
కెప్టెన్ అవుదామంటే కంటెండర్ కూడా కాలేకపోయానని ఏడ్చేసింది ఇనయ. అటు సత్య కూడా గేమ్‌లో కంటతడి పెట్టుకుంది. మరోవైపు కెప్టెన్సీ పోటీదారులవ్వడానికి బిగ్‌బాస్ నాగమణి అనే టాస్క్ ఇచ్చాడు. ఈ టాస్క్‌లో భాగంగా టీమ్ సభ్యులు వారికిచ్చిన నాగమణులను కాపాడుకోవాల్సి ఉంటుంది. అవతలి టీమ్ వాటిని దక్కించుకునేందుకు ప్రయత్నించాల్సి ఉంటుంది. ఇచ్చిందే ఫిజికల్ గేమ్ కావడంతో కిందామీదా పడి ఎలాగైనా మణులు సాధించేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ క్రమంలో రేవంత్.. ఎవరో గట్టిగా లాగుతున్నారు, ఇంతకింతా ఉంటుంది. మళ్లీ ఎవరైనా నన్ను ఫిజికల్ అన్నారంటే తోలు తీసేస్తా అని హెచ్చరించాడు.
అనడమే కాదు తన మణులు లాక్కోడానికి వచ్చినవాళ్లను తోసిపారేశాడు. దీంతో ఫిజికల్ అవొద్దు అని కీర్తి, ఆదిరెడ్డి హెచ్చరించారు. అయినా తగ్గని రేవంత్... నేను ఆపడానికి ట్రై చేస్తుంటే వాళ్లు చేతకాక ఫిజికల్ అంటున్నారని సీరియసయ్యాడు. ఇకపోతే ఈ గేమ్‌లో స్నేక్ టీమ్ గెలిచినట్లు సమాచారం. ఆ టీమ్‌లో శ్రీహాన్ కూడా ఉన్నాడు. కానీ అతడికి ఈవారం కెప్టెన్సీ కంటెండర్ అయ్యే అర్హత లేదని నాగార్జున పనిష్మెంట్ ఇచ్చిన విషయం తెలిసిందే కదా! దీంతో అతడు తన స్థానంలో శ్రీసత్యను సెలక్ట్ చేసినట్లు తెలుస్తోంది.
చదవండి: బిగ్‌బాస్ హౌస్‌లో తన్నులాట
Comments
Please login to add a commentAdd a comment