Bigg Boss 6 Telugu Family Week: Inaya Sultana Mother And Keerthi Bhat Friend Entry In BB6 House - Sakshi
Sakshi News home page

Bigg Boss 6 Telugu Family Week: 'నీ నుంచి అన్నీ లాక్కున్న దేవుడు నీకిచ్చిన అవకాశమిది'

Nov 24 2022 4:23 PM | Updated on Nov 24 2022 6:47 PM

Bigg Boss Telugu 6: Inaya Sultana, Keerthi Bhat Family and Friends Surprise - Sakshi

'జీవితంలో చాలా కోల్పోయావు, ఆ దేవుడు నీ నుంచి ఎన్నో తీసేసుకున్నాడు. కానీ అదే దేవుడు నీకు మళ్లీ ఇంకో అవకాశం ఇచ్చాడు, అదే బిగ్‌బాస్‌ అని కీర్తిలో ధైర్యం నింపేందుకు ప్రయత్నించాడు.

బిగ్‌బాస్‌ హౌస్‌లో ఓపక్క టీచింగ్‌ క్లాసులు మరోపక్క ఫ్యామిలీస్‌ ఎంట్రీతో నవ్వులు వెదజల్లుతున్నాయి. ఈ క్రమంలో శ్రీహాన్‌ ఫ్లర్టింగ్‌ ఎలా చేయాలనేది కంటెస్టెంట్లకు నేర్పిస్తున్నాడు. అమ్మాయిలను ఎలా పడగొట్టాలని టిప్స్‌ ఇస్తున్నాడు. తర్వాత కీర్తి కోసం ఆమె స్నేహితుడు, నటుడు మహేశ్‌ హౌస్‌లో అడుగుపెట్టాడు. అతడిని చూడగానే కీర్తి కళ్లల్లో ఆనందం కట్టలు తెచ్చుకుంది. వీరిద్దరూ ఈ ప్రపంచాన్నే మర్చిపోతూ స్టెప్పులేశారు. కీర్తికి తన చిన్ననాటి ఫొటో గిఫ్ట్‌ ఇవ్వడంతో కంట్లో నుంచి నీళ్లు జలజలా రాలాయి.

'జీవితంలో చాలా కోల్పోయావు, ఆ దేవుడు నీ నుంచి ఎన్నో తీసేసుకున్నాడు. కానీ అదే దేవుడు నీకు మళ్లీ ఇంకో అవకాశం ఇచ్చాడు, అదే బిగ్‌బాస్‌ అని కీర్తిలో ధైర్యం నింపేందుకు ప్రయత్నించాడు. సినిమాల్లో రాణించేందుకు ఇల్లు వదిలేసి వచ్చిన ఇనయ తన కుటుంబంతో సంబంధాలు పూర్తిగా తెగిపోయాయని ఎన్నోసార్లు బాధపడింది. అలాంటిది.. ఆమెను తిరిగి తల్లితో కలిపాడు బిగ్‌బాస్‌. ఇనయ తల్లిని హౌస్‌లోకి పంపించాడు. ఆమెను చూడగానే కాళ్లమీద పడిపోయింది ఇనయ. గుండెల్ని పిండేసే ఈ ఎమోషనల్‌ ఎపిసోడ్‌ చూడాలంటే కొద్ది గంటలు ఆగాల్సిందే!

చదవండి: కొడుకుతో హౌస్‌లో అడుగుపెట్టిన సిరి
యశోద ఓటీటీ విడుదల ఆపాలంటూ ఆదేశం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement