Bigg Boss 6 Telugu: These Contestants Nominated In Sixth Week | Bigg Boss 6 Telugu Episode 37 Highlights - Sakshi
Sakshi News home page

Bigg Boss Telugu 6: తుప్పాస్‌ రీజన్స్‌.. ప్రతీకారం తీర్చుకున్న గీతూ

Published Mon, Oct 10 2022 11:36 PM | Last Updated on Wed, Oct 12 2022 4:49 PM

Bigg Boss 6 Telugu: These Contestants Nominated In Sixth Week - Sakshi

Bigg Boss 6 Telugu, Episode 37: మండే వచ్చిందంటే చాలు బయట వాతావరణం కూల్‌గా ఉన్నా బిగ్‌బాస్‌ హౌస్‌లో మాత్రం హీట్‌ ఓ రేంజ్‌లో ఉంటుంది. వారంలో ఎన్నడూ నోరు మెదపని కంటెస్టెంట్‌ కూడా నామినేషన్స్‌లో గొంతు విప్పాల్సిందే! అవసరమైతే పోట్లాటకు, కుదిరితే కొట్లాటకు సైతం రెడీగా ఉండాల్సిందే! ఆ లెవల్‌లో ఉంటాయి బిగ్‌బాస్‌ నామినేషన్స్‌. మరి ఈ ఆరోవారం నామినేషన్స్‌ ఎలా జరిగాయి? ఎవరు ఎవర్ని నామినేట్‌ చేశారో తెలియాలంటే ఈ హైలైట్స్‌ చదివేయండి.

మొన్నటిదాకా శ్రీసత్య- అర్జున్‌, సూర్య-ఆరోహిలను జంటలుగా చూపించారు. అయితే శ్రీసత్య తనకు ఇంట్రస్ట్‌ లేదని, ఎంత ట్రై చసినా వేస్ట్‌ అని చెప్పేయడంతో వారి ప్రేమ కహానీ అక్కడే ఆగిపోయింది. అటు ఆరోహి ఎలిమినేట్‌ అవడంతో ఇనయ వెంటపడ్డాడు సూర్య. ప్రస్తుతానికి హౌస్‌లో వీరేదో ప్రేమపక్షులు అన్నంత రేంజ్‌లో పర్ఫామెన్స్‌ ఇస్తున్నారు. ఇదిలా పక్కన పెడితే ఆటకు కాకుండా అందానికే ఎక్కువ ప్రాముఖ్యతనిచ్చే వాసంతి అంటే రేవంత్‌కు ఇంట్రస్ట్‌ ఉందంటూ ఆదిరెడ్డి చెవులు కొరికింది గీతూ. దీనికి అర్జున్‌ కూడా అవునంటూ వంత పాడాడు. అతడు వేరేవాళ్లను లింక్‌ చేస్తే జోక్‌.. మనం చేస్తే మాత్రం సీరియస్‌ అవుతాడని చిటపటలాడాడు.

తర్వాత బిగ్‌బాస్‌.. ఇద్దరు ఇంటిసభ్యుల ముఖంపై ఫోమ్‌ పూసి నామినేషన్‌ ప్రక్రియను ప్రారంభించాలని ఆదేశించాడు. మొదటగా కెప్టెన్‌ రేవంత్‌.. బాలాదిత్య, సుదీపలను నామినేట్‌ చేశాడు. ఆదిరెడ్డి మాట్లాడుతూ.. హౌస్‌లో గేమ్‌ ఆడుతూ ఉండాలే తప్ప మంచితనంతో ఉండొద్దంటూ మెరీనాను నామినేట్‌ చేశాడు. ఓవర్‌ థింకింగ్‌ అంటూ కీర్తికి ఫోమ్‌ పూశాడు. మెరీనా నామినేట్‌ చేసేటప్పుడు ఆది హైపర్‌ అయిపోయాడు. ఈ క్రమంలో రోహిత్‌, ఆది కొట్టుకునేదాకా వెళ్లారు.

కీర్తి.. గీతూ, సత్యలను; రోహిత్‌.. శ్రీహాన్‌, ఆదిని; సుదీప.. ఆది, కీర్తిలను; వాసంతి.. గీతూ, ఆదిలను; శ్రీహాన్‌.. గీతూ, రాజ్‌లను; బాలాదిత్య.. గీతూ, రాజ్‌లను; అర్జున్‌.. కీర్తిని, ఆదిని; సూర్య.. గీతూ, ఆదిని; ఫైమా.. సుదీప, బాలాదిత్యను; ఇనయ.. శ్రీహాన్‌, కీర్తి; రాజ్‌.. గీతూ, బాలాదిత్యను; మెరీనా.. కీర్తి, ఆది రెడ్డిని నామినేట్‌ చేశారు. రాజ్‌ తనను నామినేట్‌ చేయడం సహించలేకపోయిన గీతూ తన వంతు వచ్చేసరికి చెలరేగిపోయింది. 'నన్ను తుప్పాస్‌ రీజన్స్‌తో నామినేట్‌ చేశావు. నువ్వు ఈ హౌస్‌లో అందరికంటే వీక్‌, ఒక్క శాతం ఎంటర్‌టైన్‌మెంట్‌ చేయలేదు అంటూ రాజ్‌ను ఏకిపారేసింది. అతడితో పాటు కీర్తిని నామినేట్‌ చేసింది. శ్రీసత్య మాట్లాడుతూ.. బూతులు మాట్లాడావంటూ కీర్తిని, ఎంటర్‌టైన్‌మెంట్‌ తక్కువైందని ఆదిని నామినేట్‌ చేసింది. నీ వల్లే చంటి బయటకు వెళ్లాడని కీర్తికి ఎక్కువ నామినేషన్‌ ఓట్లు పడటం గమనార్హం. ఫైనల్‌గా ఈ వారం కీర్తి, ఆదిరెడ్డి, గీతూ, బాలాదిత్య, సుదీప, శ్రీహాన్‌, రాజ్‌, శ్రీసత్య, మెరీనా నామినేట్‌ అయ్యారు.

చదవండి: ఆ హగ్గులేంది? రాత్రిపూట ఆ రచ్చేంది?
గీతూకే అంతుంటే నాకెంతుండాలి?

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement