
కెప్టెన్సీ కోసం పోటీపడే ఆరుగురిని ఎంపిక చేసే పనిని ప్రస్తుత కెప్టెన్ కీర్తికి అప్పజెప్పాడు బిగ్‌బాస్. దీంతో ఆమె ఫైమా, బాలాదిత్య, రేవంత్, రాజశేఖర్,
బిగ్‌బాస్ షోలో కంటెస్టెంట్లకు ఎంటర్‌టైన్ చేయడం చేతకావట్లేదని ఏకంగా బిగ్‌బాసే రంగంలోకి దిగిన విషయం తెలిసిందే కదా! ఇంటిసభ్యులకు చిత్రవిచిత్ర టాస్కులిస్తూ వారికి పనిష్మెంట్లు ఇస్తూ ముప్పుతిప్పలు పెడుతూ ముక్కు పిండి ఎంటర్‌టైన్‌మెంట్ వసూలు చేశాడు బిగ్‌బాస్. ఇప్పుడిక ఫన్ కాస్త పక్కనపెట్టి టాస్కులిచ్చే పని మొదలుపెట్టాడు. తాజాగా హౌస్‌లో కెప్టెన్సీ టాస్క్ జరుగుతోంది.
అయితే కెప్టెన్సీ కోసం పోటీపడే ఆరుగురిని ఎంపిక చేసే పనిని ప్రస్తుత కెప్టెన్ కీర్తికి అప్పజెప్పాడు బిగ్‌బాస్. దీంతో ఆమె ఫైమా, బాలాదిత్య, రేవంత్, రాజశేఖర్, సూర్య, గీతుల పేర్లను సూచించింది. దీంతో మిగతా ఇంటిసభ్యులు కాస్త హర్ట్ అయ్యారు. ఎంతగానో కష్టపడితే కించిత్తు ప్రతిఫలం కూడా దక్కట్లేదని నొచ్చుకున్నారు. మరి పై ఆరుగురిలో ఎవరు కెప్టెన్ అవుతారో తెలియాలంటే నేటి ఎపిసోడ్ వచ్చేంతవరకు వేచి చూడాల్సిందే!
చదవండి: ఖరీదైన కారు కొన్న షణ్ముఖ జశ్వంత్
ఒక్క పనితో పడిపోయిన ఇనయా గ్రాఫ్