![Bigg Boss 6 Telugu: Keerthi Fight With Sanchalak Sri Satya in Ticket to Finale Task - Sakshi](/styles/webp/s3/article_images/2022/12/1/keerthi-srihan.gif.webp?itok=kBjZAl_u)
బిగ్‌బాస్ హౌస్‌లో టికెట్ టు ఫినాలే కోసం రేవంత్, ఆదిరెడ్డి, శ్రీహాన్, కీర్తి, ఫైమా, రోహిత్ తలపడుతున్నారు. వీరికి వరుస ఛాలెంజ్‌లు ఇస్తూ ఒక్కొక్కరిని పోటీ నుంచి తప్పిస్తున్నాడు బిగ్‌బాస్. ఈ క్రమంలో హౌస్‌మేట్స్‌కు రోల్ బేబీ రోల్ అనే టాస్క్ ఇచ్చాడు. ఇందులో దొర్లుకుంటూ వెళ్లి బ్రిక్స్ తెచ్చుకుని వాటిని టవర్‌లా కట్టాల్సి ఉంటుంది. ఎవరు బాగా ఎత్తయిన టవర్ కడితే వారే గెలిచినట్లు! ఈ టాస్క్‌కు ఇనయ, శ్రీసత్య సంచాలకులుగా వ్యవహరించగా ఫైమా, కీర్తి, శ్రీహాన్, రోహిత్ ఆడారు.
శ్రీహాన్ టవర్ ఎత్తుగా ఉందని శ్రీసత్య చెప్పడంతో కీర్తికి చిర్రెత్తిపోయింది. శ్రీహాన్ టవర్‌లో గ్యాప్ కనిపించట్లేదా? అన్ని విషయాలు కూడా పరిగణనలోకి తీసుకోవాలి అని వాదించింది. నీ టవర్‌లో కూడా గ్యాప్స్ ఉన్నాయని శ్రీసత్య చెప్తుండగా ఆమె మాట వినిపించుకోలేదు కీర్తి. మీకు నచ్చినవారికి ఇచ్చుకోండి అంటూ తన టవర్‌ను ఒక్క తన్నుతో నేలకూల్చింది. ఆమె ప్రవర్తనతో అందరూ షాకయ్యారు.
చదవండి: ఓటమిని జీర్ణించుకోలేకపోయిన రేవంత్, గొప్పోడివయ్యా రోహిత్
సిద్ధూకు హెడ్‌వెయిట్? డీజే టిల్లు నుంచి అనుపమ అవుట్
Comments
Please login to add a commentAdd a comment