శ్రీసత్య ఎలిమినేట్‌, క్షమించమని చేతులెత్తి వేడుకున్న శ్రీహాన్‌ | Bigg Boss 6 Telugu: Sri Satya Eliminated From BB House | Sakshi
Sakshi News home page

Bigg Boss Telugu 6: శ్రీసత్య ఎలిమినేట్‌.. ఆలస్యంగా తప్పు తెలుసుకున్న శ్రీహాన్‌

Published Fri, Dec 16 2022 10:59 PM | Last Updated on Fri, Dec 16 2022 11:00 PM

Bigg Boss 6 Telugu: Sri Satya Eliminated From BB House - Sakshi

Bigg Boss 6 Telugu, Episode 104: బిగ్‌బాస్‌ ఇచ్చిన ఛాలెంజ్‌లు గెలవడమే కాకుండా ఏకాభిప్రాయంలోనూ నెగ్గి రోహిత్‌, శ్రీసత్య ప్రేక్షకులను ఓట్లడిగే అవకాశాన్ని దక్కించుకున్నారు. నేడు మిగతావారికి కూడా ఛాన్స్‌ రావాలన్న ఉద్దేశంతో మరిన్ని టాస్కులు పెట్టాడు. అలా వాటిలో శ్రీహాన్‌, కీర్తి గెలిచి ప్రేక్షకులతో మాట్లాడారు. ముందుగా శ్రీహాన్‌ మాట్లాడుతూ.. 'నాకు ఓటడిగే అర్హత ఉందో, లేదో మీరే నిర్ణయించాలి. దానికంటే ముందు నేను తెలీకుండా చేసిన తప్పులకు క్షమాపణలు అడుగుతున్నా. నా మాటల వల్ల, యాటిట్యూడ్‌ వల్ల కొందరు బాధపడుతున్నారని తర్వాత తెలిసింది. నాకు తెలియకుండానే వారిని బాధపెట్టానని అర్థమయ్యాక నా తప్పులు సరిదిద్దుకున్నాను. అవన్నీ మనసులో పెట్టుకోకుండా మీరు నన్ను ఇక్కడి వరకు తీసుకొచ్చారు.

 టికెట్‌ టు ఫినాలే రేవంత్‌ వదిలేయడం వల్ల నాకు వచ్చింది అని అందరూ అంటుంటే బాధగా ఉంది. కానీ గేమ్‌ అంతా మీరు చూశారు. ఊహించని పరిస్థితుల మధ్య బిగ్‌బాస్‌ షోకు వచ్చాను. ట్రోఫీ గెలవడం నాకు చాలా ముఖ్యం. మీ ప్రేమను ఓట్ల రూపంలో చూపించి గెలిపించండి. ఎక్కువ క్షమించేవాళ్లే ఎక్కువ ప్రేమిస్తారు. నేను తప్పు చేసినందుకు క్షమించండి' అంటూ చేతులెత్తి వేడుకున్నాడు. అలాగే ఇండియన్‌ ఆర్మీ జవాన్లకు, అన్నం పెట్టే రైతులకు ఎప్పటికీ రుణపడి ఉంటానంటూ సెల్యూట్‌ చేశాడు.

తర్వాత కీర్తి మాట్లాడుతూ.. 'ఇన్నిరోజులు బిగ్‌బాస్‌ హౌస్‌లో కీర్తిని చూశారు. బయట ఎలా ఉన్నాను? లోపల ఎలా ఉన్నాను? అన్నీ చూశారు. మీ ఇంటి కూతురిలా నాకు సపోర్ట్‌ చేశారు. మున్ముందు కూడా అలాగే మద్దతిస్తారనుకుంటున్నాను. నా శక్తిని మించి ఆడాను. నేను స్ట్రాంగ్‌గా ఉన్నాను. నాలాంటివాళ్లు కూడా బలంగా ఉండాలనుకుంటున్నాను. ట్రోఫీ గెలిచినా కూడా ఆ డబ్బులు నాకోసం వాడుకోను. నాలాంటి అనాధల కోసం, సామాజిక కార్యక్రమాల కోసం ఆ డబ్బులు వాడతాను. అందరికీ ఓట్లేయండి, కానీ నాక్కొంచెం ఎక్కువ ఓట్లేయండి' అని కోరింది. 

తర్వాత ఉదయం ఆరుగంటలకే హౌస్‌మేట్స్‌ను నిద్ర లేపిన బిగ్‌బాస్‌ అర్జంటుగా బ్యాగులు సర్దేసుకోండి, ఒకరిని మిడ్‌ వీక్‌ ఎలిమినేషన్‌ ద్వారా బయటకు పంపించేస్తానని చెప్పాడు. ఈ మాటతో షాకైన కంటెస్టెంట్లు చేసేదేం లేక బుద్ధిగా తమ బట్టలు సర్దేసుకుని గార్డెన్‌ ఏరియాలో వచ్చి నిల్చున్నారు. మీ అభిప్రాయంలో ఎవరు వెళ్లిపోతారనుకుంటున్నారో చెప్పమని మెలిక పెట్టాడు బిగ్‌బాస్‌. దీంతో శ్రీహాన్‌.. రోహిత్‌ పేరు, ​కీర్తి.. ఆదిరెడ్డి, శ్రీసత్య.. రేవంత్‌, ఆదిరెడ్డి.. కీర్తి, రోహిత్‌.. శ్రీహాన్‌ ఎలిమినేట్‌ కావచ్చని అభిప్రాయపడ్డారు. తర్వాత బిగ్‌బాస్‌ మాట్లాడుతూ.. మెజారిటీ ఇంటిసభ్యులు కీర్తి వెళ్లిపోతుందని నిర్ణయించారు. కానీ ప్రేక్షకుల నిర్ణయం ప్రకారం శ్రీసత్య టాప్‌ 5కి చేరుకోకుండా ఈ క్షణమే ఎలిమినేట్‌ అయిందని ప్రకటించాడు. ఎలిమినేషన్‌ను ముందే పసిగట్టిన శ్రీసత్యకు బాధను లోలోపలే దిగమింగి బయటకు మాత్రం చిరునవ్వుతో నిలబడింది. కానీ రేవంత్‌ బాధ ఆపుకోలేక ఏడ్చేశాడు. చివరికి అందరికీ ఆల్‌ ద బెస్ట్‌ చెప్తూ హౌస్‌కు వీడ్కోలు పలికింది శ్రీసత్య.

చదవండి: బిగ్‌బాస్‌ షో నుంచి తప్పుకోనున్న నాగ్‌
రేవంత్‌ తండ్రి చనిపోయినా బతికే ఉన్నాడని అబద్ధం చెప్పాం

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement