కష్టాలు నాకు చుట్టాలని కొందరు అంటూ ఉంటారు. కానీ కీర్తి భట్‌కు కష్టాలు చుట్టాలుగా కాదు ఏకంగా కుటుంబ సభ్యులమే అంటూ తన ఇంట్లో, జీవితంలో తిష్ట వేశాయి. ఫ్యామిలీతో కలిసి సంతోషంగా ఉంటున్న సమయంలో విధి కీర్తి జీవితంతో ఆడుకుంది. యాక్సిడెంట్‌లో కుటుంబం మొత్తాన్ని కోల్పోయింది. అమ్మానాన్న, అన్నయ్య.. ముగ్గురూ దూరమవడంతో ఎవరూ లేని అనాథగా మారింది.
సినిమాల నుంచి సీరియల్స్
దురదృష్టవంతురాలినని కుంగిపోయింది. కానీ ఇలా బాధపడుతూ కూర్చుంటే కరెక్ట్ కాదని తనకు తాను సర్ది చెప్పుకుంది. బాధను దిగమింగుకుంటూ జీవితాన్ని ఒంటరిగా ఎదుర్కోవాలనుకుంది. నచ్చిన ఫీల్డ్‌లో తన సత్తా చూపించాలనుకుంది. అలా కీర్తి భట్ (Keerthi Bhat) నటనవైపు అడుగులు వేసింది. కన్నడలో టీవీ సీరియల్స్ చేసింది. రెండు కన్నడ చిత్రాల్లోనూ నటించింది. తర్వాత మనసిచ్చి చూడు సీరియల్‌తో తెలుగులో ఎంట్రీ ఇచ్చింది. కార్తీకదీపం ధారావాహికలోనూ మెరిసింది.
ఎప్పటికీ తల్లి కాలేవన్న వైద్యులు
ఈ సీరియల్స్ ద్వారా వచ్చిన క్రేజ్‌తో తెలుగు బిగ్‌బాస్ ఆరో సీజన్‌లో అడుగుపెట్టింది. ఈ సీజన్‌లో ఫస్ట్ కంటెస్టెంట్‌గా అడుగుపెట్టిన ఆమె సెకండ్ రన్నరప్‌గా నిలిచి ఎందరికో ఆదర్శంగా నిలిచింది. అయితే బిగ్‌బాస్ షో (Bigg Boss Reality Show)కు వెళ్లేముందు కూడా మరోసారి కష్టాలు తనను పట్టికుదిపేశాయి. యాక్సిడెంట్ వల్ల కీర్తి ఎప్పటికీ తల్లి కాలేదని వైద్యులు తేల్చి చెప్పడంతో ఆమె ఓ పాపను దత్తత తీసుకుని పెంచుకుంది. కానీ ఆ సంతోషం కూడా ఎంతోకాలం ఉండలేదు. బిగ్‌బాస్ ఆఫర్ వచ్చిన సమయంలోనే పాప మరణించింది.
(చదవండి: 'మీరు అనుకున్నది సాధిస్తే'.. ప్రమాదం తర్వాత అజిత్ వీడియో రిలీజ్!)
2023లో ఎంగేజ్‌మెంట్
ఇలా ఎన్నో కష్టాలు దాటి ఇక్కడిదాకా వచ్చింది కీర్తి. త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నానంటూ 2023లో కీర్తి గుడ్‌న్యూస్ చెప్పింది. హీరో, దర్శకుడు విజయ్ కార్తీక్‌ను వివాహం చేసుకోనున్నట్లు ప్రకటించింది. అదే ఏడాది విజయ్‌తో ఎంగేజ్‌మెంట్ జరిగింది. ఆ మరుసటి ఏడాది నుంచి కాబోయే భర్తతో కలిసి ఒకే ఇంట్లో ఉంటోంది. నిశ్చితార్థం అయిపోయి రెండేళ్లవుతున్నా ఇంకా పెళ్లి డేట్ చెప్పట్లేదు. తాజాగా కీర్తి.. కాబోయే భర్తతో కలిసి తొలిసారి పూజలో పాల్గొంది. ఈ మేరకు సోషల్ మీడియాలో ఓ వీడియో షేర్ చేసింది.
భార్యాభర్తల్లా పూజ చేస్తున్నారేంటి?
ఇది చూసిన ఓ నెటిజన్.. మిస్ కన్నడ కీర్తి గారు.. పెళ్లికి ముందు ఇలా కలిసి పూజ చేయడం తెలుగు సాంప్రదాయం కాదు. కార్తీక్.. కనీసం మీకు మీ తల్లిదండ్రులైనా చెప్పలేదా? అయినా ఈ జనరేషన్‌లో పేరెంట్స్ మాట ఎవరూ వినరు. ముఖ్యంగా ఈ ఇండస్ట్రీలోనివాళ్లు అసలే వినరు అని పెదవి విరిచాడు. దీనికి కీర్తి స్పందిస్తూ.. పెళ్లికి ముందే మేము ఇలా పూజ చేస్తే ఏమవుతుందో కాస్త చెప్పగలరా? ఒకరిని నిందించేముందు సరైన కారణాలు చెప్పండి అని ఘాటుగా రిప్లై ఇచ్చింది.
ఎవరీ కార్తీక్?
కీర్తికి కాబోయే భర్త కార్తీక్ విషయానికి వస్తే.. చిత్తూరులోని మదనపల్లిలో పుట్టి పెరిగిన విజయ కార్తీక్ మొదట సాఫ్ట్‌వేర్ కంపెనీలో పని చేశాడు. తర్వాత సినిమా మీదున్న ప్రేమతో ఉద్యోగాన్ని వదిలేసి ఇండస్ట్రీలో చేరాడు. కన్నడ భాషలో నాలుగు సినిమాల్లో హీరోగా నటించాడు. తెలుగులో ఏబీ పాజిటివ్, చెడ్డీ గ్యాంగ్ సినిమాలు చేశాడు.
చదవండి: 'మీరు అనుకున్నది సాధిస్తే'.. ప్రమాదం తర్వాత అజిత్ వీడియో రిలీజ్!
Comments
Please login to add a commentAdd a comment