
బిగ్‌బాస్ షో మొదలై 50 రోజులైనా కాలేదు, అప్పుడే కంటెస్టెంట్లను సర్‌ప్రైజ్‌లతో ముంచెత్తుతున్నాడు బిగ్‌బాస్. బ్యాటరీ రీచార్జ్ టాస్క్ ద్వారా హౌస్‌మేట్స్‌కు వారి ఇంటిసభ్యుల నుంచి ఆడియో కాల్, వీడియో మెసేజ్, ఫొటో ఫ్రేమ్, బిర్యానీ.. ఇలా తమకు నచ్చిన ఆప్షన్లను సెలక్ట్ చేసుకునే అవకాశం కల్పించాడు. అయితే ఇందుకోసం ఇంటిసభ్యుల నుంచి కొన్ని త్యాగాలను ఆశిస్తున్నాడు.
ఈ క్రమంలో బాలాదిత్య సిగరెట్లు మానేయగా ఫైమా అతి కష్టం మీద ఇంగ్లీష్‌లో సినిమా కథలను వివరించింది. తాజాగా బిగ్‌బాస్ వీటన్నిటికంటే క్లిష్టమైన త్యాగాన్ని కోరినట్లు తెలుస్తోంది. వాసంతి, రోహిత్‌లలో ఎవరైనా ఒకరు రెండు వారాలపాటు స్వతాహాగా నామినేట్ కావాలని ఆదేశించాడు. దీంతో రోహిత్ తాను నామినేట్ అవడానికి సిద్ధమని వెల్లడించాడు.
ఇక్కడ బిగ్‌బాస్.. కంటెంట్ ఇవ్వని రోహిత్, వాసంతిలలో ఒకరిని బయటకు పంపించేందుకే వారిద్దరి పేర్లను ప్రస్తావించినట్లు తెలుస్తోంది. వారిద్దరూ గేమ్ ఆడట్లేదు, ఎంటర్‌టైన్ కూడా చేయట్లేదు.. ఇప్పుడు రోహిత్ సెల్ఫ్ నామినేట్ కావడంతో అతడు త్వరలోనే ఎలిమినేట్ అవడం ఖాయంగా కనిపిస్తోంది. ఇకపోతే తాజాగా రిలీజైన ప్రోమోలో రేవంత్‌కు ఫొటో ఫ్రేమ్, కీర్తికి మానస్ ఆడియో మెసేజ్, ఫైమాకు వీడియో కాల్ వచ్చినట్లు చూపించారు. మరి ఈ సర్‌ప్రైజ్‌లతో బూస్ట్ అందుకున్న హౌస్‌మేట్స్ ఇకనైనా గేమ్‌లో తమ ప్రతాపం చూపిస్తారా? లేదా? అనేది చూడాలి!
చదవండి: విన్నర్ అయిపోతానన్న గీతూ, అంతొద్దు.. కేవలం టాప్ 5లోనే ఉంటావన్న తండ్రి
Comments
Please login to add a commentAdd a comment