Bigg Boss Keerthi Bhat Engaged With Vijay Karthik, Deets Inside - Sakshi
Sakshi News home page

Keerthi Bhat Marriage: కీర్తి నిశ్చితార్థం.. వదలకుండా చూసుకో అంటూ కంటతడి, వరుడి బ్యాగ్రౌండ్‌ ఇదే!

Published Mon, Jul 3 2023 3:00 PM | Last Updated on Mon, Jul 3 2023 3:04 PM

Bigg Boss Keerthi Bhat Engaged With Vijay Karthik, Deets Inside - Sakshi

సీరియల్స్‌ ద్వారా గుర్తింపు తెచ్చుకుని బిగ్‌బాస్‌ షోతో ఎంతోమంది అభిమానులను సంపాదించుకుంది నటి కీర్తి భట్‌. రోడ్డుప్రమాదంలో తన కుటుంబం మొత్తాన్ని కోల్పోయిన ఆమె జీవితంలో ఎన్నో కష్టనష్టాలను, బాధలను అనుభవించి ఈ స్థాయికి ఎదిగింది. యాక్సిడెంట్‌లో తీవ్రంగా గాయపడ్డ కీర్తి.. ఎప్పటికీ పిల్లల్ని కనలేదని వైద్యులు చెప్పారు. దీంతో ఆమె పెళ్లికి ముందే పాపను దత్తత తీసుకుని పెంచుకుంది. ఆ చిన్నారిలోనే సంతోషాన్ని వెతుక్కుంది. కానీ ఆ ఆనందం కూడా ఎంతోకాలం నిలవలేదు. బిగ్‌బాస్‌ ఆఫర్‌ వచ్చిన సమయంలోనే పాప కన్నుమూసింది.

తాజాగా కీర్తి భట్‌ గుడ్‌న్యూస్‌ చెప్పింది. త్వరలోనే పెళ్లి పీటలెక్కబోతున్నట్లు తెలిపింది. ఈ మేరకు ఓ షోలో దర్శకుడు, హీరో విజయ కార్తీక్‌ తోటతో నిశ్చితార్థం జరిగింది. ఇందుకు సంబంధించిన ప్రోమో నెట్టింట చక్కర్లు కొడుతోంది. ఇందులో కార్తీక్‌, కీర్తి పూలదండలు మార్చుకున్నారు. 'నీకు నేను తోడుగా ఉంటా, సపోర్ట్‌గా ఉంటా.. నీ తల్లిదండ్రులను నా పేరెంట్స్‌ అనుకుంటా! నన్ను వదలకుండా ఇలాగే చూసుకో' అంటూ కంటతడి పెట్టుకుంది కీర్తి.

తర్వాత వీరిద్దరూ ఉంగరాలు మార్చుకున్నారు. తనకు కాబోయే అత్తామామల గురించి కీర్తి మాట్లాడుతూ.. 'నేను వారి వంశాన్ని నెక్స్ట్‌ లెవల్‌కు తీసుకుని వెళ్లలేనని నాకు తెలుసు. ఆ విషయాన్ని వాళ్లకు చెప్తే ఒకటే మాట అన్నారు. నీకు పాప ఎందుకమ్మా? నువ్వే మాకు పాప.. మనం పాపను దత్తత తీసుకుందాం' అన్నారు అంటూ భావోద్వేగానికి లోనైంది కీర్తి.

కీర్తికి కాబోయే భర్త కార్తీక్‌ విషయానికి వస్తే.. చిత్తూరులోని మదనపల్లిలో పుట్టి పెరిగిన విజయ కార్తీక్‌ మొదట సాఫ్ట్‌వేర్‌ కంపెనీలో పని చేశాడు. తర్వాత సినిమా మీదున్న ప్రేమతో ఉద్యోగాన్ని వదిలేసి ఇండస్ట్రీలో చేరాడు. కన్నడ భాషలో నాలుగు సినిమాల్లో హీరోగా నటించాడు. తెలుగులో ఏబీ పాజిటివ్‌, చెడ్డీ గ్యాంగ్‌ సినిమాలు చేశాడు.

 


 

చదవండి: ఈ వారం ఓటీటీలోకి 24 సినిమాలు
 హీరోయిన్‌ సీక్రెట్‌ పెళ్లిపై నటి సంచలన వ్యాఖ్యలు.. ఊహించని ట్విస్ట్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement