Bigg Boss Telugu 6, Episode 73: నామినేషన్స్‌లో జరిగిన గొడవను పరిష్కరించుకునే ప్రయత్నం చేశారు కీర్తి, సత్య. కానీ గొడవ సద్దుమణగడం కాదు కదా అది మరింత అగ్గి రాజుకుంది. శ్రీసత్య వైఖరితో ఏడ్చేసిన కీర్తి.. శ్రీసత్యకు రెచ్చగొట్టే అలవాటుందని నాకు బిగ్‌బాస్‌కు రాకముందే తెలుసు. తన క్యారెక్టరే అంత అని ఊరుకున్నా.. కానీ ఈరోజు నన్ను ఇమిటేట్ చేసి మాట్లాడటం నచ్చలేదని మిగతా వాళ్ల దగ్గర బాధపడింది. తను చేసింది తప్పని ఫీలైందో మరేంటో కానీ అర్ధరాత్రి శ్రీసత్య.. కీర్తి దగ్గరకు వెళ్లి సారీ చెప్పింది.
నెక్స్ట్ డే ఏదో చిన్న విషయంలో శ్రీహాన్‌కు, రేవంత్‌కు మధ్య గొడవైంది. ఈ ఫ్రస్టేషన్‌లో తన మనసులో ఉన్న కోపాన్నంతా శ్రీసత్య ముందు కక్కేశాడు శ్రీహాన్. 'రేవంత్ నన్ను నామినేట్ చేసి నా తప్పు చెప్పాలనుకున్నాడట.. అలాగైతే వాడిదగ్గర వంద తప్పులు కనిపిస్తున్నాయి. కానీ నేను నా ఫ్రెండ్‌ను బయటకు పంపించి నువ్వు తప్పు చేశావని చెప్పాలనుకోను, పక్కకు పిలిచి అతడి తప్పేంటో చెప్తా. పదిమందిలో వాడిని లోకువ చేయను. కానీ వాడు మాత్రం అందరి ముందు నా తప్పు చెప్పాలనుకున్నాడు' అంటూ రగిలిపోయాడు.
అనంతరం బిగ్‌బాస్.. నామినేషన్స్‌లో ఉన్నవారు తమను సేవ్ చేసుకుని ఇమ్యూనిటీ దక్కించుకునేందుకు ఒక అవకాశం ఇచ్చాడు. కానీ ఆ ఇమ్యూనిటీకి ఒక ధర ఉందని, ఆ మొత్తం విన్నర్ ప్రైజ్‌మనీ నుంచి తగ్గిస్తామని చెప్పాడు. నామినేట్ అయిన సభ్యులు చేయాల్సిందల్లా.. వారు ఏ ధరకు ఇమ్యూనిటీని కొనుక్కుంటారో చెక్‌లో రాయాల్సి ఉంటుంది. ఏ సభ్యుడు ఎక్కువ ధర రాస్తాడో వారు సేవ్ అవుతారని ట్విస్ట్ ఇచ్చాడు. అది కూడా లక్ష నుంచి రూ.5 లక్షల మధ్యే రాయాల్సి ఉంటుందన్నాడు.
దీంతో శ్రీహాన్ లక్ష రాయగా ఆదిరెడ్డి తానసలు ఇమ్యూనిటీయే కోరుకోవట్లేదని చెప్పాడు. 'ఒక సామాన్యుడిగా అడుగుపెట్టాను. జనాలకు నా ఆట నచ్చి వారి సపోర్ట్‌తో 11 వారాలు హౌస్‌లో ఉన్నాను. ఇలాంటి ఇమ్యూనిటీ కోరుకుని ఇక్కడిదాకా రాలేదు. ఈ సీజన్ గెలుస్తానని నాకు గట్టిగా నమ్మకముంది. అంటే నా ప్రైజ్‌మనీలో నుంచి రూ.5 లక్షలు కట్ అవుతాయన్నమాట! నా దాంట్లో నుంచి కట్ అవుతాయని తెలిసినా ఆ ఇమ్యూనిటీతో ముందుకు వెళ్లాలని లేదు. జనాల ఓట్లతో ముందుకు వెళ్తాను. ఇకపోతే ఇమ్యూనిటీ కోసం ఎక్కువ అమౌంట్ రాసేవారికి ఇంట్లో ఉండే అర్హతే లేదు' అంటూ గాల్లో మేడలు కట్టేశాడు ఆది. అనంతరం అతడు లక్ష రూపాయలు రాశాడు.
శ్రీసత్య, కీర్తి, రేవంత్.. రూ.4,99,999, రోహిత్.. రూ.2,51,001, రాజ్.. రూ.4,99,700, మెరీనా, ఇనయ.. రూ.4,99,998 రాశారు. చెక్‌పై రాసే మొత్తాన్ని ఎవరితో షేర్ చేసుకోవద్దని చెప్పినా శ్రీసత్య.. శ్రీహాన్‌తో కోడ్ భాషలో చెప్పిందంటూ ఆమెపై అనర్హత వేటు వేశాడు బిగ్‌బాస్. అలాగే ఒకే అమౌంట్ ఇద్దరూ రాస్తే వారిని రిజెక్ట్ చేశాడు. దీంతో చివరగా రోహిత్, రాజ్ మిగిలారు. వీరిలో రాజ్ రాసిన చెక్ ధర ఎక్కువగా ఉండటంతో అతడు ఇమ్యునిటీ పొందినట్లు ప్రకటించాడు. అతడు రాసిన రూ.4,99,700 విన్నర్ ప్రైజ్‌మనీలో కోత పెట్టగా రూ.45,00,300 మిగిలింది.
తర్వాత ఈ ప్రైజ్‌మనీని కాపాడుకోమంటూ సమయానుసారంగా ఛాలెంజ్‌లు ఇస్తానన్నాడు బిగ్‌బాస్. మొదటి ఛాలెంజ్‌లో భాగంగా కేవలం రన్స్ తీస్తూనే సెంచరీ పూర్తి చేయమన్నాడు. ఇందులో రోహిత్, రేవంత్ పాల్గొని 82 పరుగులు తీశారు. సెంచరీ పూర్తి చేయకపోవడంతో బిగ్‌బాస్ మరో లక్ష ప్రైజ్‌మనీ కట్ చేశాడు. దీంతో విన్నర్ ప్రైజ్ మనీ రూ.44,00,300కు వచ్చింది. ఇక ఈ వారం కెప్టెన్ ఫైమా, రాజ్ మినహా మిగతా ఎనిమిది మంది నామినేషన్‌లో ఉన్నారు.
చదవండి: భలే ట్విస్ట్, ప్రైజ్‌మనీ కట్
Comments
Please login to add a commentAdd a comment