Bigg Boss Telugu 6: Seventh Week Nominated Contestants List | Bigg Boss 6 Telugu Episode 44 Highlights - Sakshi
Sakshi News home page

Bigg Boss 6 Telugu: ఇండస్ట్రీలో ఒక్కరూ నన్ను ఫ్లర్ట్‌ చేయలేదు.. గీతూ గోడు..

Published Tue, Oct 18 2022 12:12 AM | Last Updated on Thu, Oct 20 2022 12:21 AM

Bigg Boss Telugu 6: Seventh Week Nominated Contestants List - Sakshi

Bigg Boss 6 Telugu, Episode 44: 'సునయ' లవ్‌ ట్రాక్‌ ప్రేక్షకులకు రోత పుడుతుందని అర్థమైనట్లుంది. అందుకే ఇకపై కలిసి ఉండటం కన్నా గొడవలు పెట్టుకోవడం బెటర్‌ అని ఇనయ, సూర్య డిసైడ్‌ అయ్యాడు. అనుకున్న ప్లాన్‌ ప్రకారం అందరిముందు దెబ్బలాడుకున్నారు. అటు సూర్య మాత్రం.. నాకు ఎక్కువ అటెన్షన్‌ ఇవ్వడం వల్ల ఇనయ గేమ్‌ దెబ్బతినడం నచ్చట్లేదు. ఆమె గేమ్‌ను నేనే మారుస్తా. మా ఇద్దరి మధ్య నిజంగానే డిష్యుం డిష్యుం జరిగేలా చేస్తా. కానీ ఇనయ అంటే నాకిష్టం. ఇండిపెండెంట్‌ ఉమెన్‌ను నేను ఇష్టపడతా అంటూ కెమెరాలతో మనసులో మాట పంచుకున్నాడు సూర్య.

అటు గీతూ.. ఇండస్ట్రీలో ఒక్కరంటే ఒక్కరు కూడా తనను ఫ్లర్ట్‌ చేయలేదని చెప్పింది. ఎందుకక్కా? అని రేవంత్‌ అడగ్గా బహుశా అందంగా లేనేమోనని బదులిచ్చింది. దానికి ఆది రెడ్డి కంపను తెచ్చుకుని అతికించుకోవడం ఎందుకులే అని ఊరుకున్నారులేనని దిమ్మతిరిగే పంచ్‌ ఇచ్చాడు. కాసేపటికే బిగ్‌బాస్‌ ఇంట్లో నామినేషన్‌ ప్రక్రియ మొదలైంది. ఫైమా.. వాసంతి, బాలాదిత్యను; రోహిత్‌.. రేవంత్‌, శ్రీహాన్‌ను; శ్రీసత్య.. బాలాదిత్య, రేవంత్‌ను; బాలాదిత్య.. రేవంత్‌, ఫైమాను, ఆది రెడ్డి.. అర్జున్‌, వాసంతిని; మెరీనా.. రేవంత్‌; ఆది రెడ్డిని; గీతూ.. వాసంతి, బాలాదిత్యను; రాజ్‌.. బాలాదిత్య, వాసంతిని; ఇనయ.. బాలాదిత్య, శ్రీహాన్‌ను; అర్జున్‌.. బాలాదిత్య, ఆది రెడ్డిని; వాసంతి.. రాజ్‌, రేవంతిని; కీర్తి.. బాలాదిత్య, శ్రీహాన్‌ను; రేవంత్‌.. మెరీనా, శ్రీసత్యను; సూర్య.. బాలాదిత్య, రేవంత్‌ను నామినేట్‌ చేశారు. 

శ్రీహాన్‌.. డ్రామా క్వీన్‌ అంటూ ఇనయను నామినేట్‌ చేశాడు. 23 ఏళ్లుగా స్ట్రాంగ్‌ అని చెప్పే కీర్తి ఇంట్లో ప్రతిదానికి ఏడుస్తుంది, అంటే ఆమె వీక్‌ కంటెస్టెంట్‌ అని చెప్తూ కీర్తిని నామినేట్‌ చేశాడు. ఇక ఈ ప్రక్రియలో తాను నామినేషన్‌కు భయపడుతున్నానని ఆదిరెడ్డి, రాజ్‌ అనడంతో వాసంతి చిర్రెత్తిపోయింది. నామినేషన్స్‌కు ఇక్కడ ఎవరూ భయపడట్లేదా? నేనొక్కదాన్నే భయపడుతున్నానా? ఏమైనా అంటే ఇదే కారణం వెతుక్కుంటారని చిటపటలాడింది. తనకు నామినేషన్స్‌ నథింగ్‌ అని, హెయిర్‌ తన జీవితం అయినా అయినా దాన్ని కట్‌ చేసుకున్నా అని చెప్పుకొచ్చింది. మొత్తంగా ఈ ఏడోవారం రోహిత్‌, వాసంతి, ఆదిత్య, రేవంత్‌, శ్రీహాన్‌, ఆదిరెడ్డి, ఇనయ, అర్జున్‌, కీర్తి, శ్రీసత్య, మెరీనా, రాజ్‌, ఫైమా నామినేట్‌ అయినట్లు ప్రకటించాడు బిగ్‌బాస్‌.

చదవండి: అది ఫేవరెటిజమా?: యాంకర్‌నే నిలదీసిన సుదీప
ఆ బిగ్‌బాస్‌ కంటెస్టెంట్‌ ఒంటరిగా రమ్మన్నాడు

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement