Bigg Boss Telugu 6 | Episode 82 Highlights: Inaya, Keerthi, Shrihan Full Happy After Family Visit - Sakshi
Sakshi News home page

Bigg Boss Telugu 6: ఫుల్‌ ఖుషీలో కీర్తి, ఇనయ.. శ్రీహాన్‌కు డబుల్‌ ధమాకా!

Published Thu, Nov 24 2022 11:06 PM | Last Updated on Fri, Nov 25 2022 8:44 AM

Bigg Boss 6 Telugu: Inaya, Keerthi, Shrihan Full Happy After Family Visit - Sakshi

Bigg Boss Telugu 6, Episode 82: పన్నెండు వారాల ఎడబాటుకు తెర దించుతూ కంటెస్టెంట్ల ఫ్యామిలీ మెంబర్స్‌ను హౌస్‌లోకి పంపుతున్నాడు బిగ్‌బాస్‌. వారిని చూసి గుండెల నిండా ఊపిరి పీల్చుకుంటున్నారు హౌస్‌మేట్స్‌. తమ వాళ్లను చూడగానే తెలియకుండానే కన్నీళ్లు కార్చుతున్నారు. వారితో కలిసి చిందులేస్తున్నారు. మరి ఈరోజు ఎపిసోడ్‌లో ఏయే కంటెస్టెంట్ల ఫ్యామిలీస్‌ వచ్చాయో చూద్దాం..

పన్నెండు వారాల తర్వాత ప్రేయసి కళ్లముందుకు రావడంతో భావోద్వేగానికి లోనయ్యాడు శ్రీహాన్‌. హౌస్‌లోకి వెళ్లగానే శ్రీహాన్‌ను గట్టిగా పట్టుకుని అతడిపై ముద్దుల వర్షం కురిపించింది సిరి. ఈ పదేళ్లు నా వెనకుండి నువ్వెలా నడిపించావో, భవిష్యత్తు అంతా కూడా నువ్వ నాతోనే ఉండాలంటూ తన పేరు పచ్చబొట్టు పొడిపించుకున్నానని మెడపై ఉన్న టాటూ చూపించింది. తర్వాత సిరి కొడుకు చైతూ హౌస్‌లో ఎంట్రీ ఇచ్చి సర్‌ప్రైజ్‌ చేశాడు.

వచ్చీరాగానే ఈ చిచ్చరపిడుగు తన బుల్లిబుల్లి మాటలతో అందరినీ నవ్వించాడు. ఎవరెలా మాట్లాడతారో వారి డైలాగులను సరిగ్గా దింపేశాడు. తర్వాత.. ఇంతందం దారి మళ్లిందా.. పాటకు సిరి, శ్రీహాన్‌ స్టెప్పులేశారు. వారిద్దరి మధ్యలో చైతూ వచ్చేందుకు ప్రయత్నించడంతో పానకంలో పుడకలా వస్తావేంట్రా అని తిట్టలేక నవ్వుకున్నాడు శ్రీహాన్‌. చివరగా వెళ్లిపోయేముందు శ్రీహాన్‌ పాదాలు తాకి వీడ్కోలు తీసుకుంది సిరి.

ఇక రాత్రిపూట కడుపులో మండుతుందని పాలు అడిగాడు రాజ్‌.. ఎప్పటిలాగే స్ట్రిక్ట్‌ మాస్టర్‌ రేవంత్‌ కుదరదని తెగేసి చెప్పాడు. అడిగినప్పుడు ఇవ్వడానికి ఏం ప్రాబ్లమ్‌ అని లోలోనే గునుక్కున్నాడు రాజ్‌. తర్వాతి రోజు కీర్తి కోసం ఆమె స్నేహితుడు, బుల్లితెర నటుడు మహేశ్‌ వచ్చాడు. ఆమెతో కలిసి డ్యాన్స్‌ చేసి గోరుముద్దలు తినిపించాడు. 

ఎవ్వరూ కోల్పోలేనిది నువ్వు కోల్పోయావు. కానీ ఆ దేవుడు నీకు ఇచ్చిన ఛాన్స్‌ బిగ్‌బాస్‌. ఇక్కడ నీతో నీకే పోటీ.. లక్షల మంది సైన్యం నీ వెంట ఉన్నారు.. అదే నీ బలం.. అంటూ ఆమెలో పాజిటివిటీ నింపాడు. తను  దత్తత తీసుకున్న పాప ఫొటోను బహుమతిగా అందించాడు. అయితే ఆమెను కాపాడుకోలేకపోయానని బోరున ఏడ్చింది కీర్తి. అనంతరం మహేశ్‌.. ఇనయను ముద్దుపెట్టమని అడగడంతో అందరూ సర్‌ప్రైజ్‌ అయ్యారు. అతడికి నో చెప్పడం ఇష్టం లేని ఇనయ ఫ్లయింగ్‌ కిస్‌ ఇచ్చింది.

అనంతరం ఇనయ సుల్తాన తల్లి నజ్బూర్‌ హౌస్‌లోకి వచ్చింది. ఆమెను చూడగానే ఎమోషనలైంది ఇనయ. 'నాకోసం నువ్వు మనసులో ఇంత బాధపడుతున్నావని తెలీదు, అందుకే వచ్చాను. నీ జీవితం నువ్వు చూసుకున్నావు, ఇంత కష్టపడ్డావు. బిగ్‌బాస్‌కు వచ్చావు. గెలిచి రావాలి. నువ్వు బాగుండాలనేదే నా కోరిక' అని చెప్పింది. హైదరాబాద్‌కు షిఫ్ట్‌ అయిపోదాం అని ఇనయ అడిగితే అది తర్వాత మాట్లాడుకుందాం, ముందైతే బాగా ఆడి గెలిచి రా అని బదులిచ్చింది. 

కేజీఎఫ్‌లోని అమ్మ సాంగ్‌ వేయడంతో తల్లి కాళ్ల మీద పడి ఏడ్చింది ఇనయ. అనంతరం ఆమె అక్కడి నుంచి వీడ్కోలు తీసుకుంది. తల్లిని బిగ్‌బాస్‌ హౌస్‌లో చూడాలన్న తన కల నెరవేరడంతో ఇనయ తెగ సంతోషపడిపోయింది.

చదవండి: ఇనయను, ఆమె తల్లిని కలిపిన బిగ్‌బాస్‌
భారత ఆర్మీని అవమానించిందంటూ నటిపై ట్రోలింగ్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement