
Keethi Bhat In Bigg Boss 6 Telugu: బిగ్‌బాస్ సీజన్-6 గ్రాండ్‌గా లాంచ్ అయ్యింది. ఈ సీజన్‌లో తొలి కంటెస్టెంట్‌గా సీరియల్ నటి కీర్తి భట్ ఎంట్రీ ఇచ్చింది. గాంధారీ... గాంధారీ అంటూ డ్యాన్స్‌తో సందడి చేసింది. తెలుగు ప్రేక్షకులకు కీర్తి భట్ అంటే తెలియదు కానీ.. భాను అంటే గుర్తుపడతారు. 'మనసిచ్చి చూడు'సీరియల్‌లో భానుగా అద్భుత నటనతో ఆకట్టుకుంది కీర్తి భట్. ఈ సీరియల్‌లో అందం, అభినయంతో తెలుగు ప్రేక్షకులకు చేరువైంది. బెంగుళూరు పుట్టిపెరిగిన ఈ కన్నడ బ్యూటీకి చిన్నతనం నుంచి సినిమాలంటే ఇష్టం.
ఆ మక్కువతోనే యాక్టింగ్‌లో శిక్షణ పొంది డాన్స్ కూడా నేర్చుకుంది. ఉన్నత విద్యను అభ్యసించిన కీర్తి భట్. చదువు పూర్తి కాగానే కన్నడలో ఇండస్ట్రీలో అడుగుపెట్టివరుసగా మూడు సీరియల్స్ చేసింది. ఆ తరువాత సినిమాల్లోనూ నటించింది. ఈ మధ్యే 'కార్తీకదీపం' సీరియల్ లో ఎంట్రీ ఇచ్చిన కీర్తి..హిమ పాత్రలో నటిస్తోంది. ఆరేళ్ల క్రితం యాక్సిడెంట్‌లో కుటుంబం మొత్తాన్ని కోల్పోయిన కీర్తి.. తనూ భట్ అనే చిన్నారిని దత్తత తీసుకుంది.
Comments
Please login to add a commentAdd a comment