Bigg Boss 6 Telugu: Arohi Rao Emotional Comments On Keerthi Bhatt, Deets Inside - Sakshi
Sakshi News home page

Arohi Rao: కాళ్లలో ఐరన్‌ రాడ్స్‌, శరీరం నిండా గాయాల మచ్చలు.. అయినా ఫైట్‌ చేస్తోంది

Published Fri, Nov 4 2022 9:32 PM | Last Updated on Sun, Nov 6 2022 4:06 PM

Bigg Boss Telugu 6: Arohi Rao Supports Keerthi Bhatt - Sakshi

కొందరు ఎంత కష్టపడ్డా గుర్తింపు రాదు. శ్రమకు తగ్గ ఫలితం అందుకోరు. అయినా సరే వెనుకడుగు వేయకుండా ఫైట్‌ చేస్తూనే ఉంటారు. గత సీజన్‌లో పాల్గొన్న మానస్‌ ఈ కోవకే చెందుతాడు. తోటి కంటెస్టెంట్లకు టఫ్‌ కాంపిటీషన్‌ ఇచ్చినా కూడా అతడికి ఎక్కువ హైప్‌ రాలేదు. ఈ సీజన్‌లో మానస్‌ స్నేహితురాలు కీర్తి కూడా అదే జాబితాలో చేరిపోయింది. తన హెల్త్‌ కండీషన్‌ పక్కనపెట్టి మరీ అటు ఇంటిపనిలో ఇటు బిగ్‌బాస్‌ గేమ్‌లో తలమునకలవుతోంది, ఫైటర్‌లా పోరాడుతోంది. అయినా సరే తన కృషి, పట్టుదల ఎవరికీ కనిపించకుండా పోతోంది. పైపెచ్చు అసలు తను గేమే ఆడట్లేదన్న మాటలు పడాల్సి వస్తోంది.

దీనిపై ఆరోహి రావు తీవ్రంగా స్పందించింది. 'కీర్తి ఫిజికల్‌ టాస్కులు ఏం ఆడట్లేదు, ఎందుకు సపోర్ట్‌ చేస్తున్నారని కొందరు మెసేజ్‌ చేశారు. వారికి నేనిచ్చే సమాధానం ఏంటంటే.. ఆ పిల్ల రెండు కాళ్లలో ఐరన్‌ రాడ్స్‌ ఉన్నాయి. ఈ విషయం మీకు తెలుసో లేదో నాకు తెలీదు. అయినా సరే ఎప్పుడూ ఆ ప్రస్తావన తేకుండా, సింపతీ ట్రై చేయకుండా, డ్రామా చేయకుండా తన బెస్ట్‌ ఇస్తోంది. రోడ్డు ప్రమాదంలో గాయపడ్డ గుర్తుల తాలూకు పెద్ద పెద్ద మచ్చలు తన చేతులకు, కాళ్లకు ఇప్పటికీ ఉన్నాయి. అవి శరీరం మీదే కాదు మనసులో కూడా ఉన్నాయి. మచ్చ కదా అంత జల్ది పోదు. అన్నీ మంచిగున్న మనమే అలసిపోతున్నం. అలాంటిది అది లోపల ఫైట్‌ చేస్తోంది. ఎప్పటికీ నేను కీర్తినే సపోర్ట్‌ చేస్తాను' అని రాసుకొచ్చింది. ఇది చూసిన నెటిజన్లు కీర్తి ధైర్యానికి హ్యాట్సాఫ్‌ చెప్తున్నారు.

చదవండి: నీ భార్యతో లింకు పెట్టకు, పరువు నష్టం దావా వేస్తా: బిగ్‌బాస్‌ కంటెస్టెంట్‌
గీతక్కా, నిన్ను ఏడిపించకపోతే చూడు: ఆది మాస్‌ వార్నింగ్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement