బిగ్‌బాస్ తెలుగు ఆరో సీజన్‌లో ప్రస్తుతం ఎనిమిది మంది మాత్రమే మిగిలారు. వీరిలో రోహిత్ మినహా అందరూ ఏదో ఒక వారం కెప్టెన్ అయ్యారు. ఇప్పటికే ఈ సీజన్‌లో బెస్ట్ కెప్టెన్ ఎవరు? వరస్ట్ కెప్టెన్ ఎవరు? అని ఆరా తీస్తే ఇనయ బెస్ట్, ఆదిరెడ్డి వరస్ట్ కెప్టెన్ అని తేలింది. ఇక ఈ రోజు మరో ఇంట్రస్టింగ్ గేమ్ ఆడించాడు నాగ్. హౌస్ నుంచి బయటకు వెళ్లాక జీవితాంతం ఎవరితో ఫ్రెండ్‌షిప్ చేస్తారు? ఎవరితో ఫ్రెండ్‌షిప్‌ను ఇక్కడే కట్ చేస్తారని అడిగాడు.
దీనికి శ్రీహాన్, రోహిత్.. రేవంత్ లైఫ్‌లాంగ్ ఫ్రెండ్ అని, ఆది రెడ్డిని తరచూ కలవడం కష్టమని చెప్పారు. కీర్తి మాట్లాడుతూ.. ఇనయ బాగా క్లోజ్ అయిందని చెప్పింది. తర్వాత రేవంత్ తెలివిగా అబ్బాయిల్లో నుంచి శ్రీహాన్, అమ్మాయిల్లో నుంచి శ్రీసత్య జీవితాంతం స్నేహితులుగా ఉండిపోతారని చెప్పాడు. ఇక హౌస్‌మేట్స్ వ్యక్తిత్వానికి సరిపోయేలా కొన్ని సినిమా పోస్టర్లను వారికి అంకితం చేశాడు బిగ్‌బాస్. అలా శ్రీసత్యకు అందాల రాక్షసి పోస్టర్, శ్రీహాన్‌కు దేశముదురు, ఇనయకు ఓ పిట్టకథ ఇలా పోస్టర్లు వేసుకుంటూ వెళ్లారు.
చదవండి: బ్యూటీ సెలూన్ అమ్మి పాత ఇల్లు కొన్న కమెడియన్
క్రికెటర్‌తో లవ్.. మా మధ్య స్నేహం చెడింది: నటి
Comments
Please login to add a commentAdd a comment