బిగ్‌బాస్ 6 తెలుగు సీజన్‌కు ఎండ్ కార్డ్ పడింది. 15 వారాల పాటు అలరించిన ఈ షో ఆదివారం గ్రాండ్ ఫినాలే జరుపుకుంది. విన్నర్ డిక్లరేషన్ అనంతరం చివరిలో ట్విస్ట్ చోటుచేసుకుంది. రేవంత్ కంటే కాస్త ఎక్కువ ఓట్లు తెచ్చుకున్న శ్రీహాన్ రన్నరప్‌గా నిలిచాడు. శ్రీహాన్ నిర్ణయం వల్ల రేవంత్ విన్నర్‌గా నిలిచి ట్రోఫీని సొంతం చేసుకున్నాడు. దీంతో శ్రీహాన్‌కు ఎదురుదెబ్బ తగిలింది. కానీ, ఏకంగా శ్రీహాన్ నలభై లక్షలు దక్కించుకున్నాడు.
దీంతో యాభై లక్షల ప్రైజ్ మనీలో విజేత రేవంత్‌కి దక్కింది పది లక్షలే. అయినప్పటికీ విన్నర్‌గా నిలిచిన రేవంత్ గెలుచుకున్న ప్రైజ్‌మనీ దాదాపు రూ. 50 లక్షల పైనే అయ్యింది. బిగ్‌బాస్ సీజన్ 6 ట్రోఫీతో పాటు అతను పది లక్షల ప్రైజ్‌మనీ అందుకున్నాడు. వీటితో పాటు ‘సువర్ణభూమి’ వారి 605 గజాల ఫ్లాట్, పది లక్షల విలువైన మారుతి సుజుకి బ్రెజా కారుని ప్రకటించారు. సువర్ణ భూమి వారు ఇచ్చిన ప్లాట్ విలువ రూ. 30 లక్షలు ఉంటుందని చెప్పిన సంగతి తెలిసిందే. దీంతో మొత్తంగా రేవంత్‌కు యాభై లక్షలు అందుకున్నాడు.
ఇకపోతే బిగ్‌బాస్ ద్వారా రేవంత్ ఎంత సంపాదించాడనేది ఆసక్తిగా మారింది. ప్రైజ్‌మనీ విషయం పక్కన పెడితే.. అతడి 15 వారాల పారితోషికం హాట్‌టాపిక్‌గా మారింది. ఈ తాజా బజ్ ప్రకారం.. రేవంత్ ఒక్కో వారానికి రూ. 2 లక్షల తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈ లెక్కన రేవంత్ 15 వారాలకు గానూ నుంచి దాదాపు రూ. 30 లక్షల పైనే అందుకున్నట్లు సమాచారం. దీంతో రేవంత్ బిగ్‌బాస్ విన్నర్ ప్రైజ్‌మనీతో పాటు పారితోషికం కలిపి రూ. 80 లక్షలపైనే సంపాదించినట్లు టాక్ వినిపిస్తోంది. ఈ రకంగా ఈ సీజన్‌లో అత్యధిక పారితోషికం అందుకున్న కంటెస్టెంట్‌గా రేవంత్ నిలవడం విశేషం.
చదవండి:
అందుకే సీతారామంకు తెలుగు వారిని తీసుకోలేదు: హను రాఘవపూడి
నాకు నేనే పెద్ద విమర్శకురాలిని: సమంత ఆసక్తికర వ్యాఖ్యలు
Comments
Please login to add a commentAdd a comment