంత పాడాడు. అతడు వేరేవాళ్లను లింక్ చేస్తే జోక్.. మనం చేస్తే మాత్రం సీరియస్ అవుతాడని చిటపటలాడాడు. తర్వాత బిగ్‌బాస్.. ఇద్దరు ఇంటిసభ్యుల ముఖంపై ఫోమ్ పూసి నామినేషన్ ప్రక్రియను ప్రారంభించాలని ఆదేశించాడు. మొదటగా కెప్టెన్ రేవంత్.. బాలాదిత్య, సుదీపలను నామినేట్ చేశాడు. ఆదిరెడ్డి మాట్లాడుతూ.. హౌస్‌లో గేమ్ ఆడుతూ ఉండాలే తప్ప మంచితనంతో ఉండొద్దంటూ మెరీనాను నామినేట్ చేశాడు. ఓవర్ థింకింగ్ అంటూ కీర్తికి ఫోమ్ పూశాడు. మెరీనా నామినేట్ చేసేటప్పుడు ఆది హైపర్ అయిపోయాడు. ఈ క్రమంలో రోహిత్, ఆది కొట్టుకునేదాకా వెళ్లారు. కీర్తి.. గీతూ, సత్యలను; రోహిత్.. శ్రీహాన్, ఆదిని; సుదీప.. ఆది, కీర్తిలను; వాసంతి.. గీతూ, ఆదిలను; శ్రీహాన్.. గీతూ, రాజ్‌లను; బాలాదిత్య.. గీతూ, రాజ్‌లను; అర్జున్.. కీర్తిని, ఆదిని; సూర్య.. గీతూ, ఆదిని; ఫైమా.. సుదీప, బాలాదిత్యను; ఇనయ.. శ్రీహాన్, కీర్తి; రాజ్.. గీతూ, బాలాదిత్యను; మెరీనా.. కీర్తి, ఆది రెడ్డిని నామినేట్ చేశారు. రాజ్ తనను నామినేట్ చేయడం సహించలేకపోయిన గీతూ తన వంతు వచ్చేసరికి చెలరేగిపోయింది. 'నన్ను తుప్పాస్ రీజన్స్‌తో నామినేట్ చేశావు. నువ్వు ఈ హౌస్‌లో అందరికంటే వీక్, ఒక్క శాతం ఎంటర్టైన్మెంట్ చేయలేదు అంటూ రాజ్‌ను ఏకిపారేసింది. అతడితో పాటు కీర్తిని నామినేట్ చేసింది. శ్రీసత్య మాట్లాడుతూ.. బూతులు మాట్లాడావంటూ కీర్తిని, ఎంటర్టైన్మెంట్ తక్కువైందని ఆదిని నామినేట్ చేసింది. నీ వల్లే చంటి బయటకు వెళ్లాడని కీర్తికి ఎక్కువ నామినేషన్ ఓట్లు పడటం గమనార్హం. ఫైనల్‌గా ఈ వారం కీర్తి, ఆదిరెడ్డి, గీతూ, బాలాదిత్య, సుదీప, శ్రీహాన్, రాజ్, శ్రీసత్య, మెరీనా నామినేట్ అయ్యారు. చదవండి: ఆ హగ్గులేంది? రాత్రిపూట ఆ రచ్చేంది? గీతూకే అంతుంటే నాకెంతుండాలి? -
ఈ వారం నామినేషన్స్‌లో 9 మంది, ఎవరంటే?
సండే ఎంత ఫండేగా ముగుస్తుందో మండే అంత ఫైర్‌గా ఉంటుంది. అందుకు కారణం.. ఇంట్లో నుంచి ఒకరిని బయటకు పంపించేందుకు నామినేషన్స్ ప్రక్రియ జరగడమే! ఇక్కడ ఫ్రెండ్షిప్, రిలేషన్స్ అన్నీ పక్కన పెట్టి ఒకరినొకరు నామినేట్ చేసుకుంటారు. తాజాగా హౌస్‌లో నామినేషన్ ప్రక్రియ మొదలైంది. ఈ మేరకు తాజాగా ప్రోమో రిలీజైంది. ఇందులో మరోసారి హౌస్మేట్స్ గొడవకు దిగినట్లు తెలుస్తోంది. ఇకపోతే ఈ వారం నామినేషన్స్‌లో 9 మంది ఉన్నట్లు సోషల్ మీడియాలో ఓ వార్త వైరల్‌గా మారింది. దీని ప్రకారం.. ఆది రెడ్డి, బాలాదిత్య, సుదీప, కీర్తి, మెరీనా, గీతూ, రాజ్, శ్రీహాన్, శ్రీసత్య నామినేషన్స్‌లో ఉన్నట్లు తెలుస్తోంది. మరి నామినేషన్స్ ప్రక్రియ ఎలా జరిగిందో తెలియాలంటే ఎపిసోడ్ వచ్చేంతవరకు ఆగాల్సిందే! చదవండి: రివ్యూలు చేసే గీతూకే అంతుంటే నాకెంతుండాలి! -
రేవంత్ నా బుగ్గ మీద ముద్దు పెట్టాడు, ఫైమాతో.. : గీతూ
బిగ్‌బాస్ 6- ఎపిసోడ్ 33 హైలైట్స్: బిగ్‌బాస్ బర్త్‌డే సెలబ్రేషన్స్ అటు ఇంటిసభ్యులతో పాటు ఇటు ప్రేక్షకులకు కూడా వినోదాన్ని పంచింది. మొత్తంగా ఇలా అయినా జనాలకు కావాల్సినంత ఫన్ దొరికింది. అయితే బర్త్‌డే వేడుకల్లో భాగంగా ఇంటిసభ్యులందరూ తన కోరికలు తీర్చడానికి ప్రయత్నించడంతో, ఈ రోజు హౌస్మేట్స్ కోరికలను తెలుసుకోవాలనుకున్నాడు బిగ్‌బాస్. అందులో భాగంగా కంటెస్టెంట్లు వారి కుటుంబసభ్యులు నెరవేర్చగలిగే కోరికలేంటో చెప్పమని ఆదేశించాడు. ముందుగా శ్రీహాన్ మాట్లాడుతూ.. 'నా బర్త్‌డేకు నా చేతుల మీదుగా శ్రీహాన్ హెల్పింగ్ హ్యాండ్స్ ద్వారా అనాథలకు, వృద్ధులకు సాయం చేద్దామనుకున్నా. కానీ బిగ్‌బాస్ హౌస్‌లో ఉన్నా కాబట్టి సిరి ఆ పని పూర్తి చేయాలి. అలాగే మా అమ్మానాన్నలకు రోజుకొక్కసారైనా ఫోన్ చేసి వాళ్లతో మాట్లాడు సిరి' అని చెప్తూ కంటతడి పెట్టుకున్నాడు. తన గారాలపట్టికి హౌస్ నుంచి బయటకు వచ్చాక మంచి పేరు పెడతానంటూ ఎమోషనల్ అయ్యాడు బాలాదిత్య. మా బావ, అమ్మ ఎలా ఉంటున్నారో తెలుసుకోవాలనుందని మనసులో మాటను బయటపెట్టింది ఫైమా. నా తల్లిదండ్రులు మాట్లాడిన ఒక వీడియో బైట్ చూపిస్తే అంతే చాలంటూ ఎమోషనలయ్యారు అర్జున్, సూర్య. మా అమ్మ బిగ్‌బాస్ హౌస్‌కు రావాలి, తనని గట్టిగా హగ్ చేసుకోవాలనుంది. తనను మా నాన్న అంత బాగా చూసుకోలేనేమో కానీ ఆయన లేని లోటును మాత్రం గుర్తు చేయను అని ఏడ్చేసింది ఇనయ. మా ఆయన రంగనాథ్, కుటుంబం అంతా మాట్లాడిన వీడియో చూపించాలని కోరుకుంటున్నానంది పింకీ. 'ఓరియో నాకు ప్రతిరోజు ముద్దు పెట్టి నిద్ర లేపుతాడు. నా పెంపుడు కుక్కలు ఓరియో, ఫిడోల బొచ్చు కావాలి. అది నాకు చాలా అమూల్యమైనది' అని చెప్పుకొచ్చింది గీతూ. 'అక్టోబర్ 27న నా కూతురి బర్త్‌డే. ఆమె పుట్టినరోజు బిగ్‌బాస్ హౌస్‌లో జరగాలన్నదే నా కోరిక' అని చెప్పుకొచ్చాడు ఆదిరెడ్డి. అనంతరం బిగ్‌బాస్ ఈ వారం ఎక్కువ ఎంటర్టైన్ చేసిన ఆరుగురిని కెప్టెన్సీ కంటెండర్స్‌గా ఎంపిక చేయమని కెప్టెన్ కీర్తికి బాధ్యత అప్పజెప్పాడు. దీంతో ఆమె ఫైమా, రేవంత్, సూర్య, గీతూ, ఆదిత్య, రాజశేఖర్ పేర్లను సూచించింది. వీరు గేమ్ ఆడగా.. మొదటి లెవల్లో గెలిచి తొలి మూడు స్థానాల్లో ఉన్న సూర్య, బాలాదిత్య, రేవంత్ రెండో లెవల్‌కు వెళ్లారు. రెండో లెవల్ గేమ్ రేపు ప్రసారం కానుంది. అయితే ఈ ముగ్గురిలో రేవంత్ గెలిచి కెప్టెన్‌గా ఎంపికైనట్లు తెలుస్తోంది. ఇదిలా ఉంటే రేవంత్ తన బుగ్గ మీద ముద్దుపెట్టడం నచ్చలేదని అతడితోనే చెప్పింది గీతూ. తనకు అసౌకర్యంగా అనిపించిందని చెప్పడంతో తన తీరు మార్చుకుంటానన్నాడు రేవంత్. అలాగే ఫైమా కాళ్లపై పడుకున్నావని, కాస్త వాళ్లు కంఫర్టో కాదో చూసుకోమని సూచించింది గీతూ. చదవండి: మూడుసార్లు చావు అంచులదాకా వెళ్లొచ్చిన గీతూ తండ్రి గురించి చెప్తూ కంటతడి పెట్టిన అర్జున్ -
అంతా కీర్తి చేతిలోనే, తలపట్టుకున్న కంటెస్టెంట్లు!
బిగ్‌బాస్ షోలో కంటెస్టెంట్లకు ఎంటర్టైన్ చేయడం చేతకావట్లేదని ఏకంగా బిగ్‌బాసే రంగంలోకి దిగిన విషయం తెలిసిందే కదా! ఇంటిసభ్యులకు చిత్రవిచిత్ర టాస్కులిస్తూ వారికి పనిష్మెంట్లు ఇస్తూ ముప్పుతిప్పలు పెడుతూ ముక్కు పిండి ఎంటర్టైన్మెంట్ వసూలు చేశాడు బిగ్‌బాస్. ఇప్పుడిక ఫన్ కాస్త పక్కనపెట్టి టాస్కులిచ్చే పని మొదలుపెట్టాడు. తాజాగా హౌస్‌లో కెప్టెన్సీ టాస్క్ జరుగుతోంది. అయితే కెప్టెన్సీ కోసం పోటీపడే ఆరుగురిని ఎంపిక చేసే పనిని ప్రస్తుత కెప్టెన్ కీర్తికి అప్పజెప్పాడు బిగ్‌బాస్. దీంతో ఆమె ఫైమా, బాలాదిత్య, రేవంత్, రాజశేఖర్, సూర్య, గీతుల పేర్లను సూచించింది. దీంతో మిగతా ఇంటిసభ్యులు కాస్త హర్ట్ అయ్యారు. ఎంతగానో కష్టపడితే కించిత్తు ప్రతిఫలం కూడా దక్కట్లేదని నొచ్చుకున్నారు. మరి పై ఆరుగురిలో ఎవరు కెప్టెన్ అవుతారో తెలియాలంటే నేటి ఎపిసోడ్ వచ్చేంతవరకు వేచి చూడాల్సిందే! చదవండి: ఖరీదైన కారు కొన్న షణ్ముఖ జశ్వంత్ ఒక్క పనితో పడిపోయిన ఇనయా గ్రాఫ్ -
Bigg Boss 6: చంటికి బిగ్‌షాక్.. సీజన్ మొత్తం కెప్టెన్సీకి దూరం
బిగ్‌బాస్ హౌస్‌లో చలాకీ చంటికి వరుస షాకులు తగులుతున్నాయి. మొన్న సీక్రెట్ టాస్క్ సరిగా ఆడలేదని కెప్టెన్సీ పోటీ దారుల నుంచి తొలగించిన బిగ్‌బాస్.. ఈ సారి మాత్రం ఏకంగా సీజన్ మొత్తానికే బిగ్‌బాస్ కెప్టెన్ కాకుండా చేశాడు. ఈ నిర్ణయంలో కంటెస్టెంట్స్‌ని కూడా భాగస్వామ్యం చేశాడు. Bigg Boss 6, Episode 28 Highlights: గతవారం కంటెస్టెంట్స్ ఆటతీరుని వివరిస్తూ అందరికి డబ్బులు రూపంలో మార్కులు ఇచ్చాడు నాగార్జున. ఆట బాగా ఆడిన గీతూకి, శ్రీహాన్‌లకు రూ.1000 ఇస్తూ.. గేమ్ సరిగా ఆడనివారికి జీరో ఇచ్చారు. హౌస్‌లో మొత్తంగా ఆరుగురు చంటి, రాజ్,ఆది, రోహిత్ అండ్ మెరీనా, ఆదిత్య, ఇనయాలకు జీరో వచ్చింది. వారిలో నుంచి రాజ్, రోహిత్ అండ్ మెరీనాలకు చెరో వంద ఇచ్చి కూర్చోబెట్టాడు నాగార్జున. మిగిలిన నలుగురిలో అంటే ఆది, చంటి, బాలాదిత్య, ఇనయాలలో ఒకరిని ఈ సీజన్ మొత్తం కెప్టెన్సీ పోటీదారులు కాకుండా ఎంచుకోవాలని మిగిలిన సభ్యులను ఆదేశించాడు. వీరిలో బాలాదిత్యకు ఒక్కరు కూడా ఓటు వేయలేదు. ఆదికి రేవంత్ ఒక్కడే ఓటు వేశాడు. ఇక చంటిని తప్పించాలంటూ ముగ్గురు( రేవంత్, ఆరోహి, గీతూ).. ఇనయాను తొలగించాలంటూ ముగ్గురు( శ్రీహాన్, అర్జున్, రేవంత్) చేతులెత్తారు. చంటి, ఇనయాలకు సమాన ఓట్లు రావడంతో కొత్త కెప్టెన్ కీర్తి ఒపీనియన్ చెప్పమన్నాడు నాగార్జున. దీంతో కీర్తి తనను కెమెరాల కోసమే పని చేస్తుందని అన్నాడని చెబుతూ చంటిని నామినేట్ చేసింది.దీంతో చంటి కెప్టెన్సీ పోటీదారులకు దూరమయ్యాడు. నాగార్జున పెట్టిన కండీషన్ ప్రకారం చంటి ఇక ఈ సీజన్ మొత్తం కెప్టెన్ కాలేడు. కానీ ఇలాంటి కండీషన్స్‌ని మధ్యలో ఎత్తేసే అవకాశాలు చాలా ఉన్నాయి. గత సీజన్లలో కూడా ఇలానే కొంతమందిని కెప్టెన్సీ పోటీదారులు కాకుండా చేసి..మళ్లీ అవకాశం కల్పించారు.మరి చంటి విషయంలో ఆ హిస్టరీ రిపీట్ అవుతుందో లేదో చూడాలి. -
Bigg Boss 6: ఆ ఇద్దరిని నామినేట్ చేసిన నాగార్జున.. బిగ్‌బాస్ హిస్టరీలోనే తొలిసారి..
బిగ్‌బాస్ షోలో ఎప్పుడు ఏం జరుగుతుందో ఎవరికి తెలియదు. తెరపైకి ఎప్పుడు ఎలాంటి రూల్ వస్తుందో ఊహించడం కష్టమే. ముఖ్యంగా నామినేషన్ విషయంలో చాలా మలుపులు ఉంటాయి. బిగ్‌బాస్-6లో తాజాగా ఊహించని నామినేషన్ ఎదురైంది. బిగ్‌బాస్ చరిత్రలోనే తొలిసారి హోస్ట్ కంటెస్టెంట్స్‌ని హౌస్ నుంచి పంపేందుకు నామినేట్ చేశారు. మరి ఆ ఇద్దరు ఎవరు? వారిని ఎలా నామినేట్ చేశారు? గతవారం ఆటతీరుపై కంటెస్టెంట్స్‌కి నాగార్జున ఇచ్చిన మార్కులెన్ని? తదితర విషయాలను నేటి ఎపిసోడ్లో చదివేద్దాం. గత వారం ఆటతీరు బాగాలేని తొమ్మిది మందిని నాగార్జున సోఫా వెనుక నిలబెట్టి క్లాస్ పీకిన విషయం తెలిసిందే. ఆ తొమ్మిది మందిలో నుంచే షానీ,అభినయశ్రీ ఎలిమినేట్ అయ్యారు. మిగిలిన ఏడుగురుని మళ్లీ సోఫా వెనుకాలను నిలబెట్టాడు. వారిలో నుంచి శ్రీహాస్, సత్యల ఆటతీరును మెచ్చుకుంటూ మళ్లీ సోఫాలో కూర్చోబెట్టారు. తర్వాత మిగిలిన వారిలో నుంచి ఒక్కోక్కరిని లేపి..గతవారం వాళ్లు చేసిన తప్పులను చెబుతూ ఆటతీరుకు మార్కులు ఇచ్చాడు. ముందుగా బాలాదిత్య గురించి చెబుతూ.. మాటతీరు, మనిషి తీరు బాగుందని, ఆట తీరు మాత్రం అస్సలు బాగాలేదని చెప్పాడు. మాటతీరుకు 10 మార్కులు, మనిషి తీరుకు 9 మార్కులు ఇచ్చి.. ఆటతీరుకు మాత్ర కేవలం 3 మార్కులు మాత్రమే ఇచ్చాడు. వాసంతి టీమ్‌తో కలిసిపోవడం లేదని, అలా కాకుండా అందరితో కలిసి చక్కగా ఆట ఆడాలని సూచించాడు. ఇక రోహిత్,మెరీనా జంట మాటతీరుకు 10 మార్కులు ఇచ్చిన నాగ్..ఆట తీరుకు మాత్రం కేవలం 5 మార్కులే ఇచ్చాడు. చిన్న విషయాలకు కన్నీళ్లు పెట్టుకోవద్దని చెబుతూ కీర్తి ఆటతీరుకు 4 మార్కులు ఇచ్చాడు. ఇక సుదీప ఆటతీరుకు 4, మాటతీరుకు 7 మార్కులు ఇచ్చాడు. శ్రీసత్య, శ్రీహాన్‌ల ఆట తీరు 200శాతం ఇంప్రూవ్ అయిందని మెచ్చుకున్నాడు. ‘అడవీలో ఆట’ గేమ్‌లో భాగంగా గొల్డెన్ కొబ్బరిబోండా దక్కించుకున్న శ్రీసత్యపై ప్రశంసలు కురిపించాడు. ఆమె ఆటతీరుకు 9 మార్కులు ఇచ్చాడు. శ్రీహాన్ ఆట తీరు బాగుందని చెబుతూ 9 మార్కులు ఇచ్చిన నాగ్.. మాటతీరుకు మాత్రం 7 మార్కులే ఇచ్చాడు. ఇనయాను ‘పిట్ట’అని అనడం కరెక్ట్ కాదని చెబుతూనే..ఇద్దరి మధ్య ర్యాపో ఉంటే ఏదైనా అనుకోవచ్చని, దాని వల్ల ఎవరూ ఇబ్బంది పడరని చెప్పుకొచ్చాడు. ఇక నామినేషన్ ప్రక్రియలో ఇనయా, గీతూల మధ్య జరిగిన గొడవ విషయంలో..‘దొబ్బెయ్’అని అనడం తప్పని, అలాంటి మాటలు అనొద్దని గీతూని సున్నితంగా హెచ్చరించాడు. అలాగే ఇనయా, నేహా మధ్య జరిగిన ‘చెంపదెబ్బ’లొల్లిపై కూడా నాగ్ స్పందించాడు. అసలు ఇనయా చెంపదెబ్బే కొట్టలేదని వీడియో వేసి మరీ నిరూపించాడు. దీంతో నేహా మరోసారి అలాంటి తప్పుడు ఆరోపణలు చేయనని చెబుతూ సారీ చెప్పింది. రేవంత్ ఆటతీరుకు 9 మార్కులు.. మాటతీరుకు 6, మనిషి తీరుకు 7 మార్కులు ఇచ్చాడు. అర్జున్ కల్యాణ్ మాత్రం తన కోసం కంటే శ్రీసత్య కోసమే ఎక్కువ కష్టపడుతున్నాడని ఆడియన్స్‌తో పాటు నాగ్ కూడా అన్నాడు. పైమా అద్భుతంగా ఆడుతుందని మెచ్చుకున్న నాగ్..ఆటతీరుకు 9 మార్కులు ఇచ్చాడు. చంటి మాట, మనిషి తీరుకు 10 మార్కులు ఇచ్చి..ఆటతీరుకు మాత్ర 5 మార్కులే ఇచ్చాడు. దీంతో చంటి సోఫా బయట నిలబడ్డాడు. ఇక చివరిగా సోఫా వెనుకాల వాసంతీ, బాలాదిత్య, చంటి, సుదీప, అర్జున్, రాజ్, రోహిత్ అండ్ మెరీనా, కీర్తిలు నిలబడగా.. హోస్ట్ నాగార్జున వారికి ఓ షాకింగ్ విషయాన్ని చెప్పాడు. సోఫా వెనుకాల నిలబడిన 8 మందిలోనుంచి తాను ఇద్దరిని నేను వచ్చేవారం ఎలిమేట్‌ని నామినేట్ చేస్తున్నట్లు ప్రకటించాడు. బిగ్‌బాస్ చరిత్రలోనే కంటెస్టెంట్స్‌ని హోస్ట్ నామినేట్ చేయడం తొలిసారి చెబుతూ..ఆ ఇద్దరిని ఎంచుకోవాల్సిన బాధ్యత సోఫాలో కూర్చున్నవారికి అప్పజెప్పాడు. ఇంటి సభ్యులతో నిర్వహించిన ఓటింగ్‌లో చంటికి 1, రాజ్‌కు 4, అర్జున్‌కు 5, బాలాదిత్యకు 3, వాసంతికి2, రోహిత్ అండ్ మెరీనాలకు 1, సుదీపకి 3, కీర్తి భట్‌కు 5 ఓట్లు వచ్చాయి. అత్యధిక ఓట్లు వచ్చిన అర్జున్(5), కీర్తి(5)లను నాగార్జున నేరుగా నామినేట్ చేశారు. -
ఆత్మహత్యాయత్నం చేశా.. ఆస్పత్రికి ఎవరూ రాలేదు: శ్రీసత్య
బిగ్‌బాస్ సీజన్-6 గురువారం నాటి ఎపిసోడ్ చాలా ఎమోషనల్‌గా సాగింది. హౌస్మేట్స్ తమ జీవితంలో ఒక బేబీని ఉండటం, అది వారి జీవితాన్ని ఎలా మార్చింది అన్నది ఈ ప్రక్రియలో ఓపెన్అప్ అయ్యారు. ఇందులో భాగంగా ఇంటిసభ్యులు తమ జీవితంలో జరిగిన సాడ్ స్టోరీని వివరించి కంటతడి పెట్టించారు. మరోవైపు బిగ్‌బాస్ రెండో ఇంటి కెప్టెన్‌గా ఎవరికి ఎన్ని ఓట్లు వచ్చాయి అన్నది బిగ్‌బాస్ తెలుగు సీజన్-6 పన్నెండో ఎపిసోడ్ హైలైట్స్‌లో చదివేద్దాం. ముందుగా ఆదిరెడ్డి మాట్లాడాడు. తన తల్లి ఆత్మహత్య చేసుకొని చనిపోయిందని, అప్పుడు ఉన్న పరిస్థితుల్లో ఆమె అలాంటి నిర్ణయం తీసుకుందని చెప్పాడు. కానీ కష్టాలన్నీ ఎప్పుడూ ఒకేలా ఉండవని, ఈరోజు తన తల్లి బతికిఉంటే తన సక్సెస్‌ని చూసి సంతోషించేందని చెబుతూ ఎమోషనల్ అయ్యాడు. తన కూతురులోనే అమ్మను చూసుకుంటున్నానని తెలిపాడు. ఇక సుదీప తన ప్రెగ్నెన్సీ స్టోరీని వివరిస్తూ అందరిని కంటతడి పెట్టించింది. థైరాయిడ్ కారణంగా బిడ్డను కోల్పోవాల్సి వచ్చిందని చెబుతూ సుదీప కన్నీళ్లు పెట్టుకుంది. తన చెల్లి కూతురిలో తన బిడ్డను చూసుకున్నానని, కానీ తనను తిరిగి ఇచ్చేస్తుంటే ప్రాణం పోయినంత పని అయిపోయిందని చెప్పింది. ఎప్పటికైనా తనకంటూ ఓ బిడ్డ పుడుతుందనే ఆశతో బతుకుతున్నానని చెప్పింది. చిన్నప్పటి నుంచి నాన్న అనే పిలుపుకు నొచుకోలేదని చెప్పిన రేవంత్ త్వరలోనే తాను తండ్రి కాబోతున్నానని చెబుతూ సంతోషం వ్యక్తం చేశాడు. ఎప్పుడెప్పుడు తన బిడ్డతో నాన్న అని పిలిపించుకుందామా అని ఎదురుచూస్తున్నట్లు తెలిపాడు. ఇక ఎప్పుడూ నవ్వుతూ నవ్విస్తూ ఉండే చలకీ చంటీ జీవితంలోనూ అంతులేని విషాదం ఉంది. కళ్లెదుటే ఫైర్ యాక్సిడెంట్లో తన తల్లి చనిపోయిందని చెప్పిన చంటీ ఆ తర్వాత కవల పిల్లల రూపంలో తనకు ఆ దేవుడు అమ్మను ప్రసాదించాడని తెలిపాడు. బిగ్‌బాస్ క్యూట్ కపుల్ మెరీనా అండ్ రోహిత్‌లు తమ లైఫ్‌లో జరిగిన ఇన్సిడెంట్‌ని వివరిస్తూ.. మూడోనెల దాటాక బేబీ హార్ట్‌బీట్ లేదని చెప్పారు. వేరే ఆప్షన్ లేదు..బేబీని తీసేయాల్సి వచ్చింది అని చెబుతూ ఏడ్చేశారు. దేవుడిని దర్శించుకొని తిరిగి వస్తుండగా జరిగిన కారు ప్రమాదంలో తన కుటుంబం మొత్తం చనిపోయారని చెబుతూ కీర్తి భట్ ఎమోషనల్ అయ్యింది. కొన్ని సిచ్యువేషన్స్ వల్ల ఆత్మహత్యాయత్నం చేసినట్టు చెప్పిన శ్రీసత్య అది ఫ్యామిలీకి చాలా ఎఫెక్ట్ పడిందని చెప్పింది. తన ఫ్యామిలీ దూరమవడంతో ఓ అనాథ పాపను దత్తత తీసుకున్నానని చెప్పిన కీర్తి బిగ్‌బాస్‌కి వచ్చేముందే తన కూతుర్ని పోగోట్టుకున్నానని చెప్పింది. చివరి నిమిషంలో కూడా తన కూతురితో ఉండలేకపోయినందుకు బాధగా ఉందని చెబుతూ కన్నీళ్లు పెట్టుకుంది.ఇదిలా ఉండగా బిగ్‌బాస్ సీజన్-6 రెండో ఇంటి కెప్టెన్ కోసం కెప్టెన్సీ పోటీదారులంతా ఎన్నికల ప్రచారం మొదలుపెట్టారు. ఇందులో తమకు ఓటేయాలంటూ ఎవరి పద్ధతిలో వాళ్లు అడిగారు. అయితే ఈ ప్రక్రియలో రాజ్‌కి ఎక్కువ ఓట్లు వచ్చినట్లు తెలుస్తుంది. దీంతో అతన్ని ఏకగ్రీవంగా ఎన్నుకుందామనే నిర్ణయానికి వచ్చారు. ఇవాల్టి ఎపిసోడ్లో రెండో ఇంటి కెప్టెన్ ఎవరో తెలియనుంది. -
చిన్నప్పటినుంచి నాన్న అనే పిలుపుకు నోచుకోలేదు : రేవంత్
బిగ్‌బాస్ సీజన్-6 రెండోవారం ఇంటి సభ్యులకు ఇచ్చిన సిసింద్రీ టాస్క్ పూర్తైంది. బేబీ బాగోగులు చూస్తూ సమయానుసారం బిగ్‌బాస్ ఇచ్చిన ఆదేశాల ప్రకారం ఇంటిసభ్యులు చేసిన యాక్టివిటీ వినోదాన్ని పంచిన సంగతి తెలిసిందే. అయితే ఈరోజు(గురువారం)టెలికాస్ట్ అయ్యే ఎపిసోడ్ మాత్రం చాలా ఎమోషనల్‌గా ఉండబోతుందని ప్రోమోను బట్టి అర్థమవుతుంది. ఇందులో బేబీస్తో రెండు రోజుల పాటు గడిపిన సమయం కారణంగా వాటితో ఏర్పరుచుకున్న బంధాన్ని బిగ్‌బాస్ గమినించాడని తెలుపుతూ ఇంటి సభ్యులు తమ జీవితంలో ఒక బేబీని ఉండటం, అది వారి జీవితాన్ని ఎలా మార్చింది అన్నది ఈ ప్రక్రియ ద్వారా పంచుకోవాలని ఆదేశించాడు. ఇందులో భాగంగా ఒక్కో ఇంటిసభ్యుడు తమ సాడ్ స్టోరీని వివరించి కంటతడి పెట్టించారు. 2015లో ప్రెగ్నెంట్ అని తెలిసిందనీ, కానీ థైరాయిడ్ ఎక్కువగా ఉండటంతో బేబీని కోల్పోయానంటూ సుదీప(పింకీ)ఎమోషనల్ అయ్యింది. తన చెల్లి కూతురిలో తన బిడ్డను చూసుకున్నానని, కానీ తనను తిరిగి ఇచ్చేస్తుంటే ప్రాణం పోయినంత పని అయిపోయిందని చెప్పింది. ఇక రేవంత్ మాట్లాడుతూ.. ప్రస్తుతం తన భార్య 7వ నెల ప్రెగ్నెంట్ అని చెప్పాడు. చిన్నప్పటి నుంచి నాన్న అనే పిలుపుకు నోచుకోలేదు దీంతో ఎప్పుడెప్పుడు నాన్న అని పిలిపించుకోవాలా అని ఆత్రంగా ఉందని తెలిపాడు. ఇక బిగ్‌బాస్ ఇంటికి వచ్చేముందే తన కూతుర్ని పోగోట్టుకున్నానని చెబుతూ కీర్తి భట్ ఎమోషనల్ అయ్యింది. చివరి నిమిషంలో కూడా తన కూతురితో ఉండలేకపోయినందుకు బాధగా ఉందని చెబుతూ కన్నీళ్లు పెట్టుకుంది. బిగ్‌బాస్ క్యూట్ కపుల్ మెరీనా అండ్ రోహిత్‌లు తమ లైఫ్‌లో జరిగిన ఇన్సిడెంట్‌ని వివరిస్తూ.. మూడోనెల దాటాక బేబీ హార్ట్‌బీట్ లేదని చెప్పారు. వేరే ఆప్షన్ లేదు..బేబీని తీసేయాల్సి వచ్చింది అని చెబుతూ ఏడ్చేశారు. ఎప్పుడూ నవ్వుతూ నవ్విస్తూ ఉండే చలాకీ చంటీ లైఫ్‌లో కూడా ఎవరకి తెలియని విషాదం ఉంది. తనకళ్ల ముందే ఫైర్ యాక్సిడెంట్ అయిందని, తాను చూస్తుండగానే అమ్మ కాలిపోయిందని చెప్పడం అందరినీ కంటతడి పెట్టించింది. మొత్తంగా ఈవాల్టి ఎపిసోడ్ చాలా ఎమోషనల్‌గా ఉండనుంది. -
Bigg Boss 6 Telugu: తొలి కంటెస్టెంట్‌గా సీరియల్ నటి కీర్తి భట్
Keethi Bhat In Bigg Boss 6 Telugu: బిగ్‌బాస్ సీజన్-6 గ్రాండ్‌గా లాంచ్ అయ్యింది. ఈ సీజన్లో తొలి కంటెస్టెంట్‌గా సీరియల్ నటి కీర్తి భట్ ఎంట్రీ ఇచ్చింది. గాంధారీ... గాంధారీ అంటూ డ్యాన్స్‌తో సందడి చేసింది. తెలుగు ప్రేక్షకులకు కీర్తి భట్ అంటే తెలియదు కానీ.. భాను అంటే గుర్తుపడతారు. 'మనసిచ్చి చూడు'సీరియల్లో భానుగా అద్భుత నటనతో ఆకట్టుకుంది కీర్తి భట్. ఈ సీరియల్లో అందం, అభినయంతో తెలుగు ప్రేక్షకులకు చేరువైంది. బెంగుళూరు పుట్టిపెరిగిన ఈ కన్నడ బ్యూటీకి చిన్నతనం నుంచి సినిమాలంటే ఇష్టం. ఆ మక్కువతోనే యాక్టింగ్‌లో శిక్షణ పొంది డాన్స్ కూడా నేర్చుకుంది. ఉన్నత విద్యను అభ్యసించిన కీర్తి భట్. చదువు పూర్తి కాగానే కన్నడలో ఇండస్ట్రీలో అడుగుపెట్టివరుసగా మూడు సీరియల్స్ చేసింది. ఆ తరువాత సినిమాల్లోనూ నటించింది. ఈ మధ్యే 'కార్తీకదీపం' సీరియల్ లో ఎంట్రీ ఇచ్చిన కీర్తి..హిమ పాత్రలో నటిస్తోంది. ఆరేళ్ల క్రితం యాక్సిడెంట్లో కుటుంబం మొత్తాన్ని కోల్పోయిన కీర్తి.. తనూ భట్ అనే చిన్నారిని దత్తత తీసుకుంది.