సోషల్ మీడియా ప్రభావంతో స్ట్రీట్ ఫుడ్ ఆంటీ కుమారి బాగా పాపులర్ అయింది. మధ్యాహ్నం 12 అయితే చాలు కుమారి ఆంటీ స్ట్రీట్ ఫుడ్ కోసం జనాలు బారులు తీరుతున్నారు. దీంతో భారీగా ట్రాఫిక్ ఇబ్బందులు ఎదురు కావడం.. పోలీసులు హెచ్చరించడం వంటివి కూడా జరిగాయి. చివరకు తెలంగాణ ముఖ్యమంత్రి కార్యాలయం రియాక్ట్ అయ్యే వరకు ఆమే ఫేమస్ అయింది. చివరకు సీఎం రేవంత్ రెడ్డి కూడా సమయం వచ్చినప్పుడు తాను కూడా అక్కడ భోజనం చేస్తానని చెప్పారు. అంతలా రెండు రాష్ట్రాల్లో కుమారీ ఆంటీ ఫుడ్ ఫేమస్ అయింది.
హైదరాబాద్‌లోని ఎందరో యూట్యబర్స్, నెటిజన్లు ఫుడ్ తిని తమ అభిప్రాయాలను సోషల్‌మీడియా ద్వారా షేర్ చేయడం చూశాం.. తాజాగా బిగ్‌బాస్ ఫేమ్, సీరియల్ నటి కీర్తి భట్ తనకు కాబోయే భర్త విజయ్ కార్తీక్‌తో పాటు కుమారి ఆంటీ ఫుడ్ స్టాల్ వద్దకు వెళ్లి భోజనం రుచి చూశారు. ఆపై వారి అభిప్రాయాన్ని యూట్యూబ్‌లో పంచుకున్నారు. మేము కుమారి ఆంటీనే చూద్దమని వస్తే.. ఆ సమయంలో ఆంటీ లేదని కీర్తి తెలిపింది.
వైట్ రైస్, చికెన్ కర్రీ, చికెన్ ఫ్రై తిందామని తీసుకున్నాం. కానీ తమకు నచ్చలేదని కీర్తి తెలిపింది. ఎక్కువగా కారం ఉండటం వల్ల అంత రుచిగా లేదని వారు తెలిపారు. పక్కనే ఉన్న మరో రోడ్‌సైడ్ హోటల్‌లో భోజనం చేశామని వారు తెలిపారు. అది కొంచెం బెటర్ అని వారిద్దరూ తెలిపారు. కుమారీ ఆంటీ ఫుడ్‌కు అసలు ఎందుకు అంత హైప్ వచ్చిందో తెలియదు. ధరలు కూడా కాస్త ఎక్కువగానే ఉన్నాయి. కొంచెం వైట్ రైస్, నాలుగు చికెన్ ముక్కలు వేసి రూ. 170 తీసుకున్నారు. ఆ ధరకు ఫుడ్ ఏ మాత్రం వర్త్ కాదు. మాకు నచ్చలేదు. కుమారి ఆంటీ కంటే నేను చాలా బాగా చేస్తాను.' అని కీర్తి తెలిపింది.
అందరూ ఫుడ్ బాగుంది అంటే మేము కూడా తిందామని అక్కడికి వచ్చినట్లు వారు తెలిపారు. ఇదీ తమ అభిప్రాయం మాత్రమేనని చెప్పారు. ఆమె వ్యాపారానికి నష్టం చేయాలని తమ అభిప్రాయం కాదని చెప్పుకొచ్చారు. ఆమె వ్యాపారం మరింత మంచిగా జరిగి ఆపై ఒక పెద్ద హోటల్ ఆమె పెట్టాలని కోరుకుంటున్నట్లు కీర్తి తెలిపింది. అంతే గానీ తమ అభిప్రాయాన్ని ఎవరూ తప్పుగా తీసుకోకండి అని చెప్పింది.
Comments
Please login to add a commentAdd a comment