Bigg Boss Telugu 6: Inaya Backstabbed Shrihan | Bigg Boss 6 Telugu Episode 54 Highlights - Sakshi
Sakshi News home page

Bigg Boss Telugu 6: ఇనయ వెన్నుపోటు.. ఎందుకీ యాక్టింగ్‌ అంటూ రగిలిపోయిన శ్రీహాన్‌

Oct 27 2022 11:45 PM | Updated on Oct 28 2022 10:40 AM

Bigg Boss 6 Telugu: Inaya Backstabbed Shrihan - Sakshi

ప్రతిసారి సరదాగా తీసుకుంటాను అనుకుంటుందేమో! కరెక్ట్‌ సమయం వచ్చినప్పుడు చెప్తా. అన్ని నాటకాలు ఆడుతోంది.

Bigg Boss 6 Telugu, Episode 54: మొత్తానికి గీతూ అనుకుంది సాధించింది. బాలాదిత్య- మెరీనా గేమ్‌లో ఉండటానికి వీల్లేదని డిసైడ్‌ అయిన గీతూ అన్నంత పని చేసింది. చేపల చెరువు టాస్క్‌లో సంచాలకురాలిగా వ్యవహరించిన గీతూ బాలాదిత్య జంటను గేమ్‌ నుంచి సైడ్‌ చేసింది. అత్యధిక చేపలున్న శ్రీహాన్‌- శ్రీసత్య ఇద్దరూ కెప్టెన్సీ కంటెండర్లుగా ఎన్నికయ్యారని బిగ్‌బాస్‌ ప్రకటించాడు. మరి వీరితోపాటు కెప్టెన్సీ బరిలో ఎవరెవరు దిగారు? ఈ రోజు ఎపిసోడ్‌ హైలైట్స్‌ ఏంటో చదివేద్దాం..

గీతూ మహిమ వల్ల శ్రీహాన్‌-శ్రీసత్య కెప్టెన్సీ పోటీదారులుగా నిలిచారు. మిగిలిన నాలుగు జంటలు.. చర్చించుకుని ఒక్కో జంట నుంచి ఒక్కొక్కరి చొప్పున కెప్టెన్సీ పోటీదారుల పేర్లు వెల్లడించమన్నాడు బిగ్‌బాస్‌. దీంతో రేవంత్‌- ఇనయ జోడీ నుంచి రేవంత్‌, సూర్య- వాసంతి జంట నుంచి సూర్య, రోహిత్‌- కీర్తి జంట నుంచి కీర్తి,  ఫైమా- రాజ్‌ జోడీ నుంచి ఫైమా కంటెండర్లుగా నిలబడ్డారు. కెప్టెన్సీ కోసం పోటీపడలేనందుకు ఇనయ వాష్‌రూమ్‌ ఏరియాలో సూర్యను పట్టుకుని తెగ ఏడ్చేసింది.

కెప్టెన్సీకి ఒక్క అడుగు దగ్గరవడానికి చిక్కుల్లో కెప్టెన్సీ అనే టాస్క్‌ పూర్తి చేయాలన్నాడు బిగ్‌బాస్‌. ఈ గేమ్‌లో అందరికంటే త్వరగా చిక్కుముడులు విప్పి కీర్తి, సూర్య, శ్రీహాన్‌ కెప్టెన్సీ కోసం పోటీపడ్డారు. అయితే హౌస్‌మేట్స్‌ ఎవరిని కెప్టెన్‌గా చూడాలనుకోవట్లేదో వారికి కత్తిపోట్లు గుచ్చాలన్నాడు బిగ్‌బాస్‌. రాజ్‌, రోహిత్‌, రేవంత్‌.. సూర్యకు, బాలాదిత్య, గీతూ.. కీర్తికి కత్తిపోట్లు గుచ్చారు. ఇనయ.. శ్రీహాన్‌కు కత్తి గుచ్చింది.

దీంతో హర్టయిన శ్రీహాన్‌.. ఇదంతా ప్రోమోకట్‌, కంటెంట్‌ కోసమేనన్నాడు. 'నెక్స్ట్‌ వీక్‌ ఎవరైనా నీది- సూర్యది బాండింగ్‌ మిస్‌ అవుతున్నామంటే వెంటనే వెళ్లి అతడితో కలిసిపోయినా ఆశ్చర్యపడనక్కర్లేదు. ప్రతిసారి సరదాగా తీసుకుంటాను అనుకుంటుందేమో! కరెక్ట్‌ సమయం వచ్చినప్పుడు చెప్తా. అన్ని నాటకాలు ఆడుతోంది. ఎందుకీ యాక్టింగ్‌. స్టేబులిటీ లేదని నన్నంది. ఆమె వారానికోసారి రంగు మారుస్తోంది. నాకు నమ్మకద్రోహం చేసింది. నాకు కత్తి గుచ్చినందుకు బాధపడేలా చేస్తా' అని రగిలిపోయాడు శ్రీహాన్‌. మిగిలినవాళ్లు శ్రీహాన్‌కు సపోర్ట్‌ చేయడంతో అతడు కెప్టెన్‌ అయ్యాడు. ఆ విశేషాలు రేపటి ఎపిసోడ్‌లో చూద్దాం..

చదవండి: బన్నీ భార్య స్నేహారెడ్డి చీర ఖరీదెంతో తెలుసా?
అప్పుడే విషం చిమ్మి అంతలోనే కలిసిపోయిన బావామరదళ్లు

1
1/4

2
2/4

3
3/4

4
4/4

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement