
జనాలు చూస్తున్నారు, జనాలు చూస్తున్నారు.. బిగ్‌బాస్ హౌస్‌లో ప్రతీ కంటెస్టెంటూ చెప్పే మాట ఇది. అలా అని ఇక్కడ ఇలా మాట్లాడకూడదు, అక్కడ అలా ప్రవర్తించకూడదు అని ఎవరూ నోరూ, కాళ్లు చేతులు కట్టేసుకుని కూర్చోలేదు. పైగా తామేం చేసినా రైటే అని, అది జనాలు అంగీకరిస్తారని ఎవరికి వారు ఊహల్లో తేలిపోమారు. ఇప్పుడిప్పుడే వారి కళ్ల ముందు ఏర్పడుకున్న మబ్బులు నెమ్మదిగా తొలగిపోతున్నాయి. ఆడియన్స్ అడిగే ప్రశ్నలతో ఉలిక్కిపడుతున్నారు హౌస్‌మేట్స్. ఈ మధ్యే శ్రీసత్య, శ్రీహాన్‌లను వాయించిన ప్రేక్షకులు నేడు రాజ్, కీర్తి, ఇనయల గురించి అడిగేశారు.
ఈ క్రమంలో కీర్తికి.. 'ఇతర కంటెస్టెంట్ల సపోర్ట్‌తోనే మీరు కెప్టెన్ అయ్యారు కదా, మరి నాకెవరూ సపోర్ట్ చేయలేదు, సోలో ప్లేయర్ అని ఎందుకంటారు? సింపతీ ట్రై చేస్తున్నారా?' అన్న ప్రశ్న ఎదురైంది. దీనికి కీర్తి.. సింపతీ ఒకటీరెండు రోజులు ఉంటుందే తప్ప జీవితాంతం ఉండదని చెప్పింది. తర్వాత హౌస్‌లో మీ నిజమైన ఫ్రెండ్స్ ఎవరు? మీ వెనకాల ఎవరు మాట్లాడరని అనుకుంటున్నారని రాజ్‌ను అడిగాడో ఆడియన్. దీనికతడు ఇనయ నా వెనకాల మాట్లాడుతుందనిపిస్తుందన్నాడు. ఒకప్పుడు స్నేహితుడుగా ఉన్న రాజ్ ప్రతిదానికీ తననే తప్పుపడుతుండటంతో తట్టుకోలేక ఏడ్చేసింది ఇనయ.
Comments
Please login to add a commentAdd a comment