Bigg Boss 6 Telugu: Host Nagarjuna Nominated 2 Contestants, Episode 21 Highlights - Sakshi
Sakshi News home page

Bigg Boss 6: ఆ ఇద్దరిని నామినేట్‌ చేసిన నాగార్జున.. బిగ్‌బాస్‌ హిస్టరీలోనే తొలిసారి..

Published Sat, Sep 24 2022 11:33 PM | Last Updated on Sun, Sep 25 2022 11:39 AM

Bigg Boss 6 Telugu: Host Nagarjuna Nominated 2 Contestants, Episode 21 Highlights - Sakshi

బిగ్‌బాస్‌ షోలో ఎప్పుడు ఏం జరుగుతుందో ఎవరికి తెలియదు. తెరపైకి ఎప్పుడు ఎలాంటి రూల్‌ వస్తుందో ఊహించడం కష్టమే. ముఖ్యంగా నామినేషన్‌ విషయంలో చాలా మలుపులు ఉంటాయి. బిగ్‌బాస్‌-6లో తాజాగా ఊహించని నామినేషన్‌ ఎదురైంది. బిగ్‌బాస్‌ చరిత్రలోనే తొలిసారి హోస్ట్‌ కంటెస్టెంట్స్‌ని హౌస్‌ నుంచి పంపేందుకు నామినేట్‌ చేశారు. మరి ఆ ఇద్దరు ఎవరు? వారిని ఎలా నామినేట్‌ చేశారు? గతవారం ఆటతీరుపై కంటెస్టెంట్స్‌కి నాగార్జున ఇచ్చిన మార్కులెన్ని? తదితర విషయాలను నేటి ఎపిసోడ్‌లో చదివేద్దాం.

గత వారం ఆటతీరు బాగాలేని తొమ్మిది మందిని నాగార్జున సోఫా వెనుక నిలబెట్టి క్లాస్‌ పీకిన విషయం తెలిసిందే. ఆ తొమ్మిది మందిలో నుంచే షానీ,అభినయశ్రీ ఎలిమినేట్‌ అయ్యారు. మిగిలిన ఏడుగురుని మళ్లీ సోఫా వెనుకాలను నిలబెట్టాడు. వారిలో నుంచి శ్రీహాస్‌, సత్యల ఆటతీరును మెచ్చుకుంటూ మళ్లీ సోఫాలో కూర్చోబెట్టారు. తర్వాత మిగిలిన వారిలో నుంచి ఒక్కోక్కరిని లేపి..గతవారం వాళ్లు చేసిన తప్పులను చెబుతూ ఆటతీరుకు మార్కులు ఇచ్చాడు. ముందుగా బాలాదిత్య గురించి చెబుతూ.. మాటతీరు, మనిషి తీరు బాగుందని, ఆట తీరు మాత్రం అస్సలు బాగాలేదని చెప్పాడు. మాటతీరుకు 10 మార్కులు, మనిషి తీరుకు 9 మార్కులు ఇచ్చి.. ఆటతీరుకు మాత్ర కేవలం 3 మార్కులు మాత్రమే ఇచ్చాడు. 

వాసంతి టీమ్‌తో కలిసిపోవడం లేదని, అలా కాకుండా అందరితో కలిసి చక్కగా ఆట ఆడాలని సూచించాడు. ఇక రోహిత్‌,మెరీనా జంట మాటతీరుకు 10 మార్కులు ఇచ్చిన నాగ్‌..ఆట తీరుకు మాత్రం కేవలం 5 మార్కులే ఇచ్చాడు. చిన్న విషయాలకు కన్నీళ్లు పెట్టుకోవద్దని చెబుతూ కీర్తి ఆటతీరుకు 4 మార్కులు ఇచ్చాడు. ఇక సుదీప ఆటతీరుకు 4, మాటతీరుకు 7 మార్కులు ఇచ్చాడు.

 శ్రీసత్య, శ్రీహాన్‌ల ఆట తీరు 200శాతం ఇంప్రూవ్‌ అయిందని మెచ్చుకున్నాడు. ‘అడవీలో ఆట’ గేమ్‌లో భాగంగా గొల్డెన్‌ కొబ్బరిబోండా దక్కించుకున్న శ్రీసత్యపై ప్రశంసలు కురిపించాడు. ఆమె ఆటతీరుకు 9 మార్కులు ఇచ్చాడు. శ్రీహాన్‌ ఆట తీరు బాగుందని చెబుతూ 9 మార్కులు ఇచ్చిన నాగ్‌.. మాటతీరుకు మాత్రం 7 మార్కులే ఇచ్చాడు. ఇనయాను ‘పిట్ట’అని అనడం కరెక్ట్‌ కాదని చెబుతూనే..ఇద్దరి మధ్య ర్యాపో ఉంటే ఏదైనా అనుకోవచ్చని, దాని వల్ల ఎవరూ ఇబ్బంది పడరని చెప్పుకొచ్చాడు.

ఇ​క నామినేషన్‌ ప్రక్రియలో ఇనయా, గీతూల మధ్య జరిగిన గొడవ విషయంలో..‘దొబ్బెయ్‌’అని అనడం తప్పని, అలాంటి మాటలు అనొద్దని గీతూని సున్నితంగా హెచ్చరించాడు. అలాగే ఇనయా, నేహా మధ్య జరిగిన ‘చెంపదెబ్బ’లొల్లిపై కూడా నాగ్‌ స్పందించాడు. అసలు ఇనయా చెంపదెబ్బే కొట్టలేదని వీడియో వేసి మరీ నిరూపించాడు. దీంతో నేహా మరోసారి అలాంటి తప్పుడు ఆరోపణలు చేయనని చెబుతూ సారీ చెప్పింది.

రేవంత్‌ ఆటతీరు​కు 9 మార్కులు.. మాటతీరుకు 6, మనిషి తీరుకు 7 మార్కులు ఇచ్చాడు. అర్జున్‌ కల్యాణ్‌ మాత్రం తన కోసం కంటే శ్రీసత్య కోసమే ఎక్కువ కష్టపడుతున్నాడని ఆడియన్స్‌తో పాటు నాగ్‌ కూడా అన్నాడు. పైమా అద్భుతంగా ఆడుతుందని మెచ్చుకున్న నాగ్‌..ఆటతీరుకు 9 మార్కులు ఇచ్చాడు. చంటి మాట, మనిషి తీరుకు 10 మార్కులు ఇచ్చి..ఆటతీరుకు మాత్ర 5 మార్కులే ఇచ్చాడు. దీంతో చంటి సోఫా బయట నిలబడ్డాడు. ఇక చివరిగా సోఫా వెనుకాల వాసంతీ, బాలాదిత్య, చంటి, సుదీప, అర్జున్‌, రాజ్‌, రోహిత్‌ అండ్‌ మెరీనా, కీర్తిలు నిలబడగా.. హోస్ట్‌ నాగార్జున వారికి ఓ షాకింగ్‌ విషయాన్ని చెప్పాడు.

సోఫా వెనుకాల నిలబడిన 8 మందిలోనుంచి తాను ఇద్దరిని నేను వచ్చేవారం ఎలిమేట్‌ని నామినేట్‌ చేస్తున్నట్లు ప్రకటించాడు. బిగ్‌బాస్‌ చరిత్రలోనే కంటెస్టెంట్స్‌ని హోస్ట్‌ నామినేట్‌ చేయడం తొలిసారి చెబుతూ..ఆ ఇద్దరిని ఎంచుకోవాల్సిన బాధ్యత సోఫాలో కూర్చున్నవారికి అప్పజెప్పాడు. ఇంటి సభ్యులతో నిర్వహించిన ఓటింగ్‌లో చంటికి 1, రాజ్‌కు 4, అర్జున్‌కు 5, బాలాదిత్యకు 3, వాసంతికి2, రోహిత్‌ అండ్‌ మెరీనాలకు 1, సుదీపకి 3, కీర్తి భట్‌కు 5 ఓట్లు వచ్చాయి. అత్యధిక ఓట్లు వచ్చిన అర్జున్‌(5), కీర్తి(5)లను నాగార్జున నేరుగా నామినేట్‌ చేశారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement