Bigg Boss Telugu 6: Srihan Won Rs 5 Lakhs - Sakshi
Sakshi News home page

Bigg Boss 6 Telugu: మాజీ కంటెస్టెంట్లతో కళకళ, ప్రైజ్‌మనీ గెల్చుకున్న శ్రీహాన్‌

Dec 17 2022 11:08 PM | Updated on Dec 18 2022 10:08 PM

Bigg Boss Telugu 6: Srihan Won Rs. 5 Lakhs - Sakshi

శ్రీహాన్‌ జెన్యూన్‌ కాదు, డ్రామా చేస్తున్నాడనుకున్నాను. నాకు సారీ చెప్పినప్పుడు కూడా అది నిజమని నమ్మలేదు. కానీ తర్వాత ఆ అభిప్రాయం మారింది అని చెప్పింది. 

మాజీ కంటెస్టెంట్ల రాకతో బిగ్‌బాస్‌ హౌస్‌కు కొత్త కళ వచ్చింది. మొదటగా రోల్‌ రైడా హౌస్‌లో అడుగుపెట్టి త్వరలో బీబీ జోడీ షో రాబోతుందంటూ గుడ్‌న్యూస్‌ చెప్పాడు. అది కంటెస్టెంట్లు జంటలుగా పాల్గొనే రియాలిటీ డ్యాన్స్‌ షో అని తెలిపాడు. తర్వాత ఫైనలిస్టులకు ఆల్‌ ద బెస్ట్‌ చెప్పి వీడ్కోలు తీసుకున్నాడు. తర్వాత మెహబూబ్‌, అషూ జంటగా లోపలకు ఎంట్రీ ఇచ్చారు. వారు హౌస్‌మేట్స్‌తో ఫన్నీ గేమ్స్‌ ఆడించారు. అందులో భాగంగా ఏ ప్రశ్న అడిగినా తప్పు సమాధానమే చెప్పాలన్నారు. ఇందులో కీర్తి.. శ్రీహాన్‌ గర్ల్‌ఫ్రెండ్‌ ఎవరు? అని అడగ్గా ఆదిరెడ్డి టపీమని ఇనయ పేరు చెప్పాడు. దీంతో హౌస్‌మేట్స్‌ పడీపడీ నవ్వారు.

అంతలోనే బ్యాడ్‌న్యూస్‌ అంటూ.. హౌస్‌లో ఒకరిని తమతోపాటు ఎలిమినేట్‌ చేసి తీసుకెళ్తామనగానే అందరి ముఖాలు వాడిపోయాయి. మరీ టెన్షన్‌ పెట్టడం మంచిదికాదని భావించిన వాళ్లు ఇది ప్రాంక్‌ అని చెప్పడంతో హౌస్‌మేట్స్‌ ఊపిరి పీల్చుకున్నారు. వారు వెళ్లిపోగానే అవినాష్‌- అరియానా వచ్చి డ్యాన్స్‌ చేసి, పంచ్‌లు పేల్చుతూ ఫుల్‌ ఎంటర్‌టైన్‌ చేశారు. ఆ తర్వాత చైతూ, కాజల్‌ వచ్చి ఫైనలిస్టులను సర్‌ప్రైజ్‌ చేశారు. శ్రీహాన్‌ అంటే ఎంటర్‌టైన్‌మెంట్‌, రేవంత్‌.. కోపం, ఆదిరెడ్డి.. కాన్ఫిడెంట్‌, రోహిత్‌.. కామ్‌ అండ్‌ కంపోజ్‌డ్‌, కీర్తి గేమ్‌ బాగా ఆడుతుందంటూ ఒక్కొక్కరి గురించి షార్ట్‌ అండ్‌ స్వీట్‌గా చెప్పాడు చైతూ. అనంతరం కొన్ని వస్తువులు వాడుతూ డ్యాన్స్‌ చేయాలని టాస్క్‌ ఇచ్చారు. ఈ టాస్క్‌లో కీర్తి గెలిచి ఫ్రైడ్‌ చికెన్‌ సంపాదించుకుంది.

ఈ జంట వెళ్లిపోగానే రవి-భాను లోపలకు ఎంట్రీ ఇచ్చారు. ఫైనలిస్టులకు టంగ్‌ ట్విస్టర్స్‌ ఇచ్చి వాటిని స్పీడ్‌గా చెప్పాలన్నాడు. అందరూ బానే చెప్పినా తెలుగు రాని కీర్తి కొంత తడబడుతూ దాన్ని పూర్తి చేసింది. తర్వాత బిగ్‌బాస్‌ ఓ టాస్క్‌ ఇచ్చాడు. సీజన్‌ ముగింపుకు వచ్చేసరికి ఎవరి మీద అభిప్రాయం మారిందో చెప్పాలన్నాడు. ముందుగా శ్రీహాన్‌ మాట్లాడుతూ.. మొదట్లో కీర్తి మంచి ఫ్రెండ్‌గా ఉండేది. కానీ రానురానూ గొడవలయ్యాయి. జీవితంలో ఎన్నో కష్టాలు దాటుకుంటూ వచ్చి ఇక్కడ గేమ్‌ మీద ఫోకస్‌ పెట్టి ఇంతవరకు రావడం చిన్న విషయం కాదంటూ ఆమెకు హ్యాట్సాఫ్‌ చెప్పాడు. నెక్స్ట్‌ ఆదిరెడ్డి.. మొదట్లో రేవంత్‌ యాటిట్యూడ్‌ చూపిస్తున్నాడనిపించింది. కానీ చాలాకాలానికి అది యాటిట్యూడ్‌ కాదని అర్థమైందన్నాడు.

రోహిత్‌ వంతు రాగా ఆదిరెడ్డి తప్పును అంగీకరిస్తారని తెలుసుకున్నానన్నాడు. రేవంత్‌ మాట్లాడుతూ.. ఆదిరెడ్డి రివ్యూయర్‌ కాబట్టి మానిప్యులేటర్‌ అనుకునేవాడిని. ఈ మధ్యకాలంలో అతడితో ఎక్కువగా ఉంటున్నాను. ఆ సమయంలోనే ఆయన్ను నేనెందుకు అర్థం చేసుకోలేకపోయానని ఫీలయ్యానని చెప్పాడు. కీర్తి వంతు రాగా.. శ్రీహాన్‌ జెన్యూన్‌ కాదు, డ్రామా చేస్తున్నాడనుకున్నాను. నాకు సారీ చెప్పినప్పుడు కూడా అది నిజమని నమ్మలేదు. కానీ తర్వాత ఆ అభిప్రాయం మారింది అని చెప్పింది. 

ఇకపోతే కొన్నివారాలుగా ఆన్‌లైన్‌లో లెన్స్‌కార్ట్‌ స్టైలిష్‌ కంటెస్టెంట్‌ పోటీ జరుగుతున్న విషయం తెలిసిందే కదా! ఇందులో శ్రీహాన్‌​ గెలిచి స్టైలిష్‌ కంటెస్టెంట్‌ ఆఫ్‌ ద సీజన్‌గా నిలవడమే కాకుండా రూ.5 లక్షల రూపాయలు గెలుచుకున్నాడు. ఆ మరుసటి రోజు అఖిల్‌ సార్థక్‌, తేజస్విని మదివాడ హౌస్‌లోకి వచ్చి ఆటపాటలతో సందడి చేసి వీడ్కోలు తీసుకున్నారు.

చదవండి: అర్జున్‌ కల్యాణ్‌కు నేనంటే లవ్‌.. వీడియో చూసి షాకైన శ్రీసత్య
బిగ్‌బాస్‌ విన్నర్‌ అతడే!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement