బిగ్‌బాస్ హౌస్‌లో చలాకీ చంటికి వరుస షాకులు తగులుతున్నాయి. మొన్న సీక్రెట్ టాస్క్ సరిగా ఆడలేదని కెప్టెన్సీ పోటీ దారుల నుంచి తొలగించిన బిగ్‌బాస్.. ఈ సారి మాత్రం ఏకంగా సీజన్ మొత్తానికే బిగ్‌బాస్ కెప్టెన్ కాకుండా చేశాడు. ఈ నిర్ణయంలో కంటెస్టెంట్స్‌ని కూడా భాగస్వామ్యం చేశాడు.
Bigg Boss 6, Episode 28 Highlights: గతవారం కంటెస్టెంట్స్ ఆటతీరుని వివరిస్తూ అందరికి డబ్బులు రూపంలో మార్కులు ఇచ్చాడు నాగార్జున. ఆట బాగా ఆడిన గీతూకి, శ్రీహాన్‌లకు రూ.1000 ఇస్తూ.. గేమ్ సరిగా ఆడనివారికి జీరో ఇచ్చారు. హౌస్‌లో మొత్తంగా ఆరుగురు చంటి, రాజ్,ఆది, రోహిత్ అండ్ మెరీనా, ఆదిత్య, ఇనయాలకు జీరో వచ్చింది. వారిలో నుంచి రాజ్, రోహిత్ అండ్ మెరీనాలకు చెరో వంద ఇచ్చి కూర్చోబెట్టాడు నాగార్జున. మిగిలిన నలుగురిలో అంటే ఆది, చంటి, బాలాదిత్య, ఇనయాలలో ఒకరిని ఈ సీజన్ మొత్తం కెప్టెన్సీ పోటీదారులు కాకుండా ఎంచుకోవాలని మిగిలిన సభ్యులను ఆదేశించాడు.
వీరిలో బాలాదిత్యకు ఒక్కరు కూడా ఓటు వేయలేదు. ఆదికి రేవంత్ ఒక్కడే ఓటు వేశాడు. ఇక చంటిని తప్పించాలంటూ ముగ్గురు( రేవంత్, ఆరోహి, గీతూ).. ఇనయాను తొలగించాలంటూ ముగ్గురు( శ్రీహాన్, అర్జున్, రేవంత్) చేతులెత్తారు. చంటి, ఇనయాలకు సమాన ఓట్లు రావడంతో కొత్త కెప్టెన్ కీర్తి ఒపీనియన్ చెప్పమన్నాడు నాగార్జున. దీంతో కీర్తి తనను కెమెరాల కోసమే పని చేస్తుందని అన్నాడని చెబుతూ చంటిని నామినేట్ చేసింది.దీంతో చంటి కెప్టెన్సీ పోటీదారులకు దూరమయ్యాడు. నాగార్జున పెట్టిన కండీషన్ ప్రకారం చంటి ఇక ఈ సీజన్ మొత్తం కెప్టెన్ కాలేడు. కానీ ఇలాంటి కండీషన్స్‌ని మధ్యలో ఎత్తేసే అవకాశాలు చాలా ఉన్నాయి. గత సీజన్లలో కూడా ఇలానే కొంతమందిని కెప్టెన్సీ పోటీదారులు కాకుండా చేసి..మళ్లీ అవకాశం కల్పించారు.మరి చంటి విషయంలో ఆ హిస్టరీ రిపీట్ అవుతుందో లేదో చూడాలి.
Comments
Please login to add a commentAdd a comment