Bigg Boss Keerthi Bhat Engagement With Karthik Thota; Video Viral - Sakshi
Sakshi News home page

Keerthi Bhat: ఘనంగా బిగ్‌బాస్‌ బ్యూటీ కీర్తి నిశ్చితార్థం.. కాలికి పట్టీలు, చేతికి ఉంగరం తొడుగుతూ..

Published Mon, Aug 21 2023 12:34 PM | Last Updated on Mon, Aug 21 2023 1:10 PM

Bigg Boss Beauty Engaged with Vijay Karthik Thota - Sakshi

బుల్లితెర నటి, బిగ్‌బాస్‌ కంటెస్టెంట్‌ కీర్తి భట్‌ త్వరలో కొత్త జీవితం ఆరంభించనుంది. దర్శకుడు, హీరో విజయ్‌ కార్తీక్‌ తోటను పెళ్లాడనుంది. తాజాగా వీరిద్దరి నిశ్చితార్థం ఘనంగా జరిగింది. ఆదివారం జరిగిన వీరి ఎంగేజ్‌మెంట్‌ వేడుకకు బుల్లితెర సెలబ్రిటీలతో పాటు బిగ్‌బాస్‌ కంటెస్టెంట్లు సైతం హాజరై సందడి చేశారు.

ఈ వేడుకలో కీర్తి, విజయ్‌ ఇద్దరూ ఆకుపచ్చని దుస్తుల్లో మెరిసిపోయారు. కాబోయే భార్య కాలికి పట్టీ తొడిగిన విజయ్‌ అనంతరం ఆమె వేలికి ఉంగరం తొడిగాడు. అటు కీర్తి కూడా అతడి వేలికి ఉంగరం తొడిగి తనను ముద్దాడింది. ఇందుకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి.

కాగా వీరిద్దరూ ఇటీవలే ఓ షోలోనూ పాల్గొని స్టేజీపై పూలదండలు మార్చుకున్నారు. ఈ సందర్భంగా తనకు పిల్లలు పుట్టరని తెలిసినా ప్రేమించి, పెళ్లి చేసుకునేందుకు సిద్ధమయ్యాడంటూ భావోద్వేగానికి లోనైంది కీర్తి. విజయ్‌ మాత్రమే కాదు, ఆయన కుటుంబం కూడా ఈ విషయం తెలిసి తనను కోడలిగా అంగీకరించినందుకు సంతోషం వ్యక్తం చేసింది. మొత్తానికి త్వరలో పెళ్లిపీటలెక్కబోతున్న ఈ జంటకు అంతా శుభం జరగాలని కోరుకుంటున్నారు అభిమానులు.

బిగ్‌బాస్‌ ఆరో సీజన్‌లో పాల్గొన్న కీర్తి ఈ సీజన్‌లో టాప్‌ 3 కంటెస్టెంట్‌గా నిలిచింది. ప్రస్తుతం ఆమె సీరియల్స్‌ చేస్తోంది. విజయ్‌ కార్తీక్‌ విషయానికి వస్తే.. చిత్తూరులోని మదనపల్లిలో పుట్టి పెరిగిన ఇతడు మొదట సాఫ్ట్‌వేర్‌ కంపెనీలో పని చేశాడు. అయితే సినిమాల మీద ఆసక్తితో ఉద్యోగాన్ని వదిలేసి సినిమా ఇండస్ట్రీలో చేరాడు. కన్నడ భాషలో నాలుగు చిత్రాల్లో హీరోగా నటించాడు. తెలుగులో ఏబీ పాజిటివ్‌, చెడ్డీ గ్యాంగ్‌ సినిమాలు చేశాడు.

చదవండి: ‘భోళా శంకర్‌’కు రూ.50 కోట్ల నష్టం.. అప్పుడే ఓటీటీలోకి..!

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement