Bigg Boss 6 Telugu Latest Promo: Words War Between Adi Reddy And Inaya Sultana In Nominations - Sakshi
Sakshi News home page

Bigg Boss 6 Telugu: నువ్వూ, బిగ్‌బాస్‌ బయటకు పోయి మాట్లాడుకోండి.. ఇనయపై సెటైర్లు

Published Mon, Nov 7 2022 3:54 PM | Last Updated on Mon, Nov 7 2022 4:27 PM

Bigg Boss 6 Telugu: Adi Reddy Punches to Inaya Sultana - Sakshi

బిగ్‌బాస్‌ హౌస్‌ నుంచి గీతూ వెళ్లిపోవాలని చాలామంది బలంగా కోరుకున్నారు. కానీ నిన్నటి ఎపిసోడ్‌లో మాత్రం గీతూ వెళ్లిపోతుంటే ఎంతోమంది ఎమోషనలయ్యారు. ఆమె బిగ్‌బాస్‌ను వీడలేక వీడుతుంటే భారంగా నిట్టూర్చారు. ఈరోజు గీతూ లేకుండానే నామినేషన్స్‌ ప్రక్రియ మొదలైంది. ఈ మేరకు తాజాగా ఓ ప్రోమో రిలీజైంది. 

శ్రీహాన్‌కు, నాకూ బయట ఒక లైఫ్‌ ఉంది. మా ఇద్దరి గురించి తప్పుగా మాట్లాడటం నచ్చలేదని ఇనయను నామినేట్‌ చేసింది శ్రీసత్య. పోయినవారం హ్యుమానిటీ గురించి మాట్లాడావు.. అని కీర్తి మాట్లాడటం మొదలు పెట్టిందో లేదో మధ్యలో అందుకున్నాడు శ్రీహాన్‌. హ్యుమానిటీ గురించి నేను హైలైట్‌ చేసుకోలేదు, హీరోయిన్‌లా నువ్వు చెప్పుకున్నావు అని కౌంటరిచ్చాడు. దీనికి కీర్తి.. ఇక్కడ ఎవరూ హీరోయిన్‌ కాదు, ఎవరూ హీరో కాదు, ఇదే కొంచెం తగ్గించుకోండి అని చురకలంటించింది.

కావాలని ఒకరిని కొట్టడం తప్పని రేవంత్‌.. వాసంతిని నామినేట్‌ చేశాడు. దీంతో అవాక్కైన వాసంతి.. నువ్వు మనుషులను ఎలా విసిరేస్తున్నావో ఫుటేజీతో సహా అందరం చూశామని ఎద్దేవా చేసింది. అటు ఆదిరెడ్డి.. రేవంత్‌తో పాటు ఇనయను నామినేట్‌ చేశాడు. బాత్రూమ్‌లోకి వెళ్లి గడియ పెట్టుకుని ఏడవడం, బిగ్‌బాస్‌ పిలిస్తేనే బయటకు వస్తాననడం తప్పనిపించలేదా? అని అడిగాడు.

దీనికామె అది నాకు, బిగ్‌బాస్‌కు మధ్య విషయం, మధ్యలో మీకెందుకు అని ప్రశ్నించింది. మీ ఇద్దరికీ ఉంటే మీరు బయటకు పోయి మాట్లాడుకోండి అని చిరాకు పడ్డాడు ఆది. అయినా ఇప్పటికీ దాన్ని తప్పుగా ఫీలవకపోవడం నా దురృదృష్టం అని చెప్పుకొచ్చాడు. ఇకపోతే ఈ వారం తొమ్మిది మంది నామినేషన్‌లో ఉన్నట్లు తెలుస్తోంది. రోహిత్‌, రాజ్‌, కెప్టెన్‌ శ్రీసత్య మినహా మిగిలిన తొమ్మిది మంది.. వాసంతి, రేవంత్‌, కీర్తి, శ్రీహాన్‌, ఆదిరెడ్డి, ఇనయ, మెరీనా, బాలాదిత్య, ఫైమా నామినేషన్స్‌లో ఉన్నారట!

చదవండి: కంటెంట్‌ క్వీన్‌ ఎలిమినేట్‌ అవడానికి కారణాలివే!
నేనిక్కడే ఉంటా బిగ్‌బాస్‌, ఎక్కడికీ పోను: ఏడ్చిన గీతూ

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement