బుల్లితెరపై తెలుగు బిగ్‌బాస్ 6 సీజన్ సందడికి ఎండ్ కార్డ్ పడింది. ఆదివారం బిగ్‌బాస్ గ్రాండ్ ఫినాలే ఘనంగా ముగిసింది. ఈ సీజన్‌లో రేవంత్ విజేత నిలిచి ట్రోఫీ కైవసం చేసుకోగా.. శ్రీహాన్ రన్నర్‌గా నిలిచాడు. ఇక టాప్ 3 కంటెస్టెంట్‌గా కీర్తి నిలిచింది. మొదటి నుంచి కీర్తి హౌజ్‌లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. హౌజ్ సింపతి గేన్ చేస్తుందంటూ ఎన్ని కామెంట్స్ వచ్చినా తడబడకుండా ఆమె ముందుకు సాగుతూనే ఉంది. ఆటలో సైతం తన మార్క్ చూపిస్తూ వచ్చింది.
చేతి వేలు దెబ్బతిన్నా ఆటలో.. ఎక్కడ తగ్గేదేలే అంటూ ముందకు సాగింది. గాయపడినప్పటికీ మిగతా కంటెస్టెంట్స్‌కి గట్టి పోటినిచ్చింది. తన ఆటతీరుతో ఎంతోమంది ప్రేక్షక హృదయాలను గెలుచుకున్న కీర్తి టాప్ 3లో నిలిచింది. ఫినాలేలో బిగ్‌బాస్ ఇచ్చిన ఆఫర్‌ను వద్దనుకుని రూ. 30 లక్షల ప్రైజ్‌మనీని చేజార్చుకుంది. ఎవరూ చెప్పిన వినకుండా విన్నర్ అవుతాననే కాన్ఫిడెంట్‌తో రూ. 30 లక్షల బ్రీఫ్‌కేస్‌ను తిరస్కరించింది. దీంతో కొందరు ఆమెది ఓవర్ కాన్ఫీడెన్స్ అంటూ కామెంట్స్ చేస్తుండగా.. ఆడియన్స్ మాత్రం ఆమె కాన్ఫిడెన్స్‌కి ఫిదా అవుతున్నారు.
మరికొందరు ఆ బ్రీఫ్‌కేస్ తీసుకుని ఉంటే తన శ్రమ తగిన ఫలితం ఉండేదంటూ చర్చించుకుంటున్నారు. ఈ నేపథ్యంలో కీర్తి 15 వారాలకు ఎంత రెమ్యునరేషన్ తీసుకుందనేది ఆసక్తిగా మారింది. పలు టీవీ సీరియల్స్ ద్వారా గుర్తింపు పొంది బిగ్‌బాస్ హౌజ్‌లో అడుగుపెట్టిన కీర్తి ఒక్కొ వారానికి గానూ రూ. 50 వేల నుంచి రూ. 75 వేలు తీసుకుందని వినికిడి. ఈ బజ్ ప్రకారం.. 15 వారాలపాటు హౌజ్‌లో కొనసాగిన కీర్తి మొత్తం రూ. 8 లక్షల నుంచి రూ. 11 లక్షల పైనే తీసుకుందని వినికిడి. దీనిప్రకారం హౌజ్‌లో లేడీ కంటెస్టెంట్స్‌తో పోలిస్తే అందరి కంటే కీర్తి రెమ్యునరేషన్ ఎక్కువని తెలుస్తోంది.
చదవండి:
మొత్తం బిగ్‌బాస్ ద్వారా రేవంత్ ఎంత సంపాదించాడో తెలుసా?
‘కాంతార’ భూత కోల వేడుకలో అనుష్క సందడి, వీడియో వైరల్
Comments
Please login to add a commentAdd a comment